March 15, 2013

-అవిశ్వాసం పెట్టే సత్తా మాదే
-ఒక్కటి బెయల్‌పార్టీ..మరొకరి బ్లాక్‌మెయిల్ పార్టీ
-అవి తీర్మానం పెడితే మద్దతు ఇవ్వాలా?
-పొత్తులు లేవు.. అంతా ధర్మపోరాటమే:బాబు స్పష్టీకరణ
-ఒక్కో కార్యకర్త ఒక్కో పత్రిక, రేడియో కావాలని పిలుపు

ఏలూరు: "నీచమైన రాజకీయాలను చేస్తూ పశువుల్లా ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించే వాళ్లకు తెలుగుదేశం పార్టీ సహకరించదు..సహకరించబోదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే సత్తా ఒక్క టీడీపీకి మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం వద్ద శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించి 14.3 కిలోమీటర్లు నడిచారు. పైడిపర్రులో రాత్రి బస చేశారు. వేల్పూరు సెంటర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. "బెయిల్ కోసం కొందరు.. బ్లాక్‌మెయిల్ కోసం మరికొందరు.. అవిశ్వాస తీర్మానం పెట్టారు. అలాంటి తీర్మానానికి మద్దతు ఇవ్వాలా? జగన్ బెయిల్ కోసం ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి జైలు పార్టీ(వైసీపీ) ప్రయత్నిస్తుండగా, బ్లాక్‌మెయిల్ పార్టీ(టీఆర్ఎస్) ఆ పార్టీతో కుమ్మక్కైంది'' అన్నారు.

"చెన్నారెడ్డి, రాజశేఖరరెడ్డి, కిరికిరి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలపై మేమేకదా అవిశ్వాసం పెట్టింది? అసలు సమస్యలను గాలికి వదిలేసి దోపిడీ దారుగా మారే వారితో మేమెందుకు చేతులు కలపాలి?''అని నిలదీశారు. అసెంబ్లీలో తమ పార్టీ నేతల తీరుపై మహాలక్ష్మి చెరువు వద్ద జరిగిన సభలో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. "మా వాళ్లు అసెంబ్లీలో ఉతికి ఆరేశారు. తోక పార్టీలు పెట్టిన అవిశ్వాసం వెనుక దాగి ఉన్న వ్యవహారాలను ఎండగట్టారు. అవినీతితో ర్రాష్టాన్ని నాశనం చేసిన పిల్ల కాంగ్రెస్‌కు అవిశ్వాసం పెట్టే అర్హత ఎక్కడిది? దద్దమ్మలు, పనికిరానివాళ్లు ఈ ర్రాష్టాన్ని ఏలుతున్నారు'' అని దుయ్యబట్టారు. అంతకుముందు కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు.

"కాంగ్రెస్‌తో మేము సహకరిస్తున్నామని పిల్ల కాంగ్రెస్ ఎప్పుడూ పదే పదే చెబుతోంది. ఆ ఖర్మ మాకు పట్టలేదు. ఇలాంటి పార్టీలు ఎన్నో వచ్చాయి. పోయాయి. అవన్నీ కాంగ్రెస్‌లో కలిసేవే. కాంగ్రెస్‌ను 30 ఏళ్లుగా ఢీకొంటున్నాం. ఆ సత్తా మాకే ఉంది. ఇది ఎన్టీఆర్ ఇచ్చిన ధైర్యం'' అని అక్కడ శ్రేణులను ఉత్సాహపరిచారు. టీఆర్ఎస్ నాయకుడు ఆరు నెలలు కుంభకర్ణుడిలా పడుకుని లేస్తాడని ఎద్దేవా చేశారు. ర్రాష్టంలో 42 మంది తెలుగుదేశం ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పడానికి వీలవుతుందని నిర్దేశించారు. "మనకు పేపర్లు లేవు, మీరే ఒక ఆలిండియా రేడియోగా మారాలి. మీరే ఒక వార్తా పత్రిక కావాలి. ఇంటింటికి వెళ్లి పార్టీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు చెప్పాలి'' అని సూచించారు.

నీచ రాజకీయాలకు మేం సహకరించం!

దుర్మార్గులు.. తోడు దొంగలు!
-వైఎస్‌పై, వైసీపీ, కాంగ్రెస్ నేతలపై మోత్కుపల్లి ఫైర్
-రాష్ట్ర నాశనానికి వైఎస్సే కారణం
-వైఎస్‌కు బలి పశువుగా మారిన శ్రీలక్ష్మి

హైదరాబాద్: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా 'దుర్మార్గులు.. తోడు దొంగలు' అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసీపీ, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చెలరేగిపోయారు. "రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం వైఎస్ కాదా? సీఎం పదవి ఇవ్వనందునే జగన్ పార్టీ పెట్టడం వాస్తవం కాదా?'' అని ప్రశ్నించారు. 'ఈ దుర్మార్గులు.. దోపిడీదారులు' అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవిశ్వాసంపై చర్చ జరపకుండా తమను దుర్మార్గులంటూ వ్యాఖ్యానించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో.. 'వీళ్లలో రూ.100 కోట్లకు తక్కువ సంపాదించిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? ప్రజల సొమ్ము దోపిడీ చేసిన ఈ 'దుర్మార్గులు' పెట్టిన అవిశ్వాసానికి మేం మద్దతు ఇవ్వాలా?' అని ధ్వజమెత్తారు. "సీబీఐ విచారణలో మీరు దొంగలని తేలింది.

అందుకే జైల్లో పెట్టారు. మమ్మల్ని ఎలా తప్పుపడతారు. వైఎస్ బతికి ఉంటే ఇప్పటికి జైల్లో ఉండేవాడు. సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరు ఉండబట్టే మాట్లాడుతున్నాం. వైఎస్ పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టినందుకే అప్పట్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. లోటస్‌పాండ్‌లో భవన నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సీబీఐ దర్యాప్తు నివేదికను చదివితే వీరికెందుకు కడుపు మంట? రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలకు కారణం వైఎస్సే. ఒకడు సంపదను సంపాదించుకుని ఏమి తీసుకుపోయాడు (బైబిల్‌ను ఉటంకిస్తూ)? రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్లు నిలువు దోపిడీ చేశారు.

విజయమ్మకు కడుపు కోత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా కొడుకుని బయటకు తెచ్చుకోవాలని, కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇతరులు రాసిచ్చిన ప్రసంగ పాఠం చదివేందుకు విజయలక్ష్మి పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధేస్తోంది. అమాయకురాలిని సభకు తీసుకొచ్చి బాధ పెడుతున్నారు. మా సోదరి శ్రీలక్ష్మి వైఎస్ బలిపశువుగా మారింది. ఆమె ఈ స్థితిలో ఉండడానికి వైఎస్సే కారణం. వైఎస్ దుర్మార్గుడు'' అన్నారు. అవిశ్వాసం పెట్టేందుకు తమ పార్టీ అధినేత జైల్లో లేరని ఎద్దేవా చేశారు. ఓబుళాపురం మైనింగ్‌లో కాపు రామచంద్రారెడ్డి వాటాదారుడని, ఆయనా జైలుకు వెళ్లే జాబితాలో ఉన్నారని చెప్పారు.

-సీఎం పదవి ఆవ్వనందునే జగన్ పార్టీ పెట్టాడు

చంద్రబాబు తన పాదయాత్రలో భాగంగా శుక్రవారం కార్యకర్తల సమావేశంలోను, బహిరంగసభల్లోనూ కొన్ని హితోక్తులు చేశారు. మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోయేవాళ్లం. అందుకే బేషజాలు వదిలి సమష్టిగా ఉండండి అని కార్యకర్తలకు హితవు పలికారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు అనునిత్యం విద్యార్థులే. అలా అయితేనే ఎదుగుతారు తప్ప లేదంటే ప్రజల ముందు కుప్పకూలిపోతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఎ ప్పుడైతే అహం వస్తుందో అప్పుడు పతనావస్థ ఖాయమన్నారు. డబ్బు కోసం కక్కుర్తిపడి ఎంతని సంపాదిస్తురో, ఏమి చేసుకుంటారో అంటూ ప్రశ్నించారు.

దుర్యోధనుడు ఒకనాడు విర్రవీగాడు. ఆ తర్వాత ఏమైందో మీకూ తెలుసు, రావణాసురిడిది ఇదే దారి అని చివరకు రాముడే గెలిచాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వెంట పాదయాత్రలో పార్టీ ముఖ్యనేతలంతా జతకలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, వైటీ రాజా, అంగర రామ్మోహన్, మాగంటి బాబు, గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరా జు, చింతమనేని ప్రభాకర్, టీవీ రామారావు, పీతల సుజాత, గంగిరెడ్ల మేఘలాదేవి, పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, గుబ్బల తమ్మయ్య, చి నమిల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

చంద్రబాబు హితోక్తులు...

  ఏలూరు:'రైతులు కష్టాల్లో ఉన్నారు. వాళ్లు సుఖంగా ఉండాలి' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు తెలుగుదేశం పార్టీ ఇక ముందు పూర్తిగా అండగా ఉంటుంది. అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుంది. వారి కన్నీళ్లు తుడవటమే కాదు, సుస్థిరమైన జీవితాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని' ప్రకటించారు. అవినీతి పార్టీలను తరిమివేస్తే తప్ప ర్రాష్టంలో సుస్థిర పరిపాలన, సంక్షేమ పాలన రాదని చెప్పారు.

వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా 165వ రోజైన శుక్రవారం ఆయన ఇరగవరం నుంచి పైడిపర్రు వరకు వివిధ సభల్లోనూ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న దుస్థితిని ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. సుమారు పది కిలోమీటర్ల మేర సాగించిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. తాము పడుతున్న కష్టాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కూడా ఇప్పుడున్న అవినీతి ప్రభుత్వమా కాదా అని ప్రశ్నలు సంధించారు. మీరంతా కష్టా ల్లో ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని వారిని అడిగి తెలుసుకుంటూనే త ల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లపై వాగ్బాణాలు గుప్పించారు. విమర్శలు గు ప్పించారు.

