September 7, 2013

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేస్తున్న దోపిడీని అరికడితే దేశంలో అన్ని ధరలు తగ్గుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోనే పెద్దమాఫియా ఇటలీలో ఉందని, ఆ ఇటలీ నుంచి సోనియా గాంధీ వచ్చిందని, పులివెందులలో వైఎస్‌ది ఫ్యాక్షన్ కుటుంబమని, హత్యలు, రౌడీయిజం వారికి మంచినీళ్ళ ప్రాయమని, ఆ ఇద్దరూ కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకొని భ్రష్టు పట్టించారని అన్నారు. శనివారం రాత్రి నూజివీడులో జరిగిన తెలుగుజాతి ఆత్మగౌరవయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మగాంధీ బైబిల్ నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. అలాంటి పవిత్రమైన బైబిల్‌ను చేతిలో పట్టుకొని విజయలక్ష్మి పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. బైబిల్‌ను పాటించే వారు వాస్తవాలు చెబుతారు, నిజాయితీగా వ్యవహరిస్తారు. దోపిడీదారులుగా ఉండరు. అలాంటి పవిత్ర బైబిల్‌ను చేతబట్టి విజయలక్ష్మి తప్పుడుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. వైఎస్ఆర్ పార్టీ వారు అహంకారంతో రౌడియిజంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఆ పార్టీలో అందరూ రౌడిలే చేరుతున్నారన్నారు.
న్యాయం జరగకపోతే
ఏం చేయాలో అది చేస్తా!
36 రోజులుగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి కాంగ్రెస్ చేసిన అన్యాయ ప్రక్రియపై పోరాడుతుంటే, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తెలుగు ప్రజలకి అండగా ఉంటానని, న్యాయం జరగకపోతే ఏం చేయాలో అదిచేసి చూపిస్తానని చంద్రబాబు ప్రజల హర్షధ్వానాల మధ్య స్పష్టం చేశారు. దానికి మీరు సహకరించాలని కోరారు. గతంలో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు, అధికార కాంగ్రెస్‌పార్టీ వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా మోసం చేసిందన్నారు. తెలంగాణాకు అనుకూలంగా నాటి పరిస్థితులను బట్టి లేఖ ఇచ్చిన మాట నిజమేనని, అయితే సీమాంధ్ర ప్రజలకు కూడా న్యాయం జరగాలని తాను చెప్పానన్నారు. రాజకీయాలను తాను ఒక పద్ధతి ప్రకారం, ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్వహించానే తప్ప, ప్రజలకు ఇబ్బందులు, నష్టం కల్గించే విధంగా ఏనాడు చేయలేదన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎన్టీఆర్, తరువాత తనవల్లే జరిగిందన్నారు. ఇప్పుడు కూడా తాను ప్రజల కోసమే ఈ యాత్ర చేస్తున్నానని, తన స్వార్ధం కోసం కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్ర సందర్భంగా హామీలు ఇచ్చానని, అవన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తానని ఆయన సదరు హామీలను పునరుద్ఘాటించారు.
రైతులకు పూర్తిరుణమాఫీ చేస్తానని, మరోసారి స్పష్టం చేశారు. తెలుగువారిని దిక్కులేని వారిగా చేస్తున్నారని, సీమాంధ్ర ప్రజలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రోజుకో వి«ధంగా అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత చంద్రబాబు కన్నా ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమ, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణ, మాజీ పార్లమెంట్‌సభ్యుడు మాగంటి బాబులు ప్రసంగించారు. చంద్రబాబు ప్రసంగం ముగిసిన అనంతరం నూజివీడు జేఏసీ చెందిన కొద్దిమంది చంద్రబాబును సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు.

