December 17, 2012

'వైద్యో నారాయణో హరి' అంటారు. పేదవాడి ఫ్యామిలీ డాక్టర్లుగా గౌరవం పొందే ఆర్ఎమ్‌పీ, పీఎంపీలూ రోడ్డెక్కాల్సి రావడం బాధాకరం. రాయికల్ దాటగానే..టెంటు వేసుకొని నా కోసం వాళ్లంతా ఎదురుచూస్తూ కనిపించారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కదిలిస్తున్నకొద్దీ తమ కష్టాలను కుప్పపోశారు. గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ల సేవలు ఎంతో అమూ ల్యమైనవి. ఈ విషయం పల్లెలో బతికే ఎవరిని కదిపినా తెలుస్తుంది. పేదల ఇళ్లలో సొంత మనుషుల్లా వీళ్లు మెసులుతారు. మొగుడూపెళ్లాల గొడవల నుంచి ఊరి సమస్యల దాకా వీళ్ల ను దాటి ఏ సమస్యా పక్కకు పోదు.

పిల్లలను ఆడిస్తూ, అవ్వలను ఆట పట్టిస్తూ 'మామయ్యా' 'మనవడా' అని పిలిపించుకుంటూ వృత్తి ధర్మాన్ని విధిగా నిర్వహించే కర్మజీవులు వీళ్లు. వైద్యసేవలకు దూరంగా ఉండే పల్లెలో వీళ్ల సేవలే ప్రాథమిక ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. అలాంటి ఆర్ఎమ్‌పీలు, పీఎంపీలు రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. గ్రామీణ వైద్యానికి వెన్నుదన్నుగా ఉన్న వీళ్ల వెన్నుముకను ప్రభుత్వం విరుస్తోంది. వాళ్లకు కాస్తంత శిక్షణ ఇచ్చి గుర్తింపు ఇస్తే మరింత మెరుగ్గా వైద్యసేవలు అందిస్తారు. ఆ విషయమై నేను ప్రభుత్వానికి లేఖ రాస్తే, మొదట్లో కొంత స్పందించినా ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. వీళ్లను కాపాడుకోకుండా మంచం పట్టిన గ్రామీణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ కష్టమే.

అల్లీపూర్‌లో అడుగు పెట్టగానే ఆడపడుచులు చుట్టూ గుమిగూడారు. సొంత మనిషిని చూసిన ఆనందం వాళ్ల కళ్లలో చూడగలిగాను. చేతుల్లో ఏవో స్లిప్పుల్లా ఉన్నాయి. వాటిని విసురుగా నావైపు చాపి గోడు వెళ్లబోసుకున్నారు. " ఒకనాడు 150 రూపాయలు దాటేది కాదు. ఇప్పుడేమో 500 రూపాయలపైనే బిల్లు వస్తోంది సారూ.. మా ఇంట్లో చూడు.. రెండు బల్బులన్నా ఉన్నాయా? బిల్లు మాత్రం వెయ్యి రూపాయలు తేలింది'' అని ఆ మహిళలు వాపోయారు. "ఇంతగా ఏడిపిస్తున్న సర్కారు ఏట్లో పడా'' అని వాళ్లు శా

ఏడిపించే సర్కారు ఏట్లో పడా!

బీజేపీ వంటి మతతత్వ పార్టీతో టీడీపీ కలవబోదని చంద్ర బాబు ప్రకటించారు. మైనారిటీల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉన్నదని, కాంగ్రెస్ మాత్రం వారిని ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోందని ధ్వజమెత్తారు.అల్లీపూర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. 2014 నాటి పొత్తులూ కత్తులపై స్పందించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది తమ పార్టీ ప్రణాళికలోని అంశమని, దాన్నే వైఎస్ అమలు చేసే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు ఎనిమిది శాతం కోటా, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, వడ్డీ లేని రుణాల మంజూరు, ఇమామ్‌లకు రూ. 5,300 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు.

