November 15, 2012

2002లో అనుకుంటా! రంగారెడ్డి జిల్లా ఖానాపూర్ నుంచి ఆర్టీసీ బస్సు బయలుదేరింది! బస్సు నిండా కూరగాయలు, కాయగూరల బుట్టలూ తట్టలూ! వాటి మధ్యలో రైతులు! దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ చేరుకునేవారు! పచ్చని కూరగాయలతో రాజధానికి వచ్చి.. సాయంత్రానికి చల్లని చిరునవ్వుతో ఇంటికి చేరేవారు. ఒక్క ఖానాపూరే కాదు.. హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి జిల్లాలోని ఏట్ల ఎర్రవల్లి, దేవారంపల్లి, ఘనాపూర్ తదితర గ్రామాల రైతులు వారి ఉత్పత్తులకు వారే ధర నిర్ణయించుకున్నారు!

ఇదంతా, అప్పట్లో మేం శ్రీకారం చుట్టిన రైతు బజార్ వ్యవస్థ చలవ! ఇందుకు రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక బస్సులు కూడా వేశాం. రైతు బజార్ కాన్సెప్ట్‌ను రాజధానిలో ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాం. రైతు పండించిన పంటను రైతే విక్రయించుకునేలా చేశాం.

వ్యవస్థలను నిర్మించడం మా వంతు! కుప్పకూల్చడం కాంగ్రెస్ వంతు! మిగిలిన వ్యవస్థల తరహాలోనే రైతు బజార్ వ్యవస్థనూ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసేసింది. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్‌లో పాదయాత్ర చేస్తుంటే తమ కష్టాలను రైతులే కళ్లకు కట్టినట్లు వివరించారు. పంటలు సరిగా పండడం లేదు. పండిన పంటనూ గిట్టుబాటు ధరకు అమ్ముకునే అధికారం వారికి లేదు. దళారులు మళ్లీ రంగప్రవేశం చేశారు.

రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలోని పొలంలో పావలాకు కొంటున్నారు. దానిని హైదరాబాద్ తీసుకెళ్లి పది రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రైతులూ నష్టపోతున్నారు. అక్కడ వినియోగదారులూ మోసపోతున్నారు. మధ్యలో దళారులు బలిసిపోతున్నారు.

మేం నిర్మించిన వ్యవస్థను పునర్నిర్మించాలంటే మళ్లీ మేమే రావాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బజార్ వ్యవస్థను పునర్నిర్మిస్తాం. రైతును రాజును చేస్తాం. దళారులను ఏరిపారేస్తాం. ఇటు రైతుకు, అటు వినియోగదారుకు సరసమైన ధర లభించేలా చూస్తాం.

రైతు బజార్ లో రైతు బేజార్




"తెలంగాణ పేరుతో కేసీఆర్ అమాయకులను చంపుతున్నారు. జనాలను మభ్యపెడుతున్నారు'' అని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. బాబు పాదయాత్ర సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ రెచ్చగొట్టే మాటల వల్ల ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారని.. శవయాత్రలు చేసి కేసీఆర్ లబ్ధి పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. "తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మళ్లీ మీరు సీఎం కావాలి'' అని బాబును ఉద్దేశించి వెంకట్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మళ్లీ మీరు సీఎం కావాలి

వస్తున్నా మీ కోసం' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర 700 కిలోమీటర్లకు చేరింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామంలో ఆయన ఈ మైలురాయిని దాటారు. అనంతపురం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని 100 గ్రామాల్లో, కర్నూలు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 54 గ్రామాల్లో, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో 74 గ్రామాల్లో, రంగారెడ్డి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోని 50 గ్రామాల్లో ఆయన తన పర్యటన జరిపారు.

మొత్తం 278 గ్రామాల్లో ఆయన వేల మంది ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకొన్నారని, ప్రజలతో మమేకం కావడం ద్వారా వారికి మరింత మంచి భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ఈ యాత్రకు అందరూ నిండు హృదయంతో సహకరించాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహనరావు ఒక ప్రకటనలో కోరారు.

