March 20, 2013

పోలవరం రావాలి

*  డెల్టా ఆధునీకరణ

*   క్రాప్ హాలిడే దుస్థితి రానివ్వం

*   రెండు పంటలకూ సమృద్ధిగా నీరిస్తాం

   పామాయిల్‌కు సరైన మద్దతు ధర కల్పిస్తాం

కొబ్బరి పండించే రైతులకు ప్రోత్సాహకాలిస్తాం.

కోల్డ్ స్టోరేజిలు నిర్మిస్తాం.

చేపలు, రొయ్యలకు పరిశోధనా కేంద్రం ఏర్పాటు.

కొల్లేరు కాంటూరు ప్లస్ ఐదు నుంచి ప్లస్ మూడుకు పరిమితం చేస్తాం

జాతీయ రహదారిని ఆరు లైన్ల విస్తరణ

*  ఒంగోలు-నరసాపురం వరకు కోస్టల్ రోడ్లు ఏర్పాటు

కత్తిపూడి- ఒంగోలు వరకు నాలుగు లైన్ల రోడ్డు

అన్ని పంట కాలువల ఆధునికీకరణ

రైల్వే ప్రాజెక్టులకు అనుమతి సాధన

ఏలూరు-భీమవరంలో పారిశ్రామికవాడలు

ధవళేశ్వరం ఆనకట్ట ఆధునికీకరణ

అసంఘటిత కార్మికులకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

చంద్రబాబు డిక్లరేషన్ వివరాలివీ...

ఏలూరు:'జిల్లాలో అద్భుతాలు చేసి చూపిస్తాం.. ఈ జిల్లా మనుగడ కోసం మా పార్టీ అన్ని విధాలా కట్టుబడుతుంది.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ చేసి చూపిస్తాం.. మీ చిరునవ్వే మాకు దీవెనలు.. అందుకే మేమేమి చేయబోతున్నామో ముందుగానే ప్రకటిస్తున్నాం' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఒక డిక్లరేషన్‌ను ప్రకటించారు.

ఈ డిక్లరేషన్‌లో వివిధ అంశాలను స్పష్టంగా ప్రస్తావించారు. పోలవరం దగ్గర నుంచి కొల్లేరు దాకా, రోడ్లు విస్తరణ మొదలుకుని రైల్వే లైన్ల విస్తరణ వరకు అనేక కీలక అంశాలను ఈ డిక్లరేషన్‌లో పొందుపరిచి ఆ మేరకు బుధవారం కొవ్వూరు బస్టాండ్ సెంటర్‌లో జరిగిన సభలో ప్రకటించారు.

అద్భుతాలు చూపుతాం : బాబు

నిడదవోలు: జిల్లా వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీలో కాంగ్రెస్, టీడీపీల నుం చి వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారని ఆ పార్టీకి చెందిన పలువు రు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. బుధవారం స్థానికంగా ఆ పార్టీ సమావేశం జక్కంశెట్టి బ్రదర్స్ అధ్యక్షతన జరిగింది. పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అధిష్ఠానం ప్రకటించిన నియోజకవర్గ సమన్వయ కర్తల నియామకాల్లో సామాజిక న్యా యాన్ని తుంగలో తొక్కారని ధ్వజ మెత్తారు. ఈ విషయమై పార్టీ అధినేత ను నేరుగా కలసి వివరిస్తామన్నారు.

జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేద, మ«ధ్య తరగతి వారికి అవకాశం లేకుం డా పోయిందని ఆవేదన చెందారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి ఖాదర్, నర్సాపురం నియోజక వర్గానికి చెందిన మైలా వీర్రాజు, ఏలూరు నగర మాజీ కన్వీనర్ బొద్దా ని శ్రీనివాస్, ఆచంటకు చెందిన వైట్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎస్‌సి సెల్ సభ్యుడు ముప్పిడి విజయారావు తదితరులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభావా లకు అనుగుణంగా పార్టీని నడిపించే వ్యక్తులకు సమన్వయకర్తల బాధ్యత ను అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తణుకు నియోజకవర్గానికి చెందిన విడివాడ రామచంద్రరావు మాట్లాడు తూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమ న్నారు. ఈ నెల 23న ఏలూరులో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ అసం తృప్త నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమవేశాన్ని నిర్వహిం చి సమావేశ తీర్మానాలను అధినేత జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళతామన్నారు. కార్యక్రమంలో జక్కంశెట్టి రాకేష్, లాకేష్, ప్రసాద రాజు, గోపాలపురం నియోజక వర్గానికి చెందిన పడమటి బుచ్చి బాబు, తణుకు నియోజకవర్గానికి చెందిన తెలకం కనకలింగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించారు

టీటీడీపీ ఎమ్మెల్యేల నిర్ణయం

హైదరాబాద్ : సడక్ బంద్‌కు మద్దతివ్వాలని తమను ఎవరైనా కోరితే అప్పుడు దాని గురించి ఆలోచించాలని టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో టీడీపీ జడ్చర్ల ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఎదురుపడ్డారు. సడక్‌బంద్‌కు మద్దతు ఇవ్వచ్చు కదా అని ఈటెల జైపాల్‌ను అడిగారు. తమ పార్టీని టీఆర్ఎస్ గానీ, జేఏసీ గానీ ఇంతవరకు అడిగిన పాపాన పోలేదని, ఎవరూ అడగకుండా ఎలా ఇస్తామని జైపాల్ ప్రశ్నించారు. 'ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా' అని ఈటెల అన్నారు.

మా వాళ్లతో మాట్లాడి చెబుతానని జైపాల్ ఆయనకు చెప్పారు. తర్వాత జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో జైపాల్ ఈ సంభాషణను మిగిలిన ఎమ్మెల్యేలకు వివరించారు. 'ఎదురు పడినప్పుడు మాట వరసకు ఈటెల అడిగినంత మాత్రాన మనం ఎలా మద్దతిస్తాం? జేఏసీ నుంచో లేకపోతే బంద్ చేస్తున్న పార్టీల నుంచో ఒక లేఖ వచ్చినా స్పందించేవాళ్లం. ఎవరైనా అధికారికంగా కోరితే అప్పుడు ఆలోచిద్దాం' అని టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు బదులిచ్చారు. దానికి తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలంతా మద్దతిచ్చారు.

అడిగితే ఆలోచిద్దాం

ఆయన ఇక్కడ పుట్టలేదు. ఈ మట్టితో బం«ధం లేదు. మన జాతివాడు కూడా కాదు. కానీ... మీ కన్నా, నాకన్నా ఎక్కువగా తెలుగోడి గుండెలో గుడి కట్టుకున్నాడు. విశ్వ మానవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. రాజమండ్రి బ్రిడ్జిపై నడుస్తూ దూరంగా ధవళేశ్వరం బ్యారేజీని చూసినప్పుడు కలిగిన భావమిది. ఒక ముద్ద అన్నం పెట్టినవాడినే మనం మరిచిపోలేం. అలాంటిది.. ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా రూపుదిద్దిన సర్ ఆర్థర్ కాటన్‌ని ఎవరు మరిచిపోతారు! ఒకనాడు కరువులతో, వలసలతో తల్లడిల్లిన గోదావరి జిల్లాల్లోకి జలరాశు లను తరలించిన ఆ బ్రిటిష్ అధికారి పేరు.. ఈ రాష్ట్రం ఉన్నంతవరకు చిరస్మరణీయమే!

కాటన్ స్మరణతో రాజమండ్రిలో అడుగుపెట్టాను. ఠీవిగా నిలిచిన వీరేశలింగం పంతులు విగ్రహాన్ని దారిలో చూసి స్ఫూర్తి పొందాను. ఆయన ధీరత్వమే తెలుగు జాతికి వరం. ఆదికవి నన్నయ తిరిగిన ఈ నేలపై అడుగులు వేయడం ఒకరకమైన ఉత్సాహాన్ని నాలో కలిగించింది. ఎదురుగా వచ్చిన వస్త్ర వ్యాపారులను చూసినప్పుడు మరింత సంతోషం కలిగింది. ఈ గడ్డపై మరోసారి వారితో గొంతు కలపగలిగాను. వీరి పట్టుదలను ఎవరైనా అభినందించాల్సిందే. ప్రభుత్వం మాత్రం అరెస్టులు, ఆంక్షలంటూ వేధించుకుతింటోంది. వ్యాట్‌పై నిర్ణయం ఇక ప్రజలదే. వాళ్ల సహకారం లేకుండా ఈ ఉద్యమం ముందుకు పోదు. వ్యాట్‌ను అందరి సమస్యగా గుర్తించినప్పుడే అది సాధ్యం! ఇది రెండువైపులా జరగాల్సిన ప్రయత్నం. అప్పుడిక ఈ ప్రభుత్వానికి చేయడానికేం ఉండదు...తప్పుకోవడం తప్ప!

కాటన్ స్మరణతో రాజమండ్రిలోకి..

అధికారం ఇవ్వండి 6 నెలల్లో గాడిలోకి!
మహనీయుల పక్కన వైఎస్ విగ్రహమా?
కేంద్రంతో సమంగా రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు
'తూర్పు'లో చంద్రబాబు పాదయాత్ర
రాజమండ్రిలో పొంగిన 'జన గోదారి'

 కాకినాడ/ఏలూరు : అధికారం ఇస్తే ఆరు నెలల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ అవినీతి, అసమర్థ, దొంగల, రౌడీల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు టీడీపీని గెలిపించాలని కోరారు. పశ్చిమ గోదావరి నుంచి సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఆయన అడుగుపెట్టారు. రాజమండ్రి బ్రిడ్జి వద్ద బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. వేలాది కార్యకర్తలు, అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా 'జన గోదావరి'ని తలపించింది.

మోటార్ సైకిల్ ర్యాలీలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సమయంలోనే కాకుం డా దీనికిముందు కొవ్వూరులో కూడా కాంగ్రెస్, వైసీపీల తీరును చంద్రబాబు తూర్పారబట్టారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్, ఎన్టీఆర్, వీరేశలింగం విగ్రహాల కూడలివద్ద మాట్లాడారు. "రాష్ట్రంలో గజదొంగలు పడ్డారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు కొడుకు తప్పుల్ని వెనకేసుకొచ్చారు. లక్షల కోట్లు దోచిపెట్టారు. ఆ సొమ్మును రికవరీ చేసి పేదలకు పంచాలి. త్వరలోనే పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ లో కలిసిపోతుంది'' అన్నారు.

కాటన్, వీరేశలింగం, అంబేద్కర్, అల్లూరి, గాంధీ, ఫూలే, ఎన్టీఆర్ వంటి మహనీయుల విగ్రహాలు చూసి వారి మంచిని చెప్పుకుంటాం. కానీ, లక్షల కోట్లు దోచిపెట్టిన వైఎస్ విగ్రహాలు చూపించి రేపు మీ పిల్లలకు ఏం చెప్తారు?'' అని ప్రజలను ప్రశ్నించారు. ఆటో డ్త్రెవర్లకు పదో తరగతిని విద్యార్హతగా నిర్దేశించడం దారుణమన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ఆంక్షను తొలగించంతోపాటు వస్త్ర వ్యాపారులపై వ్యాట్ రద్దు, గీత కార్మికులు, ఆటోడ్త్రెవర్లకు వడ్డీలేని రుణాలు, పేదరిక నిర్మూలనకు అనేక పథకాలు తీసుకువస్తామన్నారు.

రాష్ట్ర ఉద్యోగుల జీతాలనూ కేంద్ర ఉద్యోగుల వేతన స్కేల్‌తో సమానం చేస్తామని హామీ ఇచ్చారు. వ్యాట్ ఎత్తివేయాలన్న వస్త్ర వ్యాపారులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, ఆ పార్టీ నేతలకు ఇకముందు దుస్తులు విక్రయించవద్దని పిలుపునిచ్చారు.

అవినీతి సొమ్ము కక్కించి పేదలకు పంచుతా

అవినీతి గురించి ప్రశ్నిస్తే నిందలా ?
జగన్‌పై మండిపడిన చంద్రబాబు
పశ్చిమ గోదావరి డిక్లరేషన్ ప్రకటన

ఏలూరు : అందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇప్పుడు కిరణ్ సర్కార్, అప్పుడు వై.ఎస్. ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన విరుచుకుపడ్డారు.

చంద్రబాబు నాయుడు తమ పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ ఇన్ని లక్ష ల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే జగన్ వర్గీయులు తమపై బురద చల్లుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉందంటూ, సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా అందరికీ ఉంటుందని, కాని జగన్ పత్రిక మాత్రం తాము ఏదైనా అడిగితే తమను లక్ష్యం చేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నదని ఆయన అన్నారు.

ప.గో జిల్లా డిక్లరేషన్‌ను ప్రకటించిన చంద్రబాబు

వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం జిల్లా డిక్లరేషన్‌ను ప్రకటించారు. గోదావరి కాలువ ఆధునికీకరణ పనులు చేపడతామని తెలిపారు. ఏలూరు, భీమిలిలలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ రహదారి 214ని నాలుగు లైన్లుగా మారుస్తామని ఆయన తెలిపారు.

కొల్లేరును ఐదు కాంటూరు నుంచి మూడు కాంటూరు వరకు తగ్గిస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం నుంచి దవళేవశ్వరం వరకు గోదావరి వెంబడి మరో ప్రధాన కాలువ తవ్విస్తామని ఆయన వెల్లడించారు అసంఘటిత కార్మికుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. ధవళేశ్వరం ఆనకట్టుకు మరమ్మతులు చేపడతామని ఆయన తెలిపారు. జిల్లాలో చేపల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

అప్పుడు వై.ఎస్, ఇప్పుడు కిరణ్ అందరూ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు


పాయకరావుపేట: ఈ నెల 23న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 'పేట' పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్ష్మి ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన పార్టీ విస్తత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణలో బాలకృష్ణ పాల్గొంటున్నారని అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరై ఆయనకు స్వాగతం పలకాలన్నారు. 23న మధ్యాహ్నం మూడు గంటలకు పాల్తేరు పంచాయతీ అంకంపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరిస్తారన్నారు. కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురంలలో కూడా ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం కుమారపురంలో భారీ బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తారని దాడి రత్నాకర్ తెలిపారు.

నియోజకవర్గంలో పార్టీ పేరుతో పదవులు అధిరోహించిన నాయకుడొకరు పార్టీనే విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్ 3న నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశించనున్న చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై స్వాగతం పలకాలని 'దాడి' పిలుపునిచ్చారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయకుమార్, పార్టీ నాయకులు కురందాసు నూకరాజు, బొల్లం బాబ్జి, లాలం కాశీనాయుడు, వేజెర్ల వినోద్‌రాజు, గొర్రెల రాజబాబు, పెదిరెడ్డి చిట్టిబాబు, మజ్జూరి నారాయణరావు, చింతకాయల రాంబాబు, దేవవరపు శివ, పెదిరెడ్డి శ్రీను, కంచి మాణిక్యం, వంకా రమణ, నీలాపు మహేష్‌రెడ్డి, మల్లవరపు వీరభద్రరావు, భజంత్రీల శివ, దేవవరపు వెంకట్రావు, గోసల తాతారావు, నాగం బుల్లిదొర, లెక్కల గోవిందు, జి.శాంతమ్మ, గీసాల పద్మ, కీర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

బాలకృష్ణ పర్యటనకు తరలిరావాలి: దాడి రత్నాకర్

తుని: 'ప్రస్తుతం కీలక సమయం.. సమీపంలోనే ఎన్నికలు.. అందరూ ఐక్యంగా ఉండి పార్టీని గెలిపించుకోవలసిన తరుణం ఆసన్నమయ్యింది.. విభేదాలు వీడండి.. సమన్వయంతో పని చేయండి.'' అని విశాఖ జిల్లా టీడీపీ నాయకులతో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం యనమలను కలుసుకునేందుకు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాడి రత్నాకర్, చింతకాయల రాంబాబు, విశాఖడెయిరీ పాలక మండలి సభ్యులు రెడ్డి రామకృష్ణ, కురందాసు నూకరాజు, బొల్లం బాబ్జి, పిర్ల రాంబాబు, విజయకుమార్ తదితరులు తుని విచ్చేశారు.

ఇటీవల బండారు సత్యనారాయణమూర్తి తదితరుల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని హితవు పలికారు. తదుపరి చంద్రబాబు వస్తున్నా మీకోసం.. పాదయాత్రపై చర్చించారు. ముందుగా అనుకున్నట్లు పాయకరావుపేట నియోజకవర్గం మీదుగా విశాఖ జిల్లాలో ప్రవేశించే పర్యటనను రద్దు చేయాలని నిర్ణయించారు.

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మీదుగా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రవేశించేలా చంద్రబాబు పర్యటనను ఖరారు చేశారు. అందుకనుగుణంగా ఏర్పాట్లకు పూనుకున్నారు. ఈ సమవేశంలో యనమల కృష్ణుడు, యినుగంటి సత్యనారాయణ, మేకా రామ్మూర్తి (చిన్నా), గోపిశెట్టి ప్రసాదరావు, సూరంపూడి అప్పారావు, కూరపాటి రఘు, యనమల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

విభేదాలు వీడండి..సమన్వయంతో పనిచేయండి: యనమల

మోండా : వ్యాట్‌ను తగ్గించకపోతే సర్కారు బట్టలు విప్పుతామని టీడీపీ నేతలు అన్నారు. వస్త్ర వ్యాపార రంగం పై ప్రభుత్వం విధించిన 5 శాతం వ్యాట్‌ను రద్దుచేయాలని డిమాండ్ చే స్తూ వ్యాపారులు తొమ్మిది రోజులుగా చేస్తున్న నిరవధిక బంద్‌కు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల బృందం మంగళవారం సికింద్రాబాద్‌లో వ్యాపారులు చేపట్టిన నిరాహారదీక్షలను సందర్శించింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. వ్యాట్‌పై అసెంబ్లీ స మావేశాల్లో చర్చించాలని టీడీపీ నిర్ణయించిందన్నా రు. అనంతరం ఆ పార్టీ నాయకులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెం కటేశ్వరరావు, పీఎల్.శ్రీనివాస్ మాట్లాడారు.

