April 15, 2013

ఇదేనా 'నిర్మల్' పురస్కారం పొందిన గ్రామం? ఈ చెత్తకుప్పలు, ఆ పేడదిబ్బలు.. ఇదేనా ఒకనాడు ప్రపంచాన్ని ఆకర్షించిన పరమ పరిశుద్ధ గ్రామం. ఈ మురుగ్గుంటలు, మరుగుదొడ్లు కూడా లేని ఆ నివాసాలు..ఇదేనా కేంద్రం మెప్పు పొందిన గొప్ప గ్రామం..అప్పటి శృంగవరానికి ఇప్పటి ఈ గ్రామానికి ఎంత తేడా! అసలు పోలికే లేదు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఈ గ్రామం సాధించిన రికార్డులు ఏమయ్యాయి? ఇప్పుడు లెట్రీన్లు లేని ఇళ్లే ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది.

రహదారుల నుంచి నీటి కుంటల దాకా నాడు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తే.. ఇప్పుడు అవన్నీ అవినీతి కంపు కొడుతున్నాయి. రోడ్ల పక్కన ఆహూతులను ఆహ్లాదపరిచే పచ్చటి మొక్కల జాడ ఎక్కడా కనిపించడం లేదు. బాగున్న ఊరిని బజారులో పెట్టింది ఎవరు? పంచాయతీరాజ్ సంస్థలకు సకాలంలో ఎన్నికలు జరపని పాలకులదే ఈ పాపం. ఆలన చూడాల్సిన పంచాయతీ వ్యవస్థలు లేవు.

చేనేత కాలనీలో తిరుగుతుండగా ఓ నేతన్న ఎదురయ్యాడు. "మా బతుకులు చూడయ్యా ఎలాగయ్యాయో! చినుకు పడితే ఈ ప్రాంతమంతా మునిగిపోతుంది. మా పనీ ఆగిపోతుంది. ఎంత చెప్పినా, ఎన్ని పిటిషన్లు పెట్టినా పట్టించుకున్న వారే లేరు'' అంటూ ఆయన దిగాలు పడ్డారు. ఈ సర్కారు మునిగిపోతే తప్ప మాకీ ముప్ప తప్పదని ఆ పక్కనే ఉన్న ఓ నడివయస్కురాలు శాపనార్థాలు పెట్టింది. అది వట్టిశాపమే కాదు.. పాలకుల పాపం పండిందని చేసే హెచ్చరిక కూడా!
పాలన చేయాల్సిన గ్రామ పాలకవర్గాలు లేవు. గ్రామీణ పాలనావ్యవస్థను కూల్చేయడంతో గోడు చెప్పుకోవడానికి గోడ తప్ప గవర్నమెంట్ అధికారి లేడు. ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. పల్లెల వైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు.

ఇదేనా ఆ 'నిర్మల' గ్రామం!


నాతవరం మండలం శృంగవరంలో బసచేసిన చంద్రబాబును సోమవారం నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కల్యాణ్‌రామ్ కలిశారు. విశాఖ నుంచి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో ఇక్కడకు వచ్చిన కల్యాణ్‌రామ్ 11.55 గంటలకు చంద్రబాబు ఉన్న బస్సులోకి వెళ్లారు. సుమారు గంటకుపైబడి ఆయనతో మంతనాలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనను విలేకర్లు.. బాబుతో భేటీపై ప్రశ్నించగా సమాధానమివ్వకుండా కారెక్కి వెళ్లిపోయారు.

బాబును కలిసిన కల్యాణ్‌రామ్

సమస్యలు లేవని నిరూపిస్తే..
రాజకీయాల నుంచి తప్పుకొంటా!
కిరికిరి రెడ్డే కాదు.. అబద్ధాల కోరు కూడా
కేబినెట్‌లో 90 శాతం అవినీతిపరులే..
సబ్ ప్లాన్‌లో మాదిగలకూ చోటు: బాబు
విశాఖపట్నం/నాతవరం : కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రే కాక, అబద్ధాలకోరు కూడానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కాళ్లనొప్పులతో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన..సోమవారం సాయంత్రం నడకను పునః ప్రారంభించారు. గాంధీనగరం, తాండవ జంక్షన్, డీ ఎర్రవరం మీదుగా యాత్ర సాగించారు. మార్గమధ్యంలో పలుచోట్ల కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

"ఈసారి ఎన్నికలు మనకు ఆఖరి అవకాశం. అందుకే ప్రతి కార్యకర్తా సైనికుని మాదిరిగా పనిచేయాలి'' అని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాలినొప్పి అధికం కావడంతో శృంగవరం నుంచి గాంధీనగరం వచ్చేలోగా రెండుసార్లు విశ్రాంతి తీసుకున్నారు. డాక్టర్ భరత్ ఆయనకు ఫిజియోథెరపీ చేశారు. కాగా, తొమ్మిది సంవత్సరాలుగా నిద్దరపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీలు గుర్తుకువచ్చారా అని గాంధీనగరంలో జరిగిన సభలో ఘాటుగా ప్రశ్నించారు. వారికి కేటాయించిన నిధులు, భూములు, ఇతర సౌకర్యాలను దిగమింగి ఇప్పుడు సబ్‌ప్లాన్ అంటూ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సబ్‌ప్లాన్ పరిధిలో మాదిగలను కూడా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. కేబినెట్‌లో 90 శాతం మంది మంత్రులు అవినీతిపరులుగా ముద్రపడ్డారని పేర్కొన్నారు. నిత్యావసర ధరలను గణనీయంగా పెంచి ఒక్కొక్క కుటుంబం నుంచి మూడు వేల రూపాయలకు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం 'అమ్మ హస్తం' పేరుతో 185 రూపాయలకు తొమ్మిది రకాల సరుకులు అంటూ మోసం చేస్తున్నదన్నారు.

" నేను ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నాను. ముఖ్యమంత్రి కూడా నాతో పాటు రావాలి. ప్రజలకు సమస్యలు లేవని అప్పటికీ ఆయన నిరూపించగలిగితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా''నని సవాల్ చేశారు. తమ హయాంలో తొమ్మిది డీఎస్సీల ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌ల పేరుతో ఉద్యోగాలను అమ్ముకుంటున్నదని శృంగవరం సభలో విమర్శించారు.

వైఎస్ అవినీతికి పాల్పడుతున్నప్పుడు సోనియాగాంధీ చర్య తీసుకొని ఉంటే ఇన్ని ఇబ్బందులు తలెత్తివికాదన్న ఆయన.. తప్పుచేస్తున్న కొడుకును కన్నతల్లిగా విజయలక్ష్మి మందలించకపోవడం వల్లనే ఆయన ఈరోజు జైల్లో గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక, కేంద్రం సహకారంతో పింఛన్లను 200 నుంచి 600కు పెంచుతామని, కౌలు రైతులకు కూడా వడ్డీలేని పంటరుణాలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మద్యం బెల్టుషాపుల రద్దుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అలాగే..మత్స్యకారులకు ప్రత్యేకంగా ఒక ప్యాకేజీ రూపొందించనున్నట్టు ప్రకటించారు. దీన్ని ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు. శృంగవరంలో సోమవారం ఆయన పాయకరావుపేట నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు.

పార్టీ ఆవిర్భావం నుంచి అండగా వున్న మత్స్యకారులకు అన్నివిధాలా గుర్తింపు ఇస్తామని, న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు దామాషా ప్రాతిపదికన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ఈ అంశాన్నీ మానిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేముందు ఆయా ప్రాంతాల కార్యకర్తల నుంచి ఎస్ఎంఎస్‌ల ద్వారా అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టడంలో భాగంగా, సమాచారహక్కు చట్టం కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు, దానికి విశాఖపట్నంతోనే శ్రీకారం చుడతామని చెప్పారు. రాష్ట్రంలో కొద్దికాలంగా నాయకులు 'ఆయారామ్! గయారామ్' మాదిరిగా పార్టీలు మారుతున్నారని వ్యాఖ్యానించారు. నాయకులు వెళుతున్నా కార్యకర్తలు పార్టీలోనే ఉంటున్నారన్నారు.

తొమ్మిదేళ్ల పాలనలోని అవినీతిపై చర్చకు వస్తావా? సీఎం కిరణ్‌కు చంద్రబాబు సవాల్..

అనంతపురం అర్బన్: జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీస్తామని ప్రకటించిన నేపథ్యంతో ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశా రు. సీఎం సభకు వెళ్లనీయకుండా అ డ్డుకున్నారు. ముందస్తు చర్యల్లో భా గంగా ఉదయమే ఆయా నేతల ఇళ్లవద్దకు వెళ్లి హౌస్అరెస్టు చేశారు. మరికొందరు సీఎం సభకు వెళ్తుండగా... మార్గమధ్యలో అడ్డుకుని, అరెస్టు చే శారు. జిల్లాకేంద్రంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మె ల్సీ శమంతకమణి, జిల్లా ప్రధాన కా ర్యదర్శి వరదాపురం సూరి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ సీఎం సభకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.

దీన్ని తెలుసుకున్న సీఐలు శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, మహబూబ్‌బాషా సిబ్బందితో బీకే పార్థసారధి ఇంటివద్దకెళ్లి హౌస్ అరెస్టు చేశారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు బీవీ వెంకట్రాముడు, నెట్టెం వెంకటేష్, కందిగోపుల మురళి, రాప్తాడు వెంకట్రాముడు, మ రూరు గోపాల్, సీపీఐ నాయకులు కేశవరెడ్డి, రాజారెడ్డి, మల్లికార్జున అక్కడి కి చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి సీఎం సభకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో వారిని అరె స్టు చేసి టూటౌన్ స్టేషన్‌కు తీసుకెళ్లి, మధ్యాహ్నం వదిలారు. ఈ అరెస్టులపై టీడీపీ, సీపీఐ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు.

ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను సీ ఎం దృష్టికి తీసుకెళ్లడానికి వెళ్తుంటే పోలీసులు ఇళ్లవద్దకే వచ్చి అరెస్టు చే యడం దారుణమన్నారు. బీకే పార్థసారధి మాట్లాడుతూ... ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి పాలకులకు ప్రజ లే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... జిల్లా రైతాంగం, తా గు, సాగునీటి సమస్యలను సీఎం దృ ష్టికి తీసుకెళ్లడానికి వెళ్తుంటే పోలీసుల ద్వారా అరెస్టులు చేయించడం దారుణమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ... గృహనిర్బం ధం చేసి అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. అరెస్టుల ద్వారా విపక్షాల గొంతు నొక్కారని ధ్వజమెత్తారు.

వీటి తో ఉద్యమాలను అణచలేరని హెచ్చరించారు. దమ్ము, ధైర్యం ఉంటే సీబీ ఐ కేసులో ఉన్న అవినీతి, 420 మం త్రులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం, మంత్రులకు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడు తూ... పాలకులు ఇలాగే వ్యవహరిస్తే ఇందిరమ్మ కలలు కలలుగామానే మారిపోతాయని హితబోధ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి మాట్లాడుతూ... ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే పాలకులు స్వార్థంకోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పాలకులకు అనంత జనం ఉసురు తగలకమానదని శపించారు.

ఎక్కడికక్కడే టీడీపీ నేతల అరెస్టులు

బత్తలపల్లి: మండలంలోని చెన్నరాయపట్నంలో కాంగ్రెస్, వైసీపీ నాయకులు ఏకమై టీడీపీ కార్యర్తలపై దాడికి దిగిన ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని చెన్నరాయపట్నం గ్రామంలో ప్రతి ఏడాది ఉగాదిపర్వదినం తరువాత గ్రామంలోని సత్యమ్మదేవత ఆలయంలో గ్రామస్థులంతా జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం కూడా జాతర జరుపుకున్నారు. ఉదయం ఆలయంలో సత్యమ్మకు జంతుబలులు ఇచ్చారు. వాటి చర్మాలు అమ్మే విషయంలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాదన చిలికిచిలికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. ఉదయం 10.30 గంటల సమయంలో కాంగ్రెస్, వైసీపీ నాయకులు ఏకమై టీడీపీ వర్గీయులపై దాడికి దిగారు.

