February 16, 2013

చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం తెనాలి మండలంలోని అంగలకుదురులో రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కోడెల శివప్రసాద్ అధ్యక్షత వహించగా చంద్రబాబు అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని రకాల పంటలు పండించే రైతులు అప్పు ల ఊబిలో కూరుకుపోయారని, పండించిన పంటకు సరై న గిట్టుబాటు ధర లేదని, ఫ్రౌల్టీఫాంలు నష్టాల్లో నడుస్తున్నాయని, సాగునీరు, కరెంట్ కోతల కష్టాలను చంద్రబాబుకు రైతులు ఆవేదనతో విన్నవించారు.

వెదురుబొంగులు సబ్సిడీపై ఇవ్వాలివీరమాచినేని వెంకటేశ్వరరావు (రైతు)తెనాలి పరిధిలో ఎక్కువ మంది రైతులు వరి పంటపై ఆధారపడుతున్నారు.

దీని వల్ల సాగునీటి కొరత ఎక్కువగా ఉండటంతో తక్కువ నీటి వినియోగం ఉన్న నిమ్మ, అరటి తోటల పెంపకంపై దృష్టి పెట్టాను. పెద్ద గాలి, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలకు తోట అంతా కూలిపోతుంది. ప్రభుత్వం స్పందించి వెదురు బొంగులు సబ్సిడీపై ఇస్తే రైతులకు మేలు చేసినవారు అవుతారన్నాడు. నిమ్మకాయలకు యార్డు లేకపోవడం వలన రైతులు నష్టపోతున్నారు. పసుపు రైతులకు మంచి విత్తనం అందించే యంత్రాంగమే లేదు.

రెండవ తడికి నీరివ్వాలిఈదర పూర్ణచంద్రరావు (రైతు)వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టా రైతులను పూర్తిగా ముంచేశారన్నారు. పది రోజుల్లో రెండో పం టకు నీరివ్వకపోతే చేతికొచ్చిన పంట చేజారిపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పారుదల అంశాలపై నవంబర్‌లో జరగాల్సిన ఇరిగేషన్ ఇంజనీర్ల సమావేశం ఇప్పటికీ జరగకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమన్నారు.

రైతులు ఉపాధి కూలీలుగా మారుతున్నారు..మేకల లక్ష్మీనారాయణ (రైతు)

ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయం సంక్షభంలో పడిం ది. అన్ని పంటలకు పెట్టుబడి ఎక్కువై కనీస మద్దతు ధర ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అ న్నదాతలు ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. ర్రాష్టానికి పట్టిన ఈ దరిద్రాన్ని రైతు లు వదిలించుకోవాలని కోరారు. మిరప ధరలు పడిపోయినపుడు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతుల ను ఆదుకోవాలన్నారు. రైతుల నుండి పంట నేరుగా వినియోగదారులకు అందే విధంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.

భూములు అమ్ముకోవాల్సి వస్తుంది.బాలకృష్ణ (రైతు)

పసుపు, కంద పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక ఉన్న భూమిని అమ్ముకోవాల్సి వస్తుందని బాలకృష్ణ అనే రైతు ఆవేదన చెందారు. ఎరువుల ధరలు పెరిగి కరెంటు, నీరు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.ఫ్రౌల్టీ రైతులు తీసుకున్న రుణాలురుణమాఫీ చేయాలిచల్లా సుబ్బారావు (రైతు)

ఫ్రౌల్టీ రంగంలో కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడివున్నారని రైతు చల్లా సుబ్బారావు పేర్కొన్నారు.

బ్యాంకుల నుండి లక్షల రూపాయల రుణాలు తీసుకొని ఫారాలు నడుపుతున్నామన్నారు. దాంతో వచ్చిన ఆదాయంతో కనీసం కుటుంబాన్ని కూడా పోషించలేని పరిస్తితి నెలకొందన్నారు.

