March 15, 2013

30లోగా శాశ్వత పరిష్కారం చూపకుంటే ఆమరణ నిరాహార దీక్ష

పులివెందుల టౌన్ : పులివెందుల మున్సి పాలిటిలోని తాగునీటి సమస్యకు ఈ నెల30వ తేదీ లోగా శాశ్వత పరిష్కారం చూపకుంటే ఆమరణదీక్ష చేపడతామని రాష్ట్ర తెలుగుయువత ప్రధానకార్యదర్శి రామగోపాల్‌రెడ్డి మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ తాగునీటికి నిధుల కొరత లేదంటూనే అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోతున్నారన్నారు. మున్సిపాలిటిలో పాలక వర్గం లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఓ కమిటీని ఏర్పాటు చే సి సూచనలు, సలహాలు తీసుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.

తాగునీటి సమస్యలు ఎక్కడెక్కడ ఉండేది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 30 వతేదీలోగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే టీడీపీ ఆధ్వర్యం లో ఆందోళన కార్యక్రమాలతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమన్నారు. బోరుబావులను అధిక సంఖ్యలో తవ్వించి ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చూడాల న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.