April 26, 2013

కాకినాడ సిటీ: కాకినాడ పార్లమెం టు స్థానంలో టీడీపీ అభ్యర్థిగా తనను రాష్ట్రపార్టీ పరిశీలిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర తెలుగుమహిళ ప్రచార కార్యదర్శి మాకినీడి శేషుకుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడా రు. పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు ఎంపీగా పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నానని, తనకంటే మరిత సమర్ధవంతమైన అభ్యర్థిని పార్టీ నిలబెట్టినా టీ డీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి అం కితభావంతో పనిచేస్తానని శేషుకుమారి తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర రాష్ట్రంలో అన్నివర్గాలను కదిలించిందన్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు
50రోజులుపైగా నడిచానన్నారు. కష్టాల్లో ఉన్న ప్ర జలను ఆదుకోవాలనే సంకల్పం పాదయాత్రతో ఏర్పడిందన్నారు.

బాబును మహిళలు ఆదరిస్తున్న వైనం చూస్తుం టే ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టామా అన్న ఫీలింగ్ కనిపించిందన్నా రు. 2014లో చంద్రబాబే సీఎం అనే విషయం అందరిలో వ్యక్తమవుతుందన్నారు. తనభర్త వరప్రసాద్ హైదరాబాద్‌లో ప్రైమ్ ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉ న్నారని, ఇక్కడి ప్రజలకు సూపరిచితులని, పేదలకు వైద్యసేవలు చేస్తున్నామన్నారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయినప్పటికీ తమకు టీడీపీతో, జిల్లా నేతలతో ఉన్న సత్సంబంధాలతో పార్టీ ని అధికారంలో తె చ్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. 27న విశాఖ సభ విజయవంతానికి తనవంతు ఏర్పాట్లు చేస్తున్నానన్నారు.

2014లో చంద్రబాబే సీఎం


కాకినాడ సిటీ: ఈనెల 27న విశాఖలో జరిగే చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ చరిత్ర సృష్టించబోతుందని రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి గో రంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసభకు 25లక్షల మంది వస్తారన్నా రు. జిల్లా నుంచి 400 బస్సులు, 700 వాహనాల్లో సుమారు 50వేల మంది వరకు సభకు వస్తున్నారని దీనికి సం బంధిత ఏర్పాట్లు పూర్తయ్యాయన్నా రు. 2800కిలోమీటర్ల పాదయాత్ర చేసి న చంద్రబాబు విశాఖ సభలో విజయ శంఖారావం పూరించబోతున్నారని చె ప్పారు. 1993లో రాజమండ్రిలో ఎన్టీఆర్ సభ ఏర్పాటు చేయడం తో 250 సీట్లు వచ్చి టీడీపీ అధికారం చేపట్టిందన్నారు.

విశాఖ సభ ఇదే వరవడిని సృష్టించబోతుందన్నారు. బాబు పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుని ఎన్నికల ప్రణాళికలో పెట్టి అధికారం చేపట్టిన అనంతరం వీటిని అమ లు పరుస్తారన్నారు. సమావేశంలో రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మాకినీడి శేషకుమారి, జిల్లా పార్టీ కార్యాల య కార్యదర్శి మందాల గంగసూర్యనారాయణ, కాకినాడ నగర పార్టీ అధ్యక్షుడు నున్న దొరబాబు, నాయకులు తాజుద్దీన్, శ్రీవిజయ్ పాల్గొన్నారు.