దోపిడీదారు సోనియా

 జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు జే ఏసీ నాయకులు అభినందనలు తెలిపారు. సమైక్య ర్రాష్టాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాలో యాత్ర ముగింపు సందర్భంగా జే ఏసీ నాయకులు ఎన్ శామ్యూల్, ప్రొఫెసర్ పిీ నరసింహారావు, ఎం వెంకట రమణ ప్రజా సంఘాల జే ఏసీ కన్వీనర్ సిరిపురపు శ్రీధర్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు కసుకుర్తి హనుమంతరావుతో పాటు ఆర్టీసి, ఎల్రక్టిసిటి జే ఏసీ నాయకులు చంద్రబాబును కలిసి వినతి పత్రం సమర్పించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జే ఏసీ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమానికి సంఘీభావం ప్రకటించటమే కాక తెలుగు జాతి విచ్ఛిన్నం కాకుండా అండగా ఉంటానని ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

బాబుకు జేఏసీ నేతల అభినందనలు

' తెలంగాణా ప్రజలకు న్యాయం చేయమంటే మీకు అన్యాయం చేయమని కాదు. ఇక్కడ, అక్కడ ప్రజలతో మాట్లాడాలి. ఇద్దరికీ న్యాయం జరగాలి. అలా కాకుండా మీకు అన్యాయం జరిగితే తెగబడతా ! అవసరమైతే తిరగబడతా !! సీమాంధ్రుల ప్రతినిథిగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సమైక్యానికి ఒకప్పుడు కట్టుబడి ఉన్న మాట వాస్తవమే ! ఆ తర్వాత తెలంగాణా ప్రజల ఉద్యమం, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వారి సమస్యలను పరిష్కరించమని లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా మీకు ఎక్కడా అన్యాయం చేయమనలేదు. సీమాంధ్రలో ఉండే తెలుగువారికి ఇబ్బందులు ఉన్నాయి. 37 రోజులుగా ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్‌కు కనువిప్పు కలగలేదు. మొద్దు నిద్రలో ఉంది. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి. లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవ బస్సు యాత్ర శనివారం రెండవ రోజుకు చేరుకుంది. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. బాబు యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్షం పడినా లెక్క చేయకుండా బాబు ప్రసంగాలు విన్నారు. నాలుగు సీట్ల కోసం రాష్ట్రంలో చిచ్చుపెట్టిన వారు దేశంలో మనుగడ సాధించటానికి వీలులేదని, సోనియాకు సీట్లు కావాలంటే తెలుగువాళ్ళు కొట్లాడుకోవాలా ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి అందులో రాజకీయ లబ్ధి పొందాలని వైకాపా చూస్తోందని దుయ్యబట్టారు.

మీకోసం తెగబడతా, అవసరమైతే తిరగబడతా : ఆత్మగౌరవయాత్రలో చంద్రబాబు

రాష్ట్ర విభజన ప్రకటనకు తెలుగుదేశం పార్టీనే కా రణం అంటూ ప్రత్యర్థి పార్టీలు వేలెత్తి చూపిస్తోన్న విపత్కర తరుణం. ప్రజల్లోకి వెళితే ఎలాంటి పరిణామాలు ఎ దురౌతాయోనన్న ఉత్కంఠ ఒక వైపు. ఒక ప్రాంతానికి వెళితే మరో చోట ఇ బ్బందులు తలెత్తుతాయేమోనన్న ఆం దోళన మరోవైపు. వీటన్నింటి నడుమ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబా బు ధైర్యంగా ముందుకు కదిలారు. జిల్లాలో అడుగు పెట్టి ఆరు రోజుల పా టు ఆత్మగౌరవ యాత్ర విజయవంతం గా కొనసాగించి ఒకవైపు ప్రతిపక్షాల ఆ రోపణలను రాజకీయంగా తిప్పికొడుతూనే, ఇంకోపక్క పార్టీ కేడర్‌లో ఉత్సా హం నింపారు. స్థానిక సమస్యలనూ ప్ర స్తావించి నాటి ధరలను నేటితో