April 18, 2013


అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ....

ఆదిలాబాద్: తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి జిల్లా సమావేశం ఈ నెల 21న ఉట్నూర్‌లో జరుగనుంది. ఇదే రోజు ఇటీవల పార్టీ అధిష్ఠానం ప్రకటించిన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఎంపీ రా«థోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షుడు, బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గెడెం నగేశ్‌లతోపాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి పాల్గొనేందుకుగాను టీడీపీ జిల్లా శ్రేణులు సమాయత్తపరచనున్నారు. ఈ నెల 27 విశాఖ పట్టణంలో చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగుస్తున్నందున అక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సభకు ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు ఐదువేల మంది నాయకులను,కార్యకర్తలను తరలించాలని ఆపార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రా«థోడ్ రమేశ్ బుధవారం ఆదిలాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రతీ మండలానికి ఒక బాధ్యుడిని నియమించాలని నిర్ణయించారు. ప్రతీ మండలానికి కార్యకర్తలను తరలించేందుకు ఒక ఆర్టీసి బస్‌ను కేటాయించాలన్నారు.

ఎంపీతో జరిగిన సమావే శంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల శంకర్, టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలిరావుజాదవ్, జిల్లా అధికార ప్రతినిధి రవిందర్‌గౌడ్, జిల్లా కార్యదర్శి చిన్నస్వామి, బీసీ సెల్ జిల్లా నాయకుడు సి శంకర్, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రమాదేవి, మాజీ జడ్పీటీసీ సభ్యులు రామునాయక్, రేఖానాయక్ తదితరులు పాల్గొన్నారు.

21న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

 ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. బుధవారం కాచారం, నర్కూడ, కవ్వగూడలో జరిగిన 'ఇందిరమ్మ కలలు' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ఇందిరమ్మ కలలు పథకం పేరుతో ప్రజలలోకి వెళ్లితే వారికి ఇచ్చిన హామీలను ఏవిధంగా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకలను ప్రవేశ పెడుతుందన్నారు. సంక్షే మం పేరుతో ఎస్సీ, ఎస్టీలకు ఉపప్రణాళిక చట్టం13 అమలుకు కాంగ్రెస్‌ప్రభుత్వం నడుంబిగించింది.

అయితే దాని అమలు మాత్రం అంతంత్ర మాత్ర మే ఉంటుందని విమర్శించారు. కాచారంలో గ్రామస్థులు సమస్యలపై ఎకరువు పెట్టారు. గ్రామంలో తాగునీరు, కరెంటు, అండర్ డ్రైనేజీ తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. కాగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో శ్రీకాంత్‌రెడ్డి ఎవరికి ఏమీ కావాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఆర్. గణేష్‌గుప్త, టీడీపీ మండల అధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, టౌన్ అధ్యక్షుడు దూడల వెంకటేష్‌గౌడ్, పీఎస్‌సీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దండు ఇస్తారి, కాచారం మాజీ సర్పంచ్ సావిత్రిసత్తయ్య, మాజీ ఎంపీటీసీ జ్ఞానేశ్వర్‌యాదవ్, యూ.రాములు, ప్రత్యేకాధిరి నర్సింహరావు, ఏఈ పాల్గొన్నారు.

చౌదరిగూడలో..

చౌదరిగూడలో ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పర్యటించారు. గ్రామంలో తాగు నీరు కలుషితం అవుతుందని కొందరికి ఇళ్లు లేవని, పింఛన్లు కూడా రావడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పింఛన్లు లేనివారు. ఇళ్లు లేని వారు దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్ అధ్యక్షుడు మోహన్‌రావు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

నర్కూడలో...

నర్కూడలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీరోడ్లు, శ్మశాన వాటికకు వెళ్లేందుకు రోడ్డు వేయించాలని గ్రామస్థులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. వాటిని వెంటానే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుక్కవేణుగోపాల్, నర్కూడ మాజీ సర్పంచ్ బుర్కుంట సతీష్, కుమార్‌యాదవ్, నీరటిరాజు,బుర్కుంట గోపాల్, శివాజీ, అప్ప, బుర్కుంట మహేష్ పాల్గొన్నారు.

కవ్వగూడలో...

కవ్వగూడలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో అండర్ డ్రైనేజీ, పింఛన్లు, కరెంటు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. సమస్య లను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదే శించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నర్సింహ, మాజీ ఉప సర్పంచ్ కృష్ణ, పంచాయితీ కార్యదర్శి విఠల్‌రెడ్డి,ఎం.రత్నం, మైసయ్యయాదవ్, పెంటయ్య, సిద్దులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం నిధులిస్తేనే అభివృద్ధి


గుజరాతిపేట: ముఖ్యమంత్రి ఎన్.కి రణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చి చుట్టం చూపులా చూసి వెళ్లారే తప్ప జి ల్లాలోని ప్రధానమైన సమస్యలను ప్ర స్తావించకపోవడం చాలా దారుణమం టూ మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు ఏకరువు పెట్టారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎ స్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు మూడువేల కోట్ల రూపాయలు మంజూరు చేశామని చె ప్పారే తప్ప గత ఏడాదిలో మంజూరు చేసిన సబ్‌ప్లాన్ నిధుల వివరాలు ఇంతవరకు పత్రికా ముఖంగా చెప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలను బహిరంగ సభకు తరలించారని, ఐదుగురు కూలీలను బలిగొన్న సీఎం వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అధిష్టానంలో అవినీతి మంత్రులను పెంచి పోషిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బహిరంగ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కృపారాణి ఇంట్లో విందు చేయడానికే వచ్చారు తప్ప తోటపల్లి రిజర్వాయర్ తదితర జిల్లా సమస్యలను చర్చించే దిశగా మాట్లాడకపోవడం విచారకరమన్నారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం సమస్యలపై దృష్టిసారించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో సమస్యలు ఎన్నో ఉ న్నప్పటికీ కనీసం వాటి పరిష్కారంపై చర్చించిన దాఖలాలు లేకపోవడం వి డ్డూరంగా వుందన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు పీవీ రమణ, బీవీఎస్ ప్రకాష్, ఎస్‌వీ రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమస్యలను మరిచిన ముఖ్యమంత్రి

టెక్కలిటౌన్ : జిల్లాలో ముఖ్యమం త్రి పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని, సీ ఎం సభ విజయవంతం చేయడానికి ఐ దుగుర్ని బలితీసుకున్నారని టీడీపీ పా ర్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజ రాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. బుధవారం స్థానిక దేశం పార్టీ కార్యా లయంలో విలేఖరులతో మాట్లా డారు. రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమి తమవుతుందని ఆరోపించారు. వంశధా ర నిర్వాసితులకు పునరావాసం కల్పిం చడంలో ఈ ప్రభుత్వం విఫలమైంద న్నారు. ఆఫ్‌షోర్ గురించి మంగళవా రం జరిగిన సభలో ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడకపోవడం విచా కరమన్నారు.

టెక్కలి ప్రజల దాహార్తిని తీర్చేందుకు పురుషోత్తమ సాగరంలో ఏడాది కిందట శంకుస్థాపన చేశారని, అయినా నేటికీ ఆ పనులు ఇసుమం తైనా జరగకపోవడం చూస్తుంటే ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి ఏమిటో తెలు స్తుందన్నారు. సీఎం సభకు వచ్చి తిరిగి వెళ్తూ అయోధ్యపురం జంక్షన్‌లో జాతీ యరహదారిపై ట్రాక్టర్ బోల్తాపడి మృ తి చెందిన నందిగాం మండలం నౌగాం పంచాయతీ హుకుంపేట కుటుంబీకు లకు ఒక్కొ క్కరికి రూ.20లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలంతో పాటు ఎకరా భూమి ఇవ్వా లని ఆయన డిమాండ్ చేశారు.

దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయ ణ మూర్తి (బాబ్జీ) మాట్లాడుతూ అమ్మ హస్తం ప్రారంభ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు రూ.185కే తొమ్మి ది వస్తువులు ఇస్తున్నామని, దీంతో పే దవాడు కడుపునిండా భోజనం చేస్తాడ ని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నా రు. వారి ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులకు అడిగితే అవి ఎన్నాళ్లు వస్తాయో తెలు స్తుందని ఎద్దేవా చేశారు.ఈనెల 27తో టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు పాదయాత్ర విశాఖ లో ముగిస్తుందన్నారు. ఈనెల 21న శ్రీకాకుళంలో గల ఎన్‌జీవో భవనంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై విశాఖలో బాబు పాదయాత్ర సభకు హాజరయ్యేందుకు తీసుకోవాల్సిన చర్య లపై చర్చిస్తామని ఆయన అన్నారు.

అ నంతరం హరిశ్చంద్రపురం మాజీ ఎమ్మె ల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మా ట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరి వ్యక్తి అని, అటువంటిది ఆ య న్ని కలిసి వినతిపత్రం అందజేయ డా నికి తమకు హక్కులేదా అని ఆయన ప్రశ్నించారు. గృహనిర్భందం చేసి పో లీసులు అత్యుత్సాహం ప్రదర్శించార న్నారు. హుకుంపేట గ్రామ ఫీల్డ్అసి స్టెంట్, నందిగాం ఉపాధి ఏపీవోపై కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో తీవ్ర పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీ డీపీ నాయకులు ఎల్ఎల్ నాయుడు, హనుమంతు రామకృష్ణ, బగాది శేషగి రి, వెలమల విజయలక్ష్మి, పినకాన అజ య్‌కుమార్, పొన్నాడ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు

నర్సీపట్నం
: 'వస్తున్నా...మీకోసం' నాల్గవ రోజు చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పలికారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో గల బలిఘట్టం శివార్లలో మంగళవారం రాత్రి బసచేసిన చంద్రబాబు బుధవారం ఉదయం చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు తొలుత బలిఘట్టంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామంలో వందలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు చంద్రబాబు వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. దారిపొడవునా మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలికారు. నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నం అబీద్ సెంటర్‌లో జరిగిన సభకు భారీగా ప్రజానీకం హాజరయ్యారు.

సభ ముగిసేసరికి రాత్రి 8.30 గంటలు అయినప్పటికీ ప్రజలు పట్టణం దాటేవరకు చంద్రబాబు వెంట నడిచారు. ఆయా సభల్లో వైఎస్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాల గురించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా స్థానిక సమస్యలను కూడా ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రజలను ఆకట్టుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా బుధవారం చంద్రబాబు తన నడకవేగాన్ని కొంత పెంచడమే కాకుండా ఉదయం నుంచి కాస్త హుషారుగా ఉండడం టీడీపీ శ్రేణులకు ఊరటనిచ్చింది.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు విజయ్‌బాబు, అయ్యన్న సోదరుడు, మాజీ సర్పంచ్ సన్యాసిపాత్రుడు, నియోజకవర్గ పరిధిలోగల నాలుగు మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా కృషిచేయడంతో జిల్లాలో ఇంతవరకు ఎక్కడాలేనివిధంగా నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నంలో చంద్రబాబు పాదయాత్ర కార్యక్రమం విజయవంతమైంది.

పట్నం జనసంద్రం


నర్సీపట్నం/చోడవరం: ' నేను పాదయాత్ర ప్రారంభించి 200 రోజులు దాటిపోయింది. ఈ సందర్భంగా ఎన్నో అంశాలపై పార్టీ పరంగా స్పష్టమైన వివరణ ఇస్తున్నాను. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో విడమరిచి చెబుతున్నాను. కానీ సరిగా అర్థం చేసుకోవడంలో మీరు వెనుకబడ్డారు'' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం బలిఘట్టంలో జరిగిన చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో స్థానికురాలైన రొంగలి పద్మావతి లేచి... 'నేను ఇంత వరకు ఇటువంటి సభల్లో మాట్లాడలేదు. మిమ్మల్ని(చంద్రబాబు) చూసి మీతో మాట్లాడాలని వచ్చాను. కొన్ని సమస్యలను మీకు తెలపాలని అనుకుంటున్నాను'' అని చెప్పారు. దీంతో చంద్రబాబు స్పందించి ఆమెకు మైకు ఇవ్వాలని సూచించారు.

'కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీకే డ్వాక్రా రుణాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నది. బీమా సొమ్ము కట్టాలని బలవంతం చేస్తున్నారు. కట్టనివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు ఎక్కువగా ఉన్నాయి. నా తల్లికి పింఛను రద్దు చేశారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మాది పేద కుటుంబం. అయినా కుమారుడిని ఇంజనీరింగ్ చదివించాను. కానీ ఉద్యోగం దొరకడం లేదు'' అని పద్మావతి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో తీవ్రంగా స్పందించిన చంద్రబాబు, ఆమె వ్యక్తం చేసిన వాటికి ఏం సమాధానం చెబుతారని కార్యకర్తలను ప్రశ్నించారు. దీనిపై ఒకరిద్దరు కార్యకర్తలు మాట్లాడినప్పటికీ ఆమె వెలిబుచ్చిన సమస్యలకు సమాధానాలు చెప్పలేకపోవడంతో బాబు ఒకింత అసంతప్తి వ్యక్తం చేశారు.

పాదయాత్రలో తాను చెబుతున్న విషయాలను ప్రజలకు వివరించడంలో వెనుకబడి వున్నారని అసంతప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలు మరింత చైతన్యం కావలసిన అవసరం ఉంద
ని అన్నారు. అనంతరం పద్మావతి వెలిబుచ్చిన అంశాలపై తీసుకునే చర్యల గురించి వివరించారు. పావలా వడ్డీ రుణాల పేరుతో జరుగుతున్న మోసాన్ని అరికడతానని, వడ్డీ చెల్లించవద్దని ఇప్పటికే చెప్పానని అన్నారు. నిరుపేద మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇస్తానని, గ్రామాల్లో నిరుపేద మహిళల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తానని, అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేయిస్తానని, బెల్టుషాపులను ఎత్తివేయిస్తానని, నిత్యావసరాల ధరలు అందుబాటులో వుండేలా చూస్తానని హామీ ఇచ్చారు.

చైతన్యం పెరగాలి

నర్సీపట్నం టౌన్: విశాఖ ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న నర్సీపట్నాన్ని శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అన్ని రకాలుగా అవకాశాలు ఉన్న నర్సీపట్నాన్ని విద్యా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా నర్సీపట్నం అబీద్ సెంటర్‌లో ప్రజల నుద్దేశించి బాబు ప్రసంగించారు. అబీద్ సెంటర్‌లో వెలగని హైమాస్ట్ లైట్లను చూసిన ఆయన.... హైమాస్ట్ లైట్లలో ఉన్న బల్బులను కూడా కాంగ్రెస్ దొంగలు దోచుకొని గాడాంధకారం చేశారని వ్యంగ్యంగా విమర్శించారు.

మున్సిపాలిటీ అయిన తర్వాత నర్సీపట్నంలో ఇంటి పన్నులు పెంచేశారని విమర్శించారు. పట్టణంలో కలుషితనీరు సరఫరా చేస్తున్నారని, తాను అధికారంలోకి వస్తే శుద్ధిచేసిన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండ వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్షన్నర పెట్టి ఇళ్లు నిర్మించి సొంత ఇంటి వారిని చేస్తానని భరోసా ఇచ్చారు. ఉపాధి పథకం కాంగ్రెస్ పార్టీకి ఫలహారమైందని అ
న్నారు. కూలీలకు కనీసం రూ.50 కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, అన్ని వర్గాల వారికీ తగిన రీతిలో న్యాయం చేస్తామని అన్నారు. వృద్ధాశ్రమం పెట్టి కన్నవారి కంటే ఎక్కువగా అక్కున చేర్చుకుంటానన్నారు. రావాణాపల్లి రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

టీడీపీ అధికారంలో ఉండగా నర్సీపట్నం పెద్దచెరువుని టాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించామని, ఇప్పటికీ అది అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు ఉండిపోయిందని విమర్శించారు. తన హయాంలో కృష్ణాదేవిపేటలో అల్లూరి స్మారక పార్కు అభివృద్ధికి కృషి చేశానన్నారు. ఇప్పుడు కనీసం పార్కులో వాచ్‌మన్‌కు జీతం కూడా ఇవ్వలేని దుస్థితి ఉందని విమర్శించారు. తాను అధికారంలోక వస్తే అల్లూరికి తగిన గుర్తింపును ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.

