June 18, 2013


హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

గన్‌పార్క్ వద్ద టీడీపీ నేతల నిరసన


హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని... లైంగిక వేధింపులు అరికట్టాలంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు.

టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా

త్వరలోనే మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. అసెంబ్లీలో కళంకిత మంత్రులపై చర్చ సందర్భంగా కేశవ్‌ మాట్లాడారు. మంత్రులపై విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్లింది తొలుత టీడీపీయేనని ఆయన పేర్కొన్నారు. దొంగలబండికి సీఎం సారథిగా ఉన్నారని విమర్శించారు. దీనిపై ధర్మాన స్పందించారు. మాపై పిటీషనర్‌ ఏం చేశారో తెలియకుండా టీడీపీ మాట్లాడుతోందన్నారు. టీడీపీ ఆరోపణలపై చర్చించడానికి తాము సిద్ధంగాఉన్నామని ప్రకటించారు. చంద్రబాబు సభలో ఉంటే వారి పార్టీ చేస్తున్న విమర్శలను సమర్థించే వారు కాదని వ్యాఖ్యానించారు. ధర్మాన వ్యాఖ్యలను టీడీపీ సభ్యులు ఖండించారు. కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు.

మరో ముగ్గురు జైలుకు వెళ్తారు : పయ్యావుల