బేరీ జు వేసి వ్యత్యాసం చూపిస్తూ ప్రజల మనస్సులు గెలుచుకొనే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు యాత్రను అడ్డుకోవాల ని వైసీపీ పిలుపునివ్వడం, ఆయన్ని ప్ర శ్నించాలని ఏపీఎన్‌జీవోల ఇచ్చిన పిలు పు మధ్యన గురజాల నియోజకవర్గం పొందుగల నుంచి టీడీపీ అధినేత యా త్రకు శ్రీకారం చుట్టారు. ఆత్మగౌరవ యాత్ర చేయాలన్న నిర్ణయం తీసుకొన్న తర్వాత కేవలం నాలుగు రోజుల వ్యవ ధే అయినప్పటికీ నేతలంతా సమష్టిగా కదిలారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జేఆర్ పుష్పరాజ్, ఆలపాటి రా జేంద్రప్రసాద్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, తాడికొండ ఇన్‌చార్జ్ తెనాలి శ్రావణ్‌కుమార్, సత్తెనపల్లి ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ, మంగళగిరి ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాసరావు భారీ ఎత్తున పార్టీ కేడర్‌ను సమీకరించారు. వీరికి తెలుగుదేశం నగర కమిటీ, తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగుమహిళలు జోడు కావడంతో యాత్రకు విశేష స్పందన ల భించింది. తొలి రోజున పొందుగల, దా చేపల్లి, పిడుగురాళ్లలో జరిగిన సభలు హైలెట్‌గా నిలిచాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరిలో జరిగిన యాత్రకు జనం విశేషంగా స్పందించారు.
చంద్రబాబు రాక కోసం మండుటెండలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూ డా నిరీక్షించడం విశేషం. కొన్ని గ్రామా ల్లో చంద్రబాబును పట్టుబట్టి మరీ ఎన్‌టీఆర్ విగ్రహాలు, పార్టీ జెండాల వద్దకు తీసుకెళ్లి ఆవిష్కరింప చేశారు.
వైసీపీ ఒకటి, రెండు చోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడగా పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. వైసీపీ నేతలకు చంద్రబాబుతో పాటు గురజాల ఎ మ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీ వ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. యాత్రలో ప్రధానంగా తెలుగుజాతి వి చ్ఛిన్నానికి కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కలిసి సంయుక్తంగా కుట్ర పన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్‌ను విలీనం చేసుకొని అక్కడ సీట్లు పొందాలి. ఇక్కడ ఓడిపోయినా జగన్ మాస్కుతో సీట్లు దక్కించుకోవాలి. ఇది కాంగ్రెస్ కుటిల నీతి అంటూ ఎండగట్టారు. నాడు ఎన్‌టీఆర్
పార్టీని స్థాపించి తెలుగుజాతికి ఆత్మగౌరవం తీసుకొస్తే తాను హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపి ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలు కల్పించానని చెప్పారు. రూపాయి పతనం కావడం, బొగ్గు కుంభకోణంలో ఫైళ్లు మాయం కావడం, సోనియాకు డబ్బు పిచ్చి పట్టిందని, మన్మోహన్ ఒక తోలుబొమ్మలా మారాడని, జగన్ దొంగబ్బాయి, రాహుల్ మొద్దబ్బాయి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆరు రోజుల పాటు ఐదు నియోజకవర్గాల్లో 50కి పైగా గ్రామాలు 240 కిలోమీటర్ల పొడవునా యాత్ర కొనసాగింది. జిల్లాలో చివరిగా ఉండవల్లి సెంటర్‌లో ప్రసంగించిన చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్ మీదగా విజయవాడ నగరంలోకి వెళ్లారు. బ్యారేజ్ వద్ద టీడీపీ జిల్లా నేతలు, కార్యకర్తలను చంద్రబాబు అభినందించారు.

గుంటూరు జిల్లాలో ముగిసిన చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర

 పంట రుణాలు చెల్లించమంటూ బ్యాంకు అధికారులు చేస్తోన్న ఒత్తిళ్లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రైతుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడితే మిమ్మల్ని వదిలి పెట్టనంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అప్పులు చెల్లించక పోతే మీరు వేలం వేస్తారా? ఎంత ధైర్యం మీకు. కాంగ్రెస్ దొంగలను వే లం వేస్తే దేశంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయన్నారు. రైతుల జోలికొస్తే ఖబడ్దార్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చా రు. గురువారం ఉదయం మోతడకలో ని చలపతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద నుంచి చంద్రబాబు ఐదో రోజు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. నిడుముక్కల, పొన్నెకల్లు, బేజాతపురం, రావెల, మందపాడు, బండారుపల్లి, గరికపాడు, తాడికొండ, కంతేరులో యాత్ర కొనసాగించారు. పలుచో ట్ల ఎన్‌టీఆర్ విగ్రహాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. మార్గమధ్యలో విద్యార్థులతో సంభాషించి వారికి భరోసా నింపారు. నిడుముక్కల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నిడుముక్కల, పొన్నెకల్లు, రావెల, తాడికొండలో జరిగిన ఆత్మగౌరవ యా త్రకు వేలాదిమంది ప్రజలు హాజరై చంద్రబాబుకు ఘనస్వాగతం పలికా రు. జన స్పందన చూస్తూ 'నేను ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. సంఘీభావం తెలుపుతున్నారు. టీడీపీపై ఉన్న అభిమానం, నా మద ఉన్న నమ్మకం మిమ్మల్ని ఆత్మగౌరవ యాత్రలో పాల్గొనేలా చేస్తోంది. మీ రు ణం తీర్చుకోలేనిదంటూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ వ సూళ్ల పార్టీ అని, మొద్దబ్బాయి రాహుల్‌కు ప్రధానమంత్రి, దొంగబ్బాయి జగన్‌కు సీఎం పదవి కావాలి. ఇటలీ సోనియా, ఇడుపులపాయ విజయలక్ష్మి లంకె కుదుర్చుకొన్నారు. ప్రధాని దేశా న్ని తగలబెట్టేస్తున్నారు. సోనియా డ బ్బు పిచ్చతో దేశంలో ఉన్న డబ్బు అం తా దోచేస్తోందంటూ మండిపడ్డారు.
నిత్యవసర సరుకుల ధరలు, రైతుల సమస్యల పైనా చంద్రబాబు చర్చించా రు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే రైతులకు రుణమాఫీ చేసి తీరుతుందని పునరుద్ఘాటించారు. వ్యవసా యం కోసం బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని విడిపిస్తుందన్నారు. చేతకాని ప్రధానమంత్రి బంగారం కొనొద్ద ని చెబుతున్నారు. ఇంకోపక్క పెట్రోలు బంకులు రాత్రి వేళ మూసేస్తామంటున్నారు. ఇదో తుగ్లక్ పరిపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొన్నెకల్లులో చంద్రబాబు కాన్వా య్ ప్రధాన మార్గంలో ఏర్పాటు చేశా రు. అయితే గ్రామస్థులు పట్టుబట్టి త మ వీధుల్లో నుంచి వెళ్ళాలని అడ్డుపడ్డా రు. ఆ సమయంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య కొంత వివాదం తలెత్తగా చంద్రబాబు జోక్యం చేసుకొని ఎవరూ ఆవేశ పడొద్దని చెప్పారు. తాను ప్రసం గం అయిపోగానే మీరు కోరిన మార్గంలోకి వస్తానని చెప్పి శాంతింప చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అలానే వారు కోరిన వీధిలో పర్యటించారు. మోతడకలో ఒక మహిళ చంద్రబాబుతో సంభాషిస్తూ తన భర్త చనిపోయినా అమ్మాయిని చదివించానని చెప్పారు. ఈ రోజున ఉద్యోగం రాకపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ ఏమి చేస్తామమ్మా ఈ కాంగ్రెస్ దొంగలు రా ్రష్టాన్ని దోచేశారు. దాంతో ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరూ ముం దుకు రావడం లేదు. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీలాంటి పేదవాళ్లందరికి న్యాయం చేస్తుందని ధైర్యం చెప్పారు.