278 గ్రామాల్లో 700 కిలోమీటర్ల మైలురాయిని దాటిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర



ప్యాకేజీలు కేసీఆర్‌కే
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్ననాడు
టీఆర్ఎస్ ఒక్కపనైనా చేసిందా?
నాకు 42 మంది ఎంపీలను ఇవ్వండి..
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చూపిస్తా
రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు..
అడవి పందుల్లా, పందికొక్కుల్లా తింటున్నారు
పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం
"అడవి పందులు తిన్నంత తిని మిగిలిన పంటను నాశనం చేస్తాయి.. అలాగే కాంగ్రెస్ వాళ్లు కూడా రాష్ట్రాన్ని దోచుకు తినడమేకాక మిగిలిన వ్యవస్థలను సర్వనాశనం చేశారు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు పేర్కొన్నారు. 'మీకోసం వస్తున్నా'లో భాగంగా గురువారం ఆ యన రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లి, దేవరంపల్లి, రేగడిఘనాపూర్, ఖానాపూర్, నాంచేరిగేట్, బస్తేపూర్, మీ ర్జాగూడ క్రాస్‌రోడ్ల మీదుగా పాదయాత్ర చేశారు.

మార్గమధ్యంలో గ్రా మస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి క ష్టాలు విన్న చంద్రబాబు.. రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు పడ్డారని, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందిన కాడికి దోచుకోవడమే కాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. "మీరు కట్టే పన్నులను, మీ శ్రమను పందికొక్కుల్లా భోజనం చేస్తున్నా రు. ఇదంతా మీ ఇంటి సొమ్మేనన్న విషయం గుర్తుంచుకోండి'' అన్నారు. అవినీతిపరులకు నిలయంగా మారిన చంచల్‌గూడ జైలు నుంచి కొం దరు శవరాజకీయాలకు, నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని విమ ర్శించారు.

తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని.. ఒకసారి టీఆర్ ఎస్‌ని, మరోసారి వైసీపీని వాడుకుంటోందన్నారు. టీఆర్ఎస్ ఏడాది న్నర పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉండి అధికారాన్ని అనుభవించిందని ఆ సమయంలో ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నిం చారు. తెలంగాణపై కాంగ్రెస్ తేల్చకుండా టీడీపీపై నింద వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'సామాజిక తెలంగాణ' అన్న ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ తనలో కలిపేసుకుందని.. మిగతా రెండు పార్టీలతో బేరాలు మొదలుపెట్టిందన్నారు.

"టీఆర్ఎస్‌తో చర్చలు జరుపుతున్నారు. ప్యాకేజీలు అంటున్నారు. ఎవరికి ఇస్తారు, టీఆర్ఎస్‌కేనా?'' అని ప్రశ్నించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నాళ్లు ఉంటారో తెలియదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒక్కటేనని కనీసం పేరు కూడా మా ర్చుకోలేదని ఎద్దేవా చేశారు. చిరంజీవి లేకుంటే గత ఎన్నికల్లో టీడీపీనే గెలిచేదన్నారు. దేవరంపల్లిలో ఓ రైతు.. "యూరియా ధర రూ.500 పెరిగిపోయింది. వ్యవసాయం చేయాలంటే భయం వేస్తోంది'' అని వాపోయారు.

దీనికి స్పందించిన చంద్రబాబు.. "రాష్ట్రం నుంచి 10 మంది కేంద్ర మంత్రులున్నారు. వారంతా శుద్ధ దండగ. గతంలో మీరు టీడీపీకి అధికంగా ఎంపీలను ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పాం. ఒక్క ఫోన్‌కాల్‌తో సమస్యలను పరిష్కరించే వాళ్లం. వచ్చే ఎన్నికల్లో నాకు 42 ఎంపీ సీట్లు ఇవ్వండి.. యూరియా ధర సమస్యతో పాటు రాష్ట్రంలోని అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని బాబు చెప్పారు. బాబు పాద యాత్రలో టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, చంద్రరావు, రత్నం, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బాబుకు సంఘీ భావంగా సాంకేతిక విద్యాశాఖ మాజీ కమిషనర్ లక్ష్మీనారాయణ కూడా పాల్గొని రాత్రి దాకా నడిచారు.

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్ననాడు టీఆర్ఎస్ ఒక్కపనైనా చేసిందా?..15.11.2012