గిన్నీస్ రికార్డుకు ఎక్కనున్న చంద్రబాబు పాదయాత్ర రామచంద్రపురం: టీడీపీ అధ్యక్షు డు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర గిన్నిస్‌బుక్ రికార్డుకు ఎక్కుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏనాయకుడు చేపట్టనివిధంగా 2,800 కిలోమీటర్ల పాదయాత్రను చంద్రబాబు చేపట్టి రికార్డు సృష్టించారని తెలిపారు. పాదయాత్ర ప్రారంభంలో చం ద్రబాబునాయుడు ఇచ్చిన బీసీ, మైనారిటీ సంక్షేమం, ఎస్సీ వర్గీకరణ, రైతులరుణమాఫీ హామీలను నమ్మిన ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథంపట్టారని, మన జిల్లాలో కాపుసామాజిక వర్గానికి ఒక ప్యాకేజీ ప్రకటించటంతో ఆ వర్గమూ భారీ ఎత్తున పాదయాత్రకు తరలివచ్చిందన్నారు. ఎస్సీసబ్‌ప్లాన్ పేరుతో కాంగ్రెస్ నాయకులు హంగామా చేస్తున్నరని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఆనిధులను సక్రమంగా వినియోగించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలనెత్తిన రూ.26వేలకోట్లు సర్‌చార్జిపేరుతో ప్ర భుత్వం భారంమోపిందన్నారు. అయి నా కరెంటు ఇవ్వలేని స్థితిలో ఉందన్నా రు. ప్రజలు ఈప్రభుత్వాన్ని విశ్వసించే పరిస్థితిలో ఇకలేరని, రానున్న ఎన్నికలలో తగినగుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో పట్టణానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.



విశాఖ సభ చరిత్ర సృష్టిస్తుంది

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రను జిల్లాలో విజయవంతం చేసిన నేతలు మరో సక్సెస్ కోసం తపిస్తున్నారు. ఈ నెల 27న విశాఖపట్నంలో పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి భారీగా కార్యకర్తలను తరలించేందుకు 'దేశం' నేతలు సన్నాహాలు చేసుకున్నారు. జిల్లాలో చంద్రబాబు యాత్ర 24 రోజులపాటు సాగింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 12వరకు జిల్లాలో 11 నియోజకవర్గాలు, 16 మండలాలు, 2 కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలు, 78 గ్రామాల్లో బాబు పాద యాత్ర చేశారు. రాజమండ్రిలో ప్రవేశించి కోటనందూరు మండలం కాకరాపల్లి దాటి విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే వరకు వందలాది మంది నేతలు, వేలాది మంది కార్యకర్తలు చంద్రబాబును వెన్నంటే ఉన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు.

'దేశం' ఆవిర్భావ పండుగ ఇక్కడే! చంద్రబాబు పాదయత్రలో ఉన్న సమయంలోనే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెదపూడిలో జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరపాలని నిర్ణయించి అక్కడ భారీ పైలాన్ ఏర్పాటుచేశారు. పాదయాత్ర ఆలస్యం కావడంతో ఈ కార్యక్రమం పెదపూడిలో జరిగింది. తర్వాత పిఠాపురం వచ్చిన సందర్భంగా ఆ పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం ఇదే తొలిసారి.

ఉగాది ఆనందం.. తుని నియోజకవర్గంలో చంద్రబాబు ఉగాది ఉత్సవాలు జరుపుకున్నారు. ఉగాది పచ్చడి ఆరగించారు. పంచాంగశ్రవణాన్ని అత్యంత శ్రద్ధగా విన్నారు. ఏరువాక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

2,500 మైలురాయి ఇక్కడే.. చంద్రబాబు పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలురాయిని మండపేటలో అధిగమించారు. ప్రజా సమస్యల కోసం ఒక రాజకీయ నాయకుడు ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేయడం దేశంలోనే అరుదైన ఘట్టంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు.

విద్యుత్ ఉద్యమానికి నాంది విద్యుత్ కోతలు, సర్‌ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమానికి చంద్రబాబు ఇక్కడే శ్రీకారం చుట్టారు. కాకినాడలో ఒక రోజు ఉపవాస దీక్ష కూడా చేశారు.

కాపులకు ప్యాకేజీ ప్రకటనా ఇక్కడే అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్ల హామీ ఇచ్చిన చంద్రబాబు కాపులలో పేదల కోసం రూ.5 వేల కోట్ల ప్యాకేజీని పిఠాపురం బహిరంగ సభలో ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా జిల్లాలో కాపు సామాజికవర్గం టీడీపీకి దగ్గరవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

విశాఖ సభకు భారీగా జనసమీకరణ! విశాఖపట్నంలో పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి భారీగా కార్యకర్తలను తరలిస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఇక్కడ నుంచి వెళ్లే కార్యకర్తలందరికీ రవాణా, భోజన సదుపాయాలను ఆయా నేతలే సమకూరుస్తున్నారు.