వ్యాట్ ఎత్తేయకపోతే సర్కార్ బట్టలు విప్పుతాం: టీడీపీ

కాకినాడ : క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకునే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర బుధవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారు. నగరంలో పర్యటించి ఆ రోజు అక్కడే బస చేస్తారు. 21న రాజమండ్రి నుంచి బయలుదేరి కడియం వరకు నడవనున్నారు. 21వ తేదీ రాత్రి కడియంలో విశ్రాంతి తీసుకుంటారు.

కడియం నుంచి మండపేట, అక్కడి నుంచి అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ నగరం పిఠాపురం, కత్తిపూడి మీదుగా తుని వరకు జిల్లాలో మొత్తం 13 రోజులపాటు చంద్రబాబు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని తలపెట్టారు. ఆ రోజు చంద్రబాబు యాత్ర పిఠాపురం చేరుకుంటుంది. పార్టీ ఆవిర్భవించి 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో 31 అడుగుల పైలాన్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 29న చంద్రబాబు ఈ పైలాన్‌ని ఆవిష్కరిస్తారు.

రైతులు, చేతివృత్తులు, కార్మికుల సమస్యలపై దృష్టి చంద్రబాబు పాదయాత్రలో ముఖ్యంగా రైతుల సమస్యలతో పాటు... చేనేత, గీత కార్మికులు, ఇతర చేతివృత్తుల వారి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్యుత్ కోతలతో వందలాది పరిశ్రమలు మూలనపడి... వేలాది మంది కార్మికులకు పనిలేకుండా పోయింది. వీటిపైనా చంద్రబాబు దృష్టి సారించనున్నారు.

సంక్షేమ పథకాల అక్రమాలపైనా.. జిల్లాలో వృద్ధాప్య, వికలాంగుల, వితంతువుల పింఛన్ల పంపిణీ నుంచి డ్వాక్రా రుణాల మంజూరు, ఉపాధి హామీ అక్రమాలపైనా చంద్రబాబు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారు. ఆయా వర్గాల ప్రజలతో మమేకమై.. వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించీ ఆరా తీయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు జిల్లాలోనే బాబు పాదయాత్ర కొనసాగనుంది. రోజూ 15 కిలోమీటర్ల మేర నడిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రేపటి నుంచి రాజమండ్రి చంద్రబాబు పాదయాత్ర


రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర బుధవారం రాజమండ్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం విలేఖరులకు తెలిపారు. చంద్రబాబుకు సాయంత్రం 4.30 గంటలకు రోడ్ కం రైల్వే వంతెన మీద టీడీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలకనున్నారు. చంద్రబాబునాయుడు జిల్లాలోకి ప్రవేశించగానే రోడ్ కం రైల్వే వంతెన సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ నిర్వహిస్తారు.

డీలక్స్ సెంటర్‌లో ఎంబీసీ కులస్తులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి చాంబర్ ఆఫ్ కామర్స్ భవనానికి చేరుకుని వర్తకులతో మాట్లాడతారు. కోటగుమ్మం సెంటర్‌లో వస్త్ర వ్యాపారులతో మమేకమై వస్త్రాలను వ్యాట్ పరిధిలోకి తేవడంతో పాటు నిత్యావసర వస్తువుగా పరిగణించడం వల్ల వ్యాపారులకు ఎదురవుతున్న సమస్యల గురించి చర్చిస్తారు. వారి వాదన, బాధలను వింటారు. తర్వాత చర్చిపేట రైల్వే బ్రిడ్జి అప్సర «థియేటర్ రోడ్డులో మేదర కులస్తులతో ముఖాముఖి నిర్వహించి, చర్చిపేటలోని మాదిగల గృహాలను పరిశీలిస్తారు. జాంపేట అజాద్ చౌక్‌లో ముస్లిం మైనార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి దేవీచౌక్, నాగదేవి «థియేటర్ సెంటరు మీదుగా నటరాజ్ «థియేటర్ సెంటర్‌కు చేరుకుని అక్కడ అంబేద్కర్ హాలులో మాలలతో సమావేశం నిర్వహిస్తారు. మూలగొయ్యి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీసీ వర్గాలు, ఇతర ప్రజల నుంచి వివిధ సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరిస్తారు. అక్కడి నుంచి సీతంపేట మీదగా లలితానగర్ చేరుకుని సీజీటీఎం కళాశాలలో రాత్రి బస చేస్తారు. తొలి రోజు మొత్తం 4.8 కిలోమీటర్ల మేర నడుస్తారు. పాదయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి నగరమంతా పసుపుమయం అయిపోయింది. విలేఖరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ, రాజమండ్రి నగర శాఖ అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