నర్సీపట్నాన్ని శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తా

 'ఆవిర్భావం నుంచి చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటల్లా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు చోట్లా టీడీపీయే గెలవాలి. ఈ బాధ్యత మీదే' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సూచించారు. నర్సీపట్నం పరిధిలోని బలిఘట్టం వద్ద చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత సమయం కంటే గంటా 45 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ సమీక్ష ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో కష్టించి పార్టీని గెలిపించే బాధ్యత మీదేనని, మిమ్మల్ని గౌరవించే బాధ్యతను తాను తీసుకుంటానని బాబు చెప్పారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపడాలని సూచించారు.

నాయకులు బాగా పనిచేయడం లేదని అనడం లేదని, పార్టీ సమావేశాలు తగ్గిపోయాయని చెబుతున్నానని అన్నారు. ఒక్క ఏడాది కష్టపడితే కార్యకర్తలందరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో తరచూ సమావేశాలు నిర్వహించాలని, సలహాలు స్వీకరించాలని, ఎన్నికల నాటికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, టీడీపీ హయాంలో జరిగిన అభివద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు.

వర్గాలను ప్రోత్సహిస్తే పక్కనబెట్టండి వర్గాలను ప్రోత్సహించే నేతలను కార్యకర్తలే పక్కనపెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బుచ్చెయ్యపేట, మాడుగుల మండలాల నుంచి కొందరు కార్యకర్తలు పాలసంఘం, సహకారసంఘాల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని కార్యకర్తలు బాబు దృష్టికి తీసుకురాగా, పై విధంగా స్పందించారు.

చోడవరం ఎమ్మెల్యేకు స్థానిక ఎన్నికల పరీక్షలు ఉన్నాయి చోడవరం ఎమ్మెల్యే రాజు నూటికి నూరుమార్కులు తెచ్చుకోవడం కరక్టేనని, ఆయనకు ఇంకా స్థానిక ఎన్నికల పరీక్షలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. తమ ఎమ్మెల్యే రాజు బాగానే పనిచేస్తున్నారని ఓ కార్యకర్త అనగా, బాబు ఇలా స్పందించారు. ఆ పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించాల్సిన బాధ్యతల రాజుపై ఉందని చెప్పారు.

రెండు నియోజకవర్గాల

కార్యకర్తలు కలిసిపోయారా సమీక్షకు హాజరైన కార్యకర్తలు నియోజవర్గాల వారీగా చేతులెత్తాలని బాబు కోరడంతో, రెండు వైపులా కార్యకర్తలు చేతులెత్తారు. రెండు నియోజకవర్గాల కార్యకర్తలు వేర్వేరుగా ఉంటారని అనుకున్నానని, అందరూ కలిసిపోయారని చంద్రబాబు ఛలోక్తి విసిరారు.

సభ ప్రారంభానికి ముందు జిల్లా కన్వీనర్ అయ్యన్నపాత్రుడు నాయకులందరినీ వేదికపైకి ఆహ్వానించారు. వేదికపై చోడవరం మాడుగుల ఎమ్మెల్యేలు కెఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు బాబుకు చెరోవైపు కూర్చున్నారు.

సమీక్షలో చోడవరం నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీపీలు జి.పెదబాబు, బి.తాతయ్యబాబు, మాజీ సర్పంచ్ మల్లునాయుడు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎం.గౌరీశంకర్, నాయకులు కె.మత్స్యరాజు, ఆర్.రమణ, బి.లక్ష్మణరావు, ఎ.లక్ష్మణ్‌కుమార్, ఎం.వెంకటరమణ, డి.అప్పలనాయుడు, వి.అప్పారావు, గోవింద్, సింహాద్రి, మాడుగుల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు సరోజిని, నాయకులు ఎస్.రామునాయుడు, కె.నరసింగరావు, వర్మ, అద్దేపల్లి జగ్గారావు పాల్గొన్నారు. అంతకు ముందు నాయకులు చంద్రబాబుకు జ్ఞాపికను బహూకరించారు.

