August 24, 2013

రాష్ట్ర యోగాధ్యయన పరిషత్ కార్యదర్శి పదవిని అనర్హులకు అప్పగించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై అధ్యాపక సిబ్బంది, వైద్యుల్లో ఆందోళన నెలకొందని, అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎంకు లేఖ రాశారు. యోగా సూపర్‌వైజర్‌గా ఉన్న ఒక వ్యక్తిని ఈ పరిషత్‌కు కార్యదర్శిగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నా యని తన దృష్టికి వచ్చిందని, కొందరు అధ్యాపక సిబ్బంది, వైద్యులు అనేకసార్లు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా కార్యదర్శి పదవిని భర్తీ చే సేలా చూడాలని కోరారు.

అనరులకు యోగాధ్యయన పరిషత్ అప్పగించొద్దు......ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ

లోక్‌సభ నుండి సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం ఎంపీలు సోమవారం నుండి పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాలని, రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతి రేకంగా నిరసనను వ్యక్తం చేస్తూ లోక్‌సభ కార్య క్రమాలను అడ్డుకోవడంతో నలుగురు టిడిపి ఎంపీలను, 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం తెలుగుదేశం ఎంపీలు సమా వేశమై సోమవారం నుండి నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవికి రాజీనామా చేసి పోరాటానికి సిద్ధం కావాలని సమావేశం అనంతరం కొనకళ్ల నారాయణ డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడు తూ విందు సమావేశాలతో కాలయాపన చేయకుండా సీమాంధ్ర ప్రజల కోసం పోరాడాలని మంత్రులు, ఎంపీలకు సూచించారు. లోక్‌సభ నుంచి సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్‌ చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌ను పున:పరి శీలించాలని స్పీకర్‌కు ఎంపీలు లేఖ ఇచ్చారన్నారు.

నేడు పార్లమెంట్‌లోగాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీల నిరాహారదీక్ష

టీడీపీ నేతల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. సభ్యుల హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మాట్లాడేందుకు నామా ప్రయత్నించగా, అందుకు స్పీకర్ మీరాకుమార్ నిరాకరించారు. ఎంపీ నామాకు బీజేపీ, ఏడీఎమ్‌కే, ఎస్పీ పార్టీ నేతలు మద్దతు తెలిపారు.

లోక్‌సభ నుంచి నామా వాకౌట్

సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్.పిలు పార్లమెంటు ప్రాంగణంలోనే నిరహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.టిడిపి ఎమ్.పిలను కాంగ్రెస్ ఎమ్.పిలతో పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పట్టికీ తాము పార్లమెంటు బయట కూడా ధర్నా చేపడతామని ప్రకటించారు.తదనుగుణంగా వారు గాందీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం నుంచి వారు ఈ ఆందోళన చేపడతారు

పార్లమెంటు ఆవరణలో టిడిపి ధర్నా

హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటనా స్థలాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం ప్రమాద బాధితులను బాబు పరామర్శించారు.

హెచ్‌పీసీఎల్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాబు