April 15, 2013

కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలి

హన్మకొండ: కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు, మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఆదివారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని టీడీపీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీబీఐ తన చార్జీషీట్‌లో అభియోగాలు మోపిన మంత్రులను ముఖ్యమంత్రి తన మంత్రి వర్గం నుం చి తొలగించకుండా మీనమేశాలు లెక్కపెడుతున్నారని ధ్వజమెత్తారు. వారిని తొలగిస్తే తన సీఎం పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపే గవర్నర్ కూడా ఈ విషయంలో తన విధులను నిర్వర్తించడంలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ విషయంలో మంత్రులు, ఎంపీలు పగటి వేషాలు వే స్తున్నారన్నారు. రాష్ట్రం ఇస్తున్నామం టూ ప్రజలను మోసం చేస్తున్నారన్నా రు. వారిని నమ్మించి సన్మానాలు చే యించుకుంటున్న ఎంపీలు ఢిల్లీలో మాత్రం తెలంగాణపై ఒక్క మాట మా ట్లాడడం లేదన్నారు. ఈనెల 22 నుం చి ప్రారంభం అవుతున్న లోకసభ సమావేశాలు చివరివి. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్టికల్ 3ను ఉపయోగించి తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు పెడితే టీడీపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని శ్రీహరి స్పష్టం చేశా రు.అర్ధశతాబ్దంగా నాడు ఇందిరా గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వచ్చారని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన పథకాలు, చట్టాలు అమలు చేయడం లో చిత్తశుద్ధి లేనప్పుడు ఇటువంటివి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం శూన్యం అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. సమావేశం టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి పాల్గొన్నారు.