March 27, 2013

టెక్కలి  :త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు గుణపాఠం తప్పదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి జోష్యంచెప్పారు. మంగళవారం ఆయన 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడు తూ పంచాయతీల పదవీకాలం ముగి సి రెండేళ్లు గడిచినా ఎన్నికలు నిర్వహించలేకపోయిన ప్రభుత్వం, ఇప్పుడేమో గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ దొడ్డిదారి గెలిచిందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని కృపారాణి గొప్పలుగా చెప్పుకుంటున్నారని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్‌కోత, తాగునీటి సమస్య, రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేద ని ఆరోపించారు. కేవలం పదవుల కో సం పాకులాడడం మినహా, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎప్పుడు స్థానిక సం స్థలు ఎన్నికలు జరిగినా అధికార కాం గ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు

నంగునూరు: ప్రజా చైతన్యానికే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట, సిద్దన్నపేట, కొండంరాజ్‌పల్లి, నర్మెట గ్రామా ల్లో మంగళవారం 'పల్లెపల్లెకు టీడీపీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పార్టీ పతాకాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. టీడీపీ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్నారు.

ప్రజా సమస్యలను డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను చేపట్టారని, ఈ పాదయాత్రకు రాష్ట్రం లో అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. పాదయాత్ర సందర్భంగా పలు సమస్యలపై చంద్రబాబు స్పందిస్తున్నారని అన్నారు. మహిళలు, రైతులకు రుణాల మాఫీని ప్రకటించారని, అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదటి సంతకం రుణమాఫీ ఫైనే ఉంటుందన్నారు.

టీడీపీకి పూర్వ వైభవం తథ్యమన్నారు. టీడీపీ నాయకులు కోమండ్ల రామచంద్రారెడ్డి, గుండు భూపేశ్, నర్ర జయపాల్‌రెడ్డి, ఉడుత మల్లేశం మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ధ్వజమెత్తారు. ప్రజలు విద్యుత్ కోత, నీటి ఎద్దడిలతో అల్లాడుతున్నా సర్కార్‌లో స్పందన లేదన్నారు. ప్రజల కష్టాలు చంద్రబాబు పాలనలోనే తీరుతాయన్నారు. మండల శాఖ అధ్యక్షుడు చెలికాని మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు ఎల్లంకి మహిపాల్, సత్యనారాయణరెడ్డి, రాజమౌళి, ధరవ్మరం బ్రహ్మం, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

పటిష్ఠంగా పార్టీ క్యాడర్ గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ పటిష్ఠంగా ఉందని మైనంపల్లి హన్మంతరావు చెప్పారు. నంగునూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అన్నారు. పార్టీలో అన్నీ అనుభవించిన వారే పార్టీని వీడారని పేర్కొన్నారు. నేతలు మారినా కార్యకర్తలు పార్టీ జెండాలను మోస్తున్నారని, పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను పార్టీ తప్పక గుర్తిస్తుందన్నారు.

రాజ్యాంగ సంక్షోభంతోనే తెలంగాణ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తేనే తెలంగాణ సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రాజకీయ పార్టీలు ఐక్యంగా తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. స్వార్థ రాజకీయాలను వీడి సమష్ఠి పోరాటం చేస్తేనే తెలంగాణ సాధ్యమన్నారు. పన్నెండున్నరేళ్లుగా తెలంగాణ కోసం ఓట్లు వేసినా రాలేదన్నారు. తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా లేఖను ఇచ్చి ఉద్యమిస్తోందన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో వివిధ పార్టీల నుంచి సుమారు 70 మంది టీడీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాను కప్పి స్వాగతం పలికారు.

అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ : బాబుమోహన్ గుమ్మడిదల: వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, రైతుల రుణాలు మాఫీపైనే చంద్ర బాబు మొదటిసంతకం చేయనున్నా రని టీడీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బాబుమోహన్ పేర్కొన్నారు.

పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదలలో నిర్వహించిన బహిరంగ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతూ దాచుకోవడం..దోచుకోవడం పనిగా పెట్టుకుందని, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికలలో ఓటర్లు ఆలోచించి ఎవరు మంచి చేస్తున్నారనేది నిర్ణయించుకుని ఓటు వేయాలని కోరారు.