పరిస్థితి చేయిదాటకుండా గ్రామపెద్దలు కలుగజేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపివేశారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీడీపీ వర్గీయుడు నారాయణస్వామి ఒంటరిగా సత్యమ్మ ఆలయం వద్ద వెళ్తుండగా కాంగ్రెస్, వైసీపీ వర్గీయులు అతనని ధూషించారు. ఏరా పొద్దున నువ్వు, మీవాళ్లు చానా ఎగిరెగిరి గంతులేశారు అంటూ అతనిపై రాళ్లు రువ్వారు. అక్కడ నుంచి గొడవ మొదలైంది. గొడవ మొదలు కాగానే అడ్డుకోవడానికి టీడీపీ వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు కాంగ్రెస్, వైసీపీ వర్గీయులు ఏకమై టీడీపీ వర్గీయులు రాములమ్మ, సాయమ్మ, లక్ష్మీనారాయణమ్మ, అంజినమ్మ, సత్యమయ్య, బాలసత్యమయ్య, నారాయణస్మామి, సతీశ్‌లను చితకబాదారు. ఘర్షణలో కాంగ్రెస్‌కు చెందిన లింగమయ్య, నరేష్, శ్రీనివాసులు ముగ్గురు మాత్రమే గాయపడ్డారు.

అప్రాచెరువులో ఉన్న టీడీపీ వర్గీయులు(గాయపడ్డవారి బంధువులు) వీరనారప్ప, చిన్న సత్యమయ్య ఘర్షణ విషయం తెలుసుకుని చెన్నరాయపట్నం వెళ్తుండగానే వైసీపీ, కాంగ్రెస్‌వర్గీయులు అప్రాచెరువులో వారిపై కూడా దాడికి దిగారు. గాయపడ్డవారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శాంతిలాల్ తన సిబ్బందితో చెన్నరాయపట్నంకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీడీపీ జిల్లా ప్రధానకార ్యదర్శి వరదాపురం సూరిలు పరామర్శించారు. సూరి వెంట ఆకులేటి వీరనారప్ప, సంగాల సూరి, మాజీ తెలుగుయువత బోయపాటి ఈశ్వరయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.

కాంగ్రెస్, వైసీపీ దాడులను సహించం : సూరి కాంగ్రెస్, వైసీపీ నాయకులు టీడీపీ వర్గీయులపై దాడులు చేస్తే సహించేదిలేదని, వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని జిల్లా ప్రధానకార్యదర్శి వరదాపురం సూరి పేర్కొన్నారు. మండల పరిధిలోని చెన్నరాయపట్నంలో టీడీపీవర్గీయులపై కాంగ్రెస్, వైసీపీ వర్గీయులు దాడి చేసిన విషయం తెలుసుకున్న ఆయన బత్తలపల్లికి వచ్చి బాధితులను పరామర్శించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్ఐ లేకపోవడంతో సీఐ నరసింగప్పతో ఫోన్‌లో మాట్లాడారు. మహిళలపై కాంగ్రెస్, వైసీపీ వర్గీయులు దాడి చేశారని పేర్కొన్నారు.

అనంతరం స్టేషన్ బయటకు వచ్చి విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, వైసీపీలు రెండూ కుమ్మక్కై తమపార్టీ కార్యకర్తలపై దాడిచేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, మహిళలు అని కూడా చూడకుండా చితకబాది అత్యాచారం చేయడానికి ప్రయత్నించారన్నారు. యల్లనూరు, పుట్లూరు సంస్కృతిని కాంగ్రెస్, వైసీపీ నాయకులు ఇక్కడికి తెస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సంగాల సూరి, బోయపాటి ఈశ్వరయ్య, శ్రీనివాసులు, ఆకులేటి వీరనారప్ప, కృష్ణారెడ్డి ఉన్నారు.

టీడీపీ వర్గీయులపై కాంగ్రెస్,వైసీపీ నాయకుల దాడి

  తిరుపతి: కార్వేటినగరంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 'ఇందిరమ్మ కలలు' సభను అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో ఆదివారం తిరుపతిలో టీడీపీ నేతలను ముందుజాగ్రత్తగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సభ ముగిశాక విడుదల చేశారు. తొలుత నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ను పోలీసులు అరెస్టుచేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు మహిళ, యువత జిల్లా అధ్యక్షులు పుష్పావతి, శ్రీధర్‌వర్మ, టీఎస్ఎన్వీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస చౌదరి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవినాయుడు, నేతలు నరసింహయాదవ్, బి.ఇందిర, మందలపు మోహన్‌రావు, ఆర్‌సీ మునికృష్ణ, దంపూరి భాస్కర్‌యాదవ్, శేషాద్రి, రాజారెడ్డి, కేశవులు నాయుడు, సూరా సుధాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గుండయ్య, బాలాజి నాయుడు తదితరులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు రెండు గంటల పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఒక వైపు ఆందోళనలు, మరో వైపు నినాదాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. పెంచిన కరెంటు చార్జీలను రద్దు చేసి, సరఫరా మెరుగ్గా ఇవ్వాలని డిమాండు చేశారు. నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం బంగాళాఖాతంలో కలసిపోవడం ఖాయమని జోస్యం చెపాఆ్పరు. నల్లబెల్లంపై నిషేధం ఎత్తివేయకుంటే రైతులు, హమాలీలు, కూలీలకు మద్దతుగా చిత్తూరులో నిరవధిక ఆందోళనకు దిగతామని ఎంపీ శివప్రసాద్ ప్రకటించారు.

అరెస్టయిన వారిలో ఇంకా రజనీకాంత్ నాయుడు, బుల్లెట్ రమణ, మాల్యాద్రి, రామమోహన్, ఆనంద్, సదాశివరెడ్డి, బాలాజి నాయుడు, శివప్రసాద్, మస్తాన్ నాయుడు, లోకేష్, సతీష్, ఊట్ల సురేంద్రకుమార్, సంపూర్ణమ్మ తదితరులున్నారు. సీఎం సభ ముగిశాక (నాలుగు గంటల తర్వాత) వీరిని వదిలిపెట్టారు. కాగా, అరెస్టయిన టీడీపీ నేతలకు సీపీఐ నాయకులు రామానాయుడు, మురళి మద్దతు ప్రకటించారు. టీడీపీ చేపట్టే ఆందోళనలకు మద్దతిస్తామన్నారు.

