July 3, 2013

ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించి సురక్షితంగా రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడుని బీసీ సంఘాల ప్రతినిధులు కలుసుకుని ఘనంగా సన్మానించారు. చంద్రబాబును సన్మానిం చిన వారిలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం, జీఎస్‌ బుగ్గారా వు, వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి ఏడుకొం డలు, రజక సంఘం అధ్యక్షుడు రామారావు, నాయిబ్రహ్మణ సంఘం అధ్యక్షు డు నరేంద్ర, కృష్ణ బలిజ అధ్యక్షుడు శివరాఘవయ్య తదితరులు ఉన్నారు.

బాబును సన్మానించిన బీసీ సంఘనేతలు


  ఖమ్మం లో పేదలకు ఇళ్ల స్థలాలు చూపాలంటూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన నిరవధిక దీక్షకు ప్రభుత్వం దిగివచ్చింది. మంగళవారం ఖమ్మం ఆర్‌డీవో సంజీవరెడ్డి, సర్వే ఎడీ ప్రభాకర్, తహసీల్దార్ అశోక్‌చక్రవర్తి దీక్ష వేదిక వద్దకు వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. పట్టాలిచ్చిన 3404 మందికి దశలవారీగా స్థలాలు చూపించాలని, ముందుగా కొందరికైనా స్థలాలు చూపిస్తేనే దీక్ష విరమిస్తానని తుమ్మల తేల్చి చెప్పారు. దీంతో అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈలోగా ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ బాలసాని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాలతోపాటు, సీపీఎం, సీపీఐ నేతలు మంగళవారం దీక్షా శిబిరం వద్దకు చేరుకుని పట్టణ దిగ్బంధానికి పిలుపునిచ్చారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చింది. తొలి పదిమంది లబ్ధిదారులకు రఘునాధపాలెం 218 సర్వే వద్ద స్థలాలు చూపించారు. మరో ఇరవై రోజుల్లోగా మిగిలిన వారికి స్థలాలు చూపిస్తామని హామీ ఇచ్చిన ఆర్డీవో సంజీవరెడ్డి తుమ్మలకు పండ్లరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఫలించిన తుమ్మల దీక్ష..పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు ప్రారంభం

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి టీడీపీ సమాయత్తం అవుతోంది. పార్టీ శ్రేణులను ఈ దిశగా సంసిద్ధం చేసే నిమిత్తం ఆ పార్టీ బుధవారం నుంచి ఐదు చోట్ల ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తోంది. మొదటి సదస్సు బుధవారం విశాఖ నగరంలో జరగనుంది. నాలుగో తేదీన విజయవాడ, ఐదో తేదీన తిరుపతి, ఆరో తేదీన హైదరాబాద్, ఏడో తేదీన వరంగల్ నగరాల్లో జరగనున్నాయి. వీటన్నింటికి చంద్రబాబు హాజరవుతారు. ఒక్కో ప్రాంతీయ సదస్సుకు నాలుగైదు జిల్లాల పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా పార్టీ శ్రేణులకు ఈ ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నది టీడీపీ వ్యూహం. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడంతోపాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ ప్రాంతీయ సదస్సులు పెడుతున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ అన్నారు.

విశాఖ సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ,తూ ర్పు గోదావరి జిల్లాల నుంచి ఇరవై వేల మంది ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 4న జరిగే సదస్సుకు విజయవాడలోనిఈడుపుగల్లు వేదికకానుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 20 వేల మంది కార్యకర్తలు పాల్గొంటారని అంచనా. 5వతేదీ తిరుపతిలో జరిగే సదస్సుకు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూ రు జిల్లాల నుంచి 20 వేల మంది హజరు అవుతారు. వరంగల్‌లో ఈ నెల 7న జరిగే టీడీపీ ప్రాంతీయ సభ నిర్వహణకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 25 వేల మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరవుతారని ఎర్రబెల్లి చెప్పారు.

నేటి నుంచి టీడీపీ ప్రాంతీయ సదస్సులు

విశాఖ : పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ తొలి ప్రాంతీయ సదస్సు బుధవారం విశాఖలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికలను సకాలంలో నిర్వహించలేదని విమర్శించారు. టీడీపీ హయాంలోనే పంచాయతీలను బలోపేతం చేశామని ఆయన చెప్పారు. తమ హయాంలో అర్హులకు పింఛన్లు అందితే, కాంగ్రెస్‌ హయంలో అనర్హులకు మంజూరు చేశారని ఆరోపించారు. సర్పంచ్‌ అధికారాలను, విధులను ఇతరులకు బదిలీ చేసి పంచాయతీ సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు పూర్తి అధికారం ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం పేరుతో కాంగ్రెస్‌ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ , విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి పార్టీ నేతలు అధిక సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారు.

పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలి : చంద్రబాబు