రైతు వ్యాపారవేత్తగా ఆలోచించాలిశాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణగుంటూరు జిల్లా ప్రపంచంలో వ్యవసాయానికి మార్గదర్శకమని శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ తెలిపారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి సంక్షభంలో ఉ న్నారన్నారు. నూతన విధానాలను తెలుసుకొని ఆదాయం ఎక్కువగా వచ్చే పంటలను ఎన్నుకొని ప్రతి రైతు వ్యాపారవేత్తగా ఆలోచించాలని సూచించారు.

సంక్షోభంలో ఉన్నాం..ఆదుకోండి

కాలవల్లో రైతుల కన్నీరు
పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోని ఫలితం
కాంగ్రెస్ పాలనలో 22,500 మంది రైతుల బలవన్మరణం
రైతు రాజ్యం తీసుకురావడమే ఆశయం
ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి
గంటూరు జిల్లా పాదయాత్రలో బాబు

ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తానంటూ మాయ మాటలు చెప్పి, నీటిపారుదల వ్యవస్థను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. "కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేకపోయారు. ఫలితంగా నేడు పైనుంచి కిందికి నీరు రాక, సాగునీటి కాలువల్లో రైతుల కన్నీళ్లు పారుతున్నాయి'' అంటూ చంద్రబాబు వైఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞం పేరుతో వైఎస్ రూ.30 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో 22,500 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే.. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే 14,500 మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. అన్ని విధాలుగా చితికిపోయిన రైతులను గట్టెక్కించేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని వాగ్దానం చేశారు. చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర శనివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని అంగలకుదురులో ప్రారంభమైంది. తన పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఈదర భాస్కరరావు అనే రైతు విరాళంగా ఇచ్చిన స్థలంలో టీడీపీ తరఫున 'ఎన్‌టీఆర్ కిసాన్ భవన్' నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ కష్టాలను ఆయనకు మొరపెట్టుకున్నారు.

రుణమాఫీ చేసి తీరుతా
ఎంత కష్టమైనా రైతులకు రుణమాఫీ అమలు చేసి తీరతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తన హయాంలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకువచ్చిన విషయం గుర్తు చేశారు. వ్యవసాయాన్ని ఒక పద్ధతిలో పతనావస్థ దిశగా వైఎస్ నడిపిస్తే ప్రస్తుత సీఎం కిరణ్ దానిని పూర్తిగా అంతం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారరు. అందరూ కలిసికట్టుగా రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని పోగొట్టి రైతురాజ్యం తీసుకురావడమే తన ఆశయమన్నారు. రైతులతో సమావేశంలో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు జోరు వానను సైతం లెక్కచేయకుండా ప్రజల సమస్యలు తెలుసుకొంటూ పాదయాత్రలో ముందుకు సాగిపోయారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రౌడీలు రాష్ట్రం విడిచి పారిపోయేలా చేశామని చంద్రబాబు చెప్పారు. వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పాదయాత్రలో భాగంగా తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాల విద్యార్థినులతో చంద్రబాబు సంభాషించి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాల్సిందేనని స్పష్టం చేశారు. బాగా చదువుకోవడం కోసమే ల్యాప్‌టాప్, ఐప్యాడ్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించుకొని అవినీతిని నిర్మూలించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చదువు పూర్తి చేశాక ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగభృతి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

శనివారం చంద్రబాబు పాదయాత్ర అంగల కుదురు నుంచి మొదలై 7.3 కిలోమీటర్లు కొనసాగి రాత్రికి తెనాలిలో ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రుణ మాఫీ ఎలా సాధ్యమంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని.. అధికారంలోకి వస్తే రైతులను ఏ విధంగా ఆదుకుంటామో చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ దొంగలను రక్షించటంలో ముఖ్యమంత్రి కిరణ్ తీరిక లేకుండా ఉన్నారని, మంత్రి ధర్మాన ప్రసాదరావును కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడని చంద్రబాబు అన్నారు. ఆ శ్రద్ధ ప్రజలపై లేదంటూ విరుచుకు పడ్డారు. సొసైటీ ఎన్నికలలో ఓటును రూ.25వేలకు కొని కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే వ స్త్రాలపై వ్యాట్ టాక్స్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. ఆర్యవైశ్యులను రాజకీయంగా పైకి తీసుకొస్తామని మాదిగ ఉపకులాలకు వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

