August 24, 2013

నేడు పార్లమెంట్‌లోగాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీల నిరాహారదీక్ష

లోక్‌సభ నుండి సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం ఎంపీలు సోమవారం నుండి పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాలని, రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతి రేకంగా నిరసనను వ్యక్తం చేస్తూ లోక్‌సభ కార్య క్రమాలను అడ్డుకోవడంతో నలుగురు టిడిపి ఎంపీలను, 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం తెలుగుదేశం ఎంపీలు సమా వేశమై సోమవారం నుండి నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవికి రాజీనామా చేసి పోరాటానికి సిద్ధం కావాలని సమావేశం అనంతరం కొనకళ్ల నారాయణ డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడు తూ విందు సమావేశాలతో కాలయాపన చేయకుండా సీమాంధ్ర ప్రజల కోసం పోరాడాలని మంత్రులు, ఎంపీలకు సూచించారు. లోక్‌సభ నుంచి సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్‌ చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌ను పున:పరి శీలించాలని స్పీకర్‌కు ఎంపీలు లేఖ ఇచ్చారన్నారు.