October 19, 2012

తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును విమర్శించే అర్హత వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిలకు లేదని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమవతి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల కారణంగా పొయ్యి కింద మంటలేదు.. పొయ్యిమీద వంట లేదు అనే విధంగా తయారైందని వారు విమర్శించారు. తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బాబు ఇంతకు ముందు రెండుసార్లు కేంద్రానికి లేఖలు అందజేశారన్నారు. ఐనా కొంత మంది కావాలని మళ్లీ అభిప్రాయం చెప్పాలని ఒత్తిడి తేవడం అర్థ రహితమన్నారు.

మహబూబ్‌నగర్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే చంద్రబాబు వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర చేపట్టారన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదనట్లు వైఎస్ షర్మిల చంద్రబాబుకు పోటీగా పాదయాత్రను చేపట్టారని విమర్శించారు. పాదయాత్రలో ప్రజలకు ఏమి చెబుతారని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో లక్షలెకరాల ప్రజల భూమిని అక్రమంగా తమ వాళ్లకు కట్ట బెట్టారని విమర్శించారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ కొంత మంది కావాలని పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

అయినప్పటికీ ప్రజలు చంద్రబాబు పాదయాత్రను స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాలినొప్పులను ఖాతరు చేయకుండా చంద్రబాబు పాదయాత్రను కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న జేఏసీ నాయకులు ఎందుకు ముఖ్యమంత్రి పర్యటనను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మద్యపానాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నిషేధించేందుకు బదులుగా ఇష్టమొచ్చినట్లు బెల్టు షాపులకు అనుమతిచ్చి పేద ప్రజల జేబులకు చిల్లులు కొట్టి ఆదాయాన్ని పెంచుకున్నారని విమర్శించారు.

గ్యాస్ సిలిండర్లపై సీలింగ్ విధించి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అస్తవ్యస్త పాలన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విలేఖరుల సమావేశంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షురాలు రాధిక, ప్రధాన కార్యదర్శి వనజ, ఉపాధ్యక్షురాలు సరోజ, అధికార ప్రతినిధి జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి పాల్గొన్నారు.



chandrababu naidu padayatra vastunna meekosam at kurnool dist 19.10.2012

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదనట్లు వైఎస్ షర్మిల పాదయాత్ర ----శోభా హైమవతి

చంద్రబాబును పూలపై నడిపించిన రైతు

  కలుగొట్లకు చెందిన చాకలి అయ్యప్పకు చంద్రబాబు అంటే ఎంతోఅభిమానం. బాబు శుక్రవారం తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకుని తన ఎకరా బతిపూల తోటలో పది బస్తా పూలు కోసి రోడ్డుపై పరిచారు.

తన పొలంలో పండించిన బంతిపూలపై బాబు నడవాలనే కోరిక తీర్చుకున్నారు. గ్రామంలోకి అడుపెట్టినప్పటినుంచి దాటేవరకు బాబును పూలపైనే నడిపించారు. పాదయాత్రలో ఈ దృశ్యం ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. 


పరామర్శల వెల్లువ తరలి వచ్చిన 'దేశం' నాయకులు

కాళ్లనొప్పులతో బాధపడుతున్న చంద్రబాబును పరామర్శించేందుకు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో పాటు రావుల చంద్రశేఖర్‌రావు, దాడి వీరభద్రరావు, నారాయణపేట ఎమ్మెల్యే యల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, కళా వెంకటరావు, దేవరకద్ర ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి తదితరులు శుక్రవారం ఎమ్మిగనూరుకు వచ్చారు.