ఇప్పటిదాకా ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని అన్నారు. ఇక సూట్‌కేసు రాజకీయాలకు అలవాటుపడిన వారు ప్రజా సంక్షేమాన్ని, పార్టీ విశ్వాసాలను కుప్పకూల్చి అడ్డదారులు తొక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఆలోచన వీరిలో ఎక్కడా లేదు. డబ్బులు కూడగట్టుకోవడానికి మాత్రం పరుగులుపెడుతున్నారు. ఈ రాజకీయాలను మీరు సమర్థిస్తారా అంటూ ప్రజలపై ప్రశ్న్రాస్తాలు సంధించారు. అడవి పందుల మాదిరిగా దోచుకుతింటున్నారని, అయినా ధర్మం, న్యాయం, నీతి గెలుస్తుందని, ఈ మూడు తమ పార్టీలో ఉన్నాయని చంద్రబాబు ప్రజలకు వివరించారు. విలువలతో కూడిన రాజకీయాలకు మొదటి నుంచి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు.

అలాంటి రాజకీయాలకే మేము కట్టుబడి ఉంటాం అని స్పష్టం చేశారు. సీఎం ఒక చేతకానివాడిగా అభివర్ణించారు. రైతులు కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి ర్రాష్టంలో దాపురించింది. ఇంతకంటే ఘోరం ఏముంటుందని నిలదీశారు. కరెంటు సమస్యలు తీర్చరు, రైతు సమస్యలను పట్టించుకోరు, డ్వాక్రా మహిళలను బెదిరిస్తారు, చదువు సంధ్యలను నాశనం చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కష్టాలే మిగిలాయని దుయ్యబట్టారు. దద్దమ్మలు రాజ్యమేలుతున్న కారణంగానే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'పులివెందులలో ప్రజాస్వామ్యం లేదు, రౌడీస్వామ్యం ఉంది. వైఎస్ కుటుంబంది అంతా అరాచకమే.

అలాంటి వాళ్లు ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారు, ఈ మాటలకు మోసపోవద్దు' అని పిలుపునిచ్చారు. రైతులను కాపాడుకునే బాధ్యతను నేనే తీసుకుంటానని స్పష్టం చేశారు. 30 ఏళ్లు రాజకీయ జీవితం అందిస్తే మా పార్టీలో కూడా సూట్‌కేసులకు అమ్ముడుపోయిన వాళ్లని ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా చదువుకునే పిల్లలందరికీ సైకిళ్లు ఉచితంగా అందిస్తామన్నారు. ఇక ర్రాష్టానికి మోటారు సైకిళ్లు, కార్లు కాదని, సైకిలే దిక్కని ఆయన అన్నారు. సాక్షి పత్రిక, ఛానల్‌పైనా విరుచుకుపడుతూ అవినీతితో కూడగొట్టుకున్న సొమ్ముతో ఇలాంటి విషపూరిత పత్రికలు పెట్టి మమ్మల్నే లక్ష్యం గా చేస్తున్నారని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

ఈరోజు మీ అందరి అండతో, మీరిస్తున్న స్ఫూర్తితోనే ముందుకువెళ్తున్నాను, ఇదొక ధర్మపోరాటమని అన్నారు. చేనేత కార్మికులు, గీత కార్మికులను ఖచ్చితంగా ఆదుకుంటామని, కౌలు రైతుల విషయంలో కూడా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తామని ఆయా వర్గాలకు భరోసా ఇచ్చారు. అలాగే తెలుగుదేశం ప్రతిపాదిస్తున్న అన్ని హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తామని అన్నారు. ప్యాకేజీలను నమ్మి పార్టీకి ద్రోహం చేసిన వారిపై కూడా ఓ కన్నేసి వుంచుతామన్నారు. ఏకబిగిన కోట్లు కోట్లు సంపాదించిన వారు ఐదేళ్లు జైళ్లలో గడిపి తిరిగి వాటిని అనుభవిద్దామని చూస్తున్నారని ఆరోపించారు. నిజం నిప్పులాంటిదన్నారు.

రైతులను కాపాడతా : చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఆచంట, కొవ్వూ రు నియోజకవర్గ కార్యకర్తలు చంద్రబాబుకు పూర్తి హామీ ఇచ్చారు. కొ వ్వూరు నియోజకవర్గంలో మీ పర్యట న కాస్త పొడిగించాల్సిన అవసరం ఉం దని ఆళ్ల హరిబాబు కోరారు. నియోజకవర్గాల్లో ఐదుగురితో పరిశీలనా కమి టీ వేసి ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను పరిశీలించాలని పోడూరు ప్రసాద్ సూచించారు. నాయకులంతా ఏకంగా ఉన్నారుగానీ కార్యకర్తలను ప ట్టించుకోవడం లేదని నున్న సాయి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు పింఛన్ల విషయంలో ఇంతకుముందు చాలా కష్టపడ్డాయని హనుమాయమ్మ చెప్పారు. రైతులకు రుణమాఫీ ఎంతో ప్రయోజకరమని వీరవెంకట్రావు వెల్లడించారు. ఆచంట నియోజకవర్గ కార్యకర్తలు కూడా తలోరీతిలో స్పందించారు. నూర్‌భాషీయులను కూడా పార్టీ ప్రోత్సహించాలని షేక్ షాజహాన్ కోరారు. ఏ విషయంలోనై నా జాప్యం చేయకుండా నిర్ణయాలను వేగంగా ప్రకటించాలని రాంబాబు త మ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. పా ర్టీ నుంచి ఫిరాయించి మళ్లీ తిరిగి వస్తే అటువంటి వారికి మళ్లీ అవకాశాలు ఇవ్వవద్దని మల్లిఖార్జునరెడ్డి పేర్కొన గా, అధికారాన్ని అనుభవించిన వారే పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి దిగుమతి అభ్యర్థులు అవసరం లేదని రా జేంద్రప్రసాద్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తులసీరా వు పేర్కొన్నారు.

పార్టీని గెలిపించుకుంటాం :కార్యకర్తలు

ఏలూరు:'ప్రతి చోటా కార్యకర్తలు తమ ని యోజకవర్గాలకు అభ్యర్థి కావాలని అ డుగుతున్నారు. ఆరు నెలల్లో ఖచ్చితం గా ప్రకటిస్తాం. ప్రతీ కార్యకర్త నేనే అ భ్యర్థి అనుకుని పార్టీని గెలిపించండి. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌లకు ఎక్క డా చోటివ్వద్దు' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీతి నిజాయితీలతోనే తన పోరాటం కొనసాగుతుందన్నారు. ని యోజకవర్గాల వారీగా నాకూ అవగాహన ఉంది. సామాజిక న్యాయం అవసరం. అందుకనే బీసీలకు వంద సీట్లు ఇస్తామని ముందే చెప్పాం. ఇలాంటి వాటిని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..

వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా ఆయన 165వ రోజైన శుక్రవారం ఇరగవరం లో పాదయాత్ర ప్రారంభించే ముందు కొవ్వూరు, ఆచంట నియోజకవర్గ కా ర్యకర్తలతో ముఖాముఖి సంభాషించా రు. ఈ సందర్భంగా కార్యకర్తలు కొం దరు కొత్త సూచనలు చేశారు. రుణమాఫీ హామీ మన పార్టీకి వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా కూడా కార్యకర్తలు చంద్రబాబు ఎదుట చెప్పుకొచ్చారు. వీలైనంత వరకు అభ్యర్థులను ముందే ప్రకటించినట్లయితే ఎన్నికల పోరాటంలో తాము అలుపెరుగకుండా పనిచేస్తామని కూడా ఆయనకు భరోసా ఇచ్చారు.పిల్ల కాంగ్రెస్ వారు ఎందరినో కొన్నారు. అయినా మన పా ర్టీ మాత్రం ఎక్కడా బలహీనం కాలే దు.

నిజమైన కార్యకర్తలతో, నిజాయితీ గా ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం. మీలో ఇంకా కసిపెరగాలని సూచించారు. మన దగ్గర బోలెడన్ని ఎన్నికల ఆయుధాలు ఉన్నాయి. వీటిని వినియోగించుకోండని పిలుపునిచ్చారు. మనకు అ భ్యర్థుల కంటే పార్టీయే ముఖ్యమన్నా రు. ఇప్పటికే కేసుల్లో ఇరుక్కుపోయిన పిల్ల కాంగ్రెస్ నేత చరిత్రలో రాజకీయాల జోలికి రానంతగా తెలుగుదే శం కుటుంబసభ్యులు నిత్యం కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశా రు. జగన్ బెయిల్ కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తు చేశారు.

'నే ను నిప్పులా ఉన్నాను.. నిజం నిప్పులాంటిది.. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే' అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విబేధాలకు తావివ్వకుండా సమష్టిగా పోరాడండి, పార్టీని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. ఆ చంట నియోజకవర్గంలోను, కొవ్వూరు నియోజకవర్గంలోనూ అప్పుడు, ఇ ప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది. ఇది కలిసొస్తే ఈ నియోజకవర్గాల్లో మనకు తిరుగుండదన్నారు.

ప్రతి కార్యకర్తా అభ్యర్థే..!


చంద్రబాబు పాద యాత్రకు ఇరగవరం దాటిన దగ్గర నుంచి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నా రు. దారి పొడవునా చంద్రబాబుకు హారతులు, పూల మాలలతో స్వాగతం పలికారు. పలువురు తమ పిల్లలకు చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్నారు. మహిళలు చంద్రబాబుతో కరచాలం చే సేందుకు పోటీ పడ్డారు.మహిళల మో ములో చిరునవ్వులు చూసిన బాబు ఉత్సాహంగా దూసుకుపోయారు.

