September 18, 2013


రాష్ట్రాన్ని దోచుకున్నది వైఎస్ కుటుంబసభ్యులేనని, సిగ్గులేకుండా నాయకులుగా చెలామణి అవుతున్నారని టీడీనీ విమర్శించింది. ఇలాంటి వ్యక్తులను ప్రజలు తరిమికొట్టాలని టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్శింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకమునుపు లేని భవంతులు, ఇప్పుడు ఎలా వచ్చాయో జగన్ సోదరి షర్మిలా చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జగన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఆరోపించింది.

బుధవారం సాయంత్రం టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గీతారెడ్డిని బర్త్‌రఫ్ చేయాలని కోరామని అన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో గతంలో ఉన్న నిబంధనలనే పాటిస్తామని గవర్నర్ చెప్పారని వారన్నారు. షర్మిలా, ఆమె భర్త బ్రదర్ అనీల్‌కుమార్‌కు సంబంధించిన కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది.
courtesy: andhrajyothy

. షర్మిలా, ఆమె భర్త బ్రదర్ అనీల్‌కుమార్‌కు సంబంధించిన కంపెనీలపై సీబీఐ విచారణ !

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రెడ్డివారి రాజగోపాలరెడ్డి మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. వ్యవసాయ, రవాణా శాఖల మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, టిడిపిలో ఉన్నంతకాలం క్రియాశీలంగా వ్యవహరించి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం రైతులకు, కడప జిల్లా ప్రజలకు తీరనిదని చంద్రబాబు అన్నారు.


రాజగోపాలరెడ్డి మృతికి చంద్రబాబు సంతాపం