June 4, 2013

హైదరాబాద్: మద్యపానం రాజకీయ సమస్య కాదని, అదొక సామాజిక సమస్య అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రుణమాఫీ రద్దు ఫైలుపై మొదటి సంతకం చేస్తామని చెప్పారు. ఇక బెల్టు షాపుల రద్దుపై రెండో సంతకం చేస్తామని ఆయన తెలిపారు.

తమ ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నియంత్రణ అంశాన్ని చేర్చుతామని ఆయన చెప్పారు. బెల్టు దుకాణాల రద్దుపై సీఎం తన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఎన్నికల వేళ మద్యం అమ్మకాలను నిషేధిస్తూ నోటిఫికేషన్‌లో నిబంధన తీసుకరావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ మధ్యనే బెల్ట్ షాపులను ఎత్తివేయాలని, వాటి మీద ఆయా జిల్లాల కలెక్టర్లను నివేదిక అందించాలని చెప్పిన ముఖ్యమంత్రి బెల్టుషాపులను నిషేధిస్తామని చెప్పి ఇప్పుడు కాదని చెప్పడం తగదని బాబు అన్నారు. రాష్ట్రంలో బెల్టుషాపులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బెల్టు షాపుల రద్దు, రుణమాఫీపైనే తోలిసంతకం!