April 22, 2013

వరంగల్ : జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం మెమోరాండంను సమర్పించారు. అకాలవర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు 10వేల పరిహారం ఇవ్వాలని వినతి చేశారు. ఎమ్మెల్యేల ఎర్రబెల్లి,రేవూరి,సీతక్క, సత్యవతి రాథోడ్ కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

ఇన్‌చార్జి కలెక్టర్‌కు టీడీపీ ఎమ్మెల్యే మెమోరాండం

విశాఖపట్నం : వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లా పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పార్టీ అధ్యక్షుడలతో సమావేశం కానున్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లో జరిగే పార్టీ కార్యక్రమంపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కశింకోట మండలం తాళ్లపాక నుంచి నేడు చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించనున్నారు.

నేడు పలు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ

నెల్లూరు : జిల్లాలోని ముత్తకూరు మండలం నే లటూరు దగ్గర టీడీపీ నేత సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. జెన్‌కో ప్లాంటు దగ్గర బూడిదగుంట నిర్మాణానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన

వరంగల్ : తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ పార్టీ వసూళ్లకు పాల్పడిందని టి.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ పోలవరం వ్యవహారంలో రూ.500 కోట్లు దండుకున్నారన్నారు. టీఆర్ఎస్ నేతల వసూళ్లపై ఆధారాలు ఉన్నాయని, బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా అని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.

విద్యార్థుల ఆత్మహత్యలను కేసీఆర్ చందాలు చేసి కోట్టు దండుకున్నారని దుయ్యబట్టారు. బయ్యారం గనుల కోసం మొదటి నుంచి పారాడింది టీడీపీనే అని స్పష్టం చేశారు. బయ్యారం గనులు తెలంగాణ ఆస్తి అని, తరలిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బయ్యారంపై టీఆర్ఎస్ ఎప్పుడూ ధర్నా కూడా చేయలేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.

విద్యార్థుల ఆత్మహత్యలను కేసీఆర్ చందాలు చేసి కోట్టు దండుకున్నారు.

హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ నర్సారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది కూరగాయలు అమ్ముకునే పార్టీనే...కాని స్కాంల పార్టీ కాదని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ తాగి ఊగే పార్టీ అని విమర్శించారు.

కేసీఆర్ తాగుడు మాని ప్రజల గురించి ఆలోచించాలని ఎమ్మెల్సీ నర్సారెడ్డి సూచించారు. ఉద్యమం ముసుగులో కేసీఆర్ కుటుంబం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బాబ్లీ, బయ్యారంపై పోరాటం చేసింది టీడీపీనే అని స్పష్టం చేశారు. టీడీపీని విమర్శించే కేసీఆర్ వైసీపీని ఎందుకు విమర్శించరని ఎమ్మెల్సీ నర్సారెడ్డి ప్రశ్నించారు.

టీఆర్ఎస్ తాగి ఊగే పార్టీ : ఎమ్మెల్సీ నర్సారెడ్డి