నేడు టీడీపీ పార్లమెంటరీ కమిటీ భేటీ
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా తెనాలిలో జరగనుంది. పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ఉదయం 10 గంటలకు టీడీపీ ఎంపీలతో సమావేశమౌతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

వైఎస్ వ్యవసాయాన్ని పతనం వైపు నడిపిస్తే.. కిరణ్ అంతమే చేస్తున్నాడు

వైఎస్ మాటలు నమ్మి రైతులు ఇబ్బందుల్లో పడ్డారు
వ్యవసాయం దండగని ఎప్పుడూ చెప్పలేదు
ఇచ్చిన హామీలు నెరవేరుస్తా : చంద్రబాబు నాయుడు

  గడిచిన తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో 14,500 మంది ఆత్మహత్య చేసుకుంటే, గత నాలుగేళ్ళలో మరింత ఎక్కువయ్యాయని, వైఎస్ మాటలు నమ్మిన రైతులు ఇబ్బందుల్లో పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయడు శనివారం జిల్లాలోని అంగలకుదురులో యాత్ర ప్రారంభించారు. అకాల వర్షం కారణంగా బాబు యాత్ర కొంచెం ఆలస్యంగా ప్రారంభమయింది. ఇటీవల రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకున్న సందర్భంగా బాబు అంగలకుదురులో ఎన్టీఆర్ కిషాన్ భవన్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి ప్రజల డబ్బును దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తాను వ్యవసాయం దండుగ అని ఎప్పుడు చెప్పలేదని, రైతుల పిల్లలు చదువుకోవాలని మాత్రమే చెప్పానని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు బతికి బట్టకట్టాలంటే రుణ మాఫీ మినహా మరే మార్గం లేదన్నారు. పరిశ్రమలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతోందని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అల్మట్టి డ్యామ్ కేసులో వైయస్ కారణంగానే ఓడిపోయామన్నారు. అసమర్థుడైన బంధువును వైయస్ లాయర్‌గా పెట్టడం వల్లే అలా జరిగిందన్నారు. కాలువల్లోకి నీళ్లు రావడం లేదు. కానీ రైతుల కళ్లలో మాత్రం కన్నీళ్లొస్తున్నాయన్నారు. తాను దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి వ్యవసాయం లాభసాటిగా మార్చాలని చూశానని ఆయన చెప్పారు.

జలయజ్ఞం పేరుతో వైఎస్ డబ్బు తినేశారు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం రాజ్‌భవన్‌లో కలిశారు. కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు గవర్నర్ ను కోరారు.

నీరందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికే తీవ్ర నష్టం జరిగిందని, ఇకనైనా నీటిని విడుదల చేయాలని వారు కోరారు. గవర్నర్ ను కలిసినవారిలో టీడీపీ ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నం, దాసరి బాలవర్దన రావు తదితరులు ఉన్నారు.

గవర్నర్ నరసింహన్‌ను కలిసిన టీడీపీ నేతలు

సీఎం... ఖబడ్దార్!
రేపటి లోగా డెల్టాకు నీళ్లు రావాలి!
లేదంటే మహాధర్నాతో విజృంభిస్తాం
కిరణ్‌కు చంద్రబాబు హెచ్చరిక
గుర్తింపు ఇస్తే ప్యాకేజీలకు పోతున్నారు
'వలస'లపై ఫైర్
గుంటూరులో పాదయాత్ర పున: ప్రారంభం
పెత్తందారంటూ స్పీకర్ మనోహర్‌పై ధ్వజం

కృష్ణా డెల్టాకు ఆదివారం సాయంత్రంలోగా నీళ్లు విడుదల చేయాలని, లేదంటే సోమవారం మహా ధర్నా నిర్వహిస్తానని సీఎంకిరణ్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. జిల్లాకు నీళ్లు తీసుకురాలేని స్పీకర్ నాదెండ్ల మనోహన్.. పెత్తందారిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దొంగల్ని కాపాడేపనిని కిరణ్ చేయకపోతే, ఇప్పటికి కేబినెట్ అంతా చంచలగూడ జైలులో ఉండేదని ఎద్దేవా చేశారు. కొలకలూరులో మెట్లు కూలిన సంఘటనలో కుడికాలి మడమ నొప్పి రావడంతో గురువారం మధ్యలోనే నిలిపేసిన పాదయాత్రను వైద్యుల సలహా తీసుకొని శుక్రవారం ఉదయం 11.45 గంటలకు ఆయన తిరిగి ప్రారంభించారు. అంతకుముందు.. ఫిజియోథెరపి, మసాజ్ తదితర చికిత్సలు తీసుకున్నారు.