ఉదయం 11-10 గంటలకు బాబుతో సమావేశమయ్యారు. పరామర్శించిన వారిలో రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, డోన్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్, ఆదోని ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్సీ మసాలపద్మజ, మాజీ మంత్రి ఫరుక్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీటీ నాయడు, బీసీ జనార్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


chandrababu padayatra at kurnool dist

పాదయాత్రలో చంద్రబాబును పూలపై నడిపించిన రైతు (18వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా)

ప్రజా ప్రస్థానానికి ముందు
నాన్న గారు
పార్టీలో ఎంతో మంది
మోటానాయకులలో
ఓ బోడిలింగం
పాతబస్తీ నరమేధం చేసినా
కుర్చీ రాని పరిస్థితి
నిత్య అసమ్మతి వాది అనే ముద్ర
ఒక ప్రక్క
తన ఆద్వర్యంలో
పార్టీకి పాలనా పగ్గాలు
రాక పొతే
రాజకీయంగా సన్యసిస్తానన్నా
నమ్మే సమస్యలేదని
గౌరవ ప్రతిపక్షంగా కూడా
గౌరవించని జనం
ఒక ప్రక్క
మరో ప్రక్క
కొరుకుడు పడని స్థానం లో
సమకాలీకుడు
అభివృద్దిలో అగ్రస్థానం వైపు
ఆంధ్రాను అడుగులు వేయిస్తున్న వైనం
జీవితంలో ఆ కుర్చీ కోసం
ప్రయత్నించిన ప్రతి ప్రయత్నమూ వికటించి
సన్యసిస్తానన్న మాటను మడిచి పెట్టి
విపక్ష నాయకుడిగా కూడా విఫలం చెంది
నేటి దిక్కుమాలిన పరిస్థితి రాకూడదని
దూర దృష్టితో
ఉచిత విద్యుత్తు ఇవ్వలేమని
పాలకులు చెప్పిన దాన్ని
తన సొమ్మేం పోయిందని
ఉచిత విద్యుత్తు ఇస్తానని
ఎన్నో ఉచితాలు తాయిలాలు
ప్రకటిస్తూ
నిస్పృహతో
కొండకు వెంట్రుక వేసినట్టు
ప్రజా ప్రస్థానం చేస్తే
ఏమారిన జనానికి
నామం పెట్టి
జనకుడిగా కొడుకు వైపు మొగ్గి
రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేసిందే
ఆ ప్రజా ప్రస్థానం
జనకుడి కొడుకు
నాన్న శవం రాకనే
ఆసనం కోసం ఆత్రపడితే
అసహ్యించుకొంది అధిష్టానం
అలకను ఎడతెగని ఓదార్పు చేసి
సంబరంగా సమరం చేసినా
బెదరని పార్టీకి
కాసులతో ఓ పార్టీని పెట్టి
కంటిలో నలుసులా అయ్యే సమయంలో
మంత్రి శంకరుల న్యాయస్థానం ఆజ్ఞతో
దర్యాప్తు జరిపి
దర్యాప్తు సంస్థ కొడుకును
కారాగారానికి సాగానంపగా
కాసుల కోసం కక్కుర్తితో చేరిన
ఇతర పార్టీల వాళ్ళ ను ఓదార్చాలో
కారాగారం లో వున్న బిడ్డను ఓదార్చాలో తెలియక
మరో ప్రజా ప్రస్థానం అని
ప్రజలనుండి ఓదార్పు కోరుతూ
ప్రజల్లోకి మరో బిడ్డ అంటూ
కొత్త నాటకానికి తెరతీసారు
కానీ ఓదార్పు కే ఓదార్పు కావాలి
అని పేరును పెట్టి వుంటే
ఏ తికమక వుండేది కాదు

చాకిరేవు బ్లాగు నుండి ...www.chaakirevu.wordpress.com

ఓదార్పు కే ఓదార్పు

ఆరోగ్యశ్రీ స్థానంలో మెరుగైన వైద్య పథకం
వికలాంగులకు పెద్దపీట
ఆ శాఖకు చైర్మన్, కార్యదర్శి వారే
అవమానాలపై ప్రత్యేక చట్టం