బీజేపీతో పొత్తు ఉండదు: బాబు

ఉద్యోగులకు పీఆర్సీ వేయాలి!
పెన్షనర్లకు పింఛన్ పెంచాలి
సర్కారుకు చంద్రబాబు డిమాండ్
అధికారంలోకి వస్తే .. మేమే చేస్తామని భరోసా

ఉద్యోగ సమస్యలపై టీడీపీ అధినేత గొంతెత్తారు. పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత తొలిసారి చంద్రబాబు 'వేతనజీవుల' సమస్యలపై స్పందించారు. " వెంటనే పీఆర్సీ వేయాలి. పెన్షనర్ల పింఛను పెంచాలి'' అని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేదంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే తామే అమలు చేస్తామని తేల్చిచెప్పారు. కరీంనగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఆయన సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. రాయికల్, కుమ్మరిపల్లి, ఉప్పుమడుగు, అల్లీపూర్, కిష్టంపేట గ్రామాల వరకు 14.4 కిలోమీటర్లు నడిచారు.

ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు, వికలాంగులు, కూన పులి సంఘం, గంగ పుత్రులు, గీత కార్మికులు, నాయీబ్రాహ్మణులు, మేదరులు, కుమ్మరి, రజకులు, ముస్లింలు, గల్ఫ్ బాధితులు, మహిళలు..ఆయనకు దారి పొడవునా ఘనస్వాగతం పలికారు. గీత కార్మికుల మోకు ధరించి, బట్టలు ఇస్త్రీ చేసి, కుమ్మరి సారె తిప్పి, క్షౌరవం చేసి, రాట్నం వడికి, డప్పు కొట్టి శ్రామిక జనావళితో మమేకమయ్యారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కిరణ్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

"దేశమంతా తిరిగినా నాకు అధికారం రాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెటకారం చేస్తున్నారు. ఈయన, ఈయన మంత్రులు తిరగరు. సమస్యలు పరిష్కరించరు. ఇదో పనికి మాలిన ప్రభుత్వం. దద్దమ్మ ప్రభుత్వం. మాయ మాటలు నమ్మకండి. ప్రలోభాలకు లోను కాకండి. నేను చెప్పింది న్యాయమా కాదా అనేది మీరూ మీ కుటుంబమూ ఆలోచించండి. మీ కుటుంబ పెద్దగా ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తా. ఎన్నికల రోజు నాకివ్వండి.. ఐదు సంవత్సరాలు మీతో ఉండి మీ జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా'' అని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ వేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వారికోసం ఆరోగ్యబీమా పథకం అమలుచేయాలని కోరారు.

"ఈ రోజు పెన్షనర్ల రోజు. 30 సంవత్సరాలపాటు వారు నిస్వార్థంగా సేవలందించారు. వారికి ఇస్తున్న పెన్షన్ ఆహార , ఆరోగ్య అవసరాలకు సరిపోవడం లేదు. పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉంది'' అని సూచించారు. అలాగే ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఆరోగ్య కార్డులను జారీ చేయాలని, అధికారంలోకి వస్తే ఆ బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. వృద్ధుల పెన్షన్‌కు రూ. 200 నుంచి రూ. 600లకు తక్కువ గాకుండా పెంచుతామని, వృద్ధులు, వికలాంగులకు ఇళ్ల స్థలాలు, లక్ష రూపాయల చొప్పున వెచ్చించి ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

బీడీ కార్మికులకు రోజుకు రూ. 150 కనీస వేతనం ఇచ్చేంత వరకు ఈ ప్రభుత్వంతో పోరాడుతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే ఆ వేతనాన్ని అమలు చేస్తామన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పేద పిల్లలకు ఉచిత విద్యనందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కిరణ్ ప్రభుత్వం మొండెద్దు లాంటిదని, దీన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి బంగాళాఖాతంలో పారవేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

" కాంగ్రెస్ అవినీతి పార్టీ, టీఆర్ఎస్ అవకాశవాద పార్టీ, వైసీపీ జైళ్లో ఉండి రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ దొంగలు జైలుకు వెళ్లి దండం పెట్టి వస్తున్నారు. వీరికి కష్టాలు పట్టవు. టీఆర్ఎస్‌కు ప్రజా సమస్యలు పట్టవు. కేసీఆర్ కొడుకు, కుమార్తె, మేనల్లుడికి మాత్రం ఉద్యోగాలు కావాలిగానీ ప్రజలకు వద్దా'' అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండగా కేసీఆర్ బీడీ కట్టలపై శవం, పుర్రె గుర్తును వేయించారని గుర్తుచేశారు. మౌలిక సమస్యలను సైతం ప్రభుత్వం పరిష్కరించక పోవడంతోనే ప్రజలు రోడ్లెక్కారని విమర్శించారు.