ఏషియన్ గ్య్రాస్టో ఎంటిరాలజీ ఇనిస్టిట్యూట్ అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన గుడివాడ, కోపల్లె మీదుగా 9.7 కిలోమీటర్లు నడిచి అంగలకుదురుకు చేరుకొన్నారు. చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పడుతూ ఆయన వెంట నడిచారు. " నేను చేస్తోన్న పాదయాత్ర ఎంతో పవిత్రమైంది. మీ కష్టాలు తీర్చడం కోసం ముందుకు సాగుతున్నాను. ఈ ర్రాష్టానికి మంచి చేయాలన్న సంకల్పం తప్ప నేను ఏ పదవో ఆశించి రాలేద''ని ఈ సందర్భంగా అన్నారు. ఘటన జరిగిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, గుంటూరు జిల్లా పార్టీ నాయకులు ఆయనను కలిసి పరామర్శించారు. అనంతరం భగవాన్ సేవాలాల్ మహరాజ్ 274వ జయంతి సందర్భంగా టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ సహా పలు హామీలతో కూడిన వికాస పత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు.

పాదయాత్ర గుడివాడ గ్రామానికి చేరుకొన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొన్నారు. యాత్రలో భాగంగా కలుసుకున్న వారికి పాదయాత్రలోని ఇబ్బందులను వివరించే ప్రయత్నం చేశారు. "పాదయాత్ర వలన నాకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఒక్కోసారి నొప్పి భరించలేకుండా ఉంటోంది. 30 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అయినాసరే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పారు. అక్రమాలపై ఎవరైనా నోరు తెరిస్తే జైలులో పెట్టడాన్ని తెలివిగల పనిగా భావిస్తున్నాడంటూ సీఎం కిరణ్‌పై విరుచుకుపడ్డారు. "సహకార ఎన్నికల్లో అక్రమాలపై పోరాడినందుకు మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావును జైల్లో పెట్టారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై తప్పుడు హత్య కేసు పెట్టారు. తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేసే పరిస్థితికి వచ్చార''ని విమర్శించారు.

పశువుల కన్నా హీనంగా జగన్ పార్టీకి అమ్ముడుపోతున్నారని టీడీపీ నేతల వలసల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. "పాదయాత్రలో ఉండగా ఒక ఆడబిడ్డ పొట్టేలును మేపడం చూశాను. ఆమె ఎక్కడికి వెళితే అది అక్కడికి వస్తుంది. ఆ ఆడబిడ్డను "ఏమ్మా నువ్వు ఎక్కడికి వెళితే అది అక్కడికి వస్తుంది. ఏమి పెట్టావు'' అని ఆసక్తిగా అడిగాను. గడ్డి పెట్టానని చెప్పింది. దాని మాత్రం విశ్వాసం కూడా ఈ నేతలకు ఉండటం లేదు. ఒక చిరునామా అంటూ లేని వాళ్లకు రాజకీయజీవితం ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారు. వాళ్లిప్పుడు పశువుల కంటే హీనంగా విశ్వాసం లేకుండా జగన్ పార్టీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడు పోతున్నార''ని చంద్రబాబు ధ్వజమెత్తారు.