మరో విజయం కోసం!

మహబూబ్‌నగర్ : టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత అక్టోబరులో చంద్రబాబు జిల్లాలో నిర్వహించిన పాదయాత్రను విజయవంతం చేసిన నేపథ్యంలో, అదే స్ఫూర్తితో ముగింపు వేడుకకు తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, సీనియర్ నాయకులు గడచిన వారం రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వైజాగ్‌లో నిర్వహించనున్న ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు కొంతమంది నాయకులు ఇప్పటికే తరలివెళ్లగా, యాత్ర అనంతరం, హైదరాబాద్ (శంషాబాద్) చేరుకున్న సందర్భంగా ఘనస్వాగతం పలకడంపైనే ఎక్కువ దృష్టి సారించారు. ఇందుకోసం, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో వాహనాలను సిద్ధంచేశారు.

వస్తున్నా మీ కోసం పేరుతో చంద్రబాబు చేపట్టిన పాదయాద్ర ఈ నెల 27న ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు కొంతమంది ఇప్పటికే వైజాగ్ చేరుకోగా 28న చంద్రబాబు, హైదరాబాద్ రానున్నందున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు మరికొంత మంది నాయకులు వాహనాలు సమకూర్చడం, కార్యకర్తలను సమీకరించడంలో నిమగ్నమయ్యారు. జిల్లా నుంచి కనీసం 20 వేల మంది కార్యకర్తలు, నాయకులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలివెళ్లేలా వాహనాలు సిద్ధం చేస్తున్నారు. రాజ
ధానికి సమీప నియోజకవర్గాలైన షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి వంటి ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో, దూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి కొంత తక్కువ సంఖ్యలో కార్యకర్తలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలంపూర్, గద్వాల వంటి నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నాయకులతో చర్చించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న షాద్‌నగర్ నియోజకవర్గ పరిధి నుంచి కనీసం ఆరు వేల మంది కార్యకర్తలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బక్కని నర్సింహులు తెలిపారు. అలాగే, అన్ని నియోజవకర్గాల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల సహకారంతో పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 28న మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ చేరుకున్న తర్వాత, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారన్నారు. ఈ ర్యాలీలో, ఎంఆర్‌పీఎస్ నేత మందకృష్ణ కూడా పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. మరో వైపు 28నే హైదరాబాద్‌లో మందకృష్ణ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

చలో శంషాబాద్


నెల్లూరు:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తెలిపారు. బాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సభకు జిల్లా నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో ఐదువేల మంది కార్యకర్తలు హాజరవుతున్నట్లు తెలిపారు. తమ అధినేత జరిపిన 207 రోజుల పాదయాత్రలో జిల్లా నేతలు పలు సందర్భాల్లో పాల్గొన్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ నెల 27న విశాఖలో జరిగే బాబు సభకు జనసమీకరణ, తదితర ఏర్పాట్లపై ఆయన గురువారం ఆంధ్రజ్యోతి ప్రతినిధికి వివరించారు. అవి ఆయన మాటల్లోనే...

'గత ఏడాది అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. మొదట్లో 3నెలల పాటు జరపాలని భావించి ప్రస్తుతం 207 రోజులు 2,808 కిలోమీటర్లు బాబు పాదయాత్ర జరపడం ఇది చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలు వారి ఇబ్బందులు స్వయంగా చూసే అవకాశం కలిగింది. ప్రభుత్వ వైఫల్యాలు, వైఎస్ కుటుంబ దోపిడీ ప్రజలకు వివరించ గలిగారు. చంద్రబాబు పాలనలో మంచి చెడు ప్రజలకు విశ్లేషించి చెప్పగలిగారు. ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు ఇబ్బంది పెట్టినా పాదయాత్రను కొనసాగించారు. 16 జిల్లాల్లో జరిపిన పాదయాత్రలో జిల్లా నుంచి ఎందరో నేతలు బాబుకు సంఘీభావంగా నిలిచారు. దేశంలోనే ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర జరిపిన నేత ఎవరూ లేరు.