ప్రజా చైతన్యానికే 'పల్లెపల్లెకు టీడీపీ'

(విజయవాడ)  : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోనే తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో చూపిస్తానని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీ నుంచి మంగళవారం ప్రకటన వెలువడిన నేపథ్యంలో చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన విజయవాడ - తూర్పు, మధ్య, పశ్చిమ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జీలతో కలిసి పని చేస్తానన్నారు. నగరంలోని 59 డివిజన్లు , జిల్లాలోని గ్రామాలు, మునిసిపాలిటీల పరిధిలో పార్టీని పటిష్ఠం చేయడానికి కార్యకర్తలు, నాయకుల సహకారం తీసుకుంటానన్నారు.

తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా కాలంలో అధిక ధరలు, విద్యుత్ సమస్యలు, అవినీతితో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకకు వెళ్ళిందని నాని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించి సత్తా చాటుతానని కేశినేని నాని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ పని చేస్తానని తెలిపారు. పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశానుసారం కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ప్రజలకు మరింత దగ్గరతానన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సత్తా చూపిస్తా

(విజయవాడ)  : తెలుగుదేశం అర్బన్ పార్టీకి కొత్త కృష్ణుడు వచ్చాడు. నూతన అధ్యక్షడుగా నాగుల్‌మీరాను నియమిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కేశినేని నాని పేరును ప్రకటించారు. వల్లభనేని వంశీ మోహన్‌కు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవి ఇచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధిత్వాన్ని కేశినేని నానికి ఇవ్వాలని నిర్ణయించిన చంద్రబాబు ఆలోచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. కేశినేని నాని సిఫార్సుల మేరకు అర్బన్ అధ్యక్ష పదవిని నాగుల్ మీరాకు అప్పగించారు. ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది గడువు మాత్రమే ఉంది. అర్బన్ పార్టీకి ఇది ఎంతో కీలకమైన సమయం. అర్బన్ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సీపీఐకి, సెంట్రల్ సెగ్మెంట్‌ను సీపీఎంకు కేటాయించిన టీడీపీ తూర్పులో మాత్రమే పోటీ చేసింది.

ఈ మూడింటిలోనూ మిత్ర పక్షాలు ఓడిపోయాయి. అంతేగాక టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీమోహన్ గెలుపు అవకాశాలను కూడా అర్బన్ మింగేసింది. రూరల్ పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో వంశీ మోహన్‌కు 25 వేల ఆధిక్యత వచ్చి కూడా అర్బన్ పరిధిలో 37 వేల ఓట్ల మైనస్ రావడంతో వంశీ 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల తర్వాత వామపక్షాలు, టీడీపీల మధ్య భేదాభి ప్రాయాలు రావడంతో మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించింది. పశ్చిమ ఇన్‌చార్జిగా బుద్దా వెంకన్న, సెంట్రల్ ఇన్‌చార్జిగా బొండా ఉమామహేశ్వరరాఉ, తూర్పు ఇన్‌చార్జిగా గద్దె రామ్మోహన్ కొనసాగుతున్నారు. మూడేళ్లుగా నగరంలో మూడు పార్టీలు ఎవరి కార్య క్రమాలు వారు చేసుకుంటూ పార్టీలను బలోపేతం చేసుకుంటున్నారు.

టీడీపీ ఇన్‌చార్జిలు ముగ్గురుతో వంశీ సత్సంబంధాలు కొనసాగించారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వచ్చినా సర్దుకున్నారు. దుర్గాఘాట్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఆ నియోజకవర్గంలో బుద్దా వెంకన్న జరిపిన పోరాటాన్ని చంద్రబాబు ప్రశంశించారు. పునాదులు లేని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి చేశావంటూ ఆయన కితాబు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. దాదాపుగా నియోజకవర్గ ఇన్‌చార్జిలకే అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే అవకాశాలుంటాయని పార్టీ నాయకుల ఊహ. వంశీ నేతృత్వంలో అర్బన్ పార్టీ పరిస్థితి కొంత వరకు మెరుగైందనే అభిప్రాయం అందిరిలో ఉంది. ఆర్థికంగా తనకున్న బలంతో యువతలో క్రేజ్ పెంచుకునేందుకు వంశీ తాపత్రయ పడ్డారు. ఈ దశలో వంశీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ వర్గీయులతో ఘర్షణ వాతావరణంలో పని చేశారు.

