September 25, 2013

మోదీ.. బాబు.. కలుసుకుంటారా?



గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై కలుసుకొంటారా? ఒకరినొకరు పలకరించుకుంటారా? ఢిల్లీలో జరిగే ఒక రాజకీయేతర సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకోనుందా? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 'సిటిజన్స్ ఫర్ అకౌంటింగ్ గవర్నెన్స్' అనే స్వచ్ఛంద సంస్థ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీ ప్రారంభోపన్యాసానికి చంద్రబాబును.. ముగింపు ఉపన్యాసానికి మోదీని ఆహ్వానించింది. బాబు ప్రసంగం ఉదయం ఉంటే.. మోదీ ప్రసంగం సాయంత్రం ఉంది.

ఈ సమావేశంలో వీరిద్దరూ కలిసి పక్కపక్కన కూర్చుంటారా లేక కనీసం మాట్లాడుకొంటారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. సమయాలను బట్టి చూస్తే ఈ ఇద్దరూ కలిసి పాల్గొనే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ కలవాలని అనుకొంటే మాత్రం ఈ ఇద్దరూ ఈ భేటీని ఒక అవకాశంగా వినియోగించుకొనే చాన్స్ లేకపోలేదనీ అంటున్నారు. విద్యార్థులతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తాను వెళ్తున్నట్లు చంద్రబాబు తమ పార్టీ నేతలకు తెలిపారు. మోదీ-బాబు సుమారు ఒక దశాబ్ద కాలంగా కలుసుకోలేదు. గుజరాత్ మత కల్లోలాలకు బాధ్యునిగా మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని అప్పట్లో చంద్రబాబు పట్టుబట్టడం వీరి మధ్య సంబంధాలను తెంచివేసింది. 2004 ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలకు చంద్రబాబు ఇక్కడి జూబిలీ హాల్‌లో విందు ఇచ్చారు.

ఆ సమయంలో మోదీ నగరంలోనే ఉన్నా ఆ విందుకు హాజరు కాలేదు. ఇవన్నీ జరిగి పదేళ్లు కావడంతో ఆ సంఘటలన్నీ పాతబడ్డాయి. కొత్త సంబంధాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 'పదేళ్ల కిందట ఎలా ఉన్నామో అలాగే ఉండాలా? మార్పులు రావా' అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు . కాగా, అక్టోబర్ ఐదో తేదీ నుంచి చంద్రబాబు మలి విడత యాత్ర మొదలు కానుంది. ఈసారి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఒకే వేదికపై కలుసుకొంటారా? ఒకరినొకరు పలకరించుకుంటారా?

జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచుతా: చంద్రబాబు


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్ధాపితం చేసే నిమిత్తం జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పెంచాలని అనుకొంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆయన ఇక్కడ తన నివాసంలో వరంగల్ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ళ పాలనలో అవినీతి కనీవినీ ఎరుగని స్ధాయికి పెరిగిపోయి దేశం భ్రష్టు పట్టి పోయిందని, ఆ పార్టీని దించకపోతే దేశం సర్వ నాశనమయ్యే పరిస్ధితి వచ్చిందని ఆయన అన్నారు.
'బొగ్గు గనుల కుంభకోణంలో ఫైళ్ళు మాయం కావడంతో ఏకంగా ప్రధాని కూడా సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సిన దుస్ధితి వచ్చింది. లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది. ఇదే పరిస్ధితి ఉంటే దేశం కుప్పకూలడం ఖాయం. అవినీతి కేసుల్లో నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చేసి మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తేనే మన దేశాన్ని, సమాజాన్ని కాపాడుకొన్నవారం అవుతాం. అది జరగాలంటే కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి. అందుకే జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచాలని అనుకొంటున్నాను. మనతో భావసారూప్యం ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడగట్టి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను బలోపేతం చేస్తాను. గతంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో టిడిపి ప్రధాన పాత్ర పోషించింది. ఈసారి కూడా అటువంటి పాత్రను తీసుకొందాం. అది జరగాలంటే ఇక్కడ రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండు వైపులా మెజారిటీ సీట్లు సాధించాలి. ఇదే మన లక్ష్యం' అని ఆయన వారితో అన్నారు.
courtessy: andhrajyothy

లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది

బెయిల్‌పై విడుదలైన వైఎస్ జగన్‌ను పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక నేరస్థుడు జగన్‌కు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. జగన్‌కు గవర్నర్ ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని విమర్శించారు.

పోలీసులు దగ్గరుండి సెక్యూరిటీ కల్పించారని, ఇలా చేస్తే సాక్షుల భయపడరా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు బలహీనమతోందన్నారు. కాంగ్రెస్, జగన్, కేసీఆర్ ఒక టీం అని, అందుకే జగన్‌ను కేసీఆర్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ మంచి పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని సోమిరెడ్డి తెలిపారు. సమైక్య ఉద్యమానికి జగన్ నాయకత్వం వహిస్తే ఉద్యమానికి చెడ్డపేరు వస్తుందన్నారు.
జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. రాహుల్ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక రాహుల్ ప్రధాని పదవి చేపట్టేందుకు భయపడ్డారని సోమిరెడ్ది ఎద్దేవా చేశారు.

జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.......................

సోనియా, జగన్ మధ్య క్విడ్‌ప్రోకో జరిగిందని, రాహుల్‌ను ప్రధాని చేయడానికే కుమ్మక్కయ్యారని టీడీపీ నేతఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, వైసీపీ నేతల భార్యలు కలుసుకున్నట్లు త్వరలో వాళ్ల భర్తలు కలుస్తారని ఆయన వ్యాఖ్యానించా

రాహుల్‌ను ప్రధాని చేయడానికే కుమ్మక్కయ్యారు...........