July 4, 2013

టీడీపీ అధికారంలోకి వస్తే పింఛన్ల సొమ్ము పెంచుతాం
చంద్రబాబు పిలుపు

పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం విజయఢంకా మోగించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడకు సమీపంలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గురువారం నిర్వహించిన పంచాయతీరాజ్‌ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సదస్సుకు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. అభివృద్ధి సం క్షేమ పథకాలు ఆగిపోయాయని ఆరోపించారు. పంచాయతీల బలోపేతానికి తెలుగుదేశం కృషి చేస్తుందన్నారు. మంచి సర్పంచ్‌లను ఎన్నుకుంటే గ్రామాలు బాగుపడతాయని అన్నారు. లేదం టే అభివృద్ధి జరగదన్నారు. వైఎస్సార్‌ హయంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అనిశ్చితి పెరిగిందన్నారు. అవినీతి పరులతో చంచల్‌గూడ జైలు నిండిందన్నారు. తెలుగుదేశం హయంలో పనిచేసిన ఐఏఎస్‌లు ఉన్నత స్థానంలో ఉంటే వైఎస్‌ హయంలో పనిచేసిన వారు జైలు పాలవుతున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటు వేయడం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని జగన్‌కు ప్రజలలో బలం ఉందని బెయిల్‌ ఇవ్వమని వత్తిడి తెచ్చే అవకాశం ఉందన్నారు. రాబోయే ఎన్నికలో నిజాయితీ పరులను, మంచివారిని ఎన్నుకోకపోతే శాశ్వతంగా బాధపడాల్సి వస్తుందన్నారు. తన హయంలో గ్రామాల అభివృద్ధికి శ్రమదానం, జన్మభూమి,పచ్చదనం పరిశుభ్రత,ప్రజల వద్దకు పాలన పెట్టానని తద్వారా గ్రామాలో ఎంతో అభివృద్ధి సాధించానని అన్నారు. గ్రామాలో మద్యం సిండికేట్‌లు,ఇసుక సిండికేట్‌లు, ఇసుక సిండికేట్‌లు పెరిగిపోయాయని అన్నారు. తెలుగుదేశం గెలవడం ఒక చారిత్రక అవసరం అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఫించన్లను రూ.200 నుంచి రూ 1000లకు పెంచుతామని, వికలాంగులకు రూ.500 నుంచి రూ.1500 వరకు పెంచుతామని అన్నారు. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా నీతి వంతమైన పాలన అందించామన్నారు. మీ పిల్లల కు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశంను గెలిపించాలని కోరారు. ఈ సదస్సులో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు,ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్‌, యరపతినేని శ్రీనివాసరావు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, టి.వి.రామారావు,కందుల నారాయణరెడ్డి,జయమంగళ వెంకట రమణ, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, అంగర రామ్మోహనరావు,పార్టీ ప్రధాన కార్యదర్శులు వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గరికపాటి మోహనరావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు సీతామహాలక్ష్మీ, ప్రకాశం జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌ తెలుగుదేశం నాయకులు డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు, కాగిత వెంకట్రావు, బొండా ఉమా,అంబికా కృష్ణ, మాగంటి బాబు, లాల్‌ జాన్‌ భాషా,పంచుమర్తి అనూరాధ,రావి వెంకటేశ్వరరావు, సిఎల్‌ వెంకట్రావు, నగర అద్యక్షులు నాగుల్‌ మీరా, బుద్దా వెంకన్న, గద్దె రామమోహనరావు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, నడికుదిటి నరసింహారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, వల్లభనేని వంశీ, దివి శివరాం, తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్‌సభ ఇన్‌ చార్జి కేశినేని శ్రీనివాస్‌నాని, కడియాల రాఘవరావు నాలుగు జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు మాజీ కేంద్ర మంత్రి కె.ఎర్రంనాయుడు, మాజీ ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య, మాజీ ఎమ్మెల్యే పి.వి.నరసింహరాజు మృతికి, ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు సదస్సు ప్రగాఢ సంతాపం తెలిపారు.