చంద్రబాబుకు పూలతో స్వాగతం:

ఇరగవరం/తణుకు : రాష్ట్రంలోని రై తులు, మహిళలు తీసుకున్న అన్ని ర కాల రుణాలను మాఫీ చేసి వారికి రు ణవిముక్తి కలగిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నా రు. జిల్లాలో చంద్రబాబు చేస్తున్న వ స్తున్నా మీ కోసం పాదయాత్ర శుక్రవా రం ఇరగవరంలో సాయంత్రం 4.10 లకు ప్రారంభమైంది. ప్రారంభం నుం చి మహిళలు పెద్ద ఎత్తున హారతులు, పూల మాలలతో బాబుకు స్వాగతం ప లికారు. ఇరగవరం మెయిన్ సెంటర్లో ప్రజల నుద్ధేశించి ఆయన మాట్లాడా రు.

మహిళలు, రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. వడ్డీ లేని రుణాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. రాజశేఖరరెడ్డి అనాలోచిత ని ర్ణయాలు వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన తెలిపారు. జన్మభూమి ద్వారా తెలుగుదేశం హయాంలో మూడు నెలలకొకసారి సమావేశాలు నిర్వహించి అధికారులు వచ్చి ప్రజా సమస్యలు ప రిష్కరించేవారన్నారు. సోనియా చో ద్యం చూడడం వల్లే రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అలా చేయని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నా రు. రుణ మాఫీపై తొలి,బెల్టుషాపుల ఎత్తివేతపై రెండో సంతకం చేస్తామన్నా రు.

వృద్ధులకు, వితంతువులకు 600 రూపాయలు పెన్షన్ అందిస్తామన్నా రు. అర్హులైన వారికి ఇంటి స్థలంతో పా టు లక్షా 50 వేల రూపాయలతో ఇంటి నిర్మాణం చేస్తామన్నారు. టీడీపీతోనే నీతివంత పాలన సాధ్యమన్నారు. మ ధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంద ని, గోదావరి జలాలు ఉన్నా తాగునీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉ ందన్నారు.ప్రజల కష్టాలు తీరాలంటే టీడీపీకి పట్టం కట్టాలన్నారు. పాద యాత్రలో మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, పెనుమర్తి సోమ సూర్యచంద్రరావు, ఆరిమిల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

తొలి సంతకం రుణమాఫీ పైనే

హరికేన్ తుఫాన్ వచ్చినపుడు 1996లో రాజమండ్రిలో మకాం వేసి న విషయాన్ని చంద్రబాబు పదే పదే గర్తు చేస్తున్నారు. నీలం తుఫాన్ తరువాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మొక్కుబడి పర్యటనలు చేసి రైతుల కష్టాలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.అప్ప ట్లో తాను సచివాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకున్నానన్నారు. కొబ్బరి చెట్టుకు రూ. 1100లు పరిహారం ఇప్పించేలా అ ప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఒ ప్పించి న్యాయం చేశానని గుర్తు చే శారు. ఇలా ప్రతీ పల్లెల్లో రైతన్నల స మస్యల ప్రస్తావిస్తూ ప్రభుత్వం రైతు ల్లో ఉన్న వ్యతిరేకతను చక్కగా వినియోగించుకుంటున్నారు. దీంతో బా బు ప్రసంగాలకు మంచి స్పందన ల భిస్తోంది.

సీఎంకు రైతుల కష్టాలు పట్టవు:

భీమవరం:  తణుకు:చంద్రబాబు నా యుడు మీకోసం పాదయాత్రలో ఇన్‌ఫుట్ సబ్సిడీ ప్రధాన ఆయుధంగా మారింది. జిల్లాలో బాబు ఏడో రోజు పర్యటనలో మండల కేంద్రాల్లో, గ్రా మ ప్రాంతాల్లో ఇన్‌ఫుట్ సబ్సిడీ మం జూరు చేయకపోవడంతో ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నీలం తుఫాన్ మొదటి పంటలో హెక్టార్‌కు పది వేల రూపాయలు సబ్సిడీ పెంచినా నాలుగు నెలలుగా మంజూరు చేయలేకపోయారు.

ఈవిషయాన్ని భీమవరం, పాలకొల్లు, ఆచ ంట, తణుకు నియోజకవర్గాల్లో రైతు మహిళలు సైతం ఇదే విషయాన్ని చ ంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పలు చోట్ల రైతులు దాళ్వా పరిహారం ఇవ్వక అధిక వడ్డీలకు అప్పులు తెచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయ ంపై స్థానిక కాంగ్రెస్ నాయకులను నిలదీయాలంటూ సభలలో చంద్రబా బు పిలుపునిస్తున్నారు.

ఇన్‌ఫుట్ సబ్సిడీయే ఆయుధం

పల్లెకు వెళితే పాడిపంటలు పొంగిపొర్లాలి. పైరగాలి పలకరించాలి. గుడిలో గణగణ వినిపించాలి. బడి పిల్లల గొంతులు గలగలమనాలి. కానీ ఎక్కడ? ఇప్పటికి వేల కిలోమీటర్లు నడిచాను. కొన్ని వందల గ్రామాలు తిరిగాను. గుడి, బడి ఎక్కడైనా కనిపిస్తాయేమోనని చూశాను. చాలా చోట్ల అసలే లేవు. ఉన్న దగ్గరైనా కూనరిల్లుతున్నాయి. అదే సమయంలో ఏ పల్లెలో చూసినా బీర్లు, చీప్ లిక్కర్లు పొంగిపొర్లుతున్నాయి. అడుగుపెట్టగానే మత్తు గాలులు పలకరిస్తున్నాయి.

ఎక్కడ చూసినా గ్లాసుల గలగలలే. తూగే మనుషుల గొంతుల్లో గురగుర..ఇరగవరంలో అడుగుపెట్టగానే కంటబడ్డ దృశ్యాలివి. పేదోడి బతుకు బెల్టుషాపులకు అమ్ముడుపోవడం దారుణం! వేల్పూరులో కలిసిన ఆ ఆడపడుచులూ ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. "కూలికి వెళ్లినా కూటికి రావడం లేదు సార్! వచ్చేదే పదీపరక. కుడి చేత్తో ఇలా కూలి తీసుకోగానే పెనిమిటి ఎడమ చేత్లో లాగేసుకొని బెల్టు షాపు దారి పడుతున్నాడు. ఈ మాయదారి బెల్టు షాపులకు దూము తగల! కాల్చుకు తింటున్నాయి'' అని అంటున్నప్పుడు ఆ కళ్లలో ఎర్రజీర గమనించాను. వీళ్లకిక ఎవరి భరోసా అక్కర్లేదు!

చేసిన కష్టాన్ని కంటితో చూసుకోవడమే గానీ అనుభవించలేని బతుకు కౌలురైతుది. తుఫాను వచ్చినా, వరద వచ్చిన రైతుతో సమానంతో నష్టపోతాడు. కానీ, సాయం వరకు వచ్చేసరికి సర్కారు లెక్కల్లోనే ఉండరు. "వరదొస్తే అందే సాయమే
అరకొర. అదీ భూమి యజమానికే పోతుంద''ని వేల్పూరులో ఆ కౌలు రైతు వాపోయాడు. కౌలుకు 'క్రెడిటా?' అంటూ నోరు వెళ్లబెట్టాడు. బ్యాంకుల గడప ఎక్కడమే గగనంగా ఉన్నదని కళ్లు వత్తుకున్నాడు. ఎవరైనా వీరికి రుణపడాల్సిందే!

సర్కారు లెక్కల్లో లేని 'కౌలు'సాయం

జాతీయ భావాలతో పుట్టిన పార్టీ టీడీపీ
కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం
బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ అండ

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రాంతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడింది, పోరాటం చేస్తున్నది టీడీపీయేనని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీయేనని మోత్కుపల్లి తెలిపారు.

శుక్రవారం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోత్కుపల్లి సభలో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తమ తమ స్వార్థ రాజకీయాల కోసం, తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని విమర్శించడం సరికాదని మోత్కుపల్లి అన్నారు. గతంలో ప్రభుత్వాన్ని పడగొడితే మద్దతిస్తామని, తమకు ఎక్కువ మంది సభ్యుల మద్దతుందని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అప్పుడు ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు. అప్పుడు అవిశ్వాసం పెడితే జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టలేదన్నారు. ఇప్పుడు వారి స్వార్థ రాజకీయాల కోసం అవిశ్వాసం పెట్టారన్నారు. అవిశ్వాసం పెట్టేందుకు తమ పార్టీ అధినేత జైలులో లేరని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. వాళ్ల కోసం మేము అవిశ్వాసం పెట్టాలా అని ప్రశ్నించారు.

కాంగ్రెసు పార్టీని ఈ దేశంలో స్థానిక పార్టీ దశకు తీసుకు వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఇతరులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేందుకు వైయస్ విజయమ్మ పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధేస్తోందన్నారు. అమాయకురాలిని సభకు తీసుకు వచ్చి బాధపెడుతున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేస్తోంది టిడిపియే అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష కోట్లు సంపాదించుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. సామాజిక గొంతు వినిపించింది టిడిపియే అన్నారు. కాంగ్రెసుతో టిడిపి కుమ్మక్కయిందనడం బుద్ధిలేని రాజకీయం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెసు పార్టీలో కలవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే జగన్ పార్టీ పెట్టారన్నారు. ఆ పార్టీ తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ వ్యతిరేక విధానాల పునాదులతో టిడిపి పుట్టిందన్నారు. ఓఎంసిలో కాపు రామచంద్రా రెడ్డి వాటా దారుడు అన్నారు. ఆయన త్వరలో జైలుకు వెళ్లక తప్పదన్నారు. తాను మాట్లాడుతుండగా.. నిలబడ్డ వారిని సూచిస్తూ వారిలో వంద కోట్లకు తక్కువ ఉన్న వారెవరు లేరని మోత్కుపల్లి అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు రెండు పార్టీలు తోడు దొంగలేనని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జైలులో ఉండేవాడన్నారు. సిబిఐ విచారణలో వారు దొంగలని తేలిందన్నారు. జగన్ జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. రూ. 43వేల కోట్లు దోచుకున్నారని సిబిఐ చెప్పిందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవసరమైన వాటి కోసం త్యాగాలు చేయాలే తప్ప సొంత రాజకీయాల కోసం కాదన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఏ ఒక్కటి సొంతగా చెప్పలేదన్నారు. దోపిడీ చేసిన వారి గురించి మాట్లాడితే తప్పేంటన్నారు. సిబిఐ ఛార్జీషీటులోనే వారి గురించి ఉందన్నారు.


రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం వైయస్ : మోత్కుపల్లి


విశాఖపట్నం:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏప్రిల్ మొదటి వారంలో జిల్లాలో అడుగుపెట్టను న్నట్టు తెలిసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం మీకోసం పాదయాత్ర ఏప్రిల్ నాల్గవ తేదీతో తూర్పుగోదావరి జిల్లాలో ముగుస్తుంది. ఐదో తేదీన పాయకరావుపేటలో చంద్రబాబు అడుగుపెడతారని అంచనా వేస్తున్నారు. కచ్చితమైన తేదీ చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగింపుపై ఆధారపడి వుంటుందంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వున్న చంద్రబాబు ఈనెల 20వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించనున్నారు. అక్కడ నుంచి 15 రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తారు. ఆ జిల్లాలో మీకోసం పాదయాత్ర ముగింపు తర్వాత చంద్రబాబు తుని నుంచి పాయకరావుపేటలో ప్రవేశిస్తారు. ఈలోగా పాదయాత్ర షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఖరారుకాని షెడ్యూల్

జిల్లాలో చంద్రబాబు మీకోసం పాదయాత్రకు సంబంధించి రూటు ఇంకా ఖరారుకాలేదు. జిల్లాలో సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాటు అధినేత పాదయాత్ర వుంటుందని కేంద్ర కార్యాలయం నుంచి సూచనప్రాయంగా సమాచారం అందింది. రూరల్‌తోపాటు నగరంలో కూడా చంద్రబాబు పర్యటన వుంటుందని తెలిసింది. పాయకరావుపేట నుంచి ఎలమంచిలి, అనకాపల్లి మీదుగా నగరంలోకి వస్తారా? లేక ఎలమంచిలి నుంచి అచ్యుతాపురం, పరవాడ మీదుగా నగరంలోకి అడుగుపెడతారా? అన్నది రూరల్ జిల్లా నేతలు ఖరారు చేయాల్సి వుంది. దాని ప్రకారం నగరంలో రూటు నిర్ణయిస్తామని అర్బన్ జిల్లా నాయకులు కేంద్ర కార్యాలయానికి నివేదించారు. నగరం నుంచి ఆనందపురం మీదుగా విజయనగరం వెళతారా? లేదా పెందుర్తి, కొత్తవలస, వేపాడ మీదుగా వెళతారా? అన్నది ఇంకా ఖరారుచేయలేదు. గతంలో వున్న ఆదేశాల మేరకు జిల్లాలో చంద్రబాబు మీకోసం పాదయాత్ర ఇప్పటికే ఖరారుకావలసి వుంది. అయితే జిల్లా పార్టీలో నెలకొన్న సంక్షోభం కారణంగా జాప్యం జరుగుతోంది. అయ్యన్నపాత్రుడు వివాదం ముగిసిన వెంటనే దాడి వీరభద్రరావు వ్యవహారం తలెత్తడంతో కొంతమేర ప్రభావం చూపింది. రూరల్ జిల్లాలో పాదయాత్ర ఖరారు బాధ్యత రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్‌పై వుంది. జిల్లాలో ముఖ్య నాయకులు ఎంవీవీఎస్ మూర్తి, దాడి వీరభద్రరావు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, శాసనసభ్యులు సమావేశమై పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేయాల్సి వుంది.

ఏప్రిల్‌లో బాబు యాత్ర

తాండూరు :: తాండూరులో ఆరురోజులుగా వ్యాట్‌కు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపా రులు నిర్వహిస్తున్న నిరవధిక బంద్‌కు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి గురువారం సంఘీబావం తెలిపారు. శాసనసభలో పార్టీపరంగా వ్యాట్ ఎత్తివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో క్లాత్ మర్చంట్ అధ్యక్షుడు భగవాన్‌దాస్ గగరాణి, కార్యదర్శి బిచ్చాల అంబయ్య, సహకార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షుడు ఎస్‌పి.రవి, కోశాధికారి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

వ్యాట్ ఎత్తివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం- ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి

మర్పల్లి: : టీడీపీ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలు తీసుకున్న రుణాలతో పాటు రైతు రుణాలను కూడా రద్దు చేసి మళ్లీ కొత్తగా రుణాలు ఇవ్వనున్నట్లు వికారాబాద్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పి.విజయకుమార్ అన్నారు. పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని నర్సాపూర్, ఘనాపూర్, జంషెడ్‌పూర్, కోటమర్పల్లి, కొత్లాపూర్, సిరిపురం, వీర్లపల్లి, పట్లూర్ గ్రామాల్లో టీడీపీ నాయకులు పర్యటించి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. కరెంట్ కోతలతో పంటలు ఎండుముఖం పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జి.సుభాష్‌యాదవ్, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దివాకర్, మోమిన్‌పేట మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య నాయకులు సుధాకర్, శేఖర్ యాదవ్, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బట్టు రమేష్ పాల్గొన్నారు.

అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు రద్దు

యద్దనపూడి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకు నేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరా వు పిలుపునిచ్చారు. బుధవారం యద్ద నపూడిలోని గోనుగుంట అప్పయ్య ఇంటి వద్ద మండల పార్టీ అధ్యక్షుడు రంగయ్యచౌదరి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రం లో విద్యుత్ సంక్షోభం వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్ చార్జిల పేరుతో పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని విమర్శించారు. మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,సాగర్ కాల్వ ద్వారా చెరువుకు నీరు నింపి తాగునీటి సమ స్య లేకుండా ప్రజా ప్రతినిధులు, అధి కారులు చొరవ తీసుకోవాలన్నారు. ముందు గా గన్నవరంలో ముస్లిం పీర్ల చావిడిని పరిశీలించారు. ధూళిపాళ్ల రామస్వామి, కొల్లా సాంబశివరావుల ను పరామర్శించారు.

ఈ సమావేశం లో టీడీపీ నాయకులు కనపర్తి నాగేశ్వ రరావు, కోడె రామారావు, గోనుగుం ట్ల పెద్దబ్బాయి, నాగేశ్వరరావు, పెద్ద బాబు, పేరయ్య, కామేశ్వరరావు, ఈ దర రవి, రాము, కిరణ్, పోపూరి శ్రీను, ఆదినారాయణ పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపు టీడీపీదే

ఇంకొల్లు రూరల్ : దీర్ఘకాలంగా గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చా ర్జి ఏలూరి సాంబశివరావు అన్నారు.

మండల టీడీపీ సమావేశం బుధవా రం ఇంకొల్లులో పర్చూరు రోడ్డులోని ఒక ప్రైవేటు గోడౌన్‌లో గోరంట్ల జాన య్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతి థిగా పాల్గొన్న ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను మరచి,ధరలు విపరీతంగా పెంచి ప్రజ లపై భారం మోపాయని విమర్శించా రు. ధరల నియంత్రణపై పర్యవేక్షణ కూడా లేకుండా పోయిందన్నారు. పెట్రోలు, డీజిల్‌పై ఇప్పటికే పలుమా ర్లు ధరలు పెంచారని తెలిపారు. విద్యు త్ సర్‌చార్జిల పేరిట బిల్లులు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు బేరీజు వేసుకుని ప్రజలు ఎన్నిక లలో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోని సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యప రచాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురికాకుండా ప్రతిఒక్క కార్యకర్త పార్టీ విజయం కోసం కృషిచే యాలని తెలిపారు. ఎన్టీఆర్ సుజల ధార పథకం ద్వారా గ్రామాలలో మిన రల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేయ టం జరుగుతుందన్నారు.

17వ తేదీ పెదగంజాం హైస్కూల్‌లో మెగా ఉచి త కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి చూపులో సమస్యలు ఉన్నవారు పేర్లను నమోదు చేయించు కోవాలని కోరారు. గ్రామాల్లోని నాయ కులు ఓటరు జాబితాలను పరిశీలించా లని తెలిపారు. సమావేశంలో బాచిన అమరారావు, సొసైటీ అధ్యక్షుడు పం గులూరి బాపారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొల్లూరి నాయుడమ్మ, పేర్ని బాపారావు, వై.ప్రసాద్, షేక్ అన్సారీ, గుంజి వెంకట్రావు, లేళ్ల తిరుపతిరా యుడు, గ్రామాల నాయకులు, కార్య కర్తలు, ముస్లిం, మైనార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

ప్రజలసై భారం మోపుతున్న ప్రభుత్వాలు


చౌటుప్పల్ టౌన్: చౌటుప్పల్ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మాజీవైస్ ఎంపీపీ బొంగు జంగయ్యగౌడ్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణ టీడీపీ కమిటీ సమావేశం గురువారం జరిగింది.

సమావేశంలో జంగయ్యగౌడ్ మాట్లాడుతూ తాగునీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇంటింటికి కృష్ణాజలాలను అందించేందుకుప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అరులైన పేదలకు రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, పింఛన్లు అందించాలని ఆయన కోరారు. పిలాయిపల్లి కాల్వ పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని ఆయన కోరారు.

సహకార డైరెక్టర్‌గా ఎన్నికైన సుర్కంటి రాంరెడ్డిని సన్మానించారు. సమావేశంలో టీడీపీ ఏరియా ఇన్‌చార్జీ బొబ్బిళ్ల మురళీ, పట్టణ ప్రధానకార్యదర్శి బొమ్మిరెడ్డి మల్లా రెడ్డి,నాయకులు ఎండి బాబా షరీప్ ,ఊడుగు శ్రీనివాస్ గౌడ్ ,గోశిక నరసింహ ,టి.బాబు ,జి.శ్రీనివాస్ ,ఎం.రాజు, యాదయ్య ,శేఖర్ ,మలిగ శ్రీను ,నాగరాజు,రాములు,శ్యామ్ లు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి:టీడీపీ

షాద్‌నగర్ : అడ్డు అదుపు లేకుండా పన్నులను విధిస్తున్న ప్రభుత్వాలు ప్ర జల నడ్డి విరుస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు విమర్శలు గుప్పించారు. వ్యాట్‌కు నిరసన గా వస్త్ర వ్యాపారులు షాద్‌నగర్‌లో చే పట్టిన ఆందోళన కార్యక్రమానికి గురువారం బక్కని నర్సింహులు హాజరై మ ద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్‌టైల్ వ్యా పారంపై వ్యాట్‌ను విధించడమంటే ప రోక్షంగా ప్రజలపై భారం మోపడమేన ని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేం ద్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూ ర్తిగా విస్మరించాయని ఆరోపించారు.