దోచుకోవడం, దొంగ ఫిర్యాదులు చేయడమే జగన్ పార్టీ సిద్ధాంతమని ఆరోపించారు. "యువతకు ఉద్యోగాలు రాకుండా పోవడానికి కారణం జగన్ దోపిడీనే. పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు చూపించాల్సిన వాళ్లు వైఎస్ ప్రలోభాలకు లొంగిపోయారు. అందుకే ఈ నిరుద్యోగ సమస్య'' అని వివరించారు. దొంగలు, దొంగలు కలిసిపోయారని.. మంచివాళ్లంతా ఏకమై వారిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏ పని జరగాలన్నా స్పీకర్ పర్మిషన్ అవసరమవుతోందని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. "ఆయన ఓ పెత్తందారిగా మారారు. తెనాలి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి చేశారు. రేపు ఎన్నికలొస్తే ఆయన ఇంటికే పరిమితం కావడం ఖాయం. అప్పుడు ప్రజలకు ఎలాంటి అనుమతులు ఇచ్చే అవకాశం కూడా ఉండద''ని పేర్కొన్నారు.

అయినా..ఎదురుగాలే!
హైదరాబాద్: సీమాంధ్రలో ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులను తమ వైపు ఆకర్షించిన వైసీపీ.. వారి వల్ల ఏ మేరకు రాజకీయంగా లాభం పొందగలిగిందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ శిబిరంలో చేరిన టీడీపీ నేతల్లో అధికులు ఇటీవలి సహకార ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు సాధించలేకపోయారు. మెజారిటీ నేతల సీట్లలో జగన్ పార్టీతో పోలిస్తే టీడీపీనే మంచి ఫలితాలు సాధించగలిగింది. పార్టీ ఫిరాయించిన నేతలు తమతోపాటు కింది స్థాయి క్యాడర్‌ను తీసుకు వెళ్లలేకపోవడమే ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ వైపు చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు తన నియోజకవర్గంలో మంచి ఫలితాలు సాధిస్తే మరొకరు బాగా దెబ్బతిన్నారు.

తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి మెజారిటీ సీట్లను వైసీపీకి సాధించి పెట్టగలిగారు. కాని పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాధరెడ్డి వెనకబడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేత కృష్ణబాబు, గోపాలపురం ఎమ్మెల్యే వనిత జగన్ శిబిరంలో చేరారు. అయినా ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఒకే ఒక్క సొసైటీ లభించింది. కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గంలో కూడా వైసీపీతో పోలిస్తే టీడీపీ రెట్టింపు సొసైటీలు దక్కించుకొంది. అదే జిల్లాలో వైసీపీలో చేరిన ఉప్పులేటి కల్పన నియోజకర్గం పామర్రులో సగానికి పైగా సొసైటీలు టీడీపీ కి దక్కితే జగన్ పార్టీకి అందులో ఐదో వంతు మాత్రమే లభించాయి.

ఆ నేతలు పశువులు కన్నా హీనం

'పాదయాత్రలో ఎదురవుతు న్న ఆరోగ్య సమస్యలతో కనీళ్లు వస్తున్నాయి. ప్రజల అభిమానాన్ని చూస్తూ వాటిని దిగమింగుకొంటున్నానని' టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం కష్టపడటంలో ఉండే ఆనందం వేరు అని చెప్పారు. అవినీతి ఉంటే జాతి బతకదని చెబుతూ.. మంచివాళ్లు అంతా కలిసి దొంగలను పారదోలాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తెనాలి రూరల్‌లోని కొలకలూరు శివారు నుంచి జిల్లాలో తొమ్మిదో రోజు పాదయాత్ర ప్రారంభించి గుడివాడ, కోపల్లె మీదుగా అంగలకుదురు వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచారు.

కొలకలూరు మూడు బొమ్మల సెంటర్‌లో మెట్ల స్టేజీ కూలి కుడికాలి మడమ నొప్పికి లోనైన చంద్రబాబు శుక్రవారం కోలుకొన్నారు. అర్ధగంట ఆలస్యంగా ఉదయం 11.40 గంటలకు బస్సు నుంచి కిందికి దిగారు. అక్కడి నుంచి నడక ప్రారంభించిన చంద్రబాబు కొమ్మమూరు కాలువ వెంట పాదయాత్రను కొనసాగించారు.

