February 20, 2013

జిల్లాలో 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర కొనసాగిస్తోన్న చంద్రబాబుకు వాడవాడలా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారా వు చెప్పారు. మంగళవారం ఉద యం వేమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళలు స్వచ్చంధంగా ముందుకొచ్చి మా కష్టాలు తీరాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని గట్టిగా విశ్వసిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు బలహీనవర్గాలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకొంటూ వాటి పరిష్కారమార్గాలను ఆలోచిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఆయన మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తిగా విశ్రాంతి శిబిరానికి పరిమితమౌతారని చెప్పా రు. ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా చంద్రబాబు ఈసీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తున్నారని వెల్లడించారు. త్వరలో జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందన్నారు. జిల్లాలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ టీడీపీనే అని ఒకవేళ కాంగ్రెస్, వైసీపీ లోపాయికారి ఒప్పందం చేస ుకొంటే ప్రజలే వాటిని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.

ప్రజల్లోకి సునామిలా వెళుతోన్న పాదయాత్ర మాజీ మంత్రి డాక్టర్ 'కోడెల' చంద్రబాబు కొనసాగిస్తోన్న పా దయాత్రకు రోజురోజుకు జనాదరణ విపరీతంగా పెరుగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మం త్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం సాయం త్రం ఆయన వేమూరులో చంద్రబాబు బస చేసిన శిబిరం వద్ద విలేకరులతో మాట్లాడుతూ పాదయాత్ర ఒక సునామిలా ప్రజల్లోకి చొచ్చుకొని పోతోందన్నారు. టీడీపీ హ యాంలో ఏమి పనులు జరిగాయి, పరిపాలన ఎలా నడిచింది, ఇప్పుటి పరిస్థితి ఏమిటి అనేది ప్రజలు చర్చించుకొంటున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం పేదల కోసం కాదు పెద్దల కోసమేనని గట్టిగా నమ్ముతున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిం ది చంద్రబాబేనన్న విషయాన్ని కూడా విశ్వసిస్తూ స్వా గతం పలుకుతున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ, బెల్టుషాపుల తొలగింపు, ఎన్‌టీఆర్ సుజలకాంతి పథకం తో ఇంటింటికి కృష్ణాజలాల తాగునీరు హామీలు అమ లు చేసి తీరుతామని స్పష్టం కోడెల స్పష్టం చేశారు.

బాబుకు నీరాజనాలు

ఆయన క్రమశిక్షణ కలిగిన నాయకుడు. వ్యక్తిగతంగానూ, రాజకీయాల్లోనూ నిబద్ధతను పాటిస్తారు. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా చట్టాన్ని గౌరవిస్తారు. ఆయనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకల్లా పాదయాత్ర నిలిపేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను ఆయన తూచ తప్పకుండా పాటించి క్రమశిక్షణకు మారుపేరుగా మన్ననలు అందుకొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జంపని నుంచి పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు మండుటెండలో మూడున్నర కిలోమీటర్లు నడిచిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కేవలం పావుగంట విశ్రాంతి తీసుకొన్నారు. ఆ వెంటనే పాదయాత్రను తిరిగి ప్రారంభించి ప్రజలతో సంభాషిస్తూ వారి సమస్యలు తెలుసుకొంటూ ప్రసంగిస్తూ ముందుకు సాగారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావును అడిగి తెలుసుకొన్న చంద్రబాబు వాటిని తూచ తప్పకుండా పాటించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పాదయాత్ర చేసే అవకాశం ఉన్నా నాలుగు గంటలకే ముగించి ఈసీ సూచించిన విధంగా పార్టీ నాయకులకు వీడ్కోలు చెప్పి బస్సులోకి వెళ్లిపోయారు.ఆయన వెంట ఉండే వ్యక్తిగత సహాయకులు కూడా ఈసీ ఆదేశాలను పా టించారు. చంద్రబాబు బస చేసిన శిబి రం వద్ద పార్టీ జిల్లా నాయకులు ఉం డగా వారిని కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. సాయంత్రం 4.30 గంటలకు పార్టీ నాయకులంతా చంద్రబాబు బస చేసిన శిబిరం వదిలి వెళ్లిపోయేలా చేశారు. అనంతరం ఆ ప్రాంగణాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులను మినహా మరెవ్వరిని లోపలికి అనుమతించ వద్దన్న ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు 60 మంది పోలీసుల భద్రత: డీఎస్‌పీ ప్రసాద్