ఇ ప్పటికే వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను, విద్యుత్ ఛార్జీలను పెంచి ప్ర జలపై తీవ్ర భారం మోపాయని ఆ గ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మనిషి వి ధిగా కొనుగోలు చేయాల్సిన వస్త్రాలను కూడా వదలకుండా పన్నులు విధిస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు క్ష మించరని అన్నారు. వస్త్ర వ్యాపారులు చేపట్టే ఆందోళనకు తాము అండగా ని లుస్తామని బక్కని నర్సింహులు తెలిపారు. ఆందోళనకు టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జి వై.అంజయ్యయాదవ్ కూడా మద్దతు ప్రకటించారు. ప్రజల పై భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.

ఈ కా ర్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు మంగూలాల్‌నాయక్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, వస్త్ర వ్యాపారులు గజవాడ నర్సింలు, నాగిళ్ళ ప్రభాకర్, ఎం.చంద్రమౌళి, దం డువాసు, రఘువీర్, పులిపాటి నర్సిం లు, రామ్మోహన్, న్యాయవాది కరీం, ఆర్యవైశ్య సంఘాల నాయకులు బె జుగం రమేష్, యంసాని శ్రీనివాస్, జి. కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల నడ్డివిరుస్తున్న ప్రభుత్వాలు

కర్నూలు(కార్పొరేషన్): ఎన్నికలు ఎప్పుడు జరిగినా అత్యధిక సీట్లు సా ధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో కి వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సో మిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడా ది ఆఖరులోగా రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉ న్నాయన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫండ్ కింద 500 కోట్లు ఇచ్చినట్టు ఇటీవల గా లి అంగీకరించారని సోమిశెట్టి తెలిపా రు. తండ్రి బాటలోనే వైఎస్ జగన్ అవినీతి అక్రమాలకు పాల్పడి లక్ష కోట్ల ప్రజా ధనం దోచుకున్నారని విమర్శించారు. అలాంటి దొంగల పార్టీకి ఓటేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని అన్నారు. విజయమ్మ జైలులో ఉన్న తన కొడుకును విడిపించుకునేందుకు సోనియా గాంధీతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు.

16న మహా ధర్నా..

ప్రజా సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 16న కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపడుతున్నట్టు సోమిశెట్టి తెలిపారు. రైతు సమస్యలు, కరెంట్ కోతలు, సర్ చార్జీలు, నిత్యావసర ధరల పెరుగుల వ్యాపారులపై వ్యాట్ లాంటి అనేక సమస్యలపై మహా ధర్నా జరుగుతుందని అన్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధా న కార్యదర్శి సుబ్బరాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల పుల్లా రెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ పాల్గొన్నారు.

ఎన్నికలెప్పుడొచ్చినా అధికారం మాదే

కొండకొడిమ(వైరా): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు టీడీపీకే సాధ్యమని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలనే కన్పించటం లేదని ప్రభుత్వం ఉనికి లేకుండాపోయిందని విమర్శించారు.మండలంలోని కొండకొడిమలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోటా నుంచి రాయితీపై మంజూరైన 140గ్యాస్ కనెక్షన్లను గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్నిరంగాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. ప్రజలు కష్టాలు తొలగి అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు అందించాలంటే టీడీపీని అందరూ ఆదరించాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే అన్నివర్గాల ప్రజల కష్టాలను తీరుస్తామని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 160రోజులుగా చేస్తున్న పాదయాత్రలో అన్నివర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. అష్ణగుర్తిలో కూడా ఆయన పర్యటించి పార్టీలోకి చేరిన వారిని అభినందించారు.

ఈకార్యక్రమాల్లో వైరా సొసైటీ అధ్యక్షుడు తాతా రంగారావు, టీడీపీ మండల కన్వీనర్ ఆకుల ప్రసాద్, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్‌రావు, కొండకొడిమ మాజీ సర్పంచ్‌లు కొస్తాల నాగకోటేశ్వరరావు, దారా వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు వాకదాని వెంకటేశ్వరరావు, కొప్పుల వెంకటేశ్వర్లు, వైరా సొసైటీ డైరెక్టర్ వాకదాని శ్రీనివాసరావు, టీడీపీ మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు చల్లా జోజి, పగడవరపు పుల్లారావు, వైరా ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు పగడవరపు వీరభద్రం, దొంతెబోయిన నర్సింహారావు, మండల నాయకులు శ్రీరామనేని విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే సంక్షేమ పథకాల అమలు

పులివెందుల టౌన్ : పులివెందుల మున్సి పాలిటిలోని తాగునీటి సమస్యకు ఈ నెల30వ తేదీ లోగా శాశ్వత పరిష్కారం చూపకుంటే ఆమరణదీక్ష చేపడతామని రాష్ట్ర తెలుగుయువత ప్రధానకార్యదర్శి రామగోపాల్‌రెడ్డి మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ తాగునీటికి నిధుల కొరత లేదంటూనే అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోతున్నారన్నారు. మున్సిపాలిటిలో పాలక వర్గం లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఓ కమిటీని ఏర్పాటు చే సి సూచనలు, సలహాలు తీసుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.

తాగునీటి సమస్యలు ఎక్కడెక్కడ ఉండేది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 30 వతేదీలోగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే టీడీపీ ఆధ్వర్యం లో ఆందోళన కార్యక్రమాలతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమన్నారు. బోరుబావులను అధిక సంఖ్యలో తవ్వించి ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చూడాల న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

30లోగా శాశ్వత పరిష్కారం చూపకుంటే ఆమరణ నిరాహార దీక్ష

హైదరాబాద్‌సిటీ : నగరంలో ప్రజా సమస్యల పై తెలుగుదేశం పార్టీ భారీ ఆందోళనా కార్య క్రమాలుచేపట్టడానికి సిద్ధమవుతోంది. ఈమేరకు బుధవారం పార్టీకార్యాలయంలో జరిగిన నూతన కమిటీ తొలి కార్యవర్గసమావేశానికి గ్రేటర్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతోపాటు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విషయాలపై కూడా చర్చ జరిగింది. అనంతరం తలసాని శ్రీనివాస్‌యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు అధికంగా విద్యుత్, మంచినీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈనెల 23న విద్యుత్‌సమస్యల పై ర్యాలీపాటు విద్యుత్‌సౌథ ముట్టడి ఉంటుందని అన్నారు. ఈ మేరకు దాదాపు వెయ్యి ల్యాంతర్లలో ర్యాలీ ఉంటుందని అన్నారు.

ఇక మంచినీటి సమస్యలను నివారించాలని కోరుతూ త్వరలోనే ర్యాలీలు,ధర్నాలుకూడా చేపడతామని అన్నారు. ఇక పార్టీ ఆవిర్భావం దినోత్సవం కూడా ఈనెల 29వ తేదీన జరుగుతుందని అన్నారు. ఈసందర్భంగా నగరంలో వివిధ సేవా కార్య క్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ ప్రధానకార్యదర్శి ఎమ్మెన్ శ్రీనివాస్, వనం రమేష్, ఉపాధ్యక్షుడు డీపీరెడ్డి, జి.పవన్‌కుమార్‌గౌడ్, పరశురామ్‌ముదిరాజ్, అధికార ప్రతిని«ధులు బద్రీనాథ్‌యాదవ్, ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్, కిషోర్, ప్రచారకార్యదర్శి ప్రేమ్‌కుమార్‌ధూత్, కట్టారాములు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాబాజ్‌ఖాన్, బీసీసెల్ అధ్యక్షుడు తొలపునూరి కృష్ణాగౌడ్ సీనియర్‌నాయకులు జీఎస్‌బుగ్గారావు పాల్గొన్నారు.

ఇక సమస్యలపై ఆందోళనలు: తలసాని

మాచర్ల అర్బన్: అసెంబ్లీలో తోక పార్టీలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మా నం ప్రజా సమస్యలపై కాకుండా ఆయా పార్టీల స్వప్రయోజనాల కోసమేనని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటుపల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం ఆయన మాచర్లలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం యాత్ర ప్రజ ల్లో మంచి స్పందన ఉందని పేర్కొన్నారు. తాను 42 రోజులుగా ఆ యాత్ర లో కొనసాగానని, ఆయా ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల నుండి వస్తున్న స్పందన అమోఘంగా ఉందన్నారు. అధినేతలో వచ్చిన మార్పును ముఖ్యం గా రైతులు గమనిస్తున్నారన్నారు. నాటి చంద్రబాబునాయుడు పాలన నేటి కాంగ్రెస్ పాలనను గమనించిన ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నా రు. స్కాంల కాంగ్రెస్‌కు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

విత్తనాల నుండి ఎరువుల వర కు ధరలను పెంచేసిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతుల నడ్డి విరిచిందని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. రైతుల నుండి పంటలు వ్యాపారుల చేతిలోకి వెళ్లగానే ప్రభుత్వం, దళారులు కుమ్మక్కై అమాం తం పెంచేస్తున్నాయని ఆరోపించారు. మూడు సంవత్సరాలు చంద్రబాబు హ యాంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చి న సందర్భాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కిరణ్ ప్రభుత్వం అర్థరహితంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. డ్యాంల్లో నీరున్నా ఒక్క పంటకు కూడా నీరందించకుండా రైతులను నట్టేటముంచారని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ నేత వట్టికొండ రంగనాయకులు, మాజీ సర్పంచ్ మందలపు మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.

