March 29, 2013

విద్యుత్ కోతలపై టీడీపీ నిరసనలు

ఏదులాపురం:రాష్ట్రాన్ని విద్యుత్ కోతల పేరుతో అంధకారంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబో యే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని టీడీపీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల శంకర్ పేర్కొన్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చేపడుతున్న దీక్షలకు మద్దతుగా గురువారం స్థానిక నాయకులు ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతల వల్ల విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదువలేక పోతున్నారని అన్నారు. అలాగే మరోవైపు చిరు వ్యాపారులు నష్టపోతున్నారని ఆయన వాపోయారు. కోతల వల్ల రబీలో వేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఆదిలాబాద్ ప ట్టణ అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, నాయకులు రాజారెడ్డి, గిమ్మ సంతోష్, మంచాల మల్లన్న, టి వెంకట్‌రెడ్డి, బాలాపూర్ విఠల్, యూనిస్అక్బానీ, లేఖర్‌వాడ వెంకన్నలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

మంచిర్యాలలో...

గర్మిళ్ల: విద్యుత్ చార్జీల పెంపు, అ ప్రకటిత కోతలకు నిరసనగా గురువారం మంచిర్యాలలో తెలుగుదేశం పార్టీ, తెలుగుయువత ఆధ్వర్యంలో ప్ర జల నుంచి సంతకాలు సేకరించారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు నాయకత్వంలో పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా , అర్చన టెక్స్ సముదాయం, అంబేద్కర్ చౌరస్తాలోని జేఏసీ శిబిరం వద్ద నాయకులు సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు భారాన్ని సా మాన్య ప్రజలు గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు.

అప్రకటిత విద్యుత్ కోతలతో కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులను ఇక్కట్లకు గురి చేస్తుందని విమర్శించారు. రా ష్ట్రంలోని ప్రజలకు సరిపడే విద్యుత్ ను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రైతులకు ఏడు గంటలు విద్యుత్ సరఫరా ఇ వ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భారంగా పరిణమించే చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయనే పేర్కొన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో తెలుగు యు వత జిల్లా అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, నాయకులు బెల్లంకొండ మురళీదర్, కొండేటి సత్యం, జిల్లా ఉపాధ్యక్షురాలు రైసాబాను, డాక్టర్ రఘునందన్, గాదె సత్యం, పూరేళ్ల పోచమల్లు, దుర్గం రాజేష్, మట్టల రమేష్, డాక్టర్ ఫరీద్ హుస్సేన్, డీఎస్ఎం లక్ష్మి, నాగేందర్, పొలసాని సత్యనారాయణరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.