జడ్ ప్లస్ స్పెషల్ కేటిగిరీలో ఉన్న చంద్రబాబుకు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్‌పీ వైటీఆర్ ప్రసాద్ తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు వేమూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఆయన విశ్రాంతి తీసుకొంటున్నారని, ఆయనకు నిబంధనల ప్రకారం బందోబస్తు కల్పిస్తున్నామని చెప్పారు. తన పర్యవేక్షణలో ఇరువురు సీఐలు, 60 మంది కానిస్టేబుళ్లు 24 గంటలు పహారా కాస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రబాబును కలుసుకొనేందుకు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉందని, మరే ఇతరులు కలవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

క్రమశిక్షణకు మారుపేరుగా...

ఆ నియోజకవర్గంలో ఏ పల్లెకి వెళ్లినా మురుగుకాలువలే ముందుగా కాళ్లకు తగులుతాయి. అన్నివైపుల నుంచి దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతుంది. వేమూరు ప్రాంతంలో మంచినీళ్ల కొళాయిలకే కాదు, చివరకు డ్రైనేజీ వ్యవస్థకూ నోచుకోని పల్లెలనెన్నింటినో చూశాను. దాదాపుగా ఈ గ్రామాలన్నీ మంచం పట్టాయి. ఇక్కడి ప్రజా ఆరోగ్య వ్యవస్థలు పడకేయడంతో అంటువ్యాధులు పడగ విప్పుతున్నాయి.

ఒక మాదిగ పేటకు వెళ్లి చూసినప్పుడు గానీ పారిశుద్ధ్య సమస్య పచ్చటి ప్రాంతాలను ఎలా కబళిస్తున్నదీ తెలియలేదు. రెండున్నరేళ్లలో 60 మందిదాకా ఈ పేటలో చనిపోయారని తెలిసి విస్మయం చెందాను. ఈ చావుల పాపం ఎవరిది? సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపని ప్రభుత్వానిది కాదా? అదే పంచాయతీ పాలకమండళ్లు ఉండి ఉంటే ఈ ఘోరాలు జరిగి ఉండేవా? పాలన లేదు..ఆరోగ్య సేవలూ అందవు.. మరి ఈ జనం ఎలా బతకాలి!

ఇచ్చేది తక్కువ.. కోతలు ఎక్కువ.. చెప్పుకొనేది మరింత ఎక్కువ.. ఇది కదా మన సర్కారు సంక్షేమం అసలు ముసుగు. జంపని గుండా పోతున్నప్పుడు కలిసిన ఆ రైతులు చెప్పిన విషయాలు.. ఆ ముసుగును బదాబదలు చేసేశాయి. ఎరువుల భారం, కరెంట్ షాకు కుంగదీస్తున్నాయట. వీళ్ల క్షేమం గానీ సంక్షేమం గానీ పట్టింది ఎవరికి? సబ్సిడీలను ఘనంగా అందిస్తున్నామని ఢిల్లీలో ఉన్నవాళ్లు చెబుతుంటే, ఈ రాష్ట్రంలో రైతుకు మాత్రం బతుకే గగనంగా మారింది.

నా హయాంలో ఆశని రగిలించిన యువతరం.. ఉపాధి, ఉద్యోగం లేక ఈనాడు రోడ్డున పడింది. "అయ్యా.. మనవరాలి కోసం ఉన్న భూమిని తాకట్టుపెట్టాను. ఆమెను ఇంజనీరింగ్ చదివించేందుకు ఉన్నదంతా అమ్మేశాను. ఇంత చేసినా ఏమి మిగిలింది? బిడ్డ బాగానే చదివింది గానీ, ఉద్యోగమే లేదు. ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా పలికిన నాథుడే లేడు'' అని ఆ ముసలవ్వ అన్న మాటలు ఎవరినైనా కదిలిస్తాయి..రాయి లాంటి ఈ సర్కారుని తప్ప..