తిరుపతిలో టీడీపీ నేతల ముందస్తు అరెస్టు, విడుదల

చంద్రగిరి: చంద్రగిరిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో వేశారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అటుగా వెళ్లే వారి దృష్టి ఆ ఫ్లెక్సీపై పడుతోంది. చంద్రగిరిలో ఆదివారం రైతులతో వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరవుతున్న ముఖ్యనాయకులను ఆహ్వానిస్తూ తిరుపతి రూరల్‌కు చెందిన గురవారెడ్డి, దొడ్ల కరుణాకరరెడ్డి, కేశవులు, బ్రహ్మంరెడ్డి టవర్ క్లాక్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఇందులో వైఎస్ఆర్, జగన్, పెద్దిరెడ్డి, కరుణాకరరెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి ఫొటోలతోపాటు సినీ నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ ఫొటో కూడా ఏర్పాటు చేశారు. ఇది మండలంలో చర్చనీయాంశమైంది. వైసీపీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో ఎలా పెడతారంటూ కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ బ్యానర్ వైపే ఆసక్తిగా చూడటం గమనార్హం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

వైసీపీలో ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్

కాకినాడ సిటీ: వస్తున్నా మీకోసం చంద్రబాబు పాదయాత్ర విజయవంతంపట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. మార్చి 20న ప్రారంభమైన పాదయాత్ర ఏప్రిల్ 12 వరకు 23 రోజులపాటు కొనసాగిందన్నారు. ఈ పాదయాత్రకు సహకరించిన కార్యకర్తలకు, నాయకులకు,అభిమానులకు, జి ల్లా ప్రజలకు, పోలీసు యంత్రాంగానికి రాజప్ప ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ చరిత్రలో ముఖ్యఘట్టాలైన ఆవిర్భావదినోత్సవం, ఉగాది పంచాంగ శ్రవ ణంకార్యక్రమాలు జిల్లాలో జరగడం, వాటిలో చంద్రబాబు పాల్గొనడం టీడీ పీచరిత్రలో నిలిచిపోతాయన్నారు. చం ద్రబాబు నింపిన ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు 2014 అసెం బ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ డిక్లరేషన్లు ప్రకటించిన చంద్రబాబుకు రాజప్ప ధన్యవాదాలు తెలిపారు.

పాదయాత్ర విజయవంతంపై రాజప్ప కృతజ్ఞతలు

'చంద్రబాబు శ్రమ వృథా కాదు. కాళ్లు, కండరాల నొప్పి తీవ్రంగా ఉన్నా.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో అలుపెరుగక ఆరేడునెలలుగా తిరుగుతున్న అధినేత యాత్రతో జిల్లాలో పార్టీ బలోపేతమైంది. ఈ బలంతో స్థానిక ఎన్నికల్లో ఎదురులేని విజయాలు సాధించాలి..'' అంటూ టీడీపీ నేతలు ఉద్యుక్తులవుతున్నారు. జిల్ల్లాలో చంద్రబాబు 24 రోజులపాటు చేసిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. చంద్రబాబును చూసేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మొత్తం 11 నియోజకవర్గాల్లో చంద్రబాబు యాత్ర సాగింది.

ఒకటి, రెండు చోట్లమినహా మిగిలిన చోట్ల చంద్రబాబు పాదయాత్ర, సభలు సక్సెస్ అయ్యాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ పాదయాత్ర బాగా ఉపకరిస్తుందని టీడీపీ నేతలు ఆనందంతో ఉన్నారు. ఈ 24 రోజులూ చంద్రబాబు వెంటే నడిచిన నేతలూ కొంతమంది ఉన్నారు. వారు పాదయాత్ర సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతుల గురించి చంద్రబాబు దృష్టికి కూడా కొన్ని విషయాలు తీసుకువెళ్లారు.

సమీక్షల్లో స్పష్టత:

జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు స్వయంగా చంద్రబాబు నిర్వహించారు. నాయకులెవరినీ మాట్లాడనీయకుండా.. కార్యకర్తలకే అవకాశం కల్పించారు. దీంతో ఆయా నియోజకవర్గాలు, జిల్లాలో పార్టీ పరిస్థితి చంద్రబాబుకు చాలా వరకు అవగతమైంది. సమీక్షలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు లోటుపాట్లను సరిదిద్దుకోవాలని ఇక్కడ నేతలకు సూచించారు.

సూచనలు, సలహాలకు అవకాశం:

గతంలో ఎన్నడూలేని విధంగా పార్టీ అధినేత కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. చెప్పడానికి అవకాశంలేని వారి నుంచి లిఖితపూర్వకంగా తీసుకున్నారు. విలువైన సూచనలు చేసిన కార్యకర్తల పేర్లతో సహా చంద్రబాబు సమీక్షా సమావేశాలలో, సభలలో ప్రస్తావించారు. దీంతో తమ సూచనలకు విలువ ఇచ్చారని కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.

గ్రామస్థాయి నుంచి పటిష్టం:

చంద్రబాబు పాదయాత్ర హుషారులో ఉన్న టీడీపీ నేతలు.. ఈ జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గ్రామాల్లో వార్డులవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, లోటుపాట్లను సమీక్షించుకుని పార్టీని పంచాయతీ ఎన్నికలనాటికి మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

బాబు యాత్ర భళా..!


చక్రాయపేట : 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణా లు మాఫీ చేయడానికి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేస్తారని ఎమ్మె ల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సుర భి గ్రామం నాగులగుట్టపల్లెలో ఆదివారం ఆయన టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామం లో మెడికల్ స్టోర్ ఆంజనేయులు, రామక్రిష్ణల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెం దాలంటే చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి రావాలన్నారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూ న్యమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవినీతి పాలన అందించారని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గందరగోళమైపోయిందన్నా రు. గతంలో రోశయ్య పాలన కూడా అదే తీరులో వెళ్లిందని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ఏకమై రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంటున్నారన్నారు. అనంతరం సతీష్‌రెడ్డి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమం లో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు నాగిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షబ్బీర్, రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు చలపతియాదవ్, సుబ్బరామయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు పట్టెం అశోక్, చంద్ర ఓబుల్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు యెద్దుల చంద్ర, మాజీ వాటర్‌షెడ్ ఛైర్మన్ రాజారెడ్డి, మెడికల్‌స్టోర్ ఆంజనేయులు, రామక్రిష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ

మార్టూరు రూరల్ : విద్య ఉంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించ వచ్చని చంద్రబాబు నాయుడు గ్రా మాలలో పాఠశాలలు ఏర్పాటుచేస్తే.. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి విమ ర్శించారు. మండలంలోని జొన్నతాళి లో ఏలూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వ హించిన యువ శంఖారావం కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువశక్తి అణుశక్తి కంటే శక్తివంతమై నదన్నారు. యువతకు చేయూతని చ్చేందుకు చేపట్టిన యువశంఖారావం కాంగ్రెస్ నాయకుల్లో దడ పుట్టిస్తుం దన్నారు. యువతకు ఉపాధి కరువై మద్యం మత్తులో తేలియాడుతున్నార న్నారు.

రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగా లు ఖాళీగా ఉన్నాయని, 50 లక్షల మంది నిరుద్యోగులు పొట్ట చేత పట్టు కొని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర జనం వైపు చేతులు, భూముల వైపు చూపు ల్లా సాగుతుందన్నారు. యువతకు దశ దిశ నిర్ధేశించేందుకు శంఖారావం ఏర్పాటు చేశామని, రెండువేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకు న్నారని, టీడీపీ పర్చూరు నియోజకవ ర్గ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రం గాలలో విఫలమైందన్నారు. ఉద్యో గాలు లేక యువత, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. అనంతరం అంబేద్కర్, ఎన్టీ ఆర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మానం బ్రహ్మయ్య, ఆదినారాయణ, పోపూరి శ్రీనివాసరావు, జనార్ధన్, రవి, రజాక్, బండి నాగేశ్వరరావు, శ్రీహర్ష, రంగయ్యచౌదరి, ఉప్పలపాటి నాగేం ద్రమ్మ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొ న్నారు. వీర భద్రయ్య అనే వ్యక్తి కుట్టు లేకుండా నేసిన తెలుగుదేశం జెండాను నర్సిరెడ్డి, ఏలూరి సాంబశివరావులు ఆవిష్కరించారు.

చంద్రబాబు బడులు తెరిస్తే...కిరణ్ బార్‌లు తెరుస్తున్నారు


దర్శి: ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఇంటింటికి పాదయాత్ర నిర్వహిస్తున్న ట్లు టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జీ శిద్దా రా ఘవరావు పేర్కొన్నారు. ఆదివారం దర్శి పంచాయతీ పుచ్చలమిట్టలో ఆ యన పాదయాత్ర చేపట్టారు. ముందు గా టీడీపీ కార్యాలయం నుంచి కా లినడకన పుచ్చలమిట్టకు చేరుకున్నా రు. అక్కడ వందలాదిమంది కార్యక ర్తలు, నాయకులు ఘనస్వాగతం ప లికారు. శిద్ధా రాఘవరావు సమకూ ర్చిన మంచినీటి ట్యాంకర్ల ద్వారా మ ంచినీరు సరఫరాను ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా పుచ్చల మిట్టవాసులు పలు సమస్యలను శిద్దా దృష్టికి తెచ్చారు. గ్రామంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సిమెం టు రోడ్లను పూర్తిచేయాలని, సైడుకా లువలు నిర్మించాలని కోరారు. మ ంచినీటి కొళాయిలు లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు చెప్పారు.

అనంతరం శిద్దా మాట్లాడుతూ ప్రజల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తా మని హమీ ఇచ్చారు. టీడీపీ అధికా రంలోకి రాగానే అన్నివీధుల్లో సిమెం టు రోడ్డు నిర్మాణాలు చేయిస్తామని చెప్పారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిద్దా పాదయాత్ర సందర్భంగా కార్య కర్తలు బాణాసంచా కాలుస్తూ బ్రహ్మ ర«థం పట్టారు.

ఈ కార్యక్రమంలో టీ డీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నారపుశెట్టి పాపారావు, రాష్ట్ర వాణిజ్యవిభాగం కార్యదర్శి సూరె సుబ్బారావు, మండ లాధ్యక్షుడు బల్లగిరి శీనయ్య, మాజీ అధ్యక్షులు బొట్ల కోటేశ్వరరావు, చిట్టె వెంకటేశ్వర్లు, దర్శి పట్టణాధ్యక్షు డు యదగిరి వాసు, కార్యదర్శి రా చపూడి మోషే, జిల్లా మహిళా నాయ కురాలు శోభారాణి, దర్శి సింగిల్‌వి ండో అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, గురు వయ్య, మారం శ్రీనివాసరెడ్డి, జి.బాల గురువయ్య, బీరం వెంకటేశ్వరరెడ్డి, గుర్రం బాలకృష్ణ, మునగా శ్రీనివాస రావు, కిష్టయ్య పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను ప్రత్యక్ష్యంగా తెలుసుకునేందుకే పాదయాత్ర:శిద్దా

ఒంగోలు కార్పొరేషన్: తెలుగు దేశం పార్టీ పల్లెబాట పట్టనుంది. కాం గ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవి నీతిపై విస్తృత ప్రచారం చేయనుంది. ఈమేరకు ఆదివారం ఒంగోలులో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమా వేశంలో నేతలు నిర్ణయించారు. ని యోజకవర్గాల వారీ సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలతోపాటు, పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్య యనం చేసి అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని తీర్మానించారు. అవసరమైతే పోరా టాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ పార్టీ పటిష్ఠతకు అందరూ ఐకమ త్యంతో పని చేయాలని సూచించా రు.

చంద్రబాబును ముఖ్యమంత్రి చే యడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాల న్నారు. రాష్ట్రంలో తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ప్రజాధనాన్ని దోచుకున్నా యన్నారు. ఇదే విషయాన్ని తెదేపా రెండేళ్లుగా చెప్తున్నా కాంగ్రెస్, వైసీపీ లు తమ అవినీతిని కపిపుచ్చుకు నేందుకు ప్రయత్నించాయన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఆరుగురు మంత్రు లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయ డంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం తెదేపాపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతు న్నదని, ఈ నేపథ్యంలో తెదేపా నా యకులు, కార్యకర్తలు అవినీతి నేతల భాగోతాన్ని ప్రజలకు వివరించాల న్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటన సంద ర్భంగా ప్రజలకు ఒనగూరిన ప్రయో జనం ఏమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించినా ఏఏ పథకాలకు ఎంత నిధులు కేటాయిస్తున్న విషయంలో స్పష్టత లేదన్నారు.

విద్యుత్ సమస్యపై తెదేపా ప్రజల పక్షాన పోరాడుతున్నదన్నారు. అం దులో భాగంగా ఇప్పటికే నియోజక వర్గాల వారీగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా వ్యా ప్తంగా సేకరించిన సంతకాలను ఈ నెల 19వ తేదీకి ఒంగోలులోని పార్టీ కార్యాలయానికి పంపాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. జిల్లాలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి పోరాటాలు చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతు దారుల విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు.