వస్తున్నా మీకోసం

చంద్రబాబు పాదయాత్రకు టీడీపీ నేతలు స్వాగత ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు రోడ్‌కమ్ రైలు బ్రిడ్జి వద్దకు చేరుకుని భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలకాలని నేతలు సన్నాహాలు చేసుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌ఛార్జి మురళీమోహన్, పాలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా అధ్యక్షుడు చినరాజప్ప, ఎమ్మెల్యేలు చందన రమేష్, పెందుర్తి వెంకటేష్, పర్వత చిట్టిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, నాయకులు గన్ని కృష్ణ, వర్మ తదితరులు చంద్రబాబుకు స్వాగతం చెప్పనున్నారు.

స్వాగత ఏర్పాట్లలో నేతలు

రోజూ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో పార్టీ స్థితి, గతులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సమీక్ష నిర్వహించి..ఆ తర్వాత కొంతసేపు భోజన విరామం.. విశ్రాంతి ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రలో భాగం గా మధ్యలో ముఖ్య కూడళ్లలో ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, రైతులు, వివిధ వృత్తుల వారితో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడతారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు.

రోజూ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్ష

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర నేటి నుంచి జిల్లాలో జరగనుంది. 'వస్తున్నా మీ కోసం' పేరుతో చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర 169 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు 2 వేల 434 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 170వ రోజు పాదయాత్రతో జిల్లాలో అడుగుపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కొవ్వూరు నుంచి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీదుగా చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడతారు.

ఆయా వర్గాలు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఎంబీసీ, మాల, మాదిగ, మేదర, బీసీ వర్గాల సమావేశాలలో ఆయన పాల్గొంటారు. రెండో రోజు గురువారం కూడా రాజమండ్రిలోనే యాత్ర సాగుతుంది. మూడో రోజు కడియం వరకు సాగుతుంది. అక్కడ నుంచి మండపేట, అనపర్తి, పెదపూడి, పెద్దాడల మీదుగా సాగుతూ కాకినాడ రూరల్ గ్రామాల మీదుగా కాకినాడ చేరుకుంటారు. అక్కడ నుంచి రమణయ్యపేట, అచ్చంపేటల మీదుగా పిఠాపురం చేరుకుంటారు. ఈనెల 29 నాటికి చంద్రబాబు పాదయాత్ర పిఠాపురం చేరుకునేలా ప్లాన్ చేశారు. అదే విధంగా 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడ నిర్వహించనున్నారు. టీడీపీ ఆవిర్భవించి ముప్పయ్ ఒక్క సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 31 అడుగుల పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా దీన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.

చంద్రన్నకు పసుసు తోరణాల ... స్వాగతం

హైదరాబాద్ : బెనిటా సంస్థ ఉద్యోగి వీరభద్రారెడ్డి మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం టీడీపీ నేతలు దేవినేని ఉమా, శ్రీరాం తాతయ్య మీడియాతో మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కేసు దర్యాప్తులో పురోగతి లేదన్నారు. వీరభద్రారెడ్డి మృతి వెనుక బ్రదర్ అనిల్ హస్తం ఉందని వారు ఆరోపించారు. అనిల్ ఆస్తులపైనా సీబీఐ విచారణ జరపాలని నేతలు డిమాండ్ చేశారు.

సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల వినతి పత్రం

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 26న బాబ్లీపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

సీఎంను కలిసిన ఎర్రబెల్లి

హైదరాబాద్: వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం గన్‌పార్క్ వద్ద ఆందోళన దిగారు. వస్త్రాలపై వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వస్త్ర వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ నేత దేవినేని ఉమా తెలిపారు.

గన్‌పార్క్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన