June 13, 2013

రాష్ట్రంలోప్రజాస్వామ్యం అవహేళనకు గురవుతోందని, స్వయంగా అసెంబ్లీలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని టిడిపిఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మాణానికి మద్దతుగా గన్‌పార్క్ వద్ద వంటావార్పు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు విూడియాతో మాట్లాడుతూ ప్రజాస్వా మ్యం అసెంబ్లీ సాక్షిగా ఖూనీ అవుతోందని ఆరోపించారు. రెండు సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన తాను, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, తాను విూడియా వా ళ్లు కూడా ముచ్చటించుకునే అవకాశాలు లేకుండా స్పీకర్ చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఉన్నట్లుగా తానైతే భావించడం లేదని నియంతృత్వ పోకడలకు ప్రభుత్వం పోతోందని ద్వజమెత్తారు. రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వందరోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకువస్తామని, వంట గ్యాస్ వంద రూపాయలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం తుంగలో తొక్కారని ఆరోపించారు. అలాగే 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహారభద్రత కల్పిస్తామని, మూడు రూపాయలకు గోదుమలు, రెండు రూపాయలకు కిలోబియ్యం తోపాటు 30 కిలోలు ఒక్కో కుటుంబానికి అందిస్తామని హామి ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఇందులో ఏది కూడా అమలులోకి తెచ్చిన పాపాన ప్రభుత్వం పోలేదన్నారు. రాష్ట్రంలో 9గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని 30కిలోల బియ్యం తెలుపు రంగు రేషన్ కార్డు దారులకిస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మూడువందలనుంచి 400 రేట్లు పెరిగిపోయా యన్నారు. అవినీతి, అసమర్థ పాలనవల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. పేద ప్రజలనడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. 12రూపాయలకు కిలో ఉన్న బియ్యం నేడు 55 రూపాయలకు పెరిగిపోయాయని, 13రూపాయలు కిలో ఉన్న చెక్కర నేడు 43 రూపాయలకు పెరిగిపోయిందన్నారు. ఉప కూడా 15 రూపాయలకు పెరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇట్టే అర్థం అవుతుందన్నారు. కూరగాయల ధరలు కూడా ఆకాశంలో తేలియాడుతున్నాయని వంకాయలు నాలుగు రూపాయలు కిలో ఉండగా నేడు 40 రూపాయలకు, పచ్చిమిర్చి అయిదురూపాయలనుంచి 55 రూపాయలకు పెరిగాయని, ఎండు మిర్చి 20 రూపాయలనుంచి వంద రూపాయలకు పెరిగి పోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఇస్టానుసారంగా పెట్రోల్‌ను 29సార్లు, డీజిల్‌ను 22సార్లు పెంచేశారని ఆరోపించారు. దీనివల్ల నిత్యావసర వస్తువులపై కూడా పడుతోందన్నారు. విద్యుత్ చార్జీలు కూడా 25 వేల నుంచి 35వేలకోట్ల రూపాయలకు పెంచారని దీని ప్రభావం వల్ల పరిశ్రమలపై పడడంతో ఆచార్జీలను సైతం పరిశ్రమలు వినియోగదారులపై మోపుతున్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో 35లక్షల లీటర్ల పాలు అమ్ముడవుతుంటే నిత్యం 39లక్షల లీటర్ల మద్యం అమ్ముతున్నారన్నారు. నిత్యం పాలపై 9కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుంటే మద్యంపై 0కోట్ల రూపాయలు సమకూర్చుకుంటోందని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంతటితో ఆగకుండా నిత్యావసర వస్తువులపై కూడా వ్యాట్ పన్నును వేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అమ్మహస్తం పేరుతో 9రకాల నిత్యావసర వస్తువులను ఇస్తామని గొప్పగా చెపకుంటున్న ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామాల్లోకి చేరనేలేదని, ప్రచారం మాత్రం కోట్ల రూపాయలు వెచ్చించి డబ్బా కొట్టుకుంటుందని ఆరోపించారు. పథకం ప్రారభించడం ప్రచారానికిచేసిన ఆర్బాటం అమలులో చూపించడం లేదన్నారు. ఈపథకంలో కూడా నాసిరకమైన వస్తువులను చేర్చి పేద ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతుందని దుయ్యబట్టారు. నిరుపేద మహిళలు పొయ్యిలపై వంటలు చేసుకుంటూ పొగ ద్వారా ఆరోగ్యాలు, కళ్లు చెడిపోతుంటే చూడలేక తాను అధికారంలో ఉన్నపడు 35లక్షల మందికి దీపం పథకం క్రింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని, ఆతర్వాత ఇప్పటివరకు ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సమస్యలపై చర్చిద్దామంటే అసెంబ్లీని నడిపించలేకుండా వాయిదాలు వేస్తూ తప్పించుకుంటుందని ఆరోపించారు. స్పీకర్‌గా సభను నడిపించడంలో మనోహర్ పూర్తిగా విఫలం అయ్యారన్నారు. నాలుగేళ్లుగా స్పీకర్‌గా తాను సాధించింది ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జవాబుదారీతనం లోపించిందన్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తే ప్రభుత్వ తప్పిదాలు బయటకు వస్తాయని, సమాధానం చెపకోలేక పోతుందనే చిన్నచిన్న కారణాలతో వాయిదాలు వేసుకుంటూ పోతూ ఆనంద పడిపోతున్నారని స్పీకర్‌పైన, ముఖ్యమంత్రి, మంత్రులపై ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని, ప్రతిపక్షంపైన ఓమంత్రి కుక్కతోక వంకర అంటూ తీవ్రంగా విమర్శించినా కూడా స్పీకర్ అసెంబ్లీలో క్షమాపణ చెప్పించకుండా వాయిదా వేశారని ఆరోపించారు. కేవలం రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పడం శోచనీయమని, అప్పటికే ప్రజల్లోకి విూడియా ద్వారా వెళ్లిపోయిందన్నారు. రికార్డులనుంచి తొలగించడం ఎవరికి కావాలని చంద్రబాబు స్పీకర్‌పై విరుచుకు పడ్డారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తీరుమారకపోతే పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఎలాగూ ప్రభుత్వానికి సమాదికట్టే రోజులు దగ్గర పడుతూనే ఉన్నాయని రాబోయే ఎన్నికల్లో గద్దెదిగడమే కాక ఘోరాతి ఘోరంగా ఓటమిని రుచి చూపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బాబు హెచ్చరించారు.

ప్రజాస్వా మ్యం అసెంబ్లీ సాక్షిగా ఖూనీ అవుతోందని ఆరోపించారు......

వైఎస్ జగన్‌తో సీఎం కిరణ్ కుమ్మక్కయ్యారని టీడీపీ ఎమ్మెల్యే లు ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజేశ్ మా ట్లాడుతూ జగన్ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై భౌతికదాడులు చేస్తామని ప్రకటించారని, కార్యకర్తలను సమాయత్తం కావాలని పిలుపునిచ్చారన్నారు. ఈ పిలుపువచ్చిన వెంటనే సీఎం కిరణ్ ప్రాణభయంలో ఉన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలకు గన్‌మెన్లను కుదించారని ఆరోపించారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు పల్లె రఘునాథడ్డి, బల్లి దుర్గావూపసాద్, వరసారత్నం, ఎమ్మెల్సీ రాజేంవూదవూపసాద్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ నాయకులను భౌతికంగా అంతమొందించాలని పిలుపు ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ పార్టీ దాడులు చేస్తానంటే, మా నాయకులకు భద్రత తగ్గిస్తారా? అని నిలదీశారు.

జగన్‌తో సీఎం కుమ్మక్కు: టీడీపీ

శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండి పడ్డారు. కుక్కతోక వంకర అంటూ సభలో మంత్రులు అంటున్నారని, కానీ వాళ్లదే వక్రబుద్ధి అని అన్నారు. ధరల పెరుగుదలపై గురువారం ఉదయం సభ ప్రారంభానికి ముందు గన్‌పార్కు వద్ద పార్టీ ఎమ్మెల్యేలలో కలిసి బాబు ధర్నా నిర్వహించారు. ధర్నాలో వంటా వార్పు కార్యక్షికమాన్ని చేపట్టారు. చంద్రబాబు మాట్లాడుతూ సర్కారు సభను నడిపించకపోవడంతో తాను బయట ఇలా మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం అర్ధరాత్రి కుటుంబసభ్యులతో అమెరికాకు వెళ్లారు. అమెరికాలో చదువుకుంటున్న కోడలు బ్రహ్మణి కశాశాల స్నాతకోత్సవ వేడుకల్లో పాలొనేందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ నెల 22న బాబు ఇండియాకు తిరిగిరానున్నారు.

మంత్రులదే వక్రబుద్ధి: చంద్రబాబు

యుపిఏ, ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుంది, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ పేరు ఏదైనా కావచ్చునని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు.

యుపిఏ, ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు


 స్పీకర్ తీరును విమర్శిస్తూ టిడిపి శాసన సభాపక్షం స్పీకర్‌కు లేఖ రాసింది. టిడిపి శాసన సభాపక్షం నాయకుడు చంద్రబాబునాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే రమణ ఈ లేఖపై సంతకాలు చేశారు. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తాము ఫిర్యాదు చేసినా వెంటనే చర్య తీసుకోలేదని గుర్తు చేశారు. సభలో మాట్లాడేందుకు సమయం కేటాయించడంలో టిడిపి పట్ల వివక్ష చూపుతున్నారు. సభలో టిడిపి తరఫున ఎవరు మాట్లాడాలో స్పీకర్ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. వివిధ సభా కమిటీల్లో సభ్యుల నియామకంలో సైతం ఇదే విధంగా జరుగుతోందని తెలిపారు. టిడిపి సభ్యులు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా మధ్యలో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు.

స్పీకర్‌కు టిడిపి ‘అభిశంసన లేఖ’

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. 23న తిరిగి వస్తారు. ఈ సందర్భంగా టిడిఎల్‌పి కార్యాలయంలో ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి తీవ్రంగా కృషి చేయాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తేనే, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? అని సమావేశంలో ఎమ్మెల్యే చందర్‌రావు ప్రశ్నించగా, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా సర్దుబాట్లు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. టిడిపి ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, రేవంత్‌రెడ్డి తదితరుల గన్‌మెన్లను తొలగించారని టిడిపి ఎమ్మెల్యేలు తెలిపారు. గురువారం టిడిఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లె రఘునాథరెడ్డి, బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే గన్‌మెన్లను తొలగించారని ఆరోపించారు.

అమెరికా వెళ్లిన బాబు


టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గరిటె తిప్పారు. ఔను నిజం. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతి రోజు ఒక అంశంపై గన్‌పార్క్ వద్ద ధర్నా చేయాలని టిడిపి నిర్ణయించింది. దీనిలో భాగంగా గురువారం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద వంటా వార్పు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సీతక్క కట్టెల పొయ్యిను ఊదుతూ వంట వండుతుంటే చంద్రబాబునాయుడు గరిటె తిప్పారు. మరో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ వంటకు సహకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని విమర్శించారు. వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ సంగతి మరిచిపోయిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 300 నుంచి 400 శాతం వరకు ధరలు పెరిగాయని తెలిపారు. అవినీతి, అక్రమాలు తప్ప కాంగ్రెస్‌కు ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. శాసన సభలో ప్రజల సమస్యలు ఏ మాత్రం చర్చించడం లేదని విమర్శించారు. సభను సజావుగా జరిపించాల్సిన బాధ్యత స్పీకర్‌కు లేదా? అని ప్రశ్నించారు.

గరిటె తిప్పిన బాబు

రాజకీయాల్లో ఒకస్థాయి గల నేత అయిన టీడీపీ అధినేత చంద్రబాబును అవమానపర్చేవిధంగా ఎవరూ మాట్లాడినా సరికాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మేనమామ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై బొత్స పైవిధంగా స్పందించారు. ఒక పార్టీ నేతను కలిసినప్పుడు, మాట్లాడిన ప్రతి అంశాన్ని మీడియాకు చెప్పి పల్చన కావద్దని జేసీకి హితవు పలికారు.

బాబును అవమానపర్చడం సరికాదు: పీసీస

హైదరాబాద్‌ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని టీడీపీ సుప్రీం చంద్రబాబునాయుడు విమర్శించారు. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాల ప్రారంభాని ముందు గన్‌పార్క్‌ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పి, అధికారంలోకి వచ్చిన అనంతరం ధరలను విపరీతంగా పెంచిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర ధరలు 300 నుంచి 400 శాతం పెరిగాయన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని చెప్పారు. స్పీకర్‌ వ్యవహార శైలి బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ నేతలు గన్‌పార్క్‌ వద్ద వంటావార్పు నిర్వహించారు.

ధరల పెరుగుదలకు ప్రభుత్వాలేకారణం : చంద్రబాబు

ప్రముఖ హీరో బాలకృష్ణ, ఆయన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న కాన్వొకేషన్ లో చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి పట్టా తీసుకుంటోంది. ఈ కార్యక్రమానికి వారంతా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం జరిగిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు హైదరాబాదు తిరిగి వస్తారు. బాలకృష్ణ మాత్రం జులై వరకు అక్కడే ఉండి ఆ తరువాత వెనుదిరుగుతారు.

ఇది పూర్తిగా వ్యక్తిగత టూర్ అని, ఇందులో ఎవరిని వారు కలవరని తెలుస్తోంది. అయితే ఈనెల 28, 29 తేదీల్లో అమెరికాలోని కింగ్ ఆఫ్ ప్రష్యా నగరంలో తెలుగు సంఘం 40వ వార్షికోత్సవాలను జరుపుకుంటోంది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు.

చంద్రబాబు, బాలకృష్ణ పర్సనల్ టూర్ !

అసెంబ్లీలో స్వపక్ష శానస సభ్యుల తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే.. తగురీతిలో పోరాడటం లేదంటూ ఆయన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండానే స్పీకర్‌ సభను వాయిదా వేసుకు పోతుంటే ఎందుకు అడ్డుకోలేక పోయారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు గంటలు కూడా సభలో కూర్చోలేని వారు రాజకీయాలు ఎలా చేస్తారని చంద్రబాబు చురకలు వేశారు. మంత్రులు స్పీకర్‌ నుండి మైక్‌ తీసుకుని ఇష్టాను సారం మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీ శారు. అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసు కోవాలని చంద్రబాబు తమ్ముళ్లకు స్పష్టం చేశారు.

సభ మద్యలో పలువురు శాసన సభ్యులు లాబీల్లోకి రావడం, లాబీల్లోని టీడీఎల్పీ కార్యాలయంలో కూర్చిని మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి కాలక్షేపం చేయడం వల్ల ఉపయోగం ఏమిటీ? ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావిద్దామన్న ధ్యాస లేక పోతే ఎలా? కొత్తగా సభకు వచ్చిన వారంటే సరే.. గానీ సీనియర్లు.. రెండు సార్లు మూడు సార్లు నాలుగు దఫాలు సభకు ఎన్నికైన వారి సంగతేంటీ? అని చంద్ర బాబు నాయుడు తీవ్ర స్వరంతో అన్నట్లు సమా చారం. సభకు ఎంత మంది హాజరవుతున్నారు.? ఎవరైనా రాని వారు ఉన్నారా? వారి సంగతేంటీ? అని నారా చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం.

సబ్జెక్టుల వారీగా ప్రిపేరవుతున్న తమ్ముళ్లు!
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమం త్రిగా ఉన్న 9 సంవత్సరాలు వివిధ మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ శాసన సభ్యులకు ఆయా అంశాలపై గట్టి పట్టు ఉండ డంతో చంద్రబాబు వారిపైనే ఎక్కువ బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తోంది. జలయజ్ఞం, గనులు, భూగర్భ వనరులు, విద్యా, వైద్యం, సాంఘిక సంక్షేమం, విద్యుత్‌ తదితర శాఖలకు సంబం ధించిన అంశాలను మాజీ మంత్రులకు అప్పగిం చినట్లు సమాచారం. ముఖ్యంగా విద్యుత్‌ ఛార్జీలు, వ్యవసాయం, రైతాంగ సమస్యలపై పూర్తి స్థాయిలో నేతలు అథ్యయనం చేయాలని బాబు ఆదేశాలు జారీ చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తమ్ముళ్లపై బాబు ఫైర్‌



లేఖ రాస్తాం.. మారకుంటే చూస్తాం

సభా సంప్రదాయా లను తుంగలో తొక్కి అధి కార పార్టీ ఏజెంట్‌గా వ్యవహ రిస్తోన్న శాసనసభ స్పీకర్‌ తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ధ్వజ మెత్తింది. ఆ పార్టీ శాసనసభా పక్షం బుధవారం చంద్రబాబు నాయుడు నివాసంలో సుదీర్ఘంగా సమావేశమైంది. అనంతరం, రాత్రి ఆ పార్టీ అధికార ప్రతినిధి గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతి రాజు, ఎమ్మెల్యే ఎల్‌. రమణ చంద్రబాబు నివాసం ఎదుట విలేకరులతో మాట్లాడారు. ''స్పీకర్‌ పదవి ఉన్నతమైంది. ఆ స్థానంలో కూర్చునే వ్యక్తులు పార్టీల రంగులను సూచించే కండువాలు కప్పుకోరు. ఈ స్పీకర్‌ మాత్రం కాంగ్రెస్‌ మార్కు మూడు రంగుల కండువా కప్పుతారు. అదేమంటే- అవి జాతీయ జండా రంగులు అంటారు. జాతీయ జెండాను స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంతో పాటు ఇతర జాతీయ పండుగల సందర్భాల్లో ధరించడం సంప్రదాయం. అనునిత్యం ఎవరూ ధరించరు. ఒకవేళ అది మన జెండాను ప్రతిబింబించే కండువా అని భావించినా.. స్పీకర్‌ దాంతో ముఖం తుడుచుకోవడం జాతీయ జెండాను అవమానించడం కిందికే వస్తుంది'' అని గాలి స్పష్టం చేశారు. ఆయన ఠక్కున సభను వాయిదా వేస్తారు. ఆ వెంటనే అసెంబ్లిd నుంచి వెళ్లిపోతారు. స్పీకర్‌తో ప్రస్తావించాల్సిన అత్యవసర అంశాలు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్తాం. ఇంటి వద్ద కలవొద్దు అంటారు. ఇదేం పద్ధతి? అలా భావిస్తే ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగవచ్చు. స్పీకర్‌గా ఎందుకు కొనసాగడం అని నిప్పులు చెరిగారు.

స్పీకర్‌ విధి శాసనసభను సజావుగా నడపడం మాత్రమే. చరిత్రలో ఏ స్పీకర్‌ చేయని విధంగా ప్రభుత్వం చేసే పనుల్లో ఈయన జోక్యం చేసుకుంటారు. శాసనసభ సభ్యులను వెంట వేసుకుని సొంత జాగీరులాగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఫ్లోరైడ్‌ పీడిత ప్రజలను పరామర్శిస్తారు. ఆ పని చేసేందుకు ప్రభుత్వం ఉంది. స్పీకర్‌ తన పరిధిని అతిక్రమించారని ''దేశం'' నేతలు విరుచుకుపడ్డారు.

ఆయన కేవలం రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యే. మాలో అశోక్‌ గజపతి రాజు ఏడుసార్లు గెలిచారు. అయిదారు సార్లు గెలిచిన చరిత్ర మాకుంది. కౌల్‌ అండ్‌ షక్దర్‌ నిబంధనావళి మాకు కంఠోపాఠం. అధికార పక్షంగా.. విపక్షంగా సుదీర్ఘ అనుభవం మాకుంది. అద్భుతంగా మాట్లాడగలిగే మా కొత్త సభ్యులకు స్పీకర్‌ అవకాశం కల్పించడం లేదు. మా కొత్త సభ్యుల్లో సగం మంది సభలో ఇంకా నోరు విప్పలేదని ముద్దు కృష్ణమ చెప్పారు.

మా నేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా 1979లో శాసనసభకు ఎన్నికయ్యారు. 1980లోనే మంత్రివర్గంలో చేరారు. ఆ తర్వాత ఎందరో నేతలను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా తయారు చేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులకు ఆయా వ్యక్తులను ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆయన ప్రస్తుతం సభలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు. సభలో సభా నాయకుడు (సాధారణంగా ముఖ్యమంత్రి), ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మైక్‌ కట్‌ చేయకూడదు. సమయాన్ని గుర్తు చేయకూడదు. ఆ సంప్రదాయాలను ఆయన తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సభలో తప్పుడుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

లేఖ రాస్తాం.. తదుపరి నిర్ణయిస్తాం

''స్పీకర్‌ చేస్తూ వస్తోన్న తప్పులను వరుసగా గుర్తించి ఒక లేఖను రూపొందిస్తాం. ఆ లేఖను ఆయనకే అందజేస్తాం. ఆయన తప్పులు సవరించుకుంటే మంచిది. కాని పక్షంలో ఏం చేయాలన్నది తదుపరి నిర్ణయిస్తాం'' అని స్పీకర్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారా? అన్న ప్రశ్నకు జవాబుగా ముద్దు కృష్ణమ చెప్పారు.