  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం కంటే మెరుగైన సమగ్ర ఆరోగ్య వైద్య పథకాన్ని ప్రవేశపెడుతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరోగ్యశ్రీలో కొన్ని రకాల జబ్బులకే వైద్యం అందుతోందని, అలా కాకుండా తాను తన మదిలో ఉన్న పథకానికి ఎక్కువ రోగాలకు వర్తించేలా రూపొందిస్తామని అన్నారు. దీంతో డెంగ్యూ లాంటి విష జ్వరాలకు కూడా ఆ పథకం వర్తింస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వికలాంగులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వస్తున్నా మీకోసం యాత్రలో 18వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కాలినడక సాగించారు. ఈ సందర్భంగా తమ కష్టాలు చెప్పుకున్న వికలాంగులను నుద్దేశించి దారిలో చంద్రబాబు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ. వెయ్యి కోట్లతో బడ్జెట్ చేస్తామన్నారు. ఆ శాఖకు చైర్మన్, కార్యదర్శులు ఆ వర్గం నుంచే ఉంటారన్నారు. వికలాంగులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని చెప్పారు. బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నారు. వికలాంగులను ఏ రకంగా అవమానించినా ప్రత్యేక చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామన్నారు. తమ హయాంలో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు లబ్ధి చేకూరుస్తానన్నారు. తాను అధికారంలోకి వస్తే ఆ వర్గానికి మరింత మేలు చేసి పెద్ద మాదిగను అనిపించుకుంటానన్నారు. వికలాంగులకు సంబంధించిన లక్షా 60వేలు పింఛన్‌లను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితంలో అంధకారం నింపిందన్నారు. ప్రభుత్వ విధానాలతో చాలా మంది వికలాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరు సలహాలు ఇవ్వండి.. నేనేమి చేయాలో అడగండి..
మీ వద్దకు వస్తున్నా.. మీతో మాట్లాడుతున్నా.. మీ కష్టాలు తెలుసుకుంటున్నా.. ఈ సమయంలో నేను మీ కోసం ఏమి చేయాలో చెప్పండి.. మీరు నాకు సలీహాలు ఇవ్వండి.. నిండు మనసుతో ఆశీర్వదించండి.. నన్ను అర్థం చేసుకోండి.. మీ కుటుంబంలో పెద్ద కొడుకుగా ఆదరిస్తే మీకు అండగా ఉంటా.. అంటూ చంద్రబాబు ప్రజలతో మాట్లాడుతున్న ప్రతిసారి అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పెడుతున్న కష్టాలతో అప్పులు లేని వారు లేకుండా పోయారు.

కాంగ్రెస్ దోమలతో జబ్బులు..
రాష్ట్రంలో అవినీతికి మారుపేరు అయిన కాంగ్రెస్ నేతల మాదిరే కాంగ్రెస్ దోమలు కుట్టి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని అన్నారు. కరెంట్ కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయన్నారు. భార్యభర్తల్లో ఒకరు పొలం వద్ద, కాలువ వద్ద ఉంటూ మరొకరు మోటారు వద్ద కనిపెట్టుకున్నా చేనులోకి నీళ్లు సాగడం కష్టంగా ఉందన్నారు. 67 ఏళ్ల స్వాసంత్య్రం అనంతరం కూడా ఆడ బిడ్డలు కష్టాలు పడుతున్నారన్నారు. జరిగిన అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీ హయాంలోనేనన్నారు. పొదుపు సంఘాల ఏర్పాటు, వెలుగు, దీపం, రివాల్వింగ్ ఫండ్, మధ్యాహ్న భోజన పథకం వంటివి తామే ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి పేరుతో నిధులు కాజేస్తూ పంట నష్టపరిహారం కూడా తినేస్తున్నారన్నారు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిన జనం.. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అప్పట్లో నీరాజనం పలికారన్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు తోడుగా రాష్ట్ర నాయకులు.. మూడు రోజులుగా కాళ్ల నొప్పితో బాధ పడుతూ ముందుకు సాగుతున్న చంద్రబాబును పరామర్శించేందుకు టీడీపీ రాష్ట్ర నాయకులు పలువురు ఆయనతో పాటు కాలినడక సాగించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు దాడి వీరభద్రరావు, ఎర్రబల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, మాజీ మంత్రి కళావెంకట్రావు, దేవరకడ్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి దంపతులు, రాష్ట్ర నాయకులు రావుల చంద్రశేఖర్, పి.రాములు, చంద్రశేఖర్, ఎల్లారెడ్డి, రమారాథోడ్, మాజీ ఎంపీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు, వరంగల్ జిల్లాల నుంచి 10 బస్సులు
చంద్రబాబు పాదయాత్రకు చిత్తూరు, వరంగల్ జిల్లాల నుంచి 10 బస్సుల్లో నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చారు. చిత్తూరు జిల్లా నుంచి ఇన్‌చార్జి జేఎంసీ శ్రీనివాసులు, దొరబాబు, కటారి మోహన్, పులవర్తి నాని, ఎస్సీ సెల్ నాయకులు గిరిధర్‌కుమార్, లివిస్‌తో పాటు 6 బస్సుల్లో 400 మంది తరిలారు. వరంగల్ జిల్లా నుంచి 4 బస్సుల్లో 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే ఎల్లారెడ్డితో పాటు 50 మంది కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.