భారీ జనసమీకరణ

చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ఈ నెల 27న ముగుస్తుంది. విశాఖపట్టణంలో జరిగే ముగింపుసభకు జిల్లా నుంచి ఐదువేల మంది నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. గూడూరు, నెల్లూరు నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం. అంతేగాక 150కిపైగా వాహనాల్లో నేతలు వెళుతున్నారు. కళాకారుల బృందాలు తరలివస్తున్నాయి.

రైళ్ల వేళలు

ఈ నెల 26వ తేది రాత్రి నెల్లూరు రైల్వే స్టేషను నుంచి 7.30గంటలకు విశాఖకు ప్రత్యేక రైలు బయలు దేరుతుంది. అదేవిధంగా గూడూరు రైల్వేస్టేషను నుంచి రాత్రి 9గంటలకు రై

వచ్చే నెలలో బస్సుయాత్ర

జిల్లాలో జూన్ ఆఖరులో చంద్రబాబు బస్సుయాత్ర ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి మొదలైయ్యే ఈ యాత్ర జిల్లాలో 10-15రోజుల పాటు సాగే అవకాశం ఉంది. నియోజకవర్గానికి ఒక్క రోజు చొప్పున బస్సుయాత్ర ఉండనుంది.''
లు కదులుతుంది. 12 గంటలపాటు ప్రయాణించి 27న ఉదయం విశాఖకు చేరుకుంటుంది. సాయంత్రం మూడు గంటలకు బాబు బహిరంగ సభ మొదలవుతుంది. తిరిగి రాత్రికి ప్రయాణమై 28వ తేది ఉదయానికల్లా ప్రత్యేక రైళ్లు జిల్లాకు చేరుతాయి.

బాబు యాత్ర చారిత్రాత్మకం

ఒంగోలు: విశాఖలో శనివారం జరగనున్న తెలు గుదేశం పార్టీ బహిరంగ సభలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఆపార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నారు. అందుకోసం శుక్రవారం రాత్రి ఒంగోలు నుంచి ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు స్థానికంగా ఎక్కడికక్కడ నుంచి వాహనాలలో కూడా భారీగా వెళ్ళేందుకు సమాయత్తమవుతున్నారు. పార్టీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి గురువారమే విశాఖకు బయలు దేరి వెళ్ళారు. ఇతర ముఖ్య నాయకులు శుక్రవారం వెళ్ళనున్నట్టు సమాచారం. సుమారు ఏడు మాసాలకు పైగా వస్తున్నా ... మీ కోసం పేరుతో తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర ఈనెల 27న విశాఖలో ముగియనుంది.

ఆ సంద ర్భంగా ఆరోజున విశాఖలో తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. శనివారం సాయం త్రం నాలుగు గంటలకు యాత్ర ము గింపు చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరణ, అనంతరం బహిరంగ సభ జరగనుండగా పెద్ద సంఖ్య లో కార్యకర్తలు పాల్గొనేలా ఆధిష్ఠానం దృష్టి సారించింది. ప్రధా నంగా విశాఖకు ఇరువైపులా ఉండే నాలుగైదు జిల్లాల నుంచి జన సమీ కరణ చేస్తున్నప్పటికీ కోస్తా ప్రాం తంలో ఉండే ఇతర జిల్లాల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉండే ము ఖ్య నాయకులు హాజరయ్యేలా చూ డాలని నిర్ణయించారు. తదనుగు ణంగా జిల్లాలోను ఆపార్టీ నేతలు దృష్టి సారించారు. ఇందుకోసం వారం క్రితం పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఒం గోలు నుంచి విశాఖకు ఒక ప్రత్యేక రైలులో కార్యకర్తలు, నాయకులను తరలించేలా ఏర్పాటుచేయాలని నిర్ణ యించారు.

తదనుగుణంగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైలు ఒంగోలు నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి విశాఖకు చేరుతుంది. తిరిగి ఆ క్కడ బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆర్ధరాత్రి బయలుదేరి ఆదివారం మధాహ్ననికి ఒంగోలు చేరుకుంటుంది. ఆమేరకు రేల్వే శాఖ నుంచి జిల్లా నేతలకు సమాచారం అందింది. మొత్తం 21 బోగీలను ఈ ప్రత్యేక రైలుకు కేటా యించామన్నారు.దీంతో జిల్లాలోని వివిధ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో చర్చించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఒక్కో నియోజ కవర్గానికి రెండు లేదా మూడు బోగీ లను కేటాయించినట్టు సమాచారం. జిల్లాలో ఒంగోలు, చీరాల రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. దీంతో ఎక్కువ నియోజకవర్గాల వారు ఒం గోలు
లో రైలు ఎక్కే విధంగా సమా చారం అందించారు. మరోవైపు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల లోనూ పార్టీ నాయకులు తరలుతు న్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు అంతా విశాఖ సభకు తరలి వెళ్తున్నట్టు సమాచారం. పార్టీ సీనియర్ నేత కరణం బలరామకృ ష్ణమూర్తి గురువారమే విశాఖకు బయలు దేరి వెళ్ళారు. ఒంగోలు నుంచి మధ్యాహ్నం కోరమండల్ ఎక్స్ ప్రెస్‌లో బయలుదేరిన ఆయన రా త్రికి విశాఖ చేరుకున్నారు. శుక్రవారం ఆయన చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం ఉంది. కందుకూరు, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు డాక్టర్ దివి శివరాం, ఏలూరి సాం బశివరావులు ఇప్పటికే విశాఖ చేరు కున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యు డు శిద్దా రాఘవరావు, జిల్లా ఆధ్య క్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తదిత రులు శుక్రవారం రాత్రికి బయలుదేరి వెళ్ళనున్నట్టు సమాచారం.

విశాఖ తరలుతున్న తెదేపా శ్రేణులు

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం పాదయాత్ర ఈ నెల 27 న విశాఖతో ముగియనుంది. బహిరంగ సభకు ఆ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ గా జనాలను సమీకరించి సత్తా చాటేందుకు జిల్లాలోని పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాబు పాదయాత్ర శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాల రీత్యా రాలేకపోతున్నారు. అయినప్పటికీ శ్రీకాకుళంలో పార్టీకి ఢోకాలేదని, యువ నాయకులు, సీనియర్లు భావిస్తున్నారు. భారీగా జనసమీకరణ చేసి వాహనాల ద్వారా విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. .

ఇందుకు సంబంధించి జిల్లాస్థాయిలో నాయకులు సమావేశమై చర్చించారు. మండల, గ్రామస్థాయి కేడర్‌ను ఉత్తేజ పరుస్తూనే మరోవైపు 27న విశాఖ వెళ్లే ఏ ర్పాట్లపై సమీక్షించారు. శ్రీకాకుళం పార్లమెంట్ ని యోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు ఆధ్వర్యంలో పెద్దఎత్తున జన స
మీకరణ కే ఏర్పాట్లు సాగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఆయా ఇన్‌చార్జిలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీనియర్ నేతలు కిమిడి కళావెంట్రావు, కింజరపు అచ్చన్నాయుడు, గౌతు శ్యామసందర శివాజీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబ్జీ తదితరుల ఆధ్వర్యంలో జన సమీకరణ ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇదిలా ఉండగా గురువారం టెక్కలి ప్రాంతంలోని సాకిపల్లిలో జరిగిన షిరిడి సాయిబాబా వార్షికోత్సవ కార్యాక్రమానికి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కింజరపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ముఖ్య అతి«థులుగా హాజరయ్యారు. ఈ సదర్భంగా 27న చేట్టాల్సిన వాహనాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించుకున్నారు. జిల్లాలో దేశం కేడర్ మొత్తాన్ని కదిలించాలని నిర్ణయించారు. యువతను ఎద్దఎత్తున సమీకరించేందుకు రామ్మోహన్ నాయుడు ప్రయత్నిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోని యువత కదిలి రావాలని ఇప్పటికే ఆయన పిలుపు నిచ్చారు.

చలో.. విశాఖ

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా గురువారంసబ్బవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. పెందుర్తి నియోజకవర్గంతోపాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కేడర్‌తో సబ్బవరం కిటకిటలాడింది. అంతకు ముందు అసకపల్లి జంక్షన్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఇరువాడ మీదుగా సాయంత్ర ఆరు గంటల ప్రాంతంలో సబ్బవరం చేరుకున్నారు. దారిపొడవునా చంద్రబాబుకు జనం జేజేలు పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. చేతివృత్తుల వారు చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఆయన వారికి పలు హామీలు ఇచ్చారు. సబ్బవరం మూడురోడ్ల జంక్షన్‌లో అశేష్ జనవాహినిని ఉద్దేశించి సుమారు గంటపాటు ప్రసంగించారు. స్థానిక సమస్యలపై అనర్గళంగా మాట్లాడారు.