నడి రోడ్డు మీద జగన్‌తో చేతులు కలపడం వంశీ మీద మరక పడేలా చేసింది. ఆ తర్వాత వంశీ తప్పు ఒప్పుకుని చంద్రబాబును కలిశారు విభేదాలు సద్దుమణిగాయనుకుంటున్న తరుణంలో కేశినేని రంగ ప్రవేశంతో విజయవాడ టీడీపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. వంశీ బ్యాక్ టు పెవిలియన్ కేశినేని రాకతో వల్లభనేని వంశీమోహన్ ప్రాముఖ్యత పార్టీలో తగ్గింది. కేశినేని నాని సూచించిన నాగుల్‌మీరాకు అర్బన్ అధ్యక్ష పదవి ఇవ్వవలసి రావడంతో చంద్రబాబు వంశీని మండపేట పిలిపించుకుని మాట్లాడారు. వంశీని రాష్ట్ర పార్టీలోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన బాబు ఈ మేరకు ఆయనకు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవికి ఎంపిక చేశారు. పార్టీలో భవిష్యత్తుపై కూడా వంశీకి, బాబు భరోసా ఇచ్చారు.

అర్బన్ టీడీపీ అధ్యక్షునిగా నాగుల్ మీరా

అనపర్తి : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు అనపర్తి మండలం పెడపర్తిరేవుకు చేరుకుంది. ఈ సందర్బంగా పార్టీ సీనియర్ నాయకుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (రాము) ఆధ్వర్యంలో బాబుకు ఘన స్వాగతం పలికారు. అర్ధరాత్రి దాటినా బాబు రాక కోసం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, అధిక సంఖ్యలో ప్రజలు ఎదురు చూశారు. పెడపర్తి రేవుకు చేరుకున్న బాబుకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనపర్తి మాజీ ఎంపీపీ కొవ్వూరి పార్వతి ఆధ్వర్యంలో 150 మంది మహిళలు బాబుకు హారతులు ఇచ్చారు.

సోమవారం 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అర్ధరాత్రి దాటినప్పటికీ బాబు చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేశారు. అలసి వచ్చిన బాబుకు అంతరంగిక సి బ్బంది దిష్టి తీశారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో బాబు ప్రజలకు అభివాదం చేసి విశ్రాంతి తీసుకునేందుకు బస్సులోకి వెళ్ళారు. కార్యక్రమంలో టీడీపీ అనపర్తి మండల నాయకులు కర్రి ధర్మారెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, కర్రి వెంకట రామారెడ్డి, సత్తి దేవదాన్‌రెడ్డి, తేనెల శ్రీనివాస్, వైజాగ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అపూర్వం..చంద్రబాబుకు ఘన స్వాగతం

అనపర్తి/మండపేట
: కాంగ్రెస్ ప్ర భుత్వ వైఫల్యాలు, పిల్ల కాంగ్రెస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 'వస్తున్నా... మీకోసం' యాత్రలో భాగంగా మంగళవారం అ నపర్తి మండలం పెడపర్తిలో బస చేసిన బాబు మధ్యాహ్నం ముమ్మిడివరం నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షించారు. ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. ముందుగా చంద్రబాబునాయుడుకు బుడుగ జంగాల రాష్ట్ర నాయకులు రిజర్వేషన్‌పై వినతిపత్రాన్ని సమర్పించారు.

బీసీలో ఉన్న తమను ఎస్సీలలో కలపాలని వారు కో రారు. గంగిరెద్దుల కులస్థులను కూడా ఎస్సీలలో చేర్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకు మాట్లాడాల్సిందిగా కోరినపుడు కార్యకర్తలు పొగడ్తలు వద్దు పేదల రాజ్యం రైతు రాజ్యం లక్ష్యంగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు చంద్రబాబుకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీడీపీలోని సామాజిక న్యాయం అమలవుతుందన్నారు. టీడీపీలో అందరికీ సమన్వ యం జరిగిందన్నారు. దళితులను ఉ న్నత పదవులు అందించింది టీడీపీయే అని గుర్తు చేశారు. వైఎస్. నోడల్ ఏజ న్సీ పేరిట రాష్ట్రాన్ని దోచేశారన్నారు. ఎస్సీల నిధులు ఇడుపులపాయ, హు స్సేన్‌సాగర్‌కు తరలించారన్నారు.

