June 13, 2013

తమ్ముళ్లపై బాబు ఫైర్‌

అసెంబ్లీలో స్వపక్ష శానస సభ్యుల తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే.. తగురీతిలో పోరాడటం లేదంటూ ఆయన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండానే స్పీకర్‌ సభను వాయిదా వేసుకు పోతుంటే ఎందుకు అడ్డుకోలేక పోయారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు గంటలు కూడా సభలో కూర్చోలేని వారు రాజకీయాలు ఎలా చేస్తారని చంద్రబాబు చురకలు వేశారు. మంత్రులు స్పీకర్‌ నుండి మైక్‌ తీసుకుని ఇష్టాను సారం మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీ శారు. అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసు కోవాలని చంద్రబాబు తమ్ముళ్లకు స్పష్టం చేశారు.

సభ మద్యలో పలువురు శాసన సభ్యులు లాబీల్లోకి రావడం, లాబీల్లోని టీడీఎల్పీ కార్యాలయంలో కూర్చిని మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి కాలక్షేపం చేయడం వల్ల ఉపయోగం ఏమిటీ? ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావిద్దామన్న ధ్యాస లేక పోతే ఎలా? కొత్తగా సభకు వచ్చిన వారంటే సరే.. గానీ సీనియర్లు.. రెండు సార్లు మూడు సార్లు నాలుగు దఫాలు సభకు ఎన్నికైన వారి సంగతేంటీ? అని చంద్ర బాబు నాయుడు తీవ్ర స్వరంతో అన్నట్లు సమా చారం. సభకు ఎంత మంది హాజరవుతున్నారు.? ఎవరైనా రాని వారు ఉన్నారా? వారి సంగతేంటీ? అని నారా చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం.

సబ్జెక్టుల వారీగా ప్రిపేరవుతున్న తమ్ముళ్లు!
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమం త్రిగా ఉన్న 9 సంవత్సరాలు వివిధ మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ శాసన సభ్యులకు ఆయా అంశాలపై గట్టి పట్టు ఉండ డంతో చంద్రబాబు వారిపైనే ఎక్కువ బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తోంది. జలయజ్ఞం, గనులు, భూగర్భ వనరులు, విద్యా, వైద్యం, సాంఘిక సంక్షేమం, విద్యుత్‌ తదితర శాఖలకు సంబం ధించిన అంశాలను మాజీ మంత్రులకు అప్పగిం చినట్లు సమాచారం. ముఖ్యంగా విద్యుత్‌ ఛార్జీలు, వ్యవసాయం, రైతాంగ సమస్యలపై పూర్తి స్థాయిలో నేతలు అథ్యయనం చేయాలని బాబు ఆదేశాలు జారీ చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.