కీలకమైన సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, జగన్ లక్ష కోట్లు దోచుకున్న వైనాన్ని మీకు తెయజేప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. 'నాకు ఎవరిపైనా కక్ష, కోపం లేవు. అయితే ప్రజలు మోసపోవడాన్ని తట్టుకోలేకే ఈ ప్రాంతానికి వచ్చాను'' అని అన్నారు. గతంలో అనేకసార్లు ఇక్కడికి వచ్చానని ఈసారి మరింతగా ఆదరించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. స్థానిక సమస్యలను బండారు తెలియజేయగా వాటిపై ఏకధాటిగా మాట్లాడారు. మహిళలను అక్కలుచెల్లెళ్లు అని, యువకులను తమ్ముళ్లూ అంటూ సంబోధిస్తూ వారి మన్ననలు పొందేందుకు ప్రయత్నించారు.

కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండించాలని, జగన్ చేసిన తప్పును మనం సమర్థిస్తామా అంటూ ఆయన ప్రశ్నించగా, వద్దు... వద్దు... అంటూ ప్రజలు ప్రతి సమాధానం చెప్పారు. అనంతరం చంద్రబాబునాయుడు జోడుగుళ్ల జంక్షన్, సూరిరెడ్డిపాలెం మీదుగా అమృతపురం చేసుకున్నారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ నగర మాజీ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు, నాయకులు జి.మాధవరావు, సేనాపతి వసంత, సుగుణాచౌదరి, గుడివాడ అమర్, సతివాడ శంకరరావు, రెడ్డి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

బాబుకు సబ్బ'వరం'


విశాఖపట్నం: అధికారం చేపట్టగానే విశాఖ జిల్లా రూపురేఖలు మారుస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సబ్బవరం కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, విశాఖను పరిశ్రమల కేంద్రంగా మారుస్తానని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖ ప్రజలను మోసం చేశారన్నారు. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తామని, రూ.7.800 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఏర్పాటు చేస్తామని చెప్పి ఏమీ చేయలేకపోయారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆయా ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేస్తామన్నారు. సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం 578 జీఓను విడుదల చేస్తే, దాన్ని రద్దుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలను మోసం చేసిందన్నారు.

వీలైనంత త్వరలో అప్పన్న భూ సమస్య పరిష్కారానికి కృషి చేసి స్థానికంగా ఉన్న ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. మండల కేంద్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని, రైతాంగాన్ని ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. అలాగే ప్రతీ మండలంలోనూ డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితిని తప్పించి అర్హత గల ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, మహిళా నేతలు నన్నపనేని రాజకుమారి, శోభ హైమవతి, జిల్లా అధ్యక్షుడు రత్నాకర్ పాల్గొన్నారు.

విశాఖరూపురేఖలు మారుస్తా

విశాఖపట్నం: కొందరు నాయకులు తప్పులు చేసి పార్టీ వీడుతున్నారని, అటువంటి వారివల్ల పార్టీకి నష్టం ఉండదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఒక నాయకుడు వెళ్లిపోతే 50 మంది నేతలను తయారుచేసే సత్తా పార్టీకి ఉందన్నారు. గురువారం సాయంత్రం సబ్బవరం మండలం సున్నపుబట్టీల వద్ద కొబ్బరితోటలో జరిగిన ఎలమంచిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందరో కార్యకర్తలు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని నిరుపేదలయ్యారని, అలా అని వారు ఎక్కడా రాజీపడలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి నిజమైన ఆస్తి కార్యకర్తలేనని ఆయన ప్రశంసించారు.

