October 15, 2012

CHANDRABABU PADAYATRA PHOTOS 14th DAY


























14వ రోజు పాదయాత్ర పోటో గ్యాలరీ 15.10.2012

ప్రెస్ నోట్  Press note from TDP office

ప్రెస్ నోట్ - 15.10.2012

కర్నూలు జిల్లాలో బాబు రెండోరోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం బసన్న బావి నుంచి ప్రారంభమవుతుంది.



నేటి పాదయాత్ర షెడ్యూల్ 15.10.2012

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు కర్నూలు జిల్లా సరిహద్దులో ఘనస్వాగతం లభించింది. పన్నెండు రోజులపాటు అనంతపురం జిల్లాలో కాలినడక సాగించిన తర్వాత చంద్రబాబు ఆదివారం సాయంత్రం 6.35 గంటలకు కర్నూలు -అనంతపురం జిల్లా సరిహద్దు అయిన హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆళ్ళగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆయన సోదరులు అహోబిలం నుంచి ప్రత్యేకంగా పిలిపించిన వేదపండితులతో బాబుకు పూర్ణకుంభ స్వాగతం ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లాలో ప్రవేశించగానే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. హిజ్రాల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో హిజ్రాలు వారి సామాజిక సమస్యలపై చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు వెంట వేలాదిమంది అభిమానులు నడవడమే కాకుండా సమీప గ్రామాల నుంచి రోడ్లవద్దకు వచ్చి యాత్రను తిలకించారు.

ప్రత్యేక ఆకర్షణగా కన్నడ మహిళా బృందం
'వస్తున్నా మీకోసం' యాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా ఆహ్వానం పలికే కార్యక్రమంలో కన్నడ మహిళా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి వైకుంఠం శివప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భోజనాల కార్యక్రమంలో కూడా కన్నడ మహిళా బృందమే ప్రధాన భూమిక పోషించింది. 21మంది సభ్యులు గల ఈ బృందం ఒకే రక మైన దుస్తులు ధరించి భోజనాలు వడ్డించడం ఆకట్టుకుంది. చంద్రబాబునాయుడు జిల్లాలో అడుగుపెట్టగానే గులాబీలతో ఆహ్వానం పలకడం విడిపూలు వెదజల్లుతూ తెలుగుదేశం పార్టీ నేతలకు ఘనస్వాగతం పలకడం అందరినీ ఆకర్షించింది.

కర్నూలు జిల్లాలో బాబుకు ఘనస్వాగతం 14.10.2012





13వ రోజు పాదయాత్ర చిత్రాలు...










అమావాస్య చీకట్లను చీలుస్తూ చంద్రుడి అడుగులు...