జిల్లాలో తెదేపాకి పూర్వ వైభవం రావాలంటే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాల్సిన ఆవ శ్యకతను పలువురు నేతలు వివరిం చారు. నియోజకవర్గాల వారీ పార్టీ పరిస్థితులను అధ్యయనం చేయాల్సి న అవసరం ఉందన్నారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో పార్టీకి ప్ర యోజనం చేకూరదని, ప్రజా సమస్య లపై పోరాటాలు సాగించాలని కొం దరు సూచించారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని, అయితే అనాది నుంచి నేటి వరకు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని విస్మరించి, మధ్యలో వచ్చి పదవులు అనుభవించి మధ్య లో పార్టీని వీడే వారికి ప్రాధాన్యం ఇచ్చినందువలనే సమస్యలు వస్తున్నా యన్నారు. ఈ విధానం మారాల న్నారు.

అందుకోసం ముందుగా ప న్నెండు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఒక్కో సెగ్మెంట్ లో ఒక్కోరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని పల్లె పల్లె నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే దివి శివరాం, ఎంఎం.కొండయ్య, చిమటా సాంబు, యర్రాకుల శ్రీనివా సరావు, డి.బి.బి.వి.స్వామి, ఎర్రగొం డపాలెం కో ఆర్డినేటర్ సిహెచ్.ఆంజనే యులు, మహిళా ప్రతినిధులు ఆర్ల వెంకటరత్నం, టి.అనంతమ్మ,భవాని, తమ్మినేని మాధవి, కత్తి పద్మ, గంగవ రపు పద్మావతి, ఆరె రత్నకుమారి, గోనె మేరీ రత్నకుమారిలతోపాటు, పలువురు ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తెదేపా పల్లెబాట

తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 27న విశాఖలో నిర్వహించనున్న బహిరంగ సభను భారీఎత్తున నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. బహిరంగ సభ నిర్వహణ, జన సమీకరణ, పైలాన్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు సీనియర్లను రంగంలోనికి దింపింది. యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు, వైఎస్ చౌదరి(సుజనా)లను నియమించింది. వీరిలో యనమల, గరికపాటి రెండురోజులుగా విశాఖలోనే వుండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

ఆదివారం పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులతో సమావేశమయ్యారు. బహిరంగ సభ నిర్వహణ కోసం ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేశారు. 25వ తేదీ సాయంత్రానికి బహిరంగ వేదిక పూర్తికానున్నదని పార్టీ నేతలు చెబుతున్నారు. పైలాన్ కోసం అగనంపూడి టోల్‌గేటు సమీపంలో స్థలాన్ని నేతలు పరిశీలించారు. పైలాన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో చంద్రబాబు బస చేస్తారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, క్యాడర్ పనితీరు, నేతల మధ్య సంబంధాలపై సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం పాయకరావుపేట నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు.

టీడీపీ భారీ ప్రణాళిక

నర్సీపట్నం: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌బాబు తన వాగ్ధాటితో సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మరోసారి ఆకట్టుకున్నారు. ఆదివారం శృంగవరంలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో అయ్యన్న తనయుడు సుమారు అర్ధగంటపాటు చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. సందర్భం ఏదైనా కేవలం తెలుగుదేశం పార్టీని, అధినేత చంద్రబాబునాయుడును ప్రశంసించేందుకే విజయ్ ప్రాధాన్యత ఇచ్చారు. విజయ్ పొగడ్తలకు చంద్రబాబు ముసిముసిగా నవ్వుకుంటూ ఆనందపడ్డారు. నిర్వాహకులు తొలుత విజయ్‌ను వేదికపైకి పిలవకపోగా చంద్రబాబు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి
విజయ్‌ను వేదికపైకి పిలిపించడమే కాకుండా ప్రత్యేకంగా మాట్లాడమంటూ ప్రోత్సహించారు.

దాంతో విజయ్ వీరావేశంతో గంభీరంగా చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది. చంద్రబాబు పాలన రాష్ట్రంలో సువర్ణ అధ్యాయాన్ని సృష్టించిందని, భవిష్యత్తులో మరోసారి సువర్ణయుగం రాబోతుందని ఆయన కొనియాడారు. గ్రామాల్లో మత్తులో జోగుతూ నిర్వీర్యమైపోతున్న యువతను తట్టిలేపడానికే 63సంవత్సరాల వయస్సులో చంద్రబాబు పాదయాత్ర చేపడుతున్నారన్నారు. నర్సీపట్నం కంచుకోటను మరలా చంద్రబాబు చేతుల్లో పెట్టబోతున్నామని, అయ్యన్నపాత్రుడును మరోసారి ఎమ్మెల్యేగా చూడబోతున్నామని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఎమ్మెల్యే తదితరులను తీవ్రస్థాయిలో ఆయన విమర్శించారు.

చంద్రబాబును మెప్పించిన అయ్యప్ప

దత్తిరాజేరు : కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే హక్కులేదని గజపతినగరం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు కరణం శివరామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని మరడాంలో విద్యుత్ ధరలు, కోతలపై సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కన్నా తుగ్లక్ పాలన మిన్నా అని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూ డా ధరలు పెంచలేదన్నారు. అత్యంత దారుణంగా విద్యుత్ ధరలు పెంచి విద్యుత్ సంక్షోభానికి కారణం అయ్యారని, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలోకి వెళ్తుందన్నారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు తెలుగుదేశం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులను జైలుకు పంపే రోజులు వస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. సంతకాల సేకరణకు ప్రజల నుంచి మంచి మద్ద త వస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందన్నారు. ప్రభు త్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ కంది తిరుపతినాయుడు, మం డల పార్టీ అధ్యక్షుడు గంటా త్రినాధరావు, నాయకులు తాడి సాంబమూర్తి, రాగోలు బంగారి, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

రాష్టాన్ని పాలించే హక్కు కాంగ్రెస్‌కు లేదు


పార్వతీపురం టౌన్ : తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా జనరల్ బాడీ సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చెప్పారు. ఆదివారం పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉద యం 10 గంటలకు ఆర్అండ్‌బీ అతిథి గృహంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవనం లో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావే శం ముఖ్య ఎజెండాను వివరించారు. ఈనెల 27న 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా విశాఖ లో జరిగే పార్టీ అధినాయకుడు చంద్రబాబునాయుడు ముగింపు సభకు పార్టీశ్రేణులను కూడగట్టేందుకు చర్చ జరుగుతుందన్నారు.