పేదలలో, ప్రజలలో ఆర్థిక అసమానతలు తొలగించి జీవన ప్రమాణాలు పెంచడానికి తాను నగదు బదిలీ పథకాన్ని తీసుకురావాలని అనుకున్నానని, అయితే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేంద్రం..నగదు బదిలీని చేపట్టాలని నిర్ణయించిందని విమర్శించింది. ఇప్పటివరకు 40 శాతం ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు పూర్తి కాలేదని; తొందరపడి అమలు చేస్తే రసాభాస అవుతుందని తెలిపారు. నగదు బదిలీ వల్ల ఆర్థిక అసమానతలు తగ్గాలి కానీ పెరిగే విధంగా ఈ ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. రూపాయి కిలో బియ్యం పథకం ద్వారా నగదు బదిలీ కింద ఐదు రూపాయలిచ్చి రూ.60 భారాన్ని ప్రజలపై మోపనున్నారన్నారు. ఇలాంటి నగదు బదిలీ వల్ల రాష్ట్రంలోని 47 వేల మంది చౌక ధరల డీలర్లు వీధిన పడనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మీరొస్తేనే మాకు బతుకు..
"నేనేం చేయాలి.. మీరే చెప్పండి'' అంటూ సమస్యలను ప్రజల నోటే వింటూ, చంద్రబాబు ముందుకెళుతున్నారు. రాయికల్‌లో తనను కలిసిన యువకులు, విద్యార్థులతో సమస్య- పరిష్కారం చెప్పించారు. "మీ తొమ్మిదేళ్ల పాలన చాలా బా గుంది. అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తొమ్మిది గంటలకే వచ్చి పనిచేశారు. కాంగ్రెసోళ్లు ఏం చేస్తున్నరు? కోట్లు తిన్నారు. జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏం చేస్తున్నారు?'' అని ఒక యువకుడు ఆవేశంగా ప్రశ్నించారు. "మీ సంస్కరణల వల్ల పాలన బాగా సాగింది. సంక్షేమ ఫలాలు అందాయి. మళ్లీ మీరొస్తేనే మాకందరికి బతుకు''అని మరో విద్యార్థి ఆకాంక్షించారు.

వేతన జీవుల సమస్యలపై ఆవేదన:చంద్రబాబు

జగిత్యాల : టీడీపీ అధినేత చంద్రబా బు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం 2 గం టల నుంచి ప్రారంభమయ్యింది. చంద్రబాబు నాయుడు 71 రోజులుగా వస్తు న్నా మీకోసం పాదయాత్ర చేపడుతుండగా, నిత్యం 14-16కి.మీ. మేరకు పా దయాత్ర చేస్తుంటారు. అయితే ఆదివా రం మాత్రం ఆయన నిత్యం చేసే పాదయాత్రలో సగానికి తగ్గించుకుంటారు. పాదయాత్ర నిత్యం ఏ రాత్రికి ముగిసినప్పటికీ ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటల నుంచే ప్రారంభమవుతుంది. రాత్రి తాను ప్రత్యేక వాహనంలోకి వెళ్లి ఆ తర్వాత ఉదయం 11 గంటలకే బ యటకు వస్తుంటారు. కానీ ఆదివారం షెడ్యూల్‌లో మార్పు ఉంటుంది. రాత్రి ఏ సమయంలో వాహనంలోకి వెళ్లినప్పటికీ ఆదివారం మాత్రం మధ్యాహ్నం 2 గంటలకే బయటకు వచ్చి పాదయాత్ర చేపడుతుంటారు. 71 రోజులుగా సాగుతున్న పాదయాత్రలో చంద్రబాబు ప్రతి ఆదివారం ఈ నిబంధనలు పాటి స్తూ వస్తున్నారు. ప్రతి ఆదివారం తన పాదయాత్ర షెడ్యూల్‌పై వ్యాన్‌లోనే సమీక్షించుకుంటూనే కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. అలాగే ఆయన ను కలిసేందుకు వచ్చిన ముఖ్యమైన నాయకులతో వ్యాన్‌లోనే మాట్లాడుతుంటారు. ప్రతి ఆదివారం కుటుంబసభ్యులకు కూడా కొంత సమయాన్ని కే టాయిస్తుంటారు.

ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాటామంతీ...

మెట్‌పల్లి/మల్లాపూర్: బాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి... మా కష్టాలు గ ట్టెక్కాలని పలువురు రైతులు అన్నారు. ఆదివారం మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి నుంచి రేగుంట వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా పలు ప్రాంతాల్లో ఆగు తూ పలువురు రైతులు, యువకులు, వి ద్యార్థులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులతో చంద్రబాబు మాటామంతి కలిపారు. పసుపు చేలకు వెళ్లి పంటల ను పరిశీలించారు. మిరప, జొన్న, పసుపు పంటలను పరిశీలించారు. గొర్ల కాపరులతో మాట్లాడారు. ఇలా చంద్రబాబు పలు వర్గాలకు చెంఇన ప్రజలతో పాదయాత్రలో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు వర్గాలకు చెందిన ప్రజలు చంద్రబాబుతో జరిపిన సంభాషణ ఇలా ఉంది...

రేగుంట పసుపు రైతు: సార్ పంట కు పీడసోకింది. దిగుబడి తక్కువగా వ చ్చే ప్రమాదముంది. అధికారులు పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఆదుకోవాలి.

చంద్రబాబు: పసుపు ఎన్ని ఎకరాల్లో వేసావు. పెట్టుబడి ఎంతయింది. ఇంకా సమస్యలేంటి.

రైతు: మూడెఎకరాల్లో పసుపు వే సాను. లక్షకు పైగా పెట్టుబడి దాటింది. మందుల ఖర్చు ఎక్కువయ్యింది.

చంద్రబాబు: దిక్కుమాలిన ప్రభు త్వం రైతులను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ హయాంలోనే అన్నదాత అష్టకష్టాల పాలవుతున్నాడు.

రైతు: మీరు మళ్లీ ముఖ్యమంత్రి కా వాలి.. మా కష్టాలు గట్టెక్కించాలి.

చంద్రబాబు: రైతన్న కష్టాలు తీర్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాను. పసుపుకు ప్రత్యేక బోర్డుఏర్పాటు చేసిన మద్దతు ధర అందించాలి.

గొర్లకాపరి: సార్ గొర్లు చనిపోతున్నా యి.. బీమా సొమ్ము అందడం లేదు.. ఎ వరికి చెప్పాలో తెలియడం లేదు.

చంద్రబాబు: టీడీపీ ప్రభుత్వం వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. గొర్రెలకు బీమా అందిస్తాము. గొర్ల పెం పకానికి ఉచితంగా స్థలం కేటాయిస్తాను.

స్వయం సహాయ సంఘ మహిళ: సార్ బ్యాంకులో 50 వేల అప్పు తీసుకున్నాను. వడ్డీకి వడ్డీ వేసి ఇప్పుడు అప్పు లక్షకు పెరిగింది. కట్టే పరిస్థితిలేదు. ఉరి వేసుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు.

చంద్రబాబు: మీ సమస్యలు తెలుసుకున్నా పరిష్కారానికి కృషి చేస్తాను.

వృద్ధుడు: సార్ నా వయస్సు 80 సంవత్సరాలు, అధికారుల చుట్టు ఎన్నిసార్లు తిరిగినా కనీసం పింఛను అంద డం లేదు. మీరే ఆదుకోవాలి బాంఛెన్.

