April 26, 2013

చలో.. విశాఖ

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం పాదయాత్ర ఈ నెల 27 న విశాఖతో ముగియనుంది. బహిరంగ సభకు ఆ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ గా జనాలను సమీకరించి సత్తా చాటేందుకు జిల్లాలోని పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాబు పాదయాత్ర శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాల రీత్యా రాలేకపోతున్నారు. అయినప్పటికీ శ్రీకాకుళంలో పార్టీకి ఢోకాలేదని, యువ నాయకులు, సీనియర్లు భావిస్తున్నారు. భారీగా జనసమీకరణ చేసి వాహనాల ద్వారా విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. .

ఇందుకు సంబంధించి జిల్లాస్థాయిలో నాయకులు సమావేశమై చర్చించారు. మండల, గ్రామస్థాయి కేడర్‌ను ఉత్తేజ పరుస్తూనే మరోవైపు 27న విశాఖ వెళ్లే ఏ ర్పాట్లపై సమీక్షించారు. శ్రీకాకుళం పార్లమెంట్ ని యోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు ఆధ్వర్యంలో పెద్దఎత్తున జన స
మీకరణ కే ఏర్పాట్లు సాగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఆయా ఇన్‌చార్జిలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీనియర్ నేతలు కిమిడి కళావెంట్రావు, కింజరపు అచ్చన్నాయుడు, గౌతు శ్యామసందర శివాజీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబ్జీ తదితరుల ఆధ్వర్యంలో జన సమీకరణ ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇదిలా ఉండగా గురువారం టెక్కలి ప్రాంతంలోని సాకిపల్లిలో జరిగిన షిరిడి సాయిబాబా వార్షికోత్సవ కార్యాక్రమానికి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కింజరపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ముఖ్య అతి«థులుగా హాజరయ్యారు. ఈ సదర్భంగా 27న చేట్టాల్సిన వాహనాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించుకున్నారు. జిల్లాలో దేశం కేడర్ మొత్తాన్ని కదిలించాలని నిర్ణయించారు. యువతను ఎద్దఎత్తున సమీకరించేందుకు రామ్మోహన్ నాయుడు ప్రయత్నిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోని యువత కదిలి రావాలని ఇప్పటికే ఆయన పిలుపు నిచ్చారు.