November 17, 2012


47వ రోజు పాదయాత్ర పోటోలు


టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ఆదివారం మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి నుంచి పటాన్‌చెరు మండలం బీడీఎల్ గేటు వద్ద జిల్లాలో ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. బాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పది రోజులు జిల్లాలో పాదయాత్ర చేసి, ఈనెల 27న నిజామాబాద్ జిల్లాకు చంద్రబాబు వెళ్తారు.

పటాన్‌చెరు, సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలలో 167.2 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర ఉంటుంది. జిల్లాలో చంద్రబాబు పాదయాత్రకు అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్ ప్రభావం అధికంగా ఉన్న సిద్దిపేట, దుబ్బాకల వైపు వెళ్లకుండా చూసుకున్నది. ఇబ్బందులు అంతగా ఎదురుకాని పటాన్‌చెరు నుంచి ఇతర ప్రాంతాలను గుర్తించి.. రాష్ట్ర, జిల్లా ముఖ్యనాయకులు పర్యటించిన తర్వాతే ఈ మార్గాన్ని ఖరారుచేశారు.

మరోవైపు, తెలంగాణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్న డిమాండ్‌తో మెదక్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ జేఏసీ నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీలు జరపాలని నిర్ణయించిది. పాదయాత్రకు అడ్డంకులు కల్పించకుండా.. బాబు జిల్లాలో ఉన్నన్ని రోజులు ఎక్కడో ఒకచోట ఈ నిరసనలు జరిపేలా జేఏసీ చూస్తోంది. ఇందుకు సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ఇతరులను ర్యాలీలలో పాల్గొనాలని సూచించింది.

నేటి నుంచి మెదక్‌లో పాదయాత్ర

అధికారం ఇవ్వండి.. రుణం తీర్చుకుంటా
ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వదు కాని మందు మాత్రం ఇస్తుంది
నేటి నుంచి మెదక్‌లో బాబు పాదయాత్ర
ఐదు నియోజకవర్గాలు.. మొత్తతం 167.2 కిలోమీటర్ల నడక

రంగారెడ్డిజిల్లా, నవంబర్ 17 : తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిలో గుజరాత్ కంటే ముందు నిలిపి ప్రజల రుణం తీర్చుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా శనివారం ఆయన రంగారెడ్డిజిల్లా శంకరపల్లిలో పాదయాత్ర కొనసాగించారు.

శంకరపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతి వల్ల అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని వైఎస్, ఆయన తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని దీని వల్లే రాష్ట్ర ప్రజలకు కష్టాలు వచ్చాయని చెప్పారు. వీరి అవినీతి వల్ల రాష్ట్రం భ్రష్టుపట్టిందని ఇప్పుడు మేలుకోకుంటే సుడిగుండంలో నుంచి అగ్నిగుండంలో పడిపోతారన్నారు. టీడీపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతానని చెప్పారు.

రైతన్నకు అండగా ఉంటామని బడుగు, బలహీనవర్గాల వారికి, అగ్రవర్ణాల పేదలకు అన్నింటిలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రజలకు తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్.. మందు మాత్రం ఇస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆరునెలలు ఇంట్లో పడుకుని ఒక రోజు లేచి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ వాళ్లు జైలునే పార్టీ కార్యాలయంగా మార్చేశారని పేర్కొన్నారు. కేసులు మాఫీ చేయాలని కాంగ్రెస్‌తో రాయబేరాలు సాగిస్తున్నారన్నారు. కేసులు ఎత్తివేస్తే పార్టీని విలీనం చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

జైల్లో ఉన్న అవినీతి పరులు , మాటల గారడీలు చేసే వారు విశ్వసనీయత గురించి తనని ప్రశ్నిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రతి ఎకరాన్ని తాను అభివృద్ది కోసం కేటాయిస్తే వైఎస్ మాత్రం దోచుకుతిన్నారని ఇదంతా ఆయన తాతజాగీరా? అని ప్రశ్నించారు. వైఎస్ ఆయన తరువాత వచ్చిన వారి అవినీతిని భరించలేక పారిశ్రామిక వేత్తలు రాష్ట్రాన్ని విడిచి పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటల గారడీకి చింతకాయులు రాలతాయా? తమ్ముళ్లూ అని ప్రశ్నించారు. కొందరు మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని వ్యాపార పార్టీలు, దోపిడీ పార్టీలు, భ్రష్టుపట్టించే రాజకీయాలు నడిపే పార్టీలను సాగనంపాలన్నారు.

ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వదు కాని మందు మాత్రం ఇస్తుంది

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర లో ఆదివారం నాడు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కూడా పాల్గొనవచ్చని కధనాలు వస్తున్నాయి. ఇది గమనించదగిన పరిణామమే. కుమారుడు లోకేష్ హిందూపూర్ లో పాదయాత్ర ఆరంభమైన తర్వాత, అలాగే, ఆయా సందర్భాలలలో పాదయాత్రలలో పాల్గొన్నారు. కాని భువనేశ్వరి మాత్రం చంద్రబాబును అప్పడప్పుడు కలిసి మాట్లాడి పాదయాత్రలో పాల్గొనకుండా వెళ్లిపోయేవారు. అంటే కేవలం ఆమె చంద్రబాబు యోగక్షేమాలకే పరిమితం అయ్యారన్నమాట.ఆదివారం మాత్రం భువనేశ్వరి కూడా పాదయాత్రలో పాల్గొంటారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో పాటు భువనేశ్వరి సుమారు పదహారు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయవచ్చు.ఇందుకోసం పార్టీ నాయకులు స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత షర్మిల పాదయాత్ర చేస్తున్న నేపధ్యంలో భువనేశ్వరి పాదయాత్రకు సిద్దం అవడం విశేషం. అయితే ఇప్పుడు ఒకే రోజుకు పాదయాత్ర చేసినా, ఆ తర్వాత ఆమె కూడా మరికొన్ని రోజులు అప్పుడప్పుడు పాదయాత్రలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తారని భావించవచ్చు. ఇది టిడిపిలోని ఇతర నాయకులకు, పార్టీ శ్రేణులకు ఒక సందేశం ఇచ్చినట్లు కూడా అవుతుంది.

ఆదివారం పాదయాత్రలో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి!

 పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. తానొక్కడినే రోడ్డు మీద పడి తిరుగుతున్నానని, నాయకుల్లో సీరియస్‌నెస్ కనిపించడం లేదని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా వీర్లపల్లిలో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ ఇంచార్జీలు అలంకార ప్రాయంగా ఉంటే లాభం లేదని ఆయన అన్నారు. ముందుగానే రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటిస్తానని ఆయన చెప్పారు.
ప్రజల్లో ఉన్నవారినే అభ్యర్థులుగా ప్రకటిస్తానని ఆయన అన్నారు. అజాగ్రత్త పనికి రాదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాసుఖాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్పీ లోకసభకు అభ్యర్థులను ప్రకటించడాన్ని, కాంగ్రెసు పార్టీ కమిటీలు వేసుకోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దపడుతున్నాయని ఆయన అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంచార్జీలుగా ఉన్నంత మాత్రాన తామే అభ్యర్థులమని అనుకోరాదని, పని చేయకపోతే వేరే అభ్యర్థులను ఖరారు చేస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు నేతలు జైలు నుంచే రాజకీయాలు నడుపుతున్నారని ఆయన విమర్శించారు. శాసనసభ్యులకు ప్రత్యేక ప్యాకేజీలు ఎరు చూపి కొనుగోలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
వైయస్సార్ కాంగ్రెసు నాయకుల వద్ద టన్నుల కొద్ది డబ్బులున్నాయని ఆయన అన్నారు. విలువలు లేని రాజకీయాలతో ఎవరైనా పార్టీలు మారితే వారే చరిత్రహీనులవుతారని అన్నారు. ఏ త్యాగం చేసి జగన్ జైలుకు వెళ్లారో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రజల మధ్యకు వచ్చి ధైర్యంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంపాదించిన డబ్బుకు లెక్కలు కూడా చెప్పలేని స్థితిలో జగన్ జైలుకు వెళ్లారని ఆయన ఆరోపించారు.
అవినీతి ఆరోపణలపై మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన అడిగారు. హైదరాబాదును కుంభకోణాల రాజధానిగా మార్చిన ఘనత కాంగ్రెసు పార్టీదేనని వ్యాఖ్యానించారు. నీలం తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం కనీసం బియ్యం కూడా సరఫరా చేయలేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పాల్గొన్నారు. రేపు ఆదివారం పాదయాత్రలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ పాల్గొంటారు.

ఇంచార్జీలుగా ఉన్నంత మాత్రాన తామే అభ్యర్థులమని అనుకోరాదని, పని చేయకపోతే వేరే అభ్యర్థులను ఖరారు చేస్తా...




టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. జైలు నుంచే వైకాపా నేతలు రాజకీయాలు నడుపుతున్నారని, వారి వద్ద టన్నులకొద్ది డబ్బులున్నాయని, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గల్లీగల్లీకి వెళ్లి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై వివరించాలని, పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. టీడీపీని విమర్శించే స్థాయి కాంగ్రెస్తో లీనమయ్యే పార్టీలకు లేదని పరోక్షంగా తెరాస, వైకాపా లపై విమర్శనాస్త్రాలు సంధించారు బాబు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తానని చంద్రబాబునాయుడు తెలిపారు. సమిష్టిగా పని చేయాలని, తానొక్కడినే పార్టీ కోసం పని చేస్తే సరిపోదని పార్టీ నేతలకు సూచించారు. తాను రోడ్డున పడి నడుస్తున్నానని, ఆ సీరియస్నెస్ పార్టీ నేతల్లో కనిపించడం లేదని ఆయన తెలిపారు. అలంకారప్రాయంగా ఇన్ఛార్జిలు ఉంటే సరిపోదని సూచించారు చంద్రబాబునాయుడు.

ఎన్నికలకు సిద్ధం కండి : చంద్రబాబు