చంద్రబాబు: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధుల సంక్షేమానికి ప్ర త్యేక చర్యలు తీసుకొని అర్హులైన వృద్ధులందరికి పింఛన్లు అందిస్తాను.

మానసిక వికలాంగుని తల్లిదండ్రు లు: సార్ మా బాబు మానసిక వికలాంగుడు, ప్రభుత్వం సరైన విధంగా ఆదుకోవడం లేదు, కష్టాలు ఎదుర్కొంటున్నాము కనికరించండి.

చంద్రబాబు: వికలాంగుల మంత్రి త్వ శాఖను టీడీపీ ప్రభుత్వం వస్తే ఏ ర్పాటు చేస్తాను. వికలాంగులను ఆదుకోవడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తా ము. అన్ని రకాల వికలాంగులను ఆదుకుంటాము.

మెట్‌పల్లి/మల్లాపూర్: బాగా చదువుకోవాలి.. పైకి రావాలి.. అమ్మానాన్నలకు పేరు తీసుకురావాలి.. అంటూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విద్యార్థుల కు సూచనలందించారు. ఆదివారం మ ల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి, రే గుంటలలో నిర్వహించిన వస్తున్నా మీ కోసం పాదయాత్రలో పలువురు విద్యార్థులతో బాబు మాటామంతి నిర్వహించారు. విద్యార్థులకు సమస్యల పరిష్కారంపై భరోసా అందించారు. చంద్రబా బు నిర్వహించిన మాటామంతీ ఇలా ఉంది...

విద్యార్థులు: సార్ మాకు ఉపకార వే తనాలు వస్తలేవు.. పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కావడం లేదు, మీరే పరిష్కరించాలి.

చంద్రబాబు: మీ సమస్యల పరిష్కారానికి సహకరిస్తాను. మీరు బాగా చదువుకోవాలి... పైకి రావాలి.. అమ్మానాన్నలకు పేరు తీసుకురావాలి.

విద్యార్థులు: సార్ మా పాఠశాలకు వెళ్లే రహదారి సరిగా లేదు, పీఈటీ సా ర్ లేడు

చంద్రబాబు: ఇదే పరిస్థితి పలు ప్రాంతాల్లో ఉంది. పరిష్కారానికి కృషి చేస్తాను. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాను.

విద్యార్థులు: మీ హయాంలోనే మం చిగా ఉండె. ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు

చంద్రబాబు: నవ్వుతూ.. మీరు చెప్పి న సమస్యలు దృష్టిలో ఉంచుకుంటా ను.అవసరమైన సహకారాన్నందిస్తాను.

విద్యార్థులు: మాకు యూనిఫాము లు ఇంతవరకివ్వలే... మరుగుదొడ్లు లే వు.. సైకిళ్లు ఇవ్వలేరు

చంద్రబాబు: మీ సమస్యలన్నింటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. పరిష్కారమవుతాయి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల సమస్యలు తీరుస్తాను..

బాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి..

మెట్‌పల్లి/మల్లాపూర్/ఇబ్రహీంపట్నం: మల్లాపూర్ మండలంలో ఆదివారం మూడో రోజు చంద్రబాబు నిర్వహించిన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించారు. మండలంలోని గొర్రెపల్లి గ్రామం నుంచి రేగుంట వర కు చంద్రబాబు పాదయాత్ర జరిపారు. దారి పొడవునా రైతులను, మహిళలు, విద్యార్థులను, యువకులను, కార్మికుల ను పలకరిస్తూ... బాధలు తెలుసుకుం టూ... భరోసా ఇస్తూ... హుషారు హు షారుగా పాదయాత్ర నిర్వహించారు. పంట చేలోకి వెళ్లి రైతుల బాధలను ఆరా తీశారు. విద్యార్థులను పలకరించి సమస్యలు విన్నారు. ఇలా ఆద్యంతం బాబు పాదయాత్ర హుషారుగా జరిగింది. పాదయాత్ర ప్రారంభించినప్ప టి నుంచి చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. మండలంలోని గొర్రెపల్లిలో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బాబు పాదయాత్ర కొనసాగించారు. ముందుగా విద్యార్థులు వెల్లబోసుకు న్న గోడును బాబు ఆలకించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అక్కడి నుం చి పాదయాత్రను రేగుంట వైపు కొనసాగించారు.

