March 29, 2013

31 వసంతాల టీడీపీ ఎన్నో చేదు..తీపి జ్ఞాపకాలు

(నెల్లూరుతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భవించి నేటికి 30 సంవత్సరాలు పూర్త యి 31వ వసంతంలోకి అడుగిడుతోంది. ఈ ప్రస్థానంలో ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు చవి చూసింది. చేదు, తీపి జ్ఞాపకాలను పంచింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. గ తంలో సినిమా చిత్రీకరణతోపాటు ఎన్నికల ప్రచారం కోసం రథ యా త్రలు నిర్వహించారు. నేటి రాజకీయ ప్రముఖులు అనేక మంది టీడీపీ నుంచే ఓనమాలు దిద్దారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మానస పుత్రిక తెలుగుగంగ ప్రాజెక్టు, సోమశిల విస్తరణ పనులు ఎన్టీఆర్ హయాంలోనే మొదలయ్యాయి. బీసీ, బలహీన వర్గాలను ఆకట్టుకుని ప్రతిసారి ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు.

కానీ, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బోణి కాలే దు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. ఎందరికో రాజకీయ ఓనమాలు 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించి ప్రచారం సాగించారు. రథయాత్ర చేపట్టి జిల్లా నలుమూలలు సుడిగాలి పర్యటన జరిపారు. 1983 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. బడుగు, బలహీన వర్గాలు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి పార్టీ టికెట్లు ఇచ్చి రాజకీయ నేతలుగా తీర్చిదిద్దారు.తొలి నుంచి రాజకీయ కుటుంబంగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అయి మంత్రిగా పని చేశారు. ఇక నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పార్టీలో ప్రముఖ వ్యక్తిగా వ్యవహరించేవారు.

ఆ తరువాత ఆయన తనయుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గత ఉప ఎన్నికల వరకు పార్టీలోనే కొనసాగారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. జిల్లా పార్టీ అధ్యక్షులుగా డేగా నరసింహారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి పని చేశారు. సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్షుడిగా పని చేసి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ రికార్డు సాధించారు.

జిల్లాతో విడదీయరాని అనుబంధం సినీ నటుడిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎన్నో చిత్రాలను నెల్లూరు జిల్లాలో చిత్రీకరించారు. జిల్లాకు చెందిన పలువురు సినీ ప్రముఖులుగా వ్యవహరించడంతో ఎన్టీఆర్‌తో వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. ముఖ్యంగా అభిమానులంటేనే ప్రాణపథంగా చూసే ఆయన పార్టీ పెట్టిన తరువాత ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న సన్నారెడ్డి పెంచలరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు. అలాగే నెల్లూరుకి చెందిన తాళ్లూరి రమేష్‌రెడ్డి ఎన్టీఆర్ అభిమానిగా వ్యవహరిస్తుండడంతో ఏకంగా మంత్రిని చేశారు.

తెలుగుగంగ ప్రాజెక్టు రూపకల్పనలో జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సోమశిల విస్తరణ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. జిల్లాలో మొదలైన సారా ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.1983లో జరిగిన మహిళా సదస్సుకు స్వయంగా ఎన్టీఆర్ హాజరయ్యారు. నెల్లూరులోనే మద్యపాన నిషేధంపై ఎన్టీఆర్ ప్రకటన చేశారు. ఆయన తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రైతు పోరు బాటను జిల్లాలోనే ముగించారు. పలు సార్లు కార్యకర్తలతో సమావేశాలు, ఉప ఎన్నికల ప్రచారాలకు చంద్రబాబు విచ్చేసి రోడ్‌షోలు జరిపారు. ఈ 31 ఏళ్ల కాలంలో టీడీపీ ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను పంచింది.

నేడు కష్టాల్లో పార్టీ ప్రస్తుతం జిల్లాలో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. 2004 ఎన్నికల్లో బోణి కాకపోయినా 2009లో జరిగిన ఎన్నికల్లో సగానికి సగం ఐదు స్థానాలను జిల్లా ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు. వీరిలో కోవూరు ఎమ్మెల్యే పార్టీని వీడి వైసీపీలో కొనసాగుతున్నారు. మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న సోమిరెడ్డి తప్పుకుని బీద రవిచంద్రకు ఆ బాధ్యతలు అప్పగించారు. పార్టీ కేడర్‌ను గ్రామ స్థాయిలోకి తీసుకుపోవడంలో పార్టీ శ్రేణులు విఫలమయ్యారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

సహకార ఎన్నికల్లో కొందరు పరోక్షంగా అధికార పార్టీకి సహకరించారన్న అపవాదు పార్టీపై పడింది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సా ధించే దిశగా చేస్తున్న ప్రయత్నాలు కొన్ని నియోజకవర్గాల్లో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగుయువత కార్యవర్గాన్ని ఇంకా నియమించలేదు. కొన్ని అనుబంధ సంఘాల నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మ రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీకి దూరమైన వారికి దగ్గరకు చేర్చుకుని గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులు, నేతలు కోరుతున్నారు.