2014లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. పార్టీలో చాలాసార్లు సంక్షోభాలు వచ్చాయని, సంక్షోభం వచ్చిన ప్రతిసారీ పార్టీ మరింత రాటుతేలింది తప్ప వెనుకబడలేదన్నారు. ఎన్నికలు ఇక కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఉన్నాయని, ఈలోగానే కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

పట్టణ కార్యకర్తలు ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి గ్రామీణప్రాంతాల కార్యకర్తల కంటే పట్టణాల్లో ఉన్నవారు మరింత ఎక్కువగా పనిచేయాలని చంద్రబాబు విశాఖ నగర పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యలపై పనిచేస్తామనే నమ్మకం కల్పించినపుడే పట్టణాల్లోని ప్రజలు కార్యకర్తల చెంతకు వస్తారన్నారు. సెల్‌ఫోను మెసేజ్‌లు, ఫేస్‌బుక్, ట్విట్టర్లు వంటి సాంకేతిక మాద్యమాలను వినియోగించుకోవాలని సూచించారు. అన్నింటికి మించి నోటి ప్రచారాన్ని పెంచాలని సలహాలిచ్చారు. ఎన్నికల్లో పనిచేస్తేనే ఓట్లు రాలవని,నిరంతరం ప్రజల సమస్యలపై పనిచేస్తేనే ప్రజల నుంచి స్పందన ఉంటుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఎలమంచిలి ఎమ్మెల్యే అవినీతిపై పోరాడండి సమీక్షా సమావేశం సందర్భంగా ఎలమంచిలిలో బహుళనాయకత్వ సమస్యపైనా, ఏ ఇన్‌చార్జికి టిక్కెట్ ఇవ్వాలన్న అంశంపై కార్యకర్తలు లేవనెత్తిన ప్రశ్నలు డిమాండ్లకు చంద్రబాబు తీవ్రంగానే స్పందించారు. ఎలమంచిలిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి? ఎవరిని గెలిపించుకోవాలనేది? పార్టీ ఆలోచిస్తుందన్నారు. అంతకంటే ముందు కార్యకర్తలు, నాయకులు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆదేశించారు. కన్నబాబురాజు అవినీతిని ప్రజలముందు బట్టబయలు చేయాలన్నారు. అటువంటి ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజలంతా తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తక్షణమే పల్లె పల్లెకు కార్యకర్తలంతా తిరిగి ప్రజలకు టీడీపీ చరిత్రను పార్టీ విధానాలను తెలియజేయాలని ఆయన కోరారు. సమావేశంలో పలుమార్లు సాక్షి పత్రికపై ధ్వజమెత్తారు. అదో దిక్కుమాలిన పేపర్ అంటూ అభివర్ణించారు.

సాక్షి పత్రికపై బాబు మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తలు జేజేలు కొట్టారు.

సమీక్షా సమావేశంలో వేదికపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అర్బన్ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, మాజీఎంపీ పప్పల చలపతిరావు, రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, తెలుగుమహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, ఎలమంచిలి నాయకులు లాలం భాస్కరరావు, సుందరపు విజయకుమార్ కూర్చున్నారు. కార్యకర్తల సమావేశానికి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి భారీగా కార్యకర్తలతో ర్యాలీగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నల్లూరి భాస్కరరావు, చోడె వెంకట పట్టాభిరాం, ఆళ్ల శ్రీనివాసరావు, ఒమ్మి సన్యాసిరావు, బొట్టా నీలిమ, కోన తాతారావు, లేళ్ల కోటేశ్వరరావు, తాళ్ల ఆనంద్, రెడ్డి నారాయణరావులు పాల్గొన్నారు. ఇక, ఎలమంచిలి నియోజకవర్గం నుంచి గొంతిన నాగేశ్వరరావు, లాలం భాస్కరరావు, ఆదిరి రమణ, రాజానరమేష్‌కుమార్, దాడి ముసలినాయుడు, విజయ్‌బాబు, దిన్‌బాబు, ఎస్.నాగేశ్వరరావు, బాపినాయు
డు, దాడి కృష్ణ, రఘు, గనగళ్ల వివేక్, పిళ్లా రమాకుమారి, ఆడారి మంజు, మొల్లేటి సరళ, ఆడారి నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.

అరకులోయ సమీక్ష వాయిదా

ఎలమంచిలి, విశాఖ తూర్పు, అరకులోయ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అరకులోయ సమీక్ష సమావేశం గురువారం జరగలేదు. మరోసారి అరకులోయ, సిటీలో మిగిలిన రెండు నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ఒక నాయకుడు వెళ్లిపోతే 50 మంది తయారవుతారు..