అవిశ్వాస తీర్మానం స్వప్రయోజనాల కోసమే..

 కాకినాడ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో 13 రోజులు కొనసాగనుంది. ఈ మేరకు టీడీపీ నేతలు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర రూట్ మేప్‌ను సిద్ధం చేశారు. జిల్లాలో చంద్రబాబు రాజమండ్రి నుంచి తుని వరకు 195 కిలోమీటర్ల మేర నడవనున్నారు. ఈ యాత్ర 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామాల మీదుగా సాగనుంది.

ఈనెల 21న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్‌కమ్ రైలు బ్రిడ్జి మీదుగా రాజమండ్రి చేరుకుంటారు. ఆ రాత్రి రాజమండ్రిలో బసచేస్తారు. ఆ మరుసటి రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించి అనపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు.

అనపర్తి నుంచి మండపేట, రాయవరం, గొల్లల మామిడాడ, పెదపూడి, పెద్దాడల మీదుగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పాదయాత్ర సాగుతుంది.అక్కడ నుంచి కాకినాడ నగరం మీదుగా పిఠాపురం, కత్తిపూడి, అన్నవరం మీదుగా తుని వరకు బాబు పాదయాత్ర చేయడానికి టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నియోజకవర్గాల మీదుగా..

జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో 80 గ్రామాలను కవర్ చేస్తూ యాత్ర సాగుతుంది. రోజూ 15 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేసేలా టీడీపీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మార్చి 21న జిల్లాకు వచ్చి.. 13 రోజులపాటు 195 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి.. ఏప్రిల్ 2 నుంచి 4 తేదీల మధ్యలో విశాఖ జిల్లా పాయకరావుపేట చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

థర్మల్ ప్రభావిత గ్రామాల్లో పర్యటన

అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బాలవరం, బలభద్రపురం మధ్యలో ఏర్పాటు చేస్తున్న 100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లో 'మీకోసం వస్తున్నా' పాదయాత్రను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాత్రలో పోలీస్ లాఠీచార్జిలో గాయపడిన వారిని చంద్రబాబు పరామర్శించే అవకాశం ఉంది. థర్మల్ పోరాటంలో కేసులు ఎదుర్కొంటున్న నేతలతోనూ చంద్రబాబు కొంతసేపు చర్చించేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడే

మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జిల్లాలో చంద్రబాబు సమక్షంలో జరిపేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 29వ తేదీ నాటికి చంద్రబాబు యాత్ర జిల్లాలో 9 రోజులకు చేరుకుంటుంది. ఆ సమయానికి పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గానికి చేరుకుంటుంది. అక్కడే పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం

పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్రతో జిల్లాలో టీడీపీ గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ నేతలు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ పాదయాత్ర ప్రభావం ఉంటుందని వారం తా భావిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో జిల్లాలో కరెంటుకోత, తాగు, సాగునీరు తదితర సమస్యలపై ఎక్కువగా ప్రస్తావించి జనంలోకి వెళ్లాలని టీడీపీ యోచిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖతను తమ కు అనుకూలంగా మలచుకునేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్న టీడీపీ నేతలు 'వస్తున్నా మీ కోసం' యాత్రను విజయమవంతం చేయడానికి ఇప్పటి నుంచీ కార్యరంగంలోకి దిగుతున్నారు.

బాబు టూర్ ఖరారు

హైదరాబాద్   : టీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాసంలో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఇరుపులపాయ ఇచ్చిన ముడుపులకు ఆశపడి టీఆర్ఎస్ అవిశ్వాసం పెడుతోందన్నారు. తోక పార్టీలు రెండు ప్రత్యేక తీర్మానాలు ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు. తెలంగాణ తిరిగే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ అవిశ్వాసంలో తెలంగాణ ప్రస్తావన లేదు : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ : వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని టీడీపీ నేత బొజ్జల ఆగ్రహం వ్యక్తపరిచారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా కాంగ్రెసతో పోరాడుతుంది టీడీపీయే అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే అవసరం తమకు లేదన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడెలా స్పందిచాలో తమకు తెలుసని బొజ్జల పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే అవసరం లేదు : బొజ్జల

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలు అసత్యాలు మానుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమా సూచించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసన్నారు. టీఆర్ఎస్ ఎజెండాను టీడీపీ అమలు చేయాల్సిన అవసరం లేదని దేవినేని ఉమా పేర్కొన్నారు.

టీఆర్ఎస్ నేతలు అసత్యాలు మానుకోవాలి : దేవినేని

ఏలూరు:  టీడీపీ గెలుపు చారిత్రక అవసరం. ఇప్పడున్న దుర్మార్గ పాలన అంతరించాలన్నా, ప్రజల కష్టాలు తొలగాలన్నా, సక్రమంగా కరెంటు సరఫరా జరగాలన్నా, ప్రపంచ పటంలో అవినీతి రహిత ర్రాష్టంగా తీర్చిదిద్దాలన్నా తెలుగుదేశం గెలుపు ఒక చారిత్రక అవసరం' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకే ఇప్పటి నుంచే తక్షణం కార్యరంగంలోకి దిగాలని, ప్రతీ ఇంటి నుంచి ఒకరు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అవినీతిపై నేనొక్కడినే పోరాడితేకాదు, అసమర్ధ ప్రభుత్వాలను, దద్దమ్మ నేతలను తరిమివేయాలన్నా మీరంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ర్రాష్టంలో ఇప్పుడు మిగిలింది అవినీతే అన్నారు. నేను చేస్తున్న పాదయాత్ర తెలుగుదేశం పార్టీ పాదయాత్రగానే భావిస్తే రాబోయే రోజుల్లో ర్రాష్ట భవిష్యత్ సర్వనాశనం అవుతుందని, దీనిని గమనించి తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన 164 రోజైన గురువారం ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. టీఆర్ఎస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం గురించి, పిల్ల కాంగ్రెస్ ఎత్తుగడల గురించి, స్థానిక సమస్యల గురించి ఆయన అన్నిచోట్లా ప్రస్తావించారు. తాను చేస్తున్న పాదయాత్ర లోకకల్యాణ యాత్రగా ప్రకటించారు. 'ఇప్పుడున్నది దద్దమ్మల ప్రభుత్వం. చేతకాని ప్రభుత్వం. కరెంటు కష్టాలు తీర్చండి అంటే ఛార్జీలు పెంచుతారు. వీళ్లకు కావల్సిందల్లా సూట్‌కేసు రాజకీయాలే' అని కాంగ్రెస్‌తో పాటు మిగతా పక్షాలపై తెలుగుదేశం అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేశారుగానీ, ఇప్పుడు జగన్ బెయిల్ కోసం అవిశ్వాసం పేరిట చీకటి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

కవిటం వద్ద నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలోను, ఆ తర్వాత మార్టేరు, పెనుగొండల వద్ద జరిగిన బహిరంగసభల్లోనూ ఆయన కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లపై వాగ్బాణాలు సంధించారు. స్థానిక సమస్యలను ప్రస్తావించారు. వస్త్రవ్యాపారులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ర్రాష్టంలో పాలన గాడి తప్పిందని, దీనిని ఒక గాటన పెట్టేందుకే పాదయాత్ర చేస్తున్నానని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అప్పు లేని రైతును తాను చూడాలనుకుంటున్నానని తన మనసులోని మాట చెప్పారు. వైఎస్, కిరణ్ పరిపాలనలో దోపిడీయే జరిగిందని, రౌడీలు పెరిగారని ఆరోపించారు. ఎక్కడైనా ఒక తండ్రి తాను దోపిడీలు చేయడమే కాకుండా కొడుకును కూడా దోపిడీ చేయమని ప్రోత్సహించి జైలుకు పంపడం చూశామా, అది వైఎస్‌కే చెల్లిందని తూర్పురబట్టారు. వైఎస్ కుటుంబం చేయాల్సిందంతా చేసి, దోపిడీ చేసి జైలులో కూడా ఆనందంగానే గడుపుతోందని పరిహసించారు.

మాఫియా తయారు చేసేవాళ్ల వెంట వెళ్లాలని ఎవరైనా భావిస్తే అది భవిష్యత్ తరాలు నాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కడతామని కాలువలు తవ్వి దోపిడీలు చేశారని, రెండో పంటకు నీరివ్వకుండాపోయారని తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మొత్తం వ్యవస్థనే సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైఎస్ తన హయాంలో ఎవడబ్బ సొమ్మని, ర్రాష్టాన్ని దోచుకుతిన్నారని, దీనిని గమనించాలన్నారు. వైఎస్ హయాంలో పేదలకుగానీ, ఎస్సీ, ఎస్టీలకుగానీ, రైతులకుగానీ ఏమి ఒరిగిందని ప్రశ్నించారు. కనీసం రైతులకు పంట నష్టం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం ర్రాష్టంలో ఉందన్నారు. 'తమ్ముళ్లు మోటార్‌సైకిళ్లను కాదు.. సైకిళ్లను నమ్ముకోండి' అంటూ యువకులకు పిలుపునిచ్చారు.

అధికారంలోకి వస్తే రైతులకు తొమ్మిది గంటల పాటు కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇస్తూ మాలలకు తమ పార్టీ వ్యతిరేకం కాదని అన్నిచోట్లా స్ప ష్టం చేశారు. చిల్లరకొట్టులను దివాళా తీసేలా కొత్త విధానాలను తెరముందుకు తెస్తున్నారని, ఇదే జరిగితే లక్షలాది మంది చిన్న వ్యాపారుల బతుకు రోడ్డునపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాట్‌కు వ్యతిరేకంగా వ్యాపారులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారని, వారిపక్షాన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మా గెలుపు చారిత్రక అవసరం

రుణమాఫీ విషయంలో మీరు ఒక స్పష్టత ఇస్తే మరింతగా మనం ము ందుకు వెళ్దామని అని కార్యకర్త కేశవరావు అన్నారు. కరెంటు సమస్య తీవ్రంగా ఉందని కార్యకర్త శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదన పెడితే మీరు వారి వెంట వెళ్ళకుండా తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నామని మరో కార్యకర్త నాగేశ్వరరావు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో గందరగోళ పరిస్థ్ధితులను సరిదిద్దాలన్నారు. రైతు లు కష్టాలో ఉన్నారని, వీరికి పార్టీ అం డగా నిలుస్తుండడం సంతోషదాయకమని రాంబాబు అన్నారు.

