October 11, 2012

పాదయాత్ర పోటోలు పదోరోజు గురువారం-2nd part





















పాదయాత్ర పోటోలు పదోరోజు గురువారం-2 ( 11.10.2012 )

టీడీపీ అధికారంలోకి వస్తే కరెంటు సమస్య ఉండదు!
పాదయాత్రలో చంద్రబాబు హామీ.. నాకు ఏ కోరికా లేదు
వాస్తవాలు చెప్పడానికే వచ్చాను
పనికి మాలిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయండి
శనగ విత్తి.. బట్టలుతికి.. పదో రోజు ప్రజలతో మమేకం

  "నాకు ఏ కోరికా లేదు. మీ కష్టాలు చూడలేకే వచ్చాను. తొమ్మిదేళ్లు నాకు అధికారం ఇచ్చారు. మరో తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్ష నేతగా ఆదరిస్తున్నారు. పేదల కష్టాలు చూడలేక, మిమ్మల్ని మరింత కష్టాల్లోకి నెడుతున్న ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని వివరించి చైతన్యవంతులను చేయడానికి వచ్చాను. టీడీపీ అధికారంలోకి వస్తే కరెంటు సమస్య లేకుండా చేస్తా. డెంగ్యూ, చికున్‌గున్యా వంటి జబ్బులతో జనం అల్లాడుతున్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి. నాతో కలిసి రండి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

'వస్తున్నా.. మీ కోసం' అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర పదోరోజు గురువారం హనకనహాళ్ నుంచి మొదలైంది. అంతకుముందు వాహనం వద్దే రాయదుర్గం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హనకనహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో సమస్యలను చూసి స్పందించిన చంద్రబాబు.. పాఠశాలలో మరుగు దొడ్లు, తాగునీటి పైపు లైన్‌కు ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి నిధుల నుంచి రూ. 2.50 లక్షలు మంజూరు చేయిస్తున్నట్లు హామీ ఇచ్చారు.సొళ్లాపురం, హనుమాపురం మీదుగా 19.3 కిలోమీటర్లు పాదయాత్ర సాగించిన చంద్రబాబు ఉరవకొండ నియోజకవర్గం నింబగళ్లులో ముగించారు.

పాదయాత్రలో పలువురు వ్యక్తిగత సమస్యలతోపాటు రోడ్లు, కాల్వలు, తాగునీరు, కరెంటు, గ్యాస్ కష్టాలను ఏకరువు పెట్టారు. అనంతరం అదే గ్రామంలో వెంకన్న అనే వ్యక్తి ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఆ ఇంట్లో ఐదుగురు వికలాంగులు ఉండడం చూసి చంద్రబాబు చలించిపోయారు. ఫ్లోరైడ్ నీటి వల్ల చాలామంది చిన్న వయసులోనే వృద్ధాప్యాన్ని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొళ్లాపురంలో ఓ రైతుకు చెందిన పొలంలో చంద్రబాబు పప్పు శనగ విత్తారు. హనకనహాళ్ సమీపంలోని వంకలో బట్టలు ఉతుకుతున్న రజకుల వద్దకు చంద్రబాబు వెళ్లారు.

వారి సమస్యలు తెలుసుకుని.. వారితో కలిసి బట్టలు ఉతికారు. పదో రోజు యాత్రలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. బాబు పాదయాత్ర సొళ్లాపురానికి చేరుకోగానే కృష్ణమాదిగ అక్కడకు వచ్చారు. అక్కడే సభలో సంఘీభావం ప్రకటించారు. విశ్రాంతి తీసుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నా చంద్రబాబు ఖాతరు చేయడం లేదు. కాగా, పాదయాత్రలో పలువురు పువ్వులు చల్లడంతో చంద్రబాబు కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, గురువారం గంట ఆలస్యంగా 11 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు.