త మ హయాంలో దళితులకు భూము లు కొనుగోలు చేసి ఇస్తే వైఎస్. పరిశ్రమలకు కట్టబెట్టారని ఆరోపించా రు. తమ ప్రభుత్వం రూ.300 కోట్లు ఎస్సీ రుణాలు మాఫీ చేసిందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ పేరిట ప్రభుత్వం రూ. 800 కోట్లు విడుదల చేసి వాటిని బ్యే లెట్ బాక్సులకు తరలించి ఎస్సీలను నిర్వీ ర్యం చేసిందని ఇసుకుబట్ల వెంకటేశ్వరరావు బాబు దృష్టికి తెచ్చారు. పశువుల్లంకకు చెందిన ఉమామహేశ్వరరా వు అనే యువకుడు అగ్రవర్ణాల పేదలకు కూడా న్యాయం చేయాలని కోరారు. 7.50 లక్షల బి.ఈడీ నిరుద్యోగులుండ గా వారు ఎస్జీటీకీ అనర్హులంటూ ప్రభు త్వం ప్రకటించడంపై స్పష్టత ఇవ్వాలని బాబును కోరారు.

దీనిపై బాబు మాట్లాడుతూ అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్ కల్పించి ఆదుకుంటామన్నా రు. కాపులకు కూడా నాయ్యం చేస్తామన్నారు. ఎం.రాజేష్ అనే వికలాంగుడు మాట్లాడుతూ వికలాంగులకు రాజకీ య పదవులు కల్పించాలం టూ కోర గా బాబు స్పందించి వికలాంగులకు ఫించను, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. తాళ్లరేవుకు చెందిన కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి నష్టం తప్పదని సీఎం.గా బాబు ము మ్మిడివరం ఎమ్మెల్యేగా బుచ్చిబాబు గెలవడం తధ్యమ ని పేర్కొన్నారు. కార్యకర్తల కృషితోనే టీడీపీ కుటుంబం ఇలా ఉందని బాబు అన్నారు. ముమ్మిడివరం టీడీపీ అభ్యరి«్ధగా బుచ్చిబాబును ప్రకటించాలని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నీలకంఠేశ్వరరావు కోరారు.

మహిళలకు రక్షణ కల్పించి వారికి అన్నింటా ప్రాధాన్యం ఇవ్వాలని కొమరిగిరి మాజీ సర్పంచి సాకాసీతాదే వి కోరారు. మహిళలకు ఉద్యోగ, విద్య రాజకీయలలో అవకాశాలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసిన ఘనత టీడీ పీదే అన్నారు. తాళ్లరేవుకు చెందిన దూ ళిపూడి బాబి అవినీతిపై తాను చేసిన ఎస్ఎంఎస్‌లపై వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని ఎన్నికలలో విజ యం సాధిస్తే మీ యోగక్షేమాల బాధ్య త తనదేనంటూ భరోసా ఇచ్చారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బుచ్చిబాబు చంద్రబాబును సన్మానించారు.

సమావేశం మధ్యాహ్నం గం టంపావు వరకు నిర్వహించారు. స మావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ని మ్మకాయల చినరాజప్ప, అనపర్తి మా జీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ము మ్మిడివరం నియోజకవర్గ ఇన్‌చార్జి దా ట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, మాజీ జడ్పీటీసీలు కాశి పరిరాజకుమార్, నాగిడి నాగేశ్వరరావు, గాదిరాజు సత్యనారాయణరా జు, ఐ.పోలవరం మాజీ ఎంపీపీ పేరాబత్తుల రాజశేఖర్, దూలిపూడి బాబి, గంగ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు సాకా సీతాదేవి, బీర సత్యకుమా రి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దొంగ సాక్షి కథనాలన్నీ అబద్దాలే. సాక్షి దినపత్రిక కథనాలన్నీ అబద్దాలేనని అదో విషపు కన్య అని చంద్రబాబు అన్నారు. అనపర్తి మండలం పె డపర్తిలో జరిగిన టీడీపీ సమీక్షలో ఆ యన పైవిధంగా ప్రస్తావించారు. మనమీద వ్యతిరేక వార్తలు రాయడం వారి కి పని. మనం వస్తే వారి మనుగడ ఉండదని వారికి భయం. అలాంటి పత్రికల్లో కథనాలు చదవడం తగదని ఆయన కార్యకర్తలకు సూచించారు.

నక్కా రామకృష్ణ, టి.కొత్తపల్లి యానాం రీజెన్సీలో 3 వేల మంది పనిచేసేవారము. అక్కడ గొడవల వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. దానిని తిరిగి తెరిపించేలా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై బాబు స్పందిస్తూ ఫ్యాక్టరీ మీద దాడి జరిగింది. కార్మికులు, యాజమాన్యం రోడ్డునపడ్డారు. అక్కడ ఎమ్మెల్యేకు, స్థా నిక ఎంపీకి మధ్య ఉన్న విభేదాల వల్ల ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో సంబంధంలేని ఎంపీ జోక్యం చే సుకుని కంపు చేశారని అన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, తాను అరాచకాలను సహించనని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అనపర్తి : పేదల అభివృద్ధి, రైతుల సంక్షేమమే ధ్యేయమని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన చేపట్టిన 'వస్తున్నా... మీకోసం' కోసం పాదయాత్ర మంగళవారం అనపర్తి మండలంలో కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పెడపర్తి రేవులో బస చేసిన ప్రదేశంలో ముమ్మిడివరం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు పెడపర్తి రేవు నుంచి చంద్రబాబు పాద యాత్ర మొదలుపెట్టారు. పెడపర్తి, కుతుకులూరు, రామవరం గ్రామాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని, విద్యుత్ సర్‌ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తోందనానరు.

ఈ ఛార్జీలు సర్‌ఛార్జీలు కాదని, వైఎస్ పాలనలో దోచుకున్న దోపిడీకి ప్రస్తుతం ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్ములని బాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల దోపిడీలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. పన్నుల రూపంలో ఎంత సొమ్ము వసూలు చేసినప్పటికీ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని, ప్రతి నిరుపేదకు ఇంటి స్థలాన్ని ఇచ్చి రూ.1.50 లక్షలతో గృహ నిర్మాణం చేపడతామన్నారు. ఒక్కసారి తమ పార్టీకి అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టే అవకాశాన్ని కల్పించాలని ఆయన కోరారు.

పాదయాత్ర ప్రారంభం నుంచి అశేష జనవాహిని వెంట రావడంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు.

పెడపర్తి వద్ద పొలాల్లో కూలిపని చేసుకుంటున్న వారి వద్దకు వెళ్ళి కష్ట
సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టీలలో కార్మికులు తయారు చేస్తున్న ఇటుకలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారి యోగ క్షేమాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కుతుకులూరులోని బజ్జీల దుకాణం వద్దకు వెళ్ళిన బాబు బజ్జీలను వేయించి అందరినీ అశ్చర్యపరిచారు. కుతుకులూరు గ్రామంలోని ప్రశాంత్ విద్యానికేతన్‌లో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో బాబు పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డిల విగ్రహాలను బాబు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పాదయాత్రలో బాబు వెంట టీడీపీ నేతలు నల్లమిల్లి మూలారెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మురళీమోహన్, నిమ్మకాయల చినరాజప్ప, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

పేదల అభివృద్ధి,రైతుల సంక్షేమమే ధ్యేయం

రాయవరం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రకు రాయవరంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు రాత్రి బస చేసేందుకు నిర్దేశించిన స్థలాన్ని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సోమవారం పరిశీలించారు. కా ర్యకర్తలకు భోజనం, మంచినీటి సౌక ర్యం ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు యాత్రలో భాగంగా బుధవారం మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల సమీక్ష సమావేశం రాయవరంలో జరుగుతుందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. అనంతరం రాయవరంలో సుమారు రూ.4 లక్షల తో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించి గ్రామంలో పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పారు.