విజయఢంకా మోగించాలి..........ఉద్యోగాలు రావాలంటే టీడీపీని గెలిపించాలి



2014 అధికారం లక్ష్యంగా పోరాడాలి
దేశం నేతలు పిలుపు

(విజయవాడ/కెఎన్‌ఎన్‌బ్యూరో) : స్థానిక సంస్ధల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ గురువారం ఈడ్పుగల్లులో నిర్వహించిన ప్రాంతీయ సదస్సు ఉత్సాహవంతంగా జరిగింది. ఈ సదస్సుకు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. నాలుగు జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుతో పాటు మచిలీపట్నం ఎంపి కొనకళ్లనారాయణరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ లు హాజరయ్యారు. స్ధానిక సంస్ధలను బలోపేతం చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వారి లో మంచివారిని ఎన్నుకోవాలని సూచించారు. కేవలం కులం, మతం, డబ్బు ప్రాతిపదికన కాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ దిశగా కార్యకర్తలను, నాయకులను చైతన్యపరచాలని ఉద్భోధించారు. రాష్ట్రంలో సమర్ధత కలిగిన పరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని ఇందుకు పలు ఉదాహరణలతో కూడిన అంశాలను ఆయన కార్యకర్తలకు ఉదహరించారు. రాష్ట్రాన్ని చ క్కదిద్దాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని చాటిచెప్పాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. పంచాయతీ వ్యవస్ధ నిర్విరమైందని, పున: నిర్మించాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని సమస్యలకు కారకులైన వారి గురించి ప్రజలకు వివరించాలని నిర్ధేశించారు. విద్యుత్‌ సంక్షోభం, ధరలపెరుగుదల ,వ్యవసాయం నీటి పారుదల రంగాలు, శాంతిభద్రతల వైఫల్యం, యువత నిరుద్యోగం, గ్రామాల్లో కొరవడిన మౌళికసదుపాయాలు, అవినీతి కుంభకోణాలు, అభివ ృద్ధికి ఆటంకం అంటూ పలు అంశాలపై ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. పతనమైన వ్యవస్ధలను నిలబెట్టాలన్నా, అవినీతి రహిత సమాజం రావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించాలంటే కార్యకర్తలు, నాయకులు ఇప్పటి నుం చే పనిచేయాలన్నారు. ఈ సదస్సుకు మహిళలు స్వల్ప సంఖ్యలో హాజరుకాగా, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నాలుగు జిల్లాల నుంచి భారీ వాహనాలతో కార్యకర్తలు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. అటు కొవ్వూరు, ఇటు గిద్దలూరు నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చంద్రబాబునాయుడు వేదికపైకి చేరుకున్నారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి దివంగత నేతలు నందమూరి తారకరామారావు, కె ఎర్రంనాయుడు, పివి నరసింహరాజు, అంబటి బ్రాహ్మణయ్యలకు నివాళులు అర్పించారు. అనంతరం మా తెలుగుతల్లి గీతం తో సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో చంద్రబాబు ఇటీవల ఉత్తరాఖండ్‌ వరదలపై తాను చేపట్టిన సహాయ కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా బాధితులతో తాను పంచుకున్న అనుభవాలను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. స్ధానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాబోయే 2014 ఎన్నికల్లో అధికారాన్ని సాధించాలన్న లక్ష్యంగా పనిచేయాలని సదస్సులో ప్రసంగించిన వక్తలంతా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పై నాయకులంతా నిప్పులు చెరిగారు. ఒక దశలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌, విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ, విజయమ్మ,షర్మిల, జగన్‌ ల పై చేసిన విమర్శలపై చంద్రబాబు సున్నితంగా మందలించారు. వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళరాదని రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. తన వ్యాఖ్యల పట్ల పంచుమర్తి అనురాధ విచారం వ్యక్తం చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలో ప్రాంతీయ సదస్సును కృష్ణాజిల్లా నాయకులు విజయవంతంగా నిర్వహించారని ఏర్పాట్లు చురుకుగా చేశారని, సదస్సుకు హాజరైన ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లా నాయకులు ప్రశంసించారు. అంచనాలకు తగ్గట్టుగా 25వేలమంది హాజరుకాకపోయినా నాలుగు జిల్లాల నుంచి చెప్పుకోదగ్గ స్ధాయిలో కార్యకర్తలు తరలిరావడంతో నాయకుల్లో ఆనందం వెల్లివిలిసింది. కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రసంగాలకు జేజేలు పలుకుతూ ఉత్సాహపరిచారు.