నా కళ్ల ముందే హైదరాబాద్ సర్వనాశనం చేస్తున్నారు
గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని తాడికొండ నియోజకవర్గం మోతడకలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుభవాలను పంచుకొన్నారు. సీఎంగా ఉ న్న తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికి పడిన శ్రమను పూసగుచ్చినట్లు వి వరించారు. బిల్‌గేట్స్‌ను ఏ విధంగా ఒప్పించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్టు సెంటర్‌ను పెట్టించింది. తద్వారా ఇత ర కంపెనీలు కూడా వచ్చేలా చేసి హైటెక్ సిటీని నిర్మాణం చేసిన తీరును వెల్లడించారు. అలాంటి హైదరాబాద్‌ను నా కళ్ల ముందే నాశనం చేసేస్తున్నారంటూ చంద్రబాబు ఒకింత ఆవేదన చెందారు.
చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో బస చేసిన చంద్రబాబుకు గురువారం ఉదయం విద్యార్థులు ఘనంగా స్వాగ తం పలికారు. చంద్రబాబు ఇంచుమిం చు గంట సమయానికి పైగా తన అనుభవాలను విద్యార్థులతో పంచుకొన్నా రు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభించగానే విద్యార్థులు కేరింతలు కొట్టడంతో... తమ్ముళ్లూ విద్యార్థి వయస్సులో మీకంటే ఎక్కువ అల్లరి చేసేవాడిని నేను. నేను స్టూడెంట్ లీడర్‌ను. అ క్కడి నుంచే రాజకీయాల్లోకి వచ్చానని తన కళాశాల రోజులను గుర్తు చేసుకొన్నారు. డిగ్రీ చదువుకొనే దశలోనే ఎవరికైనా నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. అందుకే నేడు ఎంటెక్ చదివినా అందరూ ఎంబీఏ చదువుతున్నారు. దానికి కారణం నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికేనన్నారు. అందుకే తాను ఐఎస్‌బీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించానని చెప్పారు.
తల్లి, తండ్రి తర్వాత విద్యార్థుల జీవితాన్ని మలిచేది గురువులేనని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్రిటీష్ పాలన నుంచి దేశం బయటపడిన తర్వాత ఆర్థిక విధానాల్లో లోపం వలన అభివృ ద్ధి తక్కువగా జరిగింది. ఫారెన్ ఎక్స్ఛే ంజ్ లేక విధి లేని పరిస్థితుల్లో 1991వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడితే నేను పకడ్బందీగా అమలు చేశాను.
ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ రోజున మీరు పుట్టి ఉండరు. ఎవరైనా సరే చరిత్ర తెలుసుకొని భవిష్యత్తుపై దృష్టి సారిస్తేనే ముం దుకు వెళ్లగలరని నమ్ముతున్నానన్నా రు. 22 ఏళ్ల సంస్కరణల అమలులో ఫలితాలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. నేను సీఎం అయిన వెంటనే ఏమిటి మన దేశం? ఎందుకని ఇతర దేశాలతో పాటు ముందుకు వెళ్ళడం లేదని ఆలోచన చేశాను. నాకు ఆ రోజు, ఈ రోజు యువత స్ఫూర్తి. వారికి నాణ్యమైన విద్యనందిస్తే ప్రపంచాన్ని శాసిస్తారని గుర్తించి విద్యకు ప్రాధాన్యం ఇచ్చానన్నారు. పాఠశాలలు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్థాపించి అందరూ చదువుకొనేలా చేశాను. ఆ తర్వాత విజన్ 2020 ప్రారంభించాను. దానిని నేడు ఈ కాంగ్రెస్ దొంగలు విజన్ 420గా చేశారన్నారు.
