May 11, 2013

హైదరాబాద్: సీనియర్ నేత కడియం శ్రీహరి టీడీపీని వీడి నా ఎలాంటి నష్టం లేదని టీడీపీ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ కడియంకు కార్యకర్తల మద్దతు లేదని విమర్శించారు. కడియం పార్టీ వీడుతారని ముందే తెలుసని, కేసీఆర్ స్క్రిప్టును కడియం చదివారని ఆరోపించారు. టీడీపీ ప్రజల పార్టీ, కార్యకర్తల పార్టీని అని ఆయన స్పష్టం చేశారు. కడియం పార్టీ మారడం రాజకీయ వ్యభిచారం అని రేవూరి ప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కడియం పార్టీ వీడినా నష్టం లేదు : రేవూరి

హైదరాబాద్
: కడియం శ్రీహరి రాజీనామా ఊహించిందే అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కడియం రాజీనామా చేసినా పార్టీకి నష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే పార్టీ వీడారని ఆరోపించారు. తెలంగాణవాదినని చెప్పుకునే కడియం తెలంగాణపై టీడీపీ లేఖలో ఏం లేకుంటే అఖిలపక్షానికి ఎందుకు వెళ్లారని కడియంను మోత్కుపల్లి ప్రశ్నించారు.

రాజకీయ లబ్ది కోసమే పార్టీ వీడారు : మోత్కుపల్లి

హైదరాబాద్ : కడియం శ్రీహరి టీడీపీకి రాజీనామా చేయడం తొందరపాటు చర్యగా పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావించారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసమే కడియం పార్టీ వీడారని ఆరోపించారు. పదవుల కోసం కడియం పార్టీ మారటం సరికాదన్నారు. రాజీనామాపై పునరాలోచించాలని సూచించారు. తెలంగాణపై స్పష్టత ఉన్న పార్టీ టీడీపీ అని పెద్దిరెడ్డిరామచెంద్రారెడ్డి తేల్చిచెప్పారు.

కడియం రాజీనామా తొందరపాటు చర్య : పెద్దిరెడ్డి

హైదరాబాద్
: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో టీ.టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం ఉదయం ఆయన నివాసంలో సమావేశమయ్యారు. కడియం శ్రీహరి రాజీనామా నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుతో ఎర్రబెల్లి భేటీ

హైదరాబాద్

టీడీపీ వల్లే కడియం శ్రీహరికి గౌరవం పెరిగిందని, స్వార్థం కోసమే పార్టీని వీడారని ఆరోపించారు. కడియం పోయినా పార్టీని కార్యకర్తలు వీడటం లేదని వెల్లడించారు. టీడీపీపై, చంద్రబాబుపై అబాంఢాలు వేయడాన్ని కడియం విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. తెలంగాణ అంశంపై కడియంతో అనేక సార్లు మాట్లాడానని, అయినా రాజీనామా నిర్ణయం తొందరపాటు చర్య అని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
: టీడీపీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం ఏమీ లేదని టి.టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం కడియం రాజీనామా నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై అధినేత చంద్రబాబుతో ఎర్రబెల్లి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్లి పోయిన వారే నష్టపోయారన్నారు. ఎంతో మంది సీనియర్ నేతలు పార్టీని వీడి మరలా తిరిగి వచ్చారని గుర్తు చేశారు.

టీడీపీ నుంచి ఎవరు పోయిన నష్టం లేదు : ఎర్రబెల్లి