October 19, 2012

పాదయాత్రలో చంద్రబాబును పూలపై నడిపించిన రైతు (18వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా)

చంద్రబాబును పూలపై నడిపించిన రైతు

  కలుగొట్లకు చెందిన చాకలి అయ్యప్పకు చంద్రబాబు అంటే ఎంతోఅభిమానం. బాబు శుక్రవారం తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకుని తన ఎకరా బతిపూల తోటలో పది బస్తా పూలు కోసి రోడ్డుపై పరిచారు.

తన పొలంలో పండించిన బంతిపూలపై బాబు నడవాలనే కోరిక తీర్చుకున్నారు. గ్రామంలోకి అడుపెట్టినప్పటినుంచి దాటేవరకు బాబును పూలపైనే నడిపించారు. పాదయాత్రలో ఈ దృశ్యం ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. 


పరామర్శల వెల్లువ తరలి వచ్చిన 'దేశం' నాయకులు

కాళ్లనొప్పులతో బాధపడుతున్న చంద్రబాబును పరామర్శించేందుకు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో పాటు రావుల చంద్రశేఖర్‌రావు, దాడి వీరభద్రరావు, నారాయణపేట ఎమ్మెల్యే యల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, కళా వెంకటరావు, దేవరకద్ర ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి తదితరులు శుక్రవారం ఎమ్మిగనూరుకు వచ్చారు.


ఉదయం 11-10 గంటలకు బాబుతో సమావేశమయ్యారు. పరామర్శించిన వారిలో రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, డోన్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్, ఆదోని ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్సీ మసాలపద్మజ, మాజీ మంత్రి ఫరుక్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీటీ నాయడు, బీసీ జనార్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


chandrababu padayatra at kurnool dist