బిక్కవోలు: బుధవారం రాత్రి బిక్కవోలులో చంద్రబాబు బసకు ఏ ర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజులు గా టీడీపీ బిక్కవోలు గ్రామ శాఖ ఆధ్వర్యంలో రజకుల కమ్యూనిటీ హాలు ఆవరణను చదును చేశారు. ఆవరణ వెనుక భాగంలో కార్యకర్తలు, నేతలకు భోజనశాల ఏర్పాటు చేశారు. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మం గళవారం బస ఏర్పాట్లను చూసి సం తృప్తి వ్యక్తం చేశారు. ఇక కొమరిపాలెం నుంచి తొస్సిపూడి, బలభద్రపురం, బి క్కవోలు వరకు రోడ్లన్నీ పసుపుమయం అయ్యాయి. భారీ ఎత్తున కటౌట్లు, బ్యా నర్లు, జెండాలు కట్టారు. బిక్కవోలు వంతెన సమీపంలోని ఎన్టీఆర్ విగ్ర హం వద్ద జెండాలతో చేసిన ప్రత్యేక అలంకరణ కనువిందు చేస్తోంది.

చంద్రబాబు యాత్రకు భారీ ఏర్పాట్లు

 కాకినాడ:వైఎస్, కాంగ్రెస్ పాలకులు రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి వెచ్చించాల్సిన నిధుల్ని మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమజీవుల్ని దోచుకుని పేదలను మరింత పేదలుగా తయారుచేశారన్నారు. అనపర్తి మండలం పెడపర్తి, కుతుకులూరు, రామవరం, పొలమూరులలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా పలు చోట్ల రోడ్‌షోలలో జనాన్ని ఉద్దేశించి బాబు ఉత్సాహంగా ప్రసంగించారు. 'మీ కష్టాలకు కారణం చెప్పడానికి వచ్చాను. ఆదాయాలు పెరిగి ఆనందంగా ఉండాల్సిన సమయంలో అన్నీ కష్టాలే. ఈ కాంగ్రెస్ గజదొంగల వల్లే మీకు కష్టాలు. వైఎస్ తన కుటుంబానికి, బంధువులు, సన్నిహితులకు లక్షల కోట్లు దోచిపెట్టారు.

ఇపుడు ఆ ప్రభావం మీ అందరిపై పడుతోంది. పేదరికంతో అల్లాడిపోతున్నా కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం పట్టదు..' అని చంద్రబాబు పేర్కొన్నారు. కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఆలోచించి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో అందరికీ తెలియచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బెంగుళూరు, హైదరాబాద్, కడప, ఇడుపులపాయ, పులివెందుల, చెన్నయ్‌లలో జగన్ అధునాతన భవంతులు నిర్మించుకున్నారని, ఇక్కడ మాత్రం పేదలకు ఇళ్లులేవన్నారు. వాళ్ల తొమ్మిదేళ్ల పాలన, మన పాలన బేరీజు వేసుకోండని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పెట్టుబడి పెరిగింది.. ఆదాయం తగ్గింది.. వ్యవసాయ పెట్టుబడులు.. ముఖ్యంగా గోదావరి జిల్లాలో వరికి 300 శాతం పెట్టుబడి పెరిగిందని, ధర మాత్రం పెరగలేదన్నారు. టీడీపీ హయాంలో రూ. 420 ఉండే డీఏపీ ఇపుడు రూ. 1270కి, రూ. 200 ఉండే పొటాష్ రూ. 900కి పెంచేశారని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ దొంగల వల్ల రైతులు బికారులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరోగ్య శ్రీ కాదు.. అనారోగ్యశ్రీ...ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా తయారుచేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. పేదలకు వైద్యసౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాకా పేదలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో అన్ని గ్రామాలకు సురక్షిత గోదావరి జలాలను సరఫరాచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఉద్యోగాల్లోనూ అక్రమాలు.. వైఎస్ మనిషిని సర్వీస్ కమిషన్‌లో వేసుకుని ఉద్యోగాలలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో 11 సార్లు డీఎస్సీవేసి లక్షా 65 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఉద్యోగ నియామకాలలో అంతా పారదర్శకంగా చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. అన్ని వర్గాలకూ కాంగ్రెస్ పాలనలో కష్టాలేనన్నారు. ఈ కష్టాలు తొలగాలంటే టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

