January 29, 2013

పాదయాత్రకు బ్రేక్ ఇవ్వటంతో బహుదూరపు బాటసారి మరో రెండు రోజులు పరిటాల వద్ద బస్సులోనే గడపనున్నారు. హైదరాబాదు నుంచి వైద్య పరీక్షల నివేదికలు సోమవారం సాయంత్రం అందగానే పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. గ్రీన్‌వేలో బస చేసిన చంద్రబాబు శిబిరం లోపలికి పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు అనుమతించటం లేదు. సోమవారం బాబును అతికొద్ది మంది నాయకులు మాత్రమే కలిసి మాట్లాడారు.ఉమా ప్రత్యేక పూజలు చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు పరిటాల ఆంజనేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో టీడీపీ నేతలు, మాగంటి పుల్లారావు, డాక్టర్, వీరాస్వామి, శ్రీనివాస్ ప్రసాద్ , బి. సూర్యప్రకాష్, గుత్తా రమేష్ తదితరులు పొల్గొన్నారు.

స్వామి ప్రసాదాన్ని బాబుకు అందచేశారు. అక్టోబర్ రెండున ప్రారంభించిన పాదయాత్ర ఈనెల 26కు 117 రోజులు పూర్తైంది. ఆరోజున చారిత్రక ప్రసిద్ధిచెందిన పరిటాల గ్రామంలో కేశినేని నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 117 అడుగుల పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. వైద్య పరీక్షల నివేదికలు హైదరాబాదు నుంచి సోమవారం సాయంత్రానికి అందాయి. మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. వైద్యుల బృందం తప్పనిసరిగా మూడు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ చంద్రబాబు అంగీకరించ లేదు. ప్రజల కోసం పాదయాత్ర కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్న బాబు కేవలం రెండు రోజులు ఈనెల 29, 30 తేదీలలో విశ్రాంతి తీసుకునేందుకు అంగీకరించారని సాయంత్రం శిబిరం వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు మీడియాకు చెప్పారు.

31 మధ్యాహ్నం నుంచి మైలవరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. కొద్ది రోజులు పాటు రోజుకు ఏడు నుంచి పది కిలోమీటర్లు మాత్రమే నడిచి విశ్రాంతి తీసుకుంటే మంచిదన్న వైద్యుల సూచనను పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి. సోమవారం కూడా బాబు బస్సు నుంచి బయటకు రాలేదు. ఉదయం జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా, స్థానిక శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, పాదయాత్ర విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎంఎల్ఏ పరసా రత్నం, కోగ ంటి బాబు, చంద్రబాబును కల్సి కొద్దిసేపు మాట్లాడారు.

బస్సులోనే బాబు

వైద్యుల సూచనలకు తలొగ్గిన చంద్రబాబు
పది రోజుల విరామానికి మాత్రం ససేమిరా

చంద్రబాబు పాదయాత్రకు మరో రెండు రోజు లు విరామం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆయన యాత్రను పునఃప్రారంభిస్తారు. కాలినొప్పి తీవ్రంగా బాధిస్తుండటం, నడుంనొప్పి, గొంతు సమస్య వేధిస్తున్న నేపథ్యంలో రెండు రోజులుగా చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. కంచికచర్ల మండలం పరిటాల వద్ద క్యాంపులో ప్రస్తుతం ఆయన బస చేశారు.

బాబు వైద్య పరీక్ష నివేదికలను పరిశీలించిన వైద్యులు, 8 నుంచి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటేనే సాధారణ స్థితికి వస్తారని తేల్చిచెప్పారు. చక్కెర శాతం పెరగడం, ఎడమ కాలు చిటికెన వేలు గా యం ఇంకా నొప్పి కలిగించటం, మడమ నొప్పిగా ఉండటంతో విశ్రాంతి తప్పనిసరి అని తేల్చారు.

దీనిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, చంద్రబాబు కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు. డాక్టర్ల సల హా మేరకు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అయితే, అన్ని రోజుల విశ్రాంతికి చంద్రబాబుకు ఒ ప్పుకోలేదు. 2 రోజులు విశ్రాంతి సరిపోతుందని, గురువారం నుంచి యాత్రను కొనసాగిస్తానని సర్దిచెప్పారు. ఈ విషయాన్ని గరికపాటి విలేకరులకు వెల్లడించారు.

గురువారం నుంచి యాత్ర పునఃప్రారంభం

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబును రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యుల సూచన మేరకు ఈనెల 31 నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 117 రోజుల పాటు పాదాయాత్ర చేసిన చంద్రబాబు కాలి నొప్పితో బాధపడుతున్నారు. బాబుకు వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు 8 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే దీనికి అంగీకరించిన బాబు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.

చంద్రబాబు పాదయాత్రకు రెండు రోజుల విరామం