March 15, 2013

అవిశ్వాస తీర్మానం స్వప్రయోజనాల కోసమే..

మాచర్ల అర్బన్: అసెంబ్లీలో తోక పార్టీలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మా నం ప్రజా సమస్యలపై కాకుండా ఆయా పార్టీల స్వప్రయోజనాల కోసమేనని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటుపల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం ఆయన మాచర్లలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం యాత్ర ప్రజ ల్లో మంచి స్పందన ఉందని పేర్కొన్నారు. తాను 42 రోజులుగా ఆ యాత్ర లో కొనసాగానని, ఆయా ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల నుండి వస్తున్న స్పందన అమోఘంగా ఉందన్నారు. అధినేతలో వచ్చిన మార్పును ముఖ్యం గా రైతులు గమనిస్తున్నారన్నారు. నాటి చంద్రబాబునాయుడు పాలన నేటి కాంగ్రెస్ పాలనను గమనించిన ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నా రు. స్కాంల కాంగ్రెస్‌కు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

విత్తనాల నుండి ఎరువుల వర కు ధరలను పెంచేసిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతుల నడ్డి విరిచిందని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. రైతుల నుండి పంటలు వ్యాపారుల చేతిలోకి వెళ్లగానే ప్రభుత్వం, దళారులు కుమ్మక్కై అమాం తం పెంచేస్తున్నాయని ఆరోపించారు. మూడు సంవత్సరాలు చంద్రబాబు హ యాంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చి న సందర్భాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కిరణ్ ప్రభుత్వం అర్థరహితంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. డ్యాంల్లో నీరున్నా ఒక్క పంటకు కూడా నీరందించకుండా రైతులను నట్టేటముంచారని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ నేత వట్టికొండ రంగనాయకులు, మాజీ సర్పంచ్ మందలపు మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.