రామూ సమర్ధుడు, మంచి సేవకుడు మూలారెడ్డి కుమారుడికి బాబు కితాబు అనపర్తి పార్టీ ఇన్‌ఛార్జి రామకృష్ణారెడ్డి సమర్ధుడైన నాయకుడని, మంచి సేవకుడని చంద్రబాబుకితాబిచ్చారు. నియోజకవర్గంలో పార్టీకి విశేష సేవలు అందిస్తున్న రామకృష్ణారెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందన్నారు. అనపర్తి మండలం కుతుకులూరులో జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడంలో రామకృష్ణారెడ్డి కృషిచేస్తున్నారని చంద్రబాబు అభినందించారు.

పైఎస్',కాంగ్రెస్ వాళ్లు శ్రమజీవుల్ని దోచుకున్నారు'


శాంతిపురం: అవినీతి అక్రమాలతో పీకల్లోతు కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మండలంలోని ఎంకేపురం, మొరసనపల్లె తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నదేమి లేదని, అధికార పార్టీలో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు దోచుకోని తినడానికే సరిపోతుందని విమర్శించారు. అలాగే ఈనెల 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటమునిరెడ్డి, చలపతి, శ్యామరాజు, లక్ష్మీబాలకృష్ణ, ఉయ్యాలజయరామిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ను తరిమికొట్టండి

హైదరాబాద్ : విద్యుత్ కోతలపై గాంధీ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న లెఫ్ట్ పార్టీ నేతలు బుధవారం ఉదయం దీక్షలను విరమించారు. తమ దీక్షలకు ప్రభుత్వం కదిలిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలుపారు. అలాగే విద్యుత్ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షలకు సీపీఐ నేత నారాయణ మద్దతు తెలిపారు.

దీక్ష విరమించిన లెఫ్ట్ నేతలు

విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి
వామపక్షాలతో కలిసి పోరాటానికి సిద్ధం : చంద్రబాబు



తూర్పుగోదావరి జిల్లాలో 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు రాయవరంలో మీడియాతో మాట్లాడుతూ అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని ఆయన విమర్శించారు. టీడీపీ హయాంలో వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంట్ సరఫరా చేశామని, ఈ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఇప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

గ్రామాల్లో రోజంతా కరెంట్ ఉండడంలేదని, విద్యుత్ సమస్యతో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. విద్యుత్‌పై వాస్తవాలు చెబుతూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వర్షాలు కురిస్తే కరెంట్ ఇస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఎగుమతి అవుతోందని, విద్యుత్ వ్యవస్థకు సంబంధించి సీఎం వద్ద ప్రణాళిక లేదని ఆయన ఆరోపించారు.

ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచిందని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. కేంద్రం నుంచి అదనంగా గ్యాస్ తీసుకురావడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరును పిచ్చి తుగ్లక్ పాలనగా చంద్రబాబు అభివర్ణించారు. విద్యుత్ సమస్యపై వామపక్షాలతో కలిసి టీడీపీ పోరాటం చేస్తుందని, వైఎస్సార్‌సీపీతో కలిసి పోరాడే సమస్యేలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

కాగా విద్యుత్ సమస్యలపై టీడీపీ పోరుబాట కొనసాగుతోంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 26 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష బుధవారం నాటికి రెండోరోజుకు చేరుకుంది. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేల దీక్షకు మద్దతు ప్రకటించారు.

దీక్ష చేస్తున్న నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అంతకుముందు విద్యుత్ సమస్యలపై ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో తూ.గో జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షలకు సంఘీభావంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు బాబు పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలపాలని సూచించారు.
: రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని, కరెంట్ కష్టాలకు ప్రభుత్వమే కారణమని, విద్యుత్ విషయంలో ముందుచూపు లేకపోవడమే దీనికి కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. గత 20 ఏళ్లలో ఇంత సంక్షోభం ఎప్పుడు చూడలేదని, కరెంట్ కష్టాలతో జనం అల్లాడుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ప్రభుత్వం