అమెరికా, యూరప్, చైనాలో యువతకు కొరత ఉన్నది. మనవాళ్లు మాత్రం ప్రపంచంలో పని చేసే ప్రతీ నలుగురిలో ఒకరున్నారు. అందునా తెలుగువారుండాలని ఆలోచన చేశాను. చదువుకొన్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల గురించి ఆలోచించి అప్పుడే వస్తోన్న ఐటీ విప్లవాన్ని గుర్తించాను. ఇంజనీరింగ్ కళాశాలల అనుమతి కోసం ఢిల్లీ చుట్టూత ఫైళ్లు పట్టుకొని తిరిగాను. నా స్వంత పనికి కూడా అంతగా కష్టపడలేదని చెప్పారు. అమెరికాకు ఒక బృందాన్ని పంపించి అక్కడ విద్యా విధానాన్ని అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు సంస్కరణలు తీసుకొచ్చాను.
ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, తాడికొండ ఇన్‌చార్జ్ తెనాలి శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, జీ వీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, కందకూరి వీరయ్య, అనగాని సత్యప్రసాద్, ఎస్ ఎం జియావుద్దీన్, యాగంటి దుర్గారావు, కోవెలమూడి రవీంద్ర, పెదకూరపాడు బుజ్జి, వెన్నా సాంబశివారెడ్డి, మన్నవ సుబ్బారావు, కొర్రపాటి నాగేశ్వరరావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, ముత్తినేని రాజేష్, వట్టికూటి హర్షవర్ధన్, కట్టా శ్రీను, సిరిపురం శ్రీధర్, కసుకుర్తి హన్మంతరావు, గుడిమెట్ల దయారత్నం, సగ్గెల రూబెన్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల జోలికొస్తే ఖబడ్దార్

తెలుగుజాతికి ఎక్కడ, ఎప్పుడు ఇబ్బంది కలిగినా అక్కడికి వస్తా. మీ తరుపున రాజీ లేని పోరాటం చేస్తాను. మీకు సమన్యాయం జరిగేవరకు ఎవ్వరినీ వదిలి పెట్టను. అవసరమైతే వాళ్ల అంతు చూస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజన ప్రకటనతో ఆందోళన చెందుతోన్న ప్రజలకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర శుక్రవారం జిల్లాలో తాడికొండ నియోజకవర్గం కంతేరు నుంచి ప్రారంభించారు. కంతేరులో ఆడబిడ్డలు మండుటెండను కూడా లెక్క చేయకుండా నాకు స్వాగతం పలుకుతున్నారు. యువకులు ఆకాశానికి ఎగిరెగిరి పడుతున్నారంటూ ఉత్సాహం నింపారు. కంతేరు టీడీపీ నేత వాసిరెడ్డి జయరామయ్య ఎన్నో బాధలు పడ్డారు. రాజీ లేని పోరాటం చేస్తున్నారని అభినందించారు.