ఉత్సాహభరితంగా టిడిపి ప్రాంతీయ సదస్సు

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ఆ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శనివారం ఆరు జిల్లాల పార్టీ ప్రతినిధులతో జిల్లాలో ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సును పెద్దఎత్తున నిర్వహించేందుకు జిల్లాపార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ సదస్సులో రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రాంతీయ సదస్సు ద్వారా దిశా నిర్దేశం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. ఉదయం 10గంటలకు నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమం ముగిసే వరకు పార్టీ అధినేత చంద్రబాబు ఉంటారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎంపిక చేసిన ప్రతినిధులు మాత్రమే హాజరయ్యే ఈ శిబిరంలో శిక్షణ కూడా ఉంటుంది. ఈ సదస్సులో నియోజకవర్గ కోర్ కమిటీ, మండల కోర్ కమిటీ, గ్రామ కోర్ కమిటీ తదితర ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు. ఈ సదస్సులో స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పకబ్బందీగా వ్యవహరించాల్సిన తీరు, తదితర కీలకాంశాలపై ప్రతినిధులకు బోధించనున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, సమావేశం విజయవంతంపై గురువారం టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ నెల 5న నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయాలని చర్చించారు. సదస్సుకు నేరుగా పార్టీ అధినేత చంద్రబాబే హాజరు కానుండటంతో నేతలు కూడా సదస్సుకు అదే స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 50వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి 20వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా భారీగా ఉండాలనే ఆలోచనతో ముందస్తుగా గురువారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలోని ఎక్స్‌లెన్స్ గార్డెన్‌లో ఈ సదస్సును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ సమవేశంలో టీడీ పీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పి. మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌గౌడ్, నియోజకవర్గ కన్వీనర్లు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రేపు 'దేశం' ప్రాంతీయ సదస్సు


నాట్స్ సంభరాలకు తరలి వచ్చిన ప్రముఖులు

భారీగా అభిమానులు హాజరు

(విజయవాడ,కెఎన్‌ఎన్‌ బ్యూరో) : తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ చార్జి కేశినేనినాని స్థానిక పాత బస్‌స్టాండ్‌ వద్ద విజయవాడ లోక్‌సభ టీడీపీ పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం రాత్రి ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు,నాయకులు, కేశినేని అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుఅయ్యారు.పార్టీ నేతలతో వివిధ ప్రాంతాలకు చెందిన వర్తక వాణిజ్యవర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. రవాణ రంగానికి చెందిన అనేకమంది వ్యాపారులు తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలనుంచి మహిళా కార్యకర్తలు భారీగా హాజరు అయ్యారు. మూడు అంతస్తుల భవనం నిర్మించగా మొదటి అంతస్తులో సమావేశాలకు అనుగుణంగా ఏర్పాటుచేశారు. చంద్రబాబు నాయుడుపార్టీలోని అన్ని అంతస్తులు తిరిగి పరిశీలించారు. భవనం నిర్మాణ వివరాలను కేశినేని చంద్రబాబుకు వివరించారు. ఈ కార్య క్రమంలో ఎంపీ కొనకళ్ల నారాయణతో పాటు తంగిరాల ప్రభాకరరావు, శ్రీరాం తాతయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శులు వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాగిత వెంకట్రావు, బొండా ఉమా,అంబికా కృష్ణ, మాగంటి బాబు, లాల్‌ జాన్‌ భాషా,పంచుమర్తి అనూరాధ,రావి వెంకటేశ్వరరావు, సిఎల్‌ వెంకట్రావు, నగర అద్యక్షులు నాగుల్‌ మీరా, పశ్చిమ ఇన్‌ చార్జి బుద్దా వెంకన్న, తూర్పు ఇన్‌ చార్జి గద్దె రామమోహనరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

కోలాహలంగా కేశినేని కార్యాలయం ప్రారంభం


పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలిసి పోటీచేసే పరిస్థితి కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.తిరుపతిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రాంతీయ సమవేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పంచాయతీ ఎన్నికలలో పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక చోట్ల ఇప్పటికే తల్లి కాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్ కలిసి పని చేసే సూచనలు ఉన్నాయని ఆయన అన్నారు.సమర్ధపాలన,స్వచ్చమైన పాలన ఒకవైపు, అవినీతి అసమర్ధ పాలన మరో వైపు వీటి మధ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులనే ఎంపిక చేసుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కేశవ్ అన్నారు.

తల్లి, పిల్ల కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి : పయ్యావుల

హైదరాబాద్: ప్రజా ఖాతాల సంఘం(పీఏసీ)కు కొత్త ఛైర్మన్ నియమితులయ్యారు. ప్రతిపక్ష టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తిని పీఏసీ ఛైర్మన్‌గా ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నియమించారు. ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న రేవూరి ప్రకాష్‌రెడ్డిని చంద్రబాబు ఇటీవలే రాజీనామా చేయించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున చంద్రబాబుపై కేఈ ఒత్తిడి తేవడంతోనే రేవూరిని బాబు రాజీనామా చేయించినట్లు వార్తలొచ్చాయి. ఒత్తిడి కారణంగానే కేఈ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. పీఏసీ ఛైర్మన్‌గా కేఈ ప్రమాణం చేయనున్నారు. కాగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతను పీఏసీ ఛైర్మన్‌గా నియమించడం అనవాయితీగా వస్తోంది.