విద్యుత్ కోతలు, చార్జీల పెంపు పై సంతకాల సేకరణ అంశం, 9 నియోజకవర్గాల్లో 9 లక్షల సంతకాలు సేకరించి పార్టీ అధిష్టానికి నివేదించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తం పై తదితర అంశాలపై చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, విజయనగరం పార్లమెంటు ఇన్‌చార్జి బండారు సత్యనారాయణ, పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజులు ముఖ్య ఆహ్వానితులుగా హాజరవుతారని వివరించారు.

సమావేశానికి పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఇన్‌చార్జిలు, జిల్లా నుంచి రాష్ట్ర పార్టీ ప్రతినిధులు, జిల్లా అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లాకార్యవర్గం, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరుకావాలని సూచించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కోలా వెంకటరావు, మిరియాల ప్రకాశరావు, జిల్లా నాయకులు బార్నాల సీతారాం, ఎం.సత్యంనాయుడు, సీతానగరం మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు, రౌతు వేణుగోపాల్ పాల్గొన్నారు.

చంద్రబాబు సభకు భారీగా జనసమీకరణ

హన్మకొండ: కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు, మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఆదివారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని టీడీపీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీబీఐ తన చార్జీషీట్‌లో అభియోగాలు మోపిన మంత్రులను ముఖ్యమంత్రి తన మంత్రి వర్గం నుం చి తొలగించకుండా మీనమేశాలు లెక్కపెడుతున్నారని ధ్వజమెత్తారు. వారిని తొలగిస్తే తన సీఎం పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపే గవర్నర్ కూడా ఈ విషయంలో తన విధులను నిర్వర్తించడంలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ విషయంలో మంత్రులు, ఎంపీలు పగటి వేషాలు వే స్తున్నారన్నారు. రాష్ట్రం ఇస్తున్నామం టూ ప్రజలను మోసం చేస్తున్నారన్నా రు. వారిని నమ్మించి సన్మానాలు చే యించుకుంటున్న ఎంపీలు ఢిల్లీలో మాత్రం తెలంగాణపై ఒక్క మాట మా ట్లాడడం లేదన్నారు. ఈనెల 22 నుం చి ప్రారంభం అవుతున్న లోకసభ సమావేశాలు చివరివి. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్టికల్ 3ను ఉపయోగించి తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు పెడితే టీడీపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని శ్రీహరి స్పష్టం చేశా రు.అర్ధశతాబ్దంగా నాడు ఇందిరా గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వచ్చారని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన పథకాలు, చట్టాలు అమలు చేయడం లో చిత్తశుద్ధి లేనప్పుడు ఇటువంటివి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం శూన్యం అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. సమావేశం టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి పాల్గొన్నారు.

కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలి


విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రాంతానికో విధంగా ప్రకటనలు చేస్తూ గిరిజనులను మభ్యపెడుతున్న సీఎం కిరణ్‌కి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని చంద్రబాబునాయుడు అన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు గిరిజనులకు అనుకూలంగా, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానూ మాట్లాడుతున్న కాంగ్రెస్ పాలకులకు వెనుకబడిన వర్గాల సంక్షేమంపై ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా బాక్సైట్ తవ్వకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేర్కొన్నారని, అదే వాస్తవమైతే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న సీఎంకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గిరిజనుల పొట్టకొడుతూ, పర్యావరణ పరిరక్షణకు ఆటంకం కలిగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కొందరికి డబ్బు చెల్లించి బాక్సైట్ అనుకూల ప్రచారాన్ని కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు.

గిరిజనులను మభ్యపెడుతున్న సీఎం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై
వారికేం చేశారో చెప్పగలరా?
కాంగ్రెస్ పాలనలో రూ.21,747 కోట్లు మళ్లింపు
సబ్‌ప్లాన్ నిధుల వినియోగంలో సర్కారు మోసం
సామాజిక న్యాయానికి కట్టుబడ్డాం
ఎన్టీఆర్ హయాంలోనే చర్యలు చేపట్టాం: బాబు
బడుగువర్గాలను మభ్యపెడుతోందని సర్కారుపై ధ్వజం

నర్సీపట్నం(విశాఖ)  ఈ చట్టం రూపకల్పనకు తాము మద్దతునిచ్చామని, వైఎస్ఆర్ మాదిరిగా మోసం చేయకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి, సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని ప్రకటించారు. దళిత సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా కిలో రెండు రూపాయలకు బియ్యం, పక్కా గృహ నిర్మాణం, సబ్సిడీ ధరలకు చీర, ధోవతి విక్రయం వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు దారి మళ్లించకుండా వారికే ఖర్చుపెట్టేవిధంగా చూసేందుకు ఎన్టీఆర్ హయాంలోనే 1986 మే 12నమెమో(నెం. 570 ఎస్‌సీపీ 11/81-1)ని జారీ అయిందని తెలిపారు.

అప్పట్లోనే తరచూ సమీక్షలు నిర్వహించి సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని క్రమబద్ధీకరించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అయితే తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో మొత్తం రూ. 21,747 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించి హుస్సేన్‌సాగర్ అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్డు, వంతెనలు, అతిథి గృహాల నిర్మాణం, జంతు ప్రదర్శనశాల అభివృద్ధి, ఇడుపులపాయ ఎస్టేట్‌లో రహదారుల నిర్మాణానికి వెచ్చించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ హయాంలో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసినా ఆచరణలో ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ప్రస్తుత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న సబ్‌ప్లాన్ చట్టం అమలు కూడా అదే రీతిలో ఉంటుందన్నారు.

తమ హయాంలో ఎస్సీలకు రిజర్వేషన్లను 14 నుంచి 16శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 6 శాతానికి పెంచామన్నారు. ఉద్యోగ పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్‌లు అమలుచేసిన ఘనత తమకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మాయావతి ఒత్తిడి కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ నిబంధన అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని వ్యాఖ్యానించారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఎస్సీ వర్గీకరణలో మాదిగ, ఉపకులాలకు న్యాయం చేయడానికి తామెంతో శ్రమించామని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆ దిశగా కృషి చేయాలని అన్నారు.