విశాఖపట్నం

ముగింపు సభకు దాదాపు 5 లక్షల మంది రానున్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో మహాత్మాగాంధీ, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, ఎన్.టి. రామారావు, ఎర్రన్నాయుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ ముగింపు సభలోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చంద్రబాబు వెల్లడించనున్నారు.
: 207 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర శనివారంతో ముగియనుంది. దీంతో ముగింపు సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 250 మంది నేతలు కూర్చునే విధంగా భారీ స్టేజీని ఏర్పరుస్తున్నారు. ఈ ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు విజయస్థూపాన్ని(పైలాన్) ఆవిష్కరించనున్నారు.

పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

విశాఖపట్నం
: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర శనివారంతో ముగియనుండడంతో శుక్రవారం నాడు విశాఖలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 207 రోజుల పాటు తనతో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, సిబ్బందితో ఆయన కుటుంబసభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోక్‌శ్ పాల్గొన్నారు. కార్యకర్తలకు, సిబ్బందికి స్వయంగా చంద్రబాబు, భువనేశ్వరి భోజనాలు వడ్డించారు. కార్యకర్తలందరినీ పేరు పేరునా పలకరిస్తూ, ఫొటోలు దిగారు. పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

చంద్రబాబు కుటుంబసభ్యుల ఆత్మీయ సమావేశం

చంద్రబాబు నాయుడు లాంగ్ మార్చ్
శనివారంనాడు విశాఖలో ముగింపు సభ

హైదరాబాద్ క్రిందటి సంవత్సరం ఒక దశలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో నిరుత్సాహం గూడు కట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ మళ్లీ కోలుకోగలదా అన్న సందేహం అందరినీ పట్టి పీడించిన సమయం అది. ఆ సమయంలో పాదయాత్రతో ప్రజలకు చేరువ కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆరు పదులు దాటిన ఈ వయస్సులో పాదయాత్రలు ఏమిటని విమర్శించినవారున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలదన్న విశ్వాసం ప్రజలకు కలగాలంటే పాదయాత్రకు మించిన ప్రత్యామ్నాయం లేదని విశ్లేషకులు పేర్కొన్నారు.

ముందుకు పోవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు 2012 అక్టోబర్ రెండవ తేదీన హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఆయన ప్రజల కష్టనష్టాల గురించి విన్నారు. వారిలో ఒకరుగా కలిసిపోయారు. ప్రజల చెంతకు వచ్చేవాడే నాయకుడు అన్నట్టుగా ప్రజలతో మమేకం అయిపోయారు. రైతన్న దగ్గరికి వెళ్లి పొలం దున్నారు. వడ్రంగి దగ్గరకు వెళ్లి తానూ ఆ పనిలో ఒక చేయి వేశారు. రోడ్డు పక్కన చాయ్ చేసి అమ్మే చాయ్ దుకాణంలో తానూ చాయ్ తయారు చేశారు.

చంద్రన్నా మళ్లీ నువ్వే రావాలన్నా అని ఎందరో తమ్ముళ్లు చంద్రబాబుకు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. ముసలీ ముతకా తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి వారి సమస్యలు చెవి వొగ్గి విన్న బాబు వారికి ఎన్నో వరాలు కురిపించారు. ఎన్నో జిల్లాలలో డిక్లరేషన్‌లు ప్రకటించారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో శనివారంనాడు బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతున్నది. ఈ సభకు కనీసం ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొంటారని భావిస్తున్నారు.
: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. 63 ఏళ్ల వయస్సులో ఎవ్వరూ చేయని సాహసం చేసిన చంద్రబాబు ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 2800 కిలోమీటర్లు పైగా నడిచారు. మధ్యలో అనారోగ్యం ఇబ్బందులకు గురి చేసినా ఆయన వెరవక, బెదరక మొండిగా పాదయాత్ర కొనసాగించారు.

చరిత్రాత్మకమైన 'వస్తున్నా .. మీకోసం'.......లక్షలాదిగా తరలిరానున్న ప్రజలు