పీఏసీ ఛైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి నియామకం

విజయవాడలో టీడీపీ ప్రాంతీయ సదస్సు
విజయవాడ : విజయవాడలో జరుగుతున్న టీడీపీ ప్రాంతీయ సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వైఎస్‌తో ప్రారంభమైన అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. మచిలీపట్నం, రేపల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ, గుంటూరును మెగాసిటీగా మారుస్తామన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుచేస్తామన్నారు. నిజాంపట్నం, రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేస్తామన్నారు. అధికారం లోకి మామీద కోపం ప్రాజెక్టులపై చూపిస్తున్నారన్నారు. కొల్లేరు వాసులను న్యాయం జరిగేంతవరకూ అండగా ఉంటానని బాబు హామీ ఇచ్చారు. బందరు పోర్టును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

విజయవాడ, గుంటూరును మెగాసిటీ..

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కి, విదేశాంగమంత్రి సల్మాన్‌ ఖురీద్‌లకు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం లేఖలు సమర్పించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మృతిచెందిన రాష్ట్ర వాసుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మన్మోహన్‌కి చంద్రబాబు లేఖ

నగరంలోని ఈడ్పుగల్లులో టీడీపీ రెండో ప్రాంతీయ సదస్సు గురువారం ఉదయం ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా, గుంటూరు, ప్రశాకం, పగో జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు

విజయవాడలో టీడీపీ ప్రాంతీయ సదస్సు

 కాంగ్రెస్ పార్టీకి ఎన్నికంటే భయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం విశాఖలో జరిగిన ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న ఆయన డప్పు కొట్టి స్థానిక ఎన్నికల నగారా మ్రోగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించలేదని అన్నారు. మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకకు మూడేళ్లు పట్టిందని, పంచాయతీ ఎన్నికలకు రెండున్నరేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో అర్హులకు ఫించన్లు అందితే, కాంగ్రెస్ హయాంలో అనర్హులకు మంజూరు చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల అధికారాలను, విధులను ఇతరులకు బదిలీ చేసి పంచాయతీ సర్పంచ్‌లను ఉత్పవ విగ్రహాలుగా మార్చిందని ఆయన ఆరోపించారు. టీడీపీ సర్పంచ్‌లకు పూర్తి అధికారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం పేరుతో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని అన్నారు. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి టీడీపీ సమాయత్తం అవుతోంది. పార్టీ శ్రేణులను ఈ దిశగా సంసిద్ధం చేసే నిమిత్తం ఆ పార్టీ బుధవారం నుంచి ఐదు చోట్ల ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తోంది. మొదటి సదస్సు బుధవారం విశాఖ నగరంలో జరిగింది. నాలుగో తేదీన విజయవాడ, ఐదో తేదీన తిరుపతి, ఆరో తేదీన హైదరాబాద్, ఏడో తేదీన వరంగల్ నగరాల్లో జరగనున్నాయి. వీటన్నింటికి చంద్రబాబు హాజరవుతారు. ఒక్కో ప్రాంతీయ సదస్సుకు నాలుగైదు జిల్లాల పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా పార్టీ శ్రేణులకు ఈ ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నది టీడీపీ వ్యూహం.
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడంతోపాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ ప్రాంతీయ సదస్సులు పెడుతున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖ సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ,తూ ర్పు గోదావరి జిల్లాల నుంచి ఇరవై వేల మంది ఈ సదస్సుకు హాజరయ్యారు.4న జరిగే సదస్సుకు విజయవాడలోనిఈడుపుగల్లు వేదికకానుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 20 వేల మంది కార్యకర్తలు పాల్గొంటారని అంచనా. 5వతేదీ తిరుపతిలో జరిగే సదస్సుకు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూ రు జిల్లాల నుంచి 20 వేల మంది హజరు అవుతారు. వరంగల్‌లో ఈ నెల 7న జరిగే టీడీపీ ప్రాంతీయ సభ నిర్వహణకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 25 వేల మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరవుతారని ఎర్రబెల్లి చెప్పారు.