సబ్‌ప్లాన్ చట్టం ఆమోదించిన తర్వాత కూడా 2012 డిసెంబర్ 14న జారీచేసిన జీవో నెం. 5671 ప్రకారం ఎనిమిది జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఈవీఎంల మరమ్మతుల కోసం కాంగ్రెస్ సర్కారు దారి మళ్లించిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు తామేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, చేతనైతే కాంగ్రెస్ పాలకులు వారు చేసిన అభివృద్ధిని వెల్లడించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాల్ చేశారు. పవిత్రమైన అంబేద్కర్ జయంతి సందర్భంగా తాను చేస్తున్న ఈ డిమాండ్‌కు కాంగ్రెస్ పాలకులు సిద్ధం కావాలన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధమా?ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాల్

పర్యవేక్షణకు ముగ్గురు సీనియర్లు
పైలాన్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం
'సంతకాల సేకరణ' కార్యక్రమం పొడిగింపు

విశాఖపట్నం, హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం..' పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 27న చేపట్టిన బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. భారీగా జన సమీకరణ, పైలాన్ నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు, వైఎస్ చౌదరి(సుజనా)లకు అప్పగించింది.

వారిలో యనమల, గరికపాటి రెండురోజులుగా విశాఖలోనే ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. సభ నిర్వహణ కోసం పలు స్థానిక కమిటీలతో పాటు రాష్ట్రస్థాయి కమిటీలు ఉంటాయని యనమల చెప్పారు. 25వ తేదీ సాయంత్రానికి బహిరంగ వేదిక పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పైలాన్ కోసం గతంలో కేటాయించిన స్థలంపై వివాదం నెలకొన్నందున.. ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపికచేయాలన్నారు. పైలాన్ పనుల బాధ్యతను ఎమ్మెల్యే వెలగపూడికి అప్పగించారు.

నేతలతో బాబు టెలీ కాన్ఫరెన్స్..
విశాఖపట్నంలో చేపట్టిన బహిరంగ సభను భారీగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే.. ఆ తర్వాత 28న కానీ, 29న కానీ హైదరాబాద్‌లో మరో బహిరంగ సభ నిర్వహించాలని తొలుత పార్టీ నేతలు భావించారు. కానీ, హైదరాబాద్‌లో బహిరంగ సభ కాకుండా చంద్రబాబును ఘనంగా స్వాగతించేందుకే పరిమితం కావాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. పార్టీ నేతలతో పాదయాత్ర స్థలి నుంచే చంద్రబాబు ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ఆయా అంశాలు చర్చకు వచ్చాయి.

పండుగల సందర్భంగా విరామం రావడంతో వెనకపడిన.. 'సంతకాల సేకరణ' ఉద్యమాన్ని ఈ నెల 18 వరకు పొడిగించాలని నిర్ణయించారు. వాస్తవానికి 12నాటికే సంతకాల సేకరణ ముగిసింది. అయితే ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉండడం, జనం మమేకమవుతుండడం నేప«థ్యంలో 18 వరకు కొనసాగించాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు 'పల్లె పల్లెకు తెలుగుదేశం' కార్యక్రమాన్ని కూడా అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.

బాబు యాత్ర ముగింపు సభకు భారీగా జనసమీకరణ

విశాఖ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తనయుడు, సినీ హీరో
కల్యాణ్‌రామ్ సోమవారం ఉదయం విశాఖలో కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబును కలిసిన కల్యాణ్‌రామ్

విశాఖ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు రోజుల విరామం తర్వాత సోమవారం కాగా చంద్రబాబునాయుడును రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తనయుడు, సినీ హీరో కల్యాణ్‌రామ్ సోమవారం ఉదయం విశాఖలో కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సాయంత్రం నుంచి తిరిగి పాదయాత్ర చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం శృంగవరం నుంచి 'వస్తున్నా మీకోసం' యాత్ర నిర్వహించనున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఈరోజు ఆరు కిలోమీటర్లు నడవనున్నారు. ఈరోజు రాత్రికి గాంధీనగర్‌లో బస చేయనున్నారు. కాలి గాయం కారణంగా డాక్టర్ల సూచన మేరకు పాదయాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.

నొప్పులతోనే చంద్రబాబు పాదయాత్ర

నర్సీపట్నం: చంద్రుడి వదనం వాడిపోయింది. అడుగుల వేగం తగ్గిపోయింది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కాళ్ల నొప్పి తీవ్రమైంది. అంగరక్షకుల సాయంతో అడుగులో అడుగేస్తూ నడవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలి వేళ్లతోపాటు కండరాల నొప్పి కూడా తీవ్రం కావడంతో... వైద్యుల సలహా మేరకు ఆయన శనివారం నుంచి విశాఖ జిల్లా శృంగవరం గ్రామ శివార్లలోని కొబ్బరితోటలో ఏర్పాటుచేసిన తాత్కాలిక బసలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదికపైకి వచ్చేందుకు చంద్రబాబు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. తాను విశ్రాంతి తీసుకుంటున్న బస్సు నుంచి దిగేందుకు, ఆ తర్వాత వేదిక వరకు నడిచేందుకు అంగరక్షకుల సహాయం తీసుకున్నారు. అడుగులో అడుగు వేసుకుంటూ వేదికపైకి వచ్చారు. లుంగీ కట్టుకుని, కాళ్లకు మేజోళ్లు తొడుక్కున్న ఆయన వేదికపై తన ఎడమకాలుని ఓ పీటపైనే ఉంచి కూర్చోగలిగారు. హుషారుగా ఉండే చంద్రబాబు ఆదివారం నీరసంగా, బలహీనంగా కనిపించారు. శనివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకున్న ఆయన సతీమణి భువనేశ్వరి.. ఆదివారం కూడా చంద్రబాబు చెంతనే ఉండి సపర్యలు చేశారు.

అడుగు ముందుకే...
ఆరున్నర నెలలుగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు ప్రస్తుతం నడవడమే కష్టంగా మారింది. శుక్రవారం విశాఖ జిల్లాలో పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు చంద్రబాబును పరీక్షించిన వైద్యులు.. ఎట్టిపరిస్థితిలోనూ నడవడానికి వీలులేదని చెప్పారు. అయినా, ఆయన వినలేదు. వాస్తవానికి ఆయన రోజుకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా ఆరోగ్యం సహకరించని కారణంగా శుక్రవారం ఆరున్నర కిలోమీటర్లు మాత్రమే నడవగలిగారు.

శనివారం, ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం నుంచి మళ్లీ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. అడుగు తీసి అడుగు వేయలేక పోతున్న ఆయన యాత్ర ఎలా చేస్తారోనని నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే దూరాన్ని తగ్గించి, రాత్రి బస సంఖ్య పెంచి పాదయాత్రను విశాఖపట్నం వరకు కొనసాగిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

అంగరక్షక్షుల సాయంతో నడక చంద్రబాబుకు తీవ్రమైన కాలి నొప్పి