April 26, 2013

విశాఖ సభ చరిత్ర సృష్టిస్తుంది


కాకినాడ సిటీ: ఈనెల 27న విశాఖలో జరిగే చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ చరిత్ర సృష్టించబోతుందని రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి గో రంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసభకు 25లక్షల మంది వస్తారన్నా రు. జిల్లా నుంచి 400 బస్సులు, 700 వాహనాల్లో సుమారు 50వేల మంది వరకు సభకు వస్తున్నారని దీనికి సం బంధిత ఏర్పాట్లు పూర్తయ్యాయన్నా రు. 2800కిలోమీటర్ల పాదయాత్ర చేసి న చంద్రబాబు విశాఖ సభలో విజయ శంఖారావం పూరించబోతున్నారని చె ప్పారు. 1993లో రాజమండ్రిలో ఎన్టీఆర్ సభ ఏర్పాటు చేయడం తో 250 సీట్లు వచ్చి టీడీపీ అధికారం చేపట్టిందన్నారు.

విశాఖ సభ ఇదే వరవడిని సృష్టించబోతుందన్నారు. బాబు పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుని ఎన్నికల ప్రణాళికలో పెట్టి అధికారం చేపట్టిన అనంతరం వీటిని అమ లు పరుస్తారన్నారు. సమావేశంలో రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మాకినీడి శేషకుమారి, జిల్లా పార్టీ కార్యాల య కార్యదర్శి మందాల గంగసూర్యనారాయణ, కాకినాడ నగర పార్టీ అధ్యక్షుడు నున్న దొరబాబు, నాయకులు తాజుద్దీన్, శ్రీవిజయ్ పాల్గొన్నారు.

గిన్నీస్ రికార్డుకు ఎక్కనున్న చంద్రబాబు పాదయాత్ర రామచంద్రపురం: టీడీపీ అధ్యక్షు డు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర గిన్నిస్‌బుక్ రికార్డుకు ఎక్కుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏనాయకుడు చేపట్టనివిధంగా 2,800 కిలోమీటర్ల పాదయాత్రను చంద్రబాబు చేపట్టి రికార్డు సృష్టించారని తెలిపారు. పాదయాత్ర ప్రారంభంలో చం ద్రబాబునాయుడు ఇచ్చిన బీసీ, మైనారిటీ సంక్షేమం, ఎస్సీ వర్గీకరణ, రైతులరుణమాఫీ హామీలను నమ్మిన ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథంపట్టారని, మన జిల్లాలో కాపుసామాజిక వర్గానికి ఒక ప్యాకేజీ ప్రకటించటంతో ఆ వర్గమూ భారీ ఎత్తున పాదయాత్రకు తరలివచ్చిందన్నారు. ఎస్సీసబ్‌ప్లాన్ పేరుతో కాంగ్రెస్ నాయకులు హంగామా చేస్తున్నరని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఆనిధులను సక్రమంగా వినియోగించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలనెత్తిన రూ.26వేలకోట్లు సర్‌చార్జిపేరుతో ప్ర భుత్వం భారంమోపిందన్నారు. అయి నా కరెంటు ఇవ్వలేని స్థితిలో ఉందన్నా రు. ప్రజలు ఈప్రభుత్వాన్ని విశ్వసించే పరిస్థితిలో ఇకలేరని, రానున్న ఎన్నికలలో తగినగుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో పట్టణానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.