వాటిని బహిష్కరించాం

తమ సమావేశంలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానెల్‌, టి- చానెల్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని గాలి ముద్దు కృష్ణమ నాయుడు తేల్చి చెప్పారు. అవి ఆయా రాజకీయ పక్షాలకు అనుబంధంగా పని చేస్తూ తమ సొంత ఎజెండాను రుద్దుతున్నాయని ఆరోపించారు. ఇక ముందు తాము నిర్వహించే పాత్రికేయ సమావేశాలకు ఆయా సంస్థల ప్రతినిధులు రావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఇదే విధానాన్ని అనుసరించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.

స్పీకర్‌పై దేశం నిప్పులు జాతీయ జెండాను అవమానిస్తున్నారు ప్రభుత్వ విధుల్లో తలదూరుస్తున్నారు

మేనమామ లాగా పెద్దరికంతో ప్రభుత్వాన్ని కాపాడుతున్నానని జేసీ అంటాడా అసలాయన్ని ఎందుకు రానిచ్చారు కాంగ్రెస్‌ నాయకులెవరినీ నా ఛాంబర్లోకి రానివ్వొద్దు. వాళ్ళ సలహాలు, సూచనలు నాకక్కర్లేదు. అటువంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు.

నేను మేనమామనా..! - చంద్రబాబు



తన చాంబర్‌ సిబ్బందికి బాబు హుకుం
  'నా చాంబర్‌లోకి కాంగ్రెస్‌ నాయకులెవరినీ అనుమతించవద్దు' అంటూ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సిబ్బందికి హుకుం జారీ చేశారు. తనకు ఎవరి సలహాలు, సూచనలు అవసరం లేదని, కాంగ్రెస్‌ నాయకులతో మాటలు అసలే వద్దని, అటువంటి వారితో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి చంద్రబాబు మేనమామలాగా ఉన్నారంటూ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆయన మండిపడ్డారు. సభా కార్యక్రమాల నిర్వహణ తీరుపై చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆయన చాంబర్‌కు వెళ్ళిన జెసి ఆ తర్వాత విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్య ఆయనకు ఆగ్రహం తెప్పించింది. మేనమామలాగా పెద్దరికంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారంటూ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్య పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ఇదిలాఉండగా, చంద్రబాబు మేనమామ అవునో కాదో కానీ, దివాకర్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి శకుని మామలాగా ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తున్నందునే కాంగ్రెస్‌ నేతలు తమవద్దకు వచ్చి వంగివంగి నమస్కారాలు చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు.

కాంగ్రెస్‌ నేతల్ని రానివ్వొద్దు

తెలుగుదేశం పార్టీ గన్ పార్కును కేంద్రంగా చేసుకుని ఆందోళనలు కొనసాగిస్తోంది.ధరల పెరుగుదలపై గురువారం నాడు ధర్నా చేసింది. శాసనసభలోచర్చకు అవకాశం లేనందున తాము ఇక్కడ ఆందోళన చేపట్టవలసి వస్తున్నదని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు.దరల పెరుగుదలతో ప్రజల జీవన పరిస్థితులు అద్వాన్నంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ఇక్కడ వంటా వార్పు కార్యక్రమం కూడా చేపట్టింది.

ధరల పెరుగుదలపై గన్ పార్కు వద్ద టిడిపి ధర్నా!

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్‌లో తాము భాగస్వాములవుతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. యూపీఏ, ఎన్డీఏ వ్యతిరేక పార్టీలతో టీడీపీ కలుస్తుందని వివరించారు. ఇతర ప్రాంతీయ పార్టీలతోనూ తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. సరైన సమయంలో మా నిర్ణయాన్ని వెల్లడిస్తామని బాబు పేర్కొన్నాడు.

ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వాములవుతాం:బాబు


ధరలు పెరుగుదలకు ప్రభుత్వాలే కారణం : చంద్రబాబు