April 26, 2013

బాబు యాత్ర చారిత్రాత్మకం


నెల్లూరు:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తెలిపారు. బాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సభకు జిల్లా నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో ఐదువేల మంది కార్యకర్తలు హాజరవుతున్నట్లు తెలిపారు. తమ అధినేత జరిపిన 207 రోజుల పాదయాత్రలో జిల్లా నేతలు పలు సందర్భాల్లో పాల్గొన్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ నెల 27న విశాఖలో జరిగే బాబు సభకు జనసమీకరణ, తదితర ఏర్పాట్లపై ఆయన గురువారం ఆంధ్రజ్యోతి ప్రతినిధికి వివరించారు. అవి ఆయన మాటల్లోనే...

'గత ఏడాది అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. మొదట్లో 3నెలల పాటు జరపాలని భావించి ప్రస్తుతం 207 రోజులు 2,808 కిలోమీటర్లు బాబు పాదయాత్ర జరపడం ఇది చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలు వారి ఇబ్బందులు స్వయంగా చూసే అవకాశం కలిగింది. ప్రభుత్వ వైఫల్యాలు, వైఎస్ కుటుంబ దోపిడీ ప్రజలకు వివరించ గలిగారు. చంద్రబాబు పాలనలో మంచి చెడు ప్రజలకు విశ్లేషించి చెప్పగలిగారు. ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు ఇబ్బంది పెట్టినా పాదయాత్రను కొనసాగించారు. 16 జిల్లాల్లో జరిపిన పాదయాత్రలో జిల్లా నుంచి ఎందరో నేతలు బాబుకు సంఘీభావంగా నిలిచారు. దేశంలోనే ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర జరిపిన నేత ఎవరూ లేరు.

భారీ జనసమీకరణ

చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ఈ నెల 27న ముగుస్తుంది. విశాఖపట్టణంలో జరిగే ముగింపుసభకు జిల్లా నుంచి ఐదువేల మంది నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. గూడూరు, నెల్లూరు నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం. అంతేగాక 150కిపైగా వాహనాల్లో నేతలు వెళుతున్నారు. కళాకారుల బృందాలు తరలివస్తున్నాయి.

రైళ్ల వేళలు

ఈ నెల 26వ తేది రాత్రి నెల్లూరు రైల్వే స్టేషను నుంచి 7.30గంటలకు విశాఖకు ప్రత్యేక రైలు బయలు దేరుతుంది. అదేవిధంగా గూడూరు రైల్వేస్టేషను నుంచి రాత్రి 9గంటలకు రై

వచ్చే నెలలో బస్సుయాత్ర

జిల్లాలో జూన్ ఆఖరులో చంద్రబాబు బస్సుయాత్ర ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి మొదలైయ్యే ఈ యాత్ర జిల్లాలో 10-15రోజుల పాటు సాగే అవకాశం ఉంది. నియోజకవర్గానికి ఒక్క రోజు చొప్పున బస్సుయాత్ర ఉండనుంది.''
లు కదులుతుంది. 12 గంటలపాటు ప్రయాణించి 27న ఉదయం విశాఖకు చేరుకుంటుంది. సాయంత్రం మూడు గంటలకు బాబు బహిరంగ సభ మొదలవుతుంది. తిరిగి రాత్రికి ప్రయాణమై 28వ తేది ఉదయానికల్లా ప్రత్యేక రైళ్లు జిల్లాకు చేరుతాయి.