తెలుగుజాతి విధ్వంసానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ కారకులయ్యాయని మండిపడ్డారు. వాళ్లు మన పొట్టలు కొట్టారు. లాలూచి, కుట్రపూరిత రాజకీయాలు చేస్తోన్న ఆ మూడు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల హక్కులు కాపడటానికి, మీకు అండగా ఉండటానికే నేను యాత్ర చేపట్టాను. రెండు చోట్ల మీ అంతం చూస్తాం. మిమ్మల్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదని హెచ్చరించారు. సోనియా జగన్నాటకంలో వైసీపీ, టీఆర్ఎస్ పాత్రదారులని వాటిని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
కంతేరులో యాత్ర ముగిసిన అనంతరం చంద్రబాబు నిడమర్రు చేరుకొన్నారు. మార్గమధ్యలో నిడమర్రు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి దానిని ఎంతో చక్కగా నిర్వహిస్తోన్న రైతులను అభినందించారు. ఇక్కడే ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిడమర్రులోని రెండు దళితవాడల్లో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుజాతి ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్కటేనన్నారు. ఈ జాతికి ఒక అనుబంధః ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ ఎవరు తెలుగు మాట్లాడినా మన మనస్సులు పులకరించిపోతాయి. ఈ ప్రాంతం జాతి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. అన్నదమ్ముల్లా ఉంటే కళ్లు కుట్టిన ఢిల్లీ పెద్దలు రాజకీయం కోసం చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన బెయిల్ కోసం తెలుగుజాతిని తాకట్టుకు పెట్టే పరిస్థితికి వచ్చాడన్నారు. నిడమర్రు శివారులో కాసేపు విశ్రాంతి తీసుకొన్న చంద్రబాబు ఆ తర్వాత బాపూజీనగర్, నీరుకొండ శిబిరం మీదగా మంగళగిరి పట్టణంలోకి చేరుకొన్నారు. అక్కడ ఎత్తురోడ్డు సెంటర్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీకి చదువు లేదని.. ఆమె నిరక్షరాస్యురాలైనందునే ఆమె పాలన కింద దేశం పూర్తిగా సర్వనాశనమైందని తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శించారు. ఇందిరాగాంధీ కోడలిగా దేశంలో అడుగిడిన సోనియా తెలుగుజాతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ప్రధాని మన్మోహన్ ఆమె చేతిలో ఓ తోలుబొమ్మ.. కీలుబొమ్మ... ఇంకా ఎన్నన్నా తక్కువేనని ప్రధాని తీరుపై బాబు మండిపడ్డారు. బంగారం ధరలు తగ్గుతాయ్.. ఇప్పుడేమీ కొనొద్దంటాడు... రాత్రిళ్లు పెట్రోలు బంకులు మూసేస్తే వాడకం తగ్గి ధరలు తగ్గుతాయంటాడు. ఇలా ప్రధాని పిచ్చితుగ్లక్ పాలన చేస్తున్నాడు. వైఎస్ బతికుంటే తమకిన్ని కష్టాలు వచ్చేవి కావని ప్రధాని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికి తమ విచారణలో రూ.43 వేల కోట్ల అవినీతి జరిగినట్టు తేలిందని.. మొదటి ముద్దాయిగా వైఎస్‌ను పేర్కొంటూ ఆయన చనిపోయినందున జగనే తొలి ముద్దాయని సీబీఐ చెప్పడాన్ని ప్రధాని మర్చిపోవడం విచారకరమన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్ధతతో దేశం భ్రష్టు పట్టిపోయింది. లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం తాలూకూ ఫైళ్లు బొగ్గులోనే కలిసిపోయాయి. ఆ ఫైళ్లు వుంటే రాబోయే రోజుల్లో జైలుకు పోతామన్న భయంతోనే వాటిని కాల్చివేశారని చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతిపరులు ఎంతటి వాళ్లయినా గుండెల్లో రైళ్లు పరుగెత్తించామని అన్నారు.
కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించండి
దేశానికి మోక్షం కలగాలంటే కాంగ్రెస్‌ను మళ్లీ చిత్తుగా ఓడించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రగులుతున్న తెలుగుజాతి గుండపై ఒట్టేసి చెబుతున్నా.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేద్దాం.. రండంటూ ఆవేశంగా అన్నారు. ప్రజల పొట్టలు కొట్టిన కాంగ్రెస్‌ను చిత్తు చిత్తు చేసి బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు పౌరుషంతో కదిలిరావాలని అభ్యర్థించారు.
చేతకాకుంటే తప్పుకోండి..
ఆర్నెల్లలో పరిష్కరిస్తాం
రాష్ట్రాన్ని , దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పాలకులకు సమస్యల పరిష్కారం చేతకాకుంటే రాజీనామా చేసి తప్పుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలకులు పదవుల నుంచి తప్పుకుని ఎన్నికలకు సిద్ధపడితే తాము గెలిచి ఆరు మాసాల్లో సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా అసమర్ధ ప్రధాని, అవినీతి సోనియా కారణంగా గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చక్కబెట్టగలమని బాబు ధీమాగా చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మంగళగిరి టీడీపీ కన్వీనర్ పోతినేని శ్రీనివాసరావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు ఆరుద్ర అంకవరప్రసాద్, పట్టణ టీడీపీ అధ్యక్షులు నందం అబద్దయ్య, టీడీపీ నేతలు బెల్లంకొండ నరసింహారావు, మహమ్మద్ ఇబ్రహీం, వల్లభనేని సాయిప్రసాద్, కొల్లి లక్ష్మయ్యచౌదరి, గంజి చిరంజీవి, వల్లూరు సూరిబాబు, మన్నెం మార్కండేయులు, సంకా బాలాజీగుప్తా, కొత్తపల్లి శ్రీనివాసరావు, మాదల రమేష్, గాదె పిచ్చిరెడ్డి, జవ్వాది కిరణ్‌చంద్, వెలగపాటి విలియం, ముశం రవికుమార్, కోనంకి శ్రీనివాసరావు, వుయ్యూరు నాగిరెడ్డి, కగ్గా శ్రీనివాసరావు, సయ్యద్ జిలానీ, షేక్ నన్నె, షేక్ రియాజ్, మునగాల సత్యనారాయణ, గుత్తికొండ ధనుంజయరావు, పఠాన్ ఖాశీంఖాన్, పొన్నం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరిలో బాబు
యాత్రకు అడ్డుపడ్డ ఎన్జీవోలు
మంగళగిరి టౌన్: ఆత్మగౌరవ యత్రలో భాగంగా శుక్రవారం మంగళగిరి విచ్చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఏపీఎన్జీవోలు, మంగళగిరి ఉద్యోగ, కార్మిక ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు, ఉపాధ్యాయ జేఏసీ, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ, ఉపఖజానా ఉద్యోగులు, పలువురు సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా, ప్లకార్డులు పట్టుకుని ఉద్యోగస్తులు ముందుకు సాగడంతో ఉద్యోగులు బాబు వాహనాన్ని ఆపి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
జిల్లా నేతలకు అభినందనలు
ఆరు రోజుల పాటు తన యాత్ర లో జిల్లాలో విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మం త్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, ఇన్‌చార్జ్‌లు నిమ్మకాయల రాజనారాయణ, తెనాలి శ్రావణ్‌కుమార్, పోతినేని శ్రీనివాసరావు, పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, చిట్టాబత్తిన శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్, దాసరి రాజా, దామచర్ల శ్రీనివాసరావు, కొర్రపాటి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరాంప్రసాద్, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు రావిపాటి సాయికృష్ణను ఉండవల్లి వద్ద చంద్రబాబు భుజం తట్టి అభినందించారు.

తెలుగువారికి ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడికి వస్తా


ఎల్బీ స్టేడియం దగ్గర చూస్తే సమైక్యవాదం ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని టీడీపీ నేత పయ్యావుల కే శవ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం ఉద్యోగుల సభ మాత్రమే అని...సమైక్యం కోరుకునేవారంతా తరలివస్తే హైదరాబాద్ సరిపోదని ఆయన తెలిపారు.

తెలంగాణలో 50 శాతం సమైక్యవాదులు ఉన్నారని...వారిని ఈ సభకు రానివ్వకుండా చేసేందుకే తెలంగాణలో బంద్ ప్రకటించారని విమర్శించారు. టెన్‌జెన్‌పథ్ డైరెక్షన్లలోనే వైఎస్ విజయలక్ష్మి లేఖ రాశారని ఆరోపించారు. టీఆర్ఎస్ కారుకు డీజిల్, వైసీపీ ఫ్యాన్‌కు కరెంట్‌ను ఇస్తుంది కాంగ్రెస్సే అని ఆయన అన్నారు. టీఆర్ఎస్, వైసీపీ నేతలు ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలు బొమ్మలని పయ్యావులు ఎద్దేవా చేశారు.

సమైక్యవాదం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది : పయ్యావుల