మాడుగుల, చోడవరాల్లో టీడీపీయే గెలవాలి

విశాఖపట్నం:నిస్వార్థ సేవకు చిరునామా..టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మినబంటు. నాటి 'మీకోసం', నేటి 'వస్తున్నా మీకోసం' యాత్రకు సమన్వయకర్త...గరికిపాటి మోహనరావు. ఎటువంటి పదవులు, ప్రయోజనాలు ఆశించకుండా రాముడికి హనుమంతునిలా చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏడెనిమిది నెలలుగా కుటుంబానికి దూరంగా వుంటూ బాబు పాదయాత్ర విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరో పది రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో 'వస్తున్నా...మీకోసం' కార్యక్రమం స్మృతులను ఆయన 'ఆంధ్రజ్యోతి'తో పంచుకున్నారు. ఆ విశేషాలు...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర ప్రజాభిమానం పొందడంలో విజయవంతమైందని యాత్ర సమన్వయకర్త గరికిపాటి మోహనరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేయడం ద్వారా చంద్రబాబు తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నారని చెప్పారు. యువత, మహిళలు చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన ముఖ్యమంత్రి కావాలన్నదే వారి ఆకాంక్షగా కనిపిస్తోందని వెల్లడించారు. ఏడు నెలల పాదయాత్రలో ఎన్నో తీపిగుర్తులు-చేదు జ్ఞాపకాలు తమకు ఎదురయ్యాయని పేర్కొన్నారు. పాదయాత్ర ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో బుధవారం నర్సీపట్నంలో ఆయన 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధితో మాట్లాడారు.

'అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్ల నుంచి చంద్రబాబు ప్రజల మధ్యనే ఉంటున్నారు...వారి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటున్నారు...నేనున్నానంటూ ఓదారుస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని భావించిన చంద్రబాబు సుదీర్ఘమైన సాహసయాత్రకు పూనుకున్నారు' అని మోహనరావు తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లుగా అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని పాదయాత్రలో ఆయన తెలుసుకోగలిగారన్నారు. తొంభై శాతానికిపైగా ప్రజలు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఆయన ముందు మొరపెట్టుకోవడం రాష్ట్రంలో పరిపాలనకు అద్దం పడుతోందన్నారు.

రైతు, రైతుకూలీ, మహిళ, యువత, చేతివృత్తిదారులు...ఇలా అనేకమంది తమ సమ్యలు పరిష్కరించాలంటూ ఆయనకు అర్జీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు గతంలో రెండు, మూడు పర్యాయాలు బస్సు యాత్రలు నిర్వహించినప్పటికీ ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారని తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లలో మహిళలు, యువత తీవ్రమైన నిరాశ, నిస్పృహకు గురయ్యారని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు మఖ్యమంత్రి అయితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని మోహనరావు విశ్లేషించారు. ఎక్కడికెళ్లినా మహిళలు, యువతే ముందుండి ఆయనకు స్వాగతం పలుకుతూ తమ మద్దతు తెలుపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు, యువత ఇప్పుడొస్తున్నంత భారీ స్థాయిలో ఎప్పుడూ రాలేదని చెప్పారు. పాదయాత్రలో ప్రజలను కలుసుకోవడం ఒక్కటే కాకుండా పార్టీ పనితీరు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా నుంచి నియోజకవర్గ సమీక్షలు ప్రారంభించిన చంద్రబాబు పలు ప్రాంతాల్లో నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించగలిగారన్నారు. వచ్చే నెలలో పార్టీ సమీక్షకు సంబంధించి విస్తృతంగా కసరత్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అధినాయకుడే కాదు నాయకులు కూడా గ్రామాల్లో ప్రజలతో మమేకం కావాలన్న ఆకాంక్ష కొంతమేరకు తీరిందన్నారు. ఏడు నెలల పాదయాత్ర దేశంలోనే ఒక రికార్డుగా ఆయన చెప్పారు.