chandrababu vastunna meekosam padayatra at kurnool dist

ఆరోగ్యశ్రీ స్థానంలో మెరుగైన వైద్య పథకం 18వ రోజు వస్తున్నా మీకోసం యాత్రలో..19.10.12








chandrababunaidu_vastunnameekosam_padaytara_19.10.2012

ప్రెస్ నోట్ (Telugudesam party office) 19.10.2012

చంచల్ గూడ లో వున్న
అన్న వదిలిన బాణం
అని చెల్లాయి చెబుతోంది
గతంలో
చర్ల పల్లి నుండి
మద్దెల చెరువు సూరి
పంపిన బుల్లెట్
బావ కళ్ళలో ఆనందం చూడ్డానికి వచ్చి
రామ కోటికి బలైంది
జనం చూసారు
అదే సూరి పంపిన
భాను బాణం కూడా
చాలా సెటిల్మెంట్లు చేసి
చివరి సెటిల్మెంట్ గా
పంపిన సూరి చావును చూసింది
దొంగలు ఖూనీకోరులు దోపిడీదారులు అవినీతి పరులు
కారాగారాలనుండి
పంపే బాణాలు
ధర్మాన్ని న్యాయాన్ని నమ్మే కర్మ దేశంలో
ఏమవుతాయో
బహుశా భగవద్గీతలు లాంటి పురాణాల
మీద నమ్మకంలేని వాళ్లకు
తెలుస్థాయి అనుకోవడం తెలివితక్కువే

ఈ బ్లాగ్ నుండి ....
www.chaakirevu.wordpress.com

చంచల్ గూడ లో వున్న అన్న వదిలిన బాణం ..

చంద్రబాబు పాదయాత్ర శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివార్లలోని కలుగొట్ల రోడ్డులోని సమీరా రైస్‌మిల్లు నుంచి కలుగొట్ల, కె.తిమ్మాపురం.....అలా సాగుతుంది



ఈ రోజు పాదయాత్ర విడీయెల కోసం ......







chandrababunaidu_vastunnameekosam_padayatra_videos_19.10.2012

చంద్రబాబునాయుడి 18వ రోజు పాదయాత్ర విడీయెలు..19.10.2012




పోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.





chandrababunaidu_vastunna meekosam_padayatra_phots_19.10.2012

18వ రోజు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర పోటోలు 19.10.2012

 మహబూబ్‌నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. సమావేశంలో ఈ నెల 22 నుంచి జిల్లాలో జరగబోయే పాదయాత్రపై చర్చించినట్లు సమాచారం.

మహబూబ్‌నగర్ జిల్లాలో బాబు పాదయాత్రను ఎవరూ అడ్డుకోవద్దని ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. తెలంగాణవాదులు మాత్రం బాబు యాత్రను అడ్డుకోని  తీరుతామని తేల్చిచెబుతున్నారు. 


chandrababunaidu_vastunnammekosam_padayatra_19.10.2012

18వ రోజు మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ నేతలతో బాబు భేటి 19.10.2012
















chandrababu_padayatra_vastunna meekosam_photos

17వ రోజు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర పోటోలు .18.10.2012