నరసాపురంలో ఇన్‌ఛార్జి విషయంలో స్పష్టత ఇవ్వాలని భూపతి నరేష్ డిమాండ్ చేయగా మీరు చేస్తున్న పాదయాత్ర శ్రమ వృధా కానియ్యబోమని పార్టీ కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమేనని రాధాకృష్ణ అనే కార్యకర్త అన్నారు. మాల సామాజిక వర్గంలో ఉన్న అపోహలను తొలగించాలని రంజిత్ కు మార్ కోరారు. రుణమాఫీ జరిగితే ఏ ప్రాంతంలో ఎంతమంది రైతులకు మేలు జరుగుతుందో లెక్కలతో సహా మనం ప్ర చారం చేస్తే పార్టీకి తిరుగుండదని నరసింహారావు అనే కార్యకర్త అన్నారు. కొత్తపల్లి పేరు ప్రస్తావించకుండానే అతను పార్టీలో ఉన్నప్పుడు ఒక రీతిలో ఉన్నారని, ఇప్పుడు ఆయన స్వరూపం మారిందని నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు.

కార్యకర్తల ఆవేదన

ఏలూరు: ' మీరంతా కష్టపడి పని చేయండి.. ఇంక ఎక్కువ సమయం లేదు ఎన్నికలు రావడానికి.. అభ్యర్థుల సంగతి నేను చూసుకుంటాను.. అంతకుముం దు మీతో కూడా మాట్లాడతాను..అన్ని స్థ్ధానాల్లో మనమే గెలవాలి.మీ మధ్యన ఏమైనా మనస్పర్థలు ఉంటే తక్షణం సరిదిద్దుకోండి'' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల టీ డీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ స్థిితిగతులపై కార్యకర్తలు గళం ఎత్తారు. నరసాపురంలో పరిస్థ్ధిితి ఏమీ బాగోలేదని, మన పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే మ మ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ముందుగానే స్థ్ధిిరమైన అభిప్రాయానికి రావాలి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళనే నాయకులుగా చూడవద్దు.

వాళ్ళకంటే మించి పనిచేసే వా ళ్ళం కూడా ఉన్నాం. దీనిని కూడా పరిశీలించండి అని నరసాపురం కార్యకర్తలు అధినేత ఎదుటే తెగేసి చెప్పారు. పార్టీ విషయంలో మొదటి నుంచి మనం ఒక స్థ్ధిర అభిప్రాయాలతోనే ఉన్నాం, కార్యకర్తలే పార్టీకి ముఖ్యం. నాకు ఎవరూ ఎక్కువా కాదు, తక్కు వా కాదు.. అందరూ ఒకటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. నరసాపురంలో కొంత వెనుకబడి ఉన్నమాట వాస్తవమేనని సరైన అభ్యర్థ్ధిని ఇస్తాను..ఆలోపే ఒక కమిటీని కూడా మీ వద్దకు పంపిస్తానని కార్యకర్తలను బాబు ఊరడించారు. రైతులకు రుణం మాఫీ చేస్తామని మన పార్టీ చెబుతున్నది, మీరు కూడా తొలి సంతకం చేస్తామని చెబుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మా త్రం మనది రైతు వ్యతిరేక పార్టీ అని ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారని ఒక కార్యకర్త ప్రస్తావించినప్పుడు చంద్రబాబు దీనిపై సీరియస్‌గా ప్రతిస్పదించారు.

'అసలు రైతులకు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ వాళ్ళను మీరే నిలదీయండి, మనం ఏం చేస్తున్నాము..ఏమేమి చేయబోతున్నామో అందరికీ స్పష్టంగా చెప్పండి, అదే మీరు చేయాల్సిన పని. దీంట్లో వెనక్కి తగ్గితే ఎలా అంటూ ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అన్నానని రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెబుతూ వచ్చేవాడు. అదే విషయాన్ని నేను అసెంబ్లీలో నిలదీస్తే చెప్పలేక పారిపోయాడని కార్యకర్తల హర్షధ్వనాల మధ్య చంద్రబాబు చెప్పుకొచ్చారు. నరసాపురం నియోజకవర్గం లో వరుసగా రెండుసార్లు ఓడిపో యాం, ఇప్పుడు మన పరిస్థ్ధిితి అధ్వాన్నంగా మారిందని ఇంకొందరు కార్యకర్తలు చెప్పగా మీకు ఏ ఇబ్బందీ లేదు, ఈ విషయం లో అందరూ కలిసి పని చేస్తే మనకి ఎదురొచ్చేవారెవరని అన్నారు. నరసాపురంలో మనం కొంత వెనుకబడిన మాట నిజమే అయినా కూడా ఇది ఒక నాకు సవాలు. కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉండండి, ఏం చేయాలో అదే చేసి చూపెడదామన్నారు.ఎన్నికల ముందు డాక్టర్ బాబ్జీ, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణలు అభ్యర్థ్ధులుగా పో టీ చేయమని చెప్పినప్పటికీ వారికి ఉన్న మంచిపేరును దృష్టిలో పెట్టుకుని నేనే వారిని ఒప్పించి అభ్యర్థ్ధులు గా రంగంలోకి దింపానని చంద్రబాబు కార్యకర్తలకు వివరించారు.

ఇక రుణమాఫీ విషయంలో ఏమేమి చేయాలో నాకు ఒక ఆలోచన ఉంది. తప్పనిసరిగా అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో కష్టసుఖాలను అనుభవించినవారు ఉన్నారు. పదవులు ఇచ్చిన వా రు కొన్ని చోట్ల పని చేయకుండా పోతే పదవిరాని వారు మా త్రం బాధపడ్డారని, ఇది కూడా తనకు తెలుసన్నారు. ఏమైనప్పటికీ సమర్ధవంతమైన నాయకులు మీ నుంచే రావాలి. పార్టీని బతికించుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా మరోమారు బలబలాలపై సమీక్షిస్తానని, రాగ ద్వేషాలకు అతీతంగా ఉమ్మడిగా పార్టీని గెలిపించుకోవాలని కోరారు.

మీరంతా కష్టపడాల్సిందే...

ఏలూరు : జిల్లాలో ఆరు రోజులు సుదీర్ఘపాదయాత్ర...ఉదయం సమీక్షలు, మధ్యాహ్నం నడక. పొద్దుపోయినా, అర్ధరాత్రి అయినా, మంచుకురుస్తున్నా, కాళ్లు నొప్పిపెడుతున్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబు బహుదూర బాటసారిలా సాగుతూనే ఉన్నారు. జనం మధ్యన పున్నమి చంద్రుడై వారి అభిమానాన్ని మూటగట్టుకోవడానికి, తెలుగుదేశంకు కొత్త ఊపు తెచ్చేందుకు,అధికారానికి చేరువయ్యేలా ఆయన శారీరక కష్టాన్ని కూడా ఖాతరు చేయకుండా పాదయాత్ర సాగిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున కవిటం రాత్రి బసకు చేరుకున్న ఆయన గురువారం మధ్యాహ్నం నరసాపురం, పాలకొల్లు కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొన్నారు. కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నించారు. నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో రెండింటిలోనూ కార్యకర్తలు మాట్లాడే అవకాశం ఇచ్చారు.

డాక్టర్ బాబ్జి, చినమిల్లి సత్యనారాయణను క్యారెక్టర్ ఉన్న పెద్ద మనుషులుగా అభివర్ణించారు. తానే వారిని ఎమ్మెల్యేల కింద స్వయంగా బరిలోకి దింపానని చెప్పుకొచ్చారు. పార్టీని గెలిపించుకోవడానికి ఇక రాగద్వేషాలకు అతీతంగా ముందుకు సాగాలని, పార్టీకి విజయం సమకూర్చాల్సిందిగా కోరారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వరాదని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు స్వాగతించారు. 'మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా మద్దతిస్తున్నాం' అని ప్రకటించడం ద్వారా చంద్రబాబులోను నూతనోత్సాహాన్ని నింపారు. మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత ఆయన పాదయాత్రకు దిగారు. జగన్నాథపురం, మార్టేరుల మధ్య వందలాది మంది ఆయన యాత్రలో జతకలిశారు.

మార్టేరు సెంటర్‌లో జరిగిన సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇక్కడ కూడా ఆయన ప్రధాన సమస్య అయిన కరెంటు కోతలనే ప్రస్తావించడం ద్వారా అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. గురువారం కరెంటు ఛార్జీలు పెరిగిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఇప్పుడే అయిపోలేదు, మీ నడ్డి విరిచేందుకు మరో పద మూడు వేల కోట్లు ఛార్జీలు భారం వేయడానికి కిరికిరి సీఎం సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. బీహార్ కంటే ర్రాష్ట పరిస్థితి అధ్వానం గా మారిందని, అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. ప్రభుత్వంపై చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. పెనుగొండలో జరిగిన సభకు కూడా పెద్దసంఖ్యలోనే ప్రజలు హాజరయ్యారు. మార్గమధ్యలో అనేకచోట్ల కొందరు హారతులు పట్టారు. చాయ్ తాగుతూ.. కొబ్బరినీళ్లతో సేదతీరుతూ ముందుకు సాగారు. మార్టేరులో ఓ కార్యకర్త 'సార్.. మా సెంటర్‌లో కోడిపకోడి అదుర్స్, ఓ ముక్క రుచిచూడండి' అంటూ ఆఫర్ చేశారు.