మార్గమధ్యలో విద్యార్థులు, పసుపు, మొక్కజొన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. పాదయాత్ర మొదలైన అర కిలోమీటర్ దూరంలోనే వైద్య పరీక్షల కోసం చంద్రబాబు బస్సులోకి వెళ్లడంతో ప్రజల్లో కాసేపు ఉత్కంఠ నెలకొన్నది. అరగంట తర్వాత బస్సు దిగిన చంద్రబాబు గుడివాడ గ్రామానికి చేరుకొని మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొన్నారు. సాయంత్రం 4.15 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి చర్చి వీధిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.గుడివాడలో మహనీయుల విగ్రహాలు నెలకొల్పారు. ఇక్కడ వాతావరణం ఎంత పవిత్రంగా ఉందో తన పాదయాత్ర కూడా అంతేనన్నారు. ప్రజల కోసం, వారి కష్టాలు తీర్చడానికి చేస్తున్నదని చెప్పారు. కొలకలూరులో స్టేజీ మెట్లు కూలినప్పుడు ఏమి అర్థం కాలేదని, విధిని తప్పించలేమన్నారు. ఆ సంఘటనలో కాలు విరిగినా, మేకులు గుచ్చుకొన్నా మరలా ప్రజల్లోకి రావడం కష్టమయ్యేదని, అయితే భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం తన పాదయాత్రకు ఉన్నాయని చెబుతూ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొన్నారు.

ఆ రోజున స్టేజీ చిన్నది కాకుంటే ఏ వెన్నెముకో విరిగి తాను ఈ రోజున ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ ర్రాష్టానికి ఏదో చేయాలన్న సంకల్పం తప్ప తనకు మరొకటి లేదని చెప్పారు. మీరు చూపిస్తోన్న ఆదరాభిమానంతో ముందుకు పోతున్నానన్నారు.డెల్టా, సాగర్ ఆయకట్టులో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వకపోతే సోమవారం మహాధర్నా చేపడతా.. ఇప్పటికే దీనిపై ప్రభుత్వాన్ని హెచ్చరించా.. మీలో కూడా చైతన్యం రావాలి. మీరు మా వెంట రాకపోతే సహకార ఎన్నికల్లో అక్రమాలపై నిలదీసిన కోడెలను జైల్లో పెట్టారు. అలానే యరపతినేని, శ్రావణ్‌కుమార్‌పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే పరిస్థితి ఉంది.నేనూ ఇలానే ఆలోచిస్తే ఆ రోజున కాంగ్రెస్ దొంగలు బయటికి వచ్చే వారు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నా పాదయాత్రపై మీలో చర్చ జరగాలి. ఏది ధర్మమో, ఏది అధర్మమో విజ్ఞతతో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.

తెలుగుజాతికి చెడ్డ పేరు తెచ్చింది వైఎస్ కుటుంబమేనన్నారు. ఎన్‌టీఆర్ ఢిల్లీ పెద్దలను గడగడలాడించి ర్రాష్టానికి అవసరమైన పనులు, నిధులు తెస్తే తాను వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఫోన్‌లో మాట్లాడి పనులు చేయించానని చెప్పారు. ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలని తాను ఆలోచించానని, దేశానికి బిల్ క్లింటన్, బిల్‌గేట్స్, టోని బ్లెయిర్ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను చూడటానికి వచ్చారని గుర్తు చేస్తూ ఈ రోజున ఏపీ అంటేనే భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపరులు రోడ్డెక్కి మాట్లాడుతూ వాళ్ల పత్రికల్లో రాసుకొంటున్నారు. వాళ్ళ వెంట కొంతమంది పోతుండటం దురదృష్టకరమన్నారు. 20 మందికి పైగా జడ్జీల వద్దకు వెళ్లినా జగన్‌కు బెయిల్ దొరకలేదు. ఇంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ డబ్బు దోచాడని న్యాయమూర్తులు కూడా నమ్ముతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు చైతన్యవంతం కాకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతుందని చెప్పారు. ఇంటింట్లో టీడీపీ కార్యకర్తలుగా మారి ప్రచారం చేయాలి. నేను వెళ్లిపోయాక మరిచిపోతే కష్టాలేనని అప్రమత్తం చేశారు.

ప్రజాభిమానమే నడిపిస్తోంది