దారి మధ్యలో సుమారు పది మంది రైతులను బాబు కలిసి సమస్యలు తెలుసుకున్నారు. దారి వెం ట వెళ్లే విద్యార్థులను, మహిళలను పలకరిస్తూ సాగారు. ఓ మానసిక వికలాంగుడు, ఓ వృద్ధునికి చంద్రబాబు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. రే గుంట శివారులో టీ బ్రేక్ తీసుకున్నారు. అనంతరం రేగుంటలోని అం బేద్కర్ చౌరస్తా వద్ద సుమారు గంటపాటు ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అక్కడి నుంచి రేగుంట శివారులోని బ్రిడ్జి మీదుగా జగిత్యాల నియోజవకర్గంలోని ఇంటిక్యాల వరకు పాదయాత్ర కొనసాగించారు. ఇటిక్యాలలో బాబు రాత్రి బస జరపనున్నారు.

బీడీ కార్మికుల సమస్యలపై...: మెట్‌పల్లి/మల్లాపూర్ : బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికై గతంలో తాను మెట్‌పల్లిలో ధర్నా నిర్వహించానని, మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొ చ్చి ఇబ్బందులు తొలగించడానికి ప్ర యత్నిస్తానని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం నిర్వహించిన వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా రేగుంటలో నిర్వహించిన రోడ్‌షోలో బాబు మాట్లాడారు. గతంలో పుర్రె, శవం గు ర్తులను తొలగించడానికి కార్మికులు మెట్‌పల్లిలో చేసిన ఉద్యమంలో తాను పాల్గొనడం జరిగిందని గుర్తు చేశారు. ఓ బీడీ వర్కర్స్ యూనియన్ నాయకుడు కార్మికుల సమస్యలపై చంద్రబాబుకు వివరించారు. సార్ మాకు తీవ్రం గా అన్యాయం చేస్తున్నారు.

కనీస వేత నం కూడా ఇవ్వడం లేదు. వెయి బీడీలకు రూ. 110 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు పెరిగిన ధరలతో ఎలా బతకాలో తెలియడం లేదంటూ ఆవేదన వ్య క్తం చేశారు. మొదట్లో జీఓ 41 జారీ చేసిన తర్వాత తమకు న్యాయం చే యాలంటూ వేడుకున్నారు. దీంతో స్పందించిన బాబు బీడీ కంపెనీల యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్మ క్కై కార్మికుల పొట్టకొడుతున్నారన్నారు. అలాగే టీఆర్ఎస్ నేత కేసీఆర్ కేం ద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కట్టలపై పుర్రె, శవం గుర్తు వేసినా పట్టించుకోలేదని విమర్శించారు. వాటిని తొలగించాలని నేనూ మెట్‌పల్లికి వచ్చి ధర్నా చేశానని తెలిపారు. అప్పుడు ఆ గుర్తులు తొలగించారని చెప్పారు.

ప్రసంగం తీరులో మార్పు..: తన ప్రసంగం తీరులో స్వల్ప మార్పులు చేశానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అ న్నారు. వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రజలనుద్దేశించి మా ట్లాడారు. తాను హిందూపూర్‌లో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి తాను ప్రసంగించడం ప్రజలు వినడం, తదుపరి ప్రజలతో మాట్లాడించి సమస్యలు తెలుసుకోవడం వంటి పద్ధతులు పాటించానని అన్నారు. కాగా తన ప్రసంగానికి ముందే వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడించి సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఈ పద్ధతి ద్వారా ఎజెండాను ప్రజలు నిర్ణయిస్తారని, నాయకులు పాటించి ప్రసంగించాల్సి ఉంటుందన్నారు. సమస్యలను తెలుసుకోవాలన్న సదుద్దేశంతో మా ర్పు తీసుకురావడం జరిగిందన్నారు.

సమస్యలు వింటూ... ముందుకు సాగుతూ..