October 19, 2012

ఓదార్పు కే ఓదార్పు

ప్రజా ప్రస్థానానికి ముందు
నాన్న గారు
పార్టీలో ఎంతో మంది
మోటానాయకులలో
ఓ బోడిలింగం
పాతబస్తీ నరమేధం చేసినా
కుర్చీ రాని పరిస్థితి
నిత్య అసమ్మతి వాది అనే ముద్ర
ఒక ప్రక్క
తన ఆద్వర్యంలో
పార్టీకి పాలనా పగ్గాలు
రాక పొతే
రాజకీయంగా సన్యసిస్తానన్నా
నమ్మే సమస్యలేదని
గౌరవ ప్రతిపక్షంగా కూడా
గౌరవించని జనం
ఒక ప్రక్క
మరో ప్రక్క
కొరుకుడు పడని స్థానం లో
సమకాలీకుడు
అభివృద్దిలో అగ్రస్థానం వైపు
ఆంధ్రాను అడుగులు వేయిస్తున్న వైనం
జీవితంలో ఆ కుర్చీ కోసం
ప్రయత్నించిన ప్రతి ప్రయత్నమూ వికటించి
సన్యసిస్తానన్న మాటను మడిచి పెట్టి
విపక్ష నాయకుడిగా కూడా విఫలం చెంది
నేటి దిక్కుమాలిన పరిస్థితి రాకూడదని
దూర దృష్టితో
ఉచిత విద్యుత్తు ఇవ్వలేమని
పాలకులు చెప్పిన దాన్ని
తన సొమ్మేం పోయిందని
ఉచిత విద్యుత్తు ఇస్తానని
ఎన్నో ఉచితాలు తాయిలాలు
ప్రకటిస్తూ
నిస్పృహతో
కొండకు వెంట్రుక వేసినట్టు
ప్రజా ప్రస్థానం చేస్తే
ఏమారిన జనానికి
నామం పెట్టి
జనకుడిగా కొడుకు వైపు మొగ్గి
రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేసిందే
ఆ ప్రజా ప్రస్థానం
జనకుడి కొడుకు
నాన్న శవం రాకనే
ఆసనం కోసం ఆత్రపడితే
అసహ్యించుకొంది అధిష్టానం
అలకను ఎడతెగని ఓదార్పు చేసి
సంబరంగా సమరం చేసినా
బెదరని పార్టీకి
కాసులతో ఓ పార్టీని పెట్టి
కంటిలో నలుసులా అయ్యే సమయంలో
మంత్రి శంకరుల న్యాయస్థానం ఆజ్ఞతో
దర్యాప్తు జరిపి
దర్యాప్తు సంస్థ కొడుకును
కారాగారానికి సాగానంపగా
కాసుల కోసం కక్కుర్తితో చేరిన
ఇతర పార్టీల వాళ్ళ ను ఓదార్చాలో
కారాగారం లో వున్న బిడ్డను ఓదార్చాలో తెలియక
మరో ప్రజా ప్రస్థానం అని
ప్రజలనుండి ఓదార్పు కోరుతూ
ప్రజల్లోకి మరో బిడ్డ అంటూ
కొత్త నాటకానికి తెరతీసారు
కానీ ఓదార్పు కే ఓదార్పు కావాలి
అని పేరును పెట్టి వుంటే
ఏ తికమక వుండేది కాదు

చాకిరేవు బ్లాగు నుండి ...www.chaakirevu.wordpress.com
No comments :

No comments :