March 29, 2013

'విద్యుత్' మంటలు

హన్మకొండ:కరెంట్ కోతలు, చార్జీల పెంపునకు నిరసనగా గురువారం జిల్లా వ్యాప్తం గా తెలుగు దేశం పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు చేపట్టారు. కరెంట్ బిల్లుల ను దహనం చేశారు. 9 నియోజకవర్గా ల్లో ఆందోళన కార్యక్రమాలుజరిగాయి. మిగతా మూడింట్లో శుక్రవారం నిర్వహిస్తారు. జనగామ నియోజవకర్గం పరిధిలో జనగామ, బచ్చన్నపేట మం డలాల్లో టీడీపీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు, రాయపర్తి, దేవరుప్పుల మండలాల్లో, మహబూబాబా ద్‌నియోజకవర్గంలోని గూడూరు మం డలంలో, నర్సంపేట నియోజవకర్గంలోని చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లో, వర్దన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేటలో, భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి మండల కేంద్రంలో, ములుగు నియోజకవర్గం లో ములుగు, ఏటూరునాగారం, కొత్తగూడ మండలాల్లో నిరాహార దీక్షలు జరిగాయి. కరెంట్ కోతలను ఎత్తివేయాలని, చార్జీల పెంపును ఉపసంహరించాలని కోరుతూ నినాదాలు చేశా రు.

దీక్షా శిబిరాల వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. వరంగల్ తూర్పు నియోజకర్గంలో హెడ్‌పోస్టాఫీసు వద్ద టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి గుండు ప్రభాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాస్తారోకో జరిపారు. విద్యుత్ బిల్లులను దహనం చేశారు. కరెంట్‌ను సక్రమంగా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎం డగడుతూ నినాదాలు చేశారు. హన్మకొండ చౌరస్తా వద్ద టీడీపీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళీ నాయకత్వంలో కార్యకర్తలు రాస్తారోకో చేశా రు. కరెంట్ బిల్లులను దహనం చేశా రు.

కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జీ లు, ముఖ్య నేతలు హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వద్ద సాగుతున్న నిరవధిక నిరాహార దీక్షా శిబిరంలో పా ల్గొంటున్నందున తమజిల్లాలోని వారి నియోజకవర్గంలో నిరాహారదీక్ష శిబిరంలో దీక్షలను వాయిదా వేసుకున్నా రు. స్టేషన్‌ఘనపూర్, డోర్నకల్ నియోజకవర్గంలో శుక్రవారం జరుగుతాయి. పరకాల నియోజకవర్గంలో ప్రస్తుతం గ్రామ కమిటీల సమావేశాలు జరుగుతున్నందు వల్ల అవి పూర్తయిన తర్వా త దీక్షలను చేపడతారు.

సంతకాల సేకరణ

కరెంట్ కోతలకు, చార్జీల హెచ్చింపుపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ఏప్రిల్ 2 నుంచి 7 వరకు సంతకాల సేకరణను చేపట్టాలని పారీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరిస్తా రు. వీటిని ఏప్రిల్ 9న మండల కేంద్రాలకు ఊరేగింపుగా తీసుకువస్తారు. 11 న నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. 18న జిల్లా పార్టీకి అందచేస్తారు. 19న రాష్ట్ర పార్టీకి పంపిస్తారు. 21న హైదరాబాద్‌లో టీడీఎల్‌పీ సమావేశంలో సంతకాల సేకరణపై చర్చిస్తారు. 22న ర్యాలీగా వెళ్ళి గవర్నర్‌కు అందచేస్తారు.

కొత్త భవనంలోకి పార్టీ కార్యాలయం

ప్రస్తుతం హన్మకొండలో ఎన్‌జీవోస్ కాలనీ రోడ్డులో ఉన్న ఈ కార్యాలయా న్ని శుక్రవారం హన్మకొండ హంటర్‌రోడ్‌లో వనవిజ్ఞాన్‌ను ఆనుకొని ఉన్న కొత్త భవనంలోకి మార్చుతున్నారు. ఉదయం 9గంటలకు కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుంది. అనంత రం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ను నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ ముఖ్యనేతల ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఉంటుంది. అవిర్భాదినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేం ద్రాల్లో, గ్రామాల్లోని పార్టీ కార్యాలయాల్లో ఆవిర్భావ వేడుకలను ఘనం గా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.