కాంగ్రెస్‌కు ఎన్నికలు అంటే భయం : చంద్రబాబు

స్థానిక సంస్థలకు టీడీపీ హయాంలోనే అధికారాలు, నిధులు అందించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీల్లో కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయని, తాగడానికి నీళ్లు దొరకడం లేదని, రాత్రి వీధిదీపాలు వెలగడం లేదని, గ్రామాల్లో పాఠశాలలు తెరుచుకోవడం లేదని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదని, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. వీటన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ఇటీవల కేంద్రం స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చిందని, మన వాటాగా రూ. 4వేల కోట్లు రావాల్సి ఉండగా.. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ సొమ్ము రాకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇసుక ఆదాయంపై పంచాయతీలకే హక్కు కల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చేసి గ్రామాల్లో 'ఇసుక మాఫియా'ను తయారుచేసిందన్నారు. ఆఖరుకు వృత్తిపన్ను, నీటితీరువా కూడా పంచాయతీలకు ఇవ్వడం లేదన్నారు.

ఎమ్మెల్యేల పెత్తనం అంగీకరించం
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ఎమ్మెల్యేలే పెత్తనం చేస్తున్నారని, దాన్ని తాము ఆమోదించబోమని చంద్రబాబు పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక పంచాయతీల వీధిదీపాల విద్యుత్తు వ్యయం భారీగా పెరిగిపోయిందన్నారు. గతంలో యూనిట్ ధర రూ. 2.30 ఉండగా దాన్ని రూ. 5.37 చేశారన్నారు. తాగునీటి పథకాలకు విద్యుత్తు యూనిట్ రేటు 1.40 ఉండగా దాన్ని రూ.4.37కు పెంచేశారని ఆరోపించారు. సాగు ఖర్చులు 300 శాతం పెరిగితే మద్దతు ధర 20 శాతం కూడా పెంచలేదన్నారు.

స్థానిక సంస్థలకు జవసత్వాలు : చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు తముళ్లకు దిశానిర్దేశం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే 6 ప్రాంతీయ సదస్సులను బాబు ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖలో జరిగిన మొదటి ప్రాంతీయ సదస్సులో ఆయన పార్టీ కార్యకర్తలకు పంచాయితీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వివరించారు. అంతేకాకుండా ఈ వేదిక నుండే అధికార కాంగ్రెస్ ను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్థను భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించే దమ్ము కాంగ్రెస్ కు లేదని.. కాంగ్రెస్ పాలనలో… ఇలాంటివి ఎల్లప్పుడూ వుండేవేనని ఎద్దేవా చేశారు.

తెదేపా వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానిక పాలనను ఏర్పాటు చేసినప్పటి నుంచి పంచాయితీల అభివృద్ధికి కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీ వ్యవస్థను ఒక క్రమపద్దతిలో అభివృద్ధి చేస్తూ.. గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు సర్పంచ్ లకు అవకాశం కల్పించామని బాబు పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ పరిపాలనలో.. కాంగ్రెస్ కార్యకర్తలే కమీషన్లతో గ్రామాల అభివృద్ధికి అడ్డుగోడలా తయారయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందేందుకు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని బాబు కార్యకర్తలకు సూచించారు.తెలుగుతమ్ముళ్లు (కార్యకర్తలు) తెలుగుదేశానికి ఏకైక ఆస్తి అని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి వారే పాటుపడతారని చంద్రబాబు అన్నారు. ప్రాంతీయ సదస్సులలో అధినేత తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేస్తుండంతో.. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాలను తెదేపా గెలుచుకుంటుందనే ఆశాభావాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

స్థానికంగా విజృంభించండి : బాబు

నగరంలోని ఈడ్పుగల్లులో టీడీపీ రెండో ప్రాంతీయ సదస్సు గురువారం ఉదయం ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా, గుంటూరు, ప్రశాకం, పగో జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

విజయవాడలో టీడీపీ ప్రాంతీయ సదస్సు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోని లాలాచెరువు సెంటర్ వద్ద నేతలతో ముచ్చటించారు. గురువారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో వెళ్తున్న చంద్రబాబుకు రాజమండ్రిలో నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలతో ముచ్చటించిన బాబు స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

రాజమండ్రిలో నేతలతో ముచ్చటించిన చంద్రబాబు


చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోని లాలాచెరువు సెంటర్ వద్ద

పంచాయితీ ఎన్నికల్లో మంచి నేతను ఎన్నుకుంటేనే పంచాయితీల రూపురేఖలు మారుతాయని, ఆదర్శగ్రామాలుగా అభివృద్ధి చెందుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం ఉదయం జిల్లాలో జరిగిన టీడీపీ రెండో ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాబు నేతలనుద్దేశించి ప్రసంగించారు. అవినీతిపరులను గ్రామాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే టీడీపీ పనిచేస్తోందని తెలిపారు. పంచాయితీలను బలోపేతం చేయడానికే ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

పంచాయితీలను బలోపేతం చేయడానికే ప్రాంతీయ సదస్సులు : చంద్రబాబు