April 18, 2013

జిల్లా సమస్యలను మరిచిన ముఖ్యమంత్రి


గుజరాతిపేట: ముఖ్యమంత్రి ఎన్.కి రణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చి చుట్టం చూపులా చూసి వెళ్లారే తప్ప జి ల్లాలోని ప్రధానమైన సమస్యలను ప్ర స్తావించకపోవడం చాలా దారుణమం టూ మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు ఏకరువు పెట్టారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎ స్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు మూడువేల కోట్ల రూపాయలు మంజూరు చేశామని చె ప్పారే తప్ప గత ఏడాదిలో మంజూరు చేసిన సబ్‌ప్లాన్ నిధుల వివరాలు ఇంతవరకు పత్రికా ముఖంగా చెప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలను బహిరంగ సభకు తరలించారని, ఐదుగురు కూలీలను బలిగొన్న సీఎం వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అధిష్టానంలో అవినీతి మంత్రులను పెంచి పోషిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బహిరంగ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కృపారాణి ఇంట్లో విందు చేయడానికే వచ్చారు తప్ప తోటపల్లి రిజర్వాయర్ తదితర జిల్లా సమస్యలను చర్చించే దిశగా మాట్లాడకపోవడం విచారకరమన్నారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం సమస్యలపై దృష్టిసారించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో సమస్యలు ఎన్నో ఉ న్నప్పటికీ కనీసం వాటి పరిష్కారంపై చర్చించిన దాఖలాలు లేకపోవడం వి డ్డూరంగా వుందన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు పీవీ రమణ, బీవీఎస్ ప్రకాష్, ఎస్‌వీ రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.