ఆ చావుల పాపం ఎవరిది?

ఒళ్లంతా అహమే!
కిరణ్‌కు పాలన నాస్తి.. ఫోజులు జాస్తి
వైఎస్ 'దోపిడీ'ని ప్రతి ఫైలులో మోస్తున్నాడు
అందుకే దొంగ ముసుగులో 'సహకారం'
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

ప్రజ ల వద్దకు కాంగ్రెస్ నాయకులు నేరుగా వెళితే 'చె య్యి' విరగ్గొట్టి పంపడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే సహకార సంఘాల ఎన్నికల్లో 'పరోక్ష' పద్ధతుల్లో గట్టెక్కిందని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌కు ఒళ్లంతా అహమేనని, వైఎస్ దోపిడీని పాలనలో తు.చ.తప్పక కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం జం పని వద్ద ఆయన మంగళవారం పాదయాత్ర ప్రా రంభించారు.

చంపాడ సెంటర్, బూతుమల్లి మీదగా 6.8 కిలోమీటర్లు నడిచి, వేమూరు చేరుకున్నారు. అక్కడ ఉన్న స్టేషన్‌లోకి వెళ్లారు. డీఎస్ పీ, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. జీతాలెలా వస్తున్నాయి. .పీఆర్‌సీ అ మలు జరుగుతుందా? డ్యూటీలు ఎలా వేస్తున్నారు?.. అంటూ ఆరా తీశారు. మిలిటరీ క్యాంటీన్ వలే తమకూ ఉంటే బావుంటుందని వారు కోరగా, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి బయటకు వచ్చాక ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి కిరణ్‌పై విరుచుకుపడ్డారు.

"కిరణ్‌కు ఒళ్లంతా అహమే. ప్రజాసంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోడు. అంతా తెలుసన్నట్లుగా ఫోజులు కొడతారు. దేనికీ నేరుగా సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడతారు. వైఎస్ ప్రారంభించిన దోపిడీని ప్రతి ఫైలులోనూ కొనసాగిస్తున్నారు'' అని మండిపడ్డారు. పార్టీ నుంచి వలస పోతున్న నేతలంతా ఆయారామ్... గయారామ్‌లని పేర్కొన్నారు. "వారంతా తొలుత తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. ఇప్పుడు వాళ్లకు అమ్ముడుపోతున్నారు. ఇది చూస్తే చాలా బాధేస్తోంది. పార్టీ గుర్తుతో గెలిచి ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం లేకుండా చేస్తూ బరితెగించి పరోక్ష ఎన్నికలకు శ్రీకారం చుడుతోంది.

రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు కూ డా అదే పద్ధతిన నిర్వహించాలని యోచిస్తోంది. మొండి'చెయ్యి'తో నేరుగా ప్రజల వద్దకు వెళితే విరగ్గొడతారని తెలిసి దొంగ ముసుగేసుకొని వస్తోంద''ని ధ్వజమెత్తారు. సహకార ఎన్నికల్లో జగన్ పార్టీ, టీఆర్ఎస్ గల్లంతు అయ్యాయని, టీడీపీ గెలిచే స్థానాల్లో స్టేలతో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందన్నారు. అందరూ కలిసి 'హస్తాన్ని' చితక్కొట్టి నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, మైనార్టీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టి ఎన్నికలకు పోయి ఉండకపోతే టీడీపీదే గెలుపు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీపై దయ తలిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఎన్‌టీఆర్ తర్వాత జనం గుండెలో కొంత స్థానం తనకు ఇవ్వాలని కోరారు.

జనం దగ్గరకెళితే 'చెయ్యి' విరగ్గొడతారు!