దీనిపైనా చంద్రబాబు ప్రతిస్పందించారు. పెనుగొండ సెంటర్‌లో ప్రవేశించినప్పుడు వాసవీ మాతను గుర్తు చేసుకున్నారు. వాసవీ మాత పుట్టిన ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దోపిడీదారుడు వై.ఎస్ విగ్రహాలు పెట్టడం న్యాయమేనా అని స్థానికులను ప్రశ్నించారు. తద్వారా పుణ్యక్షేత్ర ప్రసిద్ధిని ఒకవైపు వివరిస్తూనే, ఇంకోవైపు వాసవీ మాత కొలువుదీరిన ఇలా ంటి కేంద్రంలో అవినీతిపరులకు చోటివ్వవద్దంటూ పిలుపునిచ్చినప్పుడు కూడా ప్రజలకు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. గడచిన ఐదురోజులతో పోలిస్తే ఆరో రోజైన గురువారం ఆయన పాదయాత్ర ఒకింత వేగంగానే ముందుకు సాగింది. మార్గమధ్యలో ఆయన పార్టీ నేతలతో ఎక్కువగా సంభాషించారు.

నియోజకవర్గ స్థితిగతులు, తాజా రాజకీయాలపైన ఆయన జిల్లా నేతలతో ముచ్చటిస్తూ అడుగులు వేశారు. చంద్రబాబు వెంట పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పీతల సుజాత, అంగర రామ్మోహన్, మాగంటి బాబు,గుబ్బల తమ్మయ్య, గన్ని వీరాంజనేయులు, పాందువ శ్రీను, పాలి ప్రసాద్, ఉ ప్పాల జగదీష్‌బాబు, గాదిరాజు బాబు, మొ డియం శ్రీనివాసరావు, దాలయ్య, బూరుగుపల్లి వేణుగోపాల్, మేఘలాదేవి, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ,అంబికా కృష్ణ, ముళ్లపూడి బాపిరాజు,శీలం వెంకటేశ్వరరావు, వై టిరాజా,శివరామరాజు తదితరులు ఉన్నారు.

బాటసారికి నీరాజనం

ఆ వృద్ధుడిని అంతగా పట్టించుకోలేదు. యథాలాపంగానే పలకరించాను. కానీ, ఆయన చెప్పిన సంగతులను మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేకపోయాను. సామాజిక సమస్యలపై ఒకేరకం స్పందనను ఆశించలేమేమో! ఈ వృద్ధుడి విషయమే చూస్తే.. ఈ వయస్సులోనూ రిక్షా నడుపుతున్నాడట. వినగానే సంతోషం అనిపించింది. అదే సమయంలో..రిక్షా తొక్కితేనే ఐదు వేళ్లూ నోట్లోకి పోతాయట. ఈ మాట చెప్పడంతోనే నా కళ్లు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి.

రిక్షావాళ్ల గురించి ఆలోచించడం ఒక ఎత్తు.. ఇలాంటి వృద్ధులు రిక్షా లాగి బతకాల్సిన స్థితిని గురించి బాధపడటం వేరు! మార్టేరు సెంటర్‌లో కాసేపు మాట్లాడాను. తిరిగి మాట్లాడేందుకు కూడా ఓపిక ఉన్నట్టు లేదు. కాకపోతే.. కళ్లలో కాస్త జీవకళ! "మీరు మా ఊరు వచ్చారని తెలిసి వచ్చాను. నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది నాయనా'' అంటుంటే మాట తడబడింది. అది వృద్ధాప్యం వల్ల కాదు.. నన్ను చూసిన ఆనందంతో కలిగిన తత్తరపాటు అని తెలుస్తూనే ఉంది. ఇలాంటి అభాగ్యులు ఎలా బతుకుతున్నారో ఆ భగవంతుడికే తెలియాలి!

ఆడపడుచుల చేతుల్లో ఖాళీ బిందెలు..నీళ్లు కూడా లేని రైతుల కళ్లు. ఇవి చాలవా.. కాలువల్లో నిధులు తప్ప నీళ్లు పారడం లేదని చెప్పేందుకు! పెనుకొండలో అన్నదాతల బాధలు వింటే కలిగిన భావమిది. నీలం తుఫాను వచ్చి సగం నాశనం చేసిపోయిందట. శీతకన్నేసిన సర్కారు మిగతా సగం ప్రాణమూ తీస్తోందట. వరద సాయం కింద కోట్లు విడుదలయినట్టు వినడమే గానీ, ఒక పైసా కళ్ల చూడలేదట. " పెనంపై ఉన్నాం. మున్ముందు ఏకంగా పొయ్యిలోకి నెట్టేసేటట్టు ఉన్నారు సార్'' అన్న ఆ రైతు కళ్లలో భయం పోయి.. సర్కారుకు భయం పుట్టించేదెప్పుడో!

ఎలా బతుకుతారో ఏమో..!


హైదరాబాద్: చంద్రబాబును కలిసి సంఘీభావం తెలపాలనుకొనే వారి కోసం వారాంతాల్లో ప్రత్యేక బస్ సర్వీసు నడపాలని 'స్పందన' స్వచ్ఛంద సంస్థ నిర్ణయించింది. శని, ఆదివారాల్లో చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడకు తీసుకువెళ్లి ఆయనను కలిపించి తీసుకురానున్నట్టు సంస్థ నిర్వాహకులు పవన్, పట్టాభి, ప్రత్యగాత్మ తదితరులు గురువారం ఎన్టీఆర్ భవన్‌లో తెలిపారు. "వివిధ రకాల వృత్తి వ్యాపారాల్లో ఉన్న తాము వివిధ సందర్భాల్లో చంద్రబాబు పాదయాత్రలో పాల్గొన్నాం.

ఆసక్తి ఉన్నా ఎలా వెళ్లాలో తెలియక...ఆయన ఎక్కడ ఉన్నారో అర్థం కాక వెళ్లలేకపోతున్నామని చాలా మంది చెబుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాటు చేశాం'' అని వివరించారు. అటువంటి వారు 'వస్తున్నా మీకోసం ట్రిప్. కాం' వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చునని సూచించారు. "మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కాని రాష్ట్రం అభివృద్ది కోసం చంద్రబాబు రావాలని మేం కోరుకొంటున్నాం. ఒక్క పైసా లాభం లేకుండా కేవలం ఖర్చులు తీసుకొని ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. ఉదాహరణకు తణుకు యాత్రకు రానూపోనూ రూ. ఆరు వందలు తీసుకొంటున్నాం. చంద్రబాబు అభిమానుల కోసం మేం ఏర్పాటు చేసిన సౌకర్యం ఇది'' అని పవన్ వివరించారు.

యాత్రకు ప్రత్యేక బస్ సర్వీస్:'వస్తున్నా మీకోసం ట్రిప్. కాం' వెబ్‌సైట్‌

ఆ తప్పు మళ్లీ చేయను
తీర్మానం నెగ్గాలంటే ఎమ్మెల్యేలను కొనాలి
పశ్చిమ యాత్రలో చంద్రబాబు స్పష్టీకరణ



ఏలూరు : "గతంలో ఒకసారి అవిశ్వాసం పెడితే ఎమ్మెల్యేలు అమ్ముడయ్యారు. సూట్‌కేసుల కోసం, ఖరీదైన కార్ల కోసం ఆశపడి పోయారు. మరోసారి ఆ తప్పు నేను చేయలేను. ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం అంటున్నారు. ఆ తీర్మానం నెగ్గాలంటే కచ్చితంగా ఎమ్మెల్యేలను కొనాలి. ప్రజాస్వామ్యాన్నీ కొనేయాలి. ఆ పని నేను చేయలేను'' అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంటు ఇవ్వాల్సిన వేళ.. సర్కారు 'చార్జీల' షాకులు ఇస్తోందని మండిపడ్డారు. 'ఇది సర్కారు కాదు.. దోపిడీదారు'' అని ధ్వజమెత్తారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం జగన్నాథపురం వద్ద గురువారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మార్టేరు, నెగ్గిపూడి, పెనుగొండ, ఐతంపూడి, ఏలేటిపాడు ఎక్స్‌రోడ్, గొల్లగుంటపాలెం, వేండ్రవారిపాలెం వరకు నడిచి ఇరగవరంలో రాత్రి బస చేశారు. విద్యుత్ సర్‌చార్జీలు మరోసారి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను మార్టేరు, పెనుగొండ సభల్లో ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. "భవిష్యత్‌లో మరో పదమూడు వేల కోట్ల మేర సర్‌చార్జీల వసూలుకు సర్కారు సిద్ధమవుతోంది. అసలీ ప్రభుత్వానికి దిశాదశా లేదు. ప్రజలను పీడించడం, పన్నులు వేసి దోపిడీ చేయడమే పనిగా పెట్టుకొంది'' అని మండిపడ్డారు.

టీఆర్ఎస్ 'అవిశ్వాసం' నిర్ణయాన్ని ఆయన తోసిపుచ్చారు. "ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారు. అలాంటివాళ్లు అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ సమర్థించాలా?'' అని మరోమారు ప్రశ్నించారు. చీకటి రాజకీయాలు, సూట్‌కేసు రాజకీయాలకు టీడీపీ దూరమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజునే అవిశ్వాసం అంటూ ఆ రెండు పార్టీలు చీకటి రాజకీయాలతో ముందుకొచ్చాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చకు ఒకసారి తాము సిద్ధం కాగా, 'ఆకలి అవుతున్నది' అంటూ వైఎస్ వెళ్లిపోయేవారని గుర్తుచేశారు.

కాగా మంత్రి పితాని బావ గుబ్బల తమ్మయ్య చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అంతకుముందు.. కవిటం వద్ద నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. "మన పార్టీలో ఉన్న పరిస్థితులను ప్రజలకు వివరించి విరాళం కోరగా.. పాదయాత్రలో ఇప్పటిదాకా 41 లక్షల రూపాయలకు పైగానే వసూలయ్యాయి. మీరూ ఎన్నో త్యాగాలు చేశారు. మరికొంత కాలం తప్పదు. అర ఎకరమో, పావు ఎకరమో అమ్ముకుని అయినాసరే పార్టీని బతికించుకోవడానికి సిద్ధం కావాలి'' అని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యాన్నీ కొనాలి.. ఆ పనిచేయలేను