అన్నింటా అక్రమాలే
ప్రభుత్వ తీరును చంద్రబాబు ఎండగట్టారు. "అన్నింటా అక్రమాలే. ఇన్‌పుట్ సబ్సిడీ రాదు. రైతులకు పంటల బీమా అందదు. ఇందిరమ్మ ఇళ్లలోనూ దొంగ బిల్లులతో దోచేశారు. గనుల పేరుతో వేల కోట్లు దోచేశారు. అటువంటి వారికే అధికారం ఇస్తున్నారు. మీలో చైతన్యం రావాలి. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీదే'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ ఇప్పటికే ఢిల్లీలో జెండా పీకేసిందని, ఏనాడైనా కాంగ్రెస్‌లో విలీనమవుతుందని, ఈ మేరకు ఇప్పటికే మంతనాలు జరుగుతున్నాయని చెప్పారు. అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకు రాగా 'ఏమి చేయాలో మీరే చెప్పండ'ని ఆయన ఎదురు ప్రశ్నించారు.

ఇందుకు మూకుమ్మడిగా 'మీరు సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుంద'ని పలువురు బదులిచ్చారు. దీంతో, చంద్రబాబు స్పందిస్తూ 'మీరు అనుకున్నది జరుగుతుంది. అధికారంలోకి వచ్చేది టీడీపీయే. పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులను రుణ విముక్తులను చేస్తాం. హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి గ్రామీణ ప్రజలు ఏమాత్రం అనారోగ్యం పాలు కాకుండా చర్యలు తీసుకున్న ఘనత కూడా టీడీపీదే'నని చంద్రబాబు చెప్పారు.

"సార్! మా గ్రామంలో రెడ్ల దౌర్జన్యం కొనసాగుతోంది. కార్డు ఇవ్వరు. పింఛను అందదు. మా పేర్లతో వచ్చిన బిల్లులను కూడా వారే కాజేశారు. అదేమని అడిగితే తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో కొట్టిస్తున్నారు'' అంటూ హనకనహాళ్ గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు.

దీంతో, ఆయన స్పందిస్తూ "పేదలపై దౌర్జన్యం చేస్తే వదిలి పెట్టను. పెత్తందార్ల వ్యవస్థను మళ్లీ తీసుకు రావాలనుకుంటున్నారా? ఇలా చేస్తే సహించేది లేదు'' అన్నారు. హనకనహాళ్‌వైసీపీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి స్వగ్రామం. అక్కడ ఆయన వర్గీయులే దౌర్జన్యాలు చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టిస్తున్నారని స్థానికులు ఆరోపించగా, "పోలీసులూ! మీరు కూడా ఆలోచించండి. అధికారం శాశ్వతం కాదు. న్యాయబద్ధంగా వ్యవహరించండి. మీ ఉద్యోగాలను ఎవరూ తీసేయలేరు'' అని చంద్రబాబు సూచించారు. (andhrajyothi)

శనగ విత్తి.. బట్టలుతికి.. పదో రోజు ప్రజలతో మమేకం

పాదయాత్ర పోటోలు పదోరోజు గురువారం










padaytraphotos 10th day

పాదయాత్ర పోటోలు పదోరోజు గురువారం ( 11.10.2012 )

నేటి పాదయాత్ర ...(12.10.2012) Neti padayatra at Uravakonda

నేటి పాదయాత్ర ...(12.10.2012)

 ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర గురువారం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు కణేకల్లు మండలం అనకనహల్లులో పాదయాత్ర ప్రారంభమైంది. సల్లాపురం, ఎన్‌.హనుమాపురం, నింబగళ్ల్లు గ్రామాల మీదుగా సాగింది. ఆయా ప్రాంతాల్లోని రైతుల, రజకుల, వ్యవసాయకూలీలు, నిరుద్యోగులు, వృద్ధులు, మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రజాసంక్షేమం గురించి కాంగ్రెస్‌ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాధనాన్ని దొంగల్లా దోచుకుని పండుగలు చేసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి కోసం 650 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ఏ ఒక్క గ్రామానికి కూడా తాగునీటిరు సక్రమంగా సరఫరా చేయడం లేదన్నారు. టిడిపి అధికారంలో 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆదాయం ఆరు రెట్లు పెరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు. కరెంటు బిల్లులు, డీజిల్‌, పెట్రో ధరలు పెంచి పేదలపై మరింత భారం మోపిందన్నారు. సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని మైనింగ్‌ ముడిసరుకులు ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టడం లేదన్నారు. స్వార్థపరులకు అప్పనంగా అప్పజెప్పి కోట్ల రూపాయలను కొల్లగొట్టిందన్నారు. అవినీతి పరుల వల్ల రాష్ట్ర పరువు పోతోందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే బిసిలకు పెద్దపీట వేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రకృతి సంపదను దోచుకున్న గాలిజనర్థాన్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ, వైఎస్‌ఆర్‌సిపి పార్టీలు రెండూ దొంగలేనని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీలో కలిసేందుకు వైఎస్‌ఆర్‌సిపి చర్యలు మొదలు పెట్టిందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఏర్పడిన ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమయ్యిందని గుర్తు చేశారు. సామాజిక న్యాయం అంటే కొందరి కోసం కాదని ఆయన చెప్పారు.అక్రమాస్తుల కేసులో వైఎస్‌ఆర్‌సిపి నాయకులంతా జైలుకు వెళ్లారని, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. భవిష్యత్తులో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. మాదిగలకు అన్యాయం జరిగిందని, అందుకే ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ముస్లిం జనాభాకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు లేరని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు పార్థసారధి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపక్‌రెడ్డి, ఎమ్మెల్సీ మెట్టుగోవిందురెడ్డి, పరిటాల సునీత, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
హైస్కూలుకు రూ.రెండు లక్షల ఎమ్మెల్సీ నిధులు...
చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలో సందర్భంగా హనకనహల్లు హైస్కూలుకు 2.5 లక్షల రూపాయలు నిధులను ఎమ్మెల్సీ నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ మెట్టుగోవిందురెడ్డికి సూచించారు. ఈ నిధులను మరుగుదొడ్లు, తాగునీటి, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని చెప్పారు.

పాదయాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు -ప్రజాశక్తి

Revanth reddy press meet at NTR trust bhavan (11.10.2012)






రెవంత్ రెడ్డి ప్రెస్ మీట్ 11.10.2012

ప్రెస్ నోట్ 11.10.2012 ( PRESSNOTE)

ప్రెస్ నోట్ 11.10.2012 PRESSNOTE

అలుపెరుగని బాటసారి
9 రోజులు.. 165 కిలోమీటర్లు
అడుగడుగునా పూలవర్షం.. మంగళ హారతులు

  'మీ కష్టాల్లో భాగం పంచుకోవడానికే వచ్చాను. మీకు న్యా యం చేయడానికి పాదయాత్ర చేపట్టాను. నన్ను ఆశీర్వదించండి. మీ కష్టాలు తీర్చే శక్తి నాకు ప్రసాదించండి' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర పదో రోజులోకి అడుగుపెడుతోం ది.

ఆయన ఇప్పటివరకు 165 కిలోమీటర్లు నడిచారు. ఆరుపదులు దాటిన వయసులోనూ ఏమాత్రం అలసట లేకుండా ముందుకు సాగుతున్నారు. దారి పొడవునా విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు చూపుతున్న అభిమానం బాబులో నూతనోత్సాహాన్ని నింపుతోంది.

రోజూ కనీసం 200మందితో మాట్లాడుతున్నారు. దాదా పు 84 గ్రామాల్లో పర్యటించారు. తొమ్మిదో రోజు యాత్ర బుధవారం బెళుగుప్ప మండలం విరుపాపల్లి వద్ద మొద లై.. రాత్రి 11 గంటలకు హనకనహల్‌కు చేరుకుంది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తోపాటు జనం భారీ గా యాత్రలో పాల్గొన్నారు.

పలుచోట్ల ప్రజలుబాబుపై పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పాదయాత్రకు ఎర్రిస్వామి అనే రైతు తనవంతు సాయంగా రూ. 5వేలు అందించా రు. విరుపాపల్లి, శీర్పి గ్రామాల మధ్య బాబు పొలాల్లో కలియదిరిగారు. ఓ రైతు పొలంలో కాలిపోయిన మోటారును చూసి విద్యుత్ కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   (source:andhrajyothy)

తొమ్మిదో రోజు పాదయాత్ర బెళుగుప్ప మండలం (10.10.2012)

10th Day Padayatra Route

పదవరోజు పాదయాత్ర సాగుతుందిలా..




















Vastunna meekosam padayatra photos 9th Day

పాదయాత్ర పోటోలు తొమ్మిదో రోజు ( 10.10.2012 )