'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర మహాయజ్ఞంలా వందలాది మంది అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షగా అన్ని వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. తమలో తారతమ్య భేదాలు లేకుండా అంతా కలిసి పనిచేస్తున్నామని అన్నారు. పాదయాత్రకు రెండు నెలల ముందే కసరత్తు చేశామని, అందుకే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతోందని తెలిపారు. చంద్రబాబు శారీరకంగా బాగా అలసిపోయారని, రోజూ కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు వస్తున్నప్పటికీ ప్రజల కష్టాలు తీర్చాలన్న తపనతో వాటిని లెక్కచేయడంలేదని ఆవేదనగా చెప్పారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తామంతా గర్విస్తున్నామని మోహనరావు చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌లో ఆయన ప్రసంగిస్తుండగా వేదిక కూలిపోవడం ఓ చేదు జ్ఞాపకమని అన్నారు. ఆరోజు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించే వరకూ తాము నిద్రపోలేదని, అప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. అలాగే గుంటూరు జిల్లా వేమూరు అసెంబ్లీ పరిధి వలకనూరు వేదిక మెట్లు కూలిపోయినప్పుడు కూడా ఎంతో కలవరానికి గురయ్యామని తెలిపారు. తామంతా భయపడుతుంటే ఆయనే తమకు మనోధైర్యాన్ని ఇచ్చి 'ధర్మపోరాటం చేస్తున్నాం...దేముడు మన వెనుకే ఉన్నాడు' అని భరోసా ఇస్తూ ముందుకుసాగడం ఆయనలో స్ఫూర్తిదాయక లక్షణానికి నిదర్శనమన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఓ బాలిక తన పేదరికాన్ని తెలియజేసినప్పుడు చంద్రబాబు చలించిపోయారని...ఆ సంఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ
కంటతడి పెట్టించిందన్నారు. ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలన్నదే ఆయన తపన అని వివరించారు.

పాదయాత్రకు ఎంతోమంది ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ప్రజలు, అభిమానులు ఇచ్చిన విరాళాల నుంచి కొంత మొత్తాన్ని ఆయన యాత్రలో పేద వృద్ధులకు ఇస్తున్నారని గరికిపాటి తెలిపారు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు, విపక్షనేతగా మరో తొమ్మిదేళ్లు పనిచేసిన చంద్రబాబు ఎటువంటి భేషజంలేని వ్యక్తి అని, క్రమశిక్షణలో ఆయన రోల్‌మోడల్ అని గరికిపాటి కితాబిచ్చారు. మరో పది రోజుల్లో పాదయాత్ర ముగియనుందని, విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రజాభిమాన యాత్ర భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా త్వరలో ఓ పుస్తకాన్ని తీసుకురానున్నట్టు మోహనరావు తెలిపారు.

ప్రజాభిమాన పాత్రుడు చంద్రబాబు

ప.గో : జిల్లాలో పలు అభివృధ్ది పనులను ప్రారంభించడానికి భీమవరం వచ్చిన మంత్రి ప్రసాద్‌రావు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. అవినీతి మంత్రి రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. న ర్సాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు వారి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో మంత్రి కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంత్రి ధర్మాన శంకుస్థాప చేయడంతో అపవిత్రమైందని విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.

మంత్రి ధర్మానను అడ్డుకునేందుకు టీడీపీ యత్నం

శాన్ హొసె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించే లక్ష్య సాధనలో భాగంగా అందరూ చంద్రబాబు నాయుడుకు మద్దతు ప్రకటించాలని బే ఏరియా టి.డి.పి. కోరింది. ఆంధ్ర ప్రదేశ్ బంగారు భవితవ్యంకోసం అందరూ శనివారంనాడు కదిలిరావాలని ఈ సంస్థ కోరింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ శనివారం మధ్యాహ్నం మిల్‌పిటాస్‌లోని సత్యనారాయణ ఆలయంలో పూజ జరుగుతుందని, ఆ తర్వాత సంఘీభావ యాత్ర జరుగుతుందని సంస్థ నిర్వాహకులు వివరించారు.
: తెలుగు దేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వస్తున్నా.. మీకోసం పాదయాత్ర 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో శనివారంనాడు సంఘీభావ యాత్ర నిర్వహిస్తున్నట్టు బే ఏరియా ఎన్.ఆర్.ఐ. టి.డి.పి. వెల్లడించింది.

మిల్‌పిటాస్‌లో 20న చంద్రబాబు సంఘీభావ యాత్ర