April 4, 2013

జెండా ఎన్నాళ్లు మోస్తాం!
అసెంబ్లీ, పార్లమెంటుకు సైకిల్ దూసుకుపోవాలి
టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు
కాళ్ల నొప్పులు ఓర్చుకుంటూ నడక



 "మనలో ఉన్న పట్టుదలకు కసి తోడవ్వాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరాలి.. మీరంతా కష్టాల్లో ఉన్నారు.. అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్లుగా జెండాలు మోస్తున్నారు.. ఎన్నాళ్లని మోస్తూ కూర్చుంటాం.. అధికారం వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలం..'' అని చంద్రబాబు అన్నారు. 'వస్తున్నా మీ కోసం..' పాదయాత్ర గురువారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సాగింది.

పాదయాత్రలో చంద్రబాబు తనను కలిసిన భవన నిర్మాణ కార్మికులు, రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, వేరే పని చేతకాదని చేబ్రోలులో ఒక కౌలురైతు బాబుకు విన్నవించుకున్నారు. దాంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. బెల్టుషాపులను ఎత్తివేయించి.. వారికి వేరే ఉపాధి కల్పిస్తామన్నారు. పిఠాపురం మండలం తాటిపర్తి సెంటర్‌లో అనపర్తి, పిఠాపురం నియోజకవర్గాల కార్యకర్తల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని, టీడీపీ గెలుపు ఒక చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏడాదిలో రావచ్చు. ఆరు నెలల్లోనైనా రావచ్చు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలన్నారు. జెండాలు మోసీమోసీ భుజాలు అరిగిపోయాయని, ఇక అధికారంలోకి రావడ ం తప్పనిసరని చంద్రబాబు పేర్కొన్నారు.

"పిఠాపురంలో కొందరు ఇతరపార్టీల నుంచి మన పార్టీలోకి రానివ్వడం లేదు. ఇన్‌చార్జి మొహమాటంతో వారినేమీ అనలేకపోతున్నారు..'' అని సూర్యప్రకాష్ అనే కార్యకర్త చంద్రబాబుతో అన్నారు. దాంతో.. ఎంత సమర్థుడైన నాయకుడైనా మొహమాటం వదులుకోకపోతే ఇబ్బందులు తప్పవని... తాను చాలావరకు మొహమాటాలు వదులుకున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరాలి

రాజాం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం పూర్తిగా భ్రష్టుపట్టుకుపోయిందని టీడీపీ రాష్ట్రఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభాభారతి ఆరోపించారు.గురవాం గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడారు.ప్రభుత్వం మోపిన విద్యుత్‌భారాన్ని తగ్గించేందుకే సంతకాల సేకరణ చేపడుతున్నట్టు తెలిపారు. సంతకాలు సేకరించి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళి చార్జీల భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గురవాన నారాయణరావు,పీఏసీఎస్ అధ్యక్షుడు వంగా గోవిందరావు, మండలకార్యదర్శి పొన్నాడ పురుషోత్తంనాయుడు, మండల తెలుగుయువత అధ ్యక్షుడు వంగా గోవిందరావు, టంకాల కన్నంనాయుడు, శాశపు రాజేష్, రౌతు రాజు, సీహెచ్ రాంబాబు, రౌతు చినలక్ష్ముం, మీసాల ఆదినారాయణ, స్వామినాయుడు పాల్గొన్నారు.

చేతకాని ప్రభుత్వ గద్దె దిగాలి పాతపట్నం: చేతకాని ప్రభుత్వం గద్దెదిగాలని టీడీపీ ్ట జిల్లా అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు డిమాం డ్‌చేశారు.పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించాలని విద్యుత్ సరఫరా వైఫల్యాలపై నిరసిస్తూ మంగళవారం పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంతకాల సేకరణను నిర్వహించారు.ఈకార్యక్రమంలో నాయకులు కొంచాడ వీరభద్రరావు శాసనపురి మధుబాబు పైల బాబ్జి పాల్గొన్నారు

కాంగ్రెస్ హయాంలో భ్రష్టుపట్టిన పాలన

శామీర్‌పేట= :విద్యుత్ కోతలకు నిరసనగా  రాత్రి శామీర్‌పేట విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట టీడీపీ మండల అధ్యక్షుడు హరిమోహన్‌రెడ్డి ఆధ్యర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కొవ్వొత్తులు, పార్టీ జం డాలు పట్టుకుని ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ ఇన్‌చార్జీ నక్క ప్రభాకర్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అనేక దుర్మార్గాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మండల టీడీపీ ఆధ్యక్షుడు హరిమోహన్‌రెడ్డి, మండల మాజీ ఎంపీపీ యాదగిరి మాట్లాడుతూ ఎడాపెడా విద్యుత్ కోతలను విధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాకి ప్రజలే బుద్దిచెపుతారన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర నాయకుడు డాక్టర్ రమేశ్, పార్టీ మండల రైతు అధ్యక్షుడు గన్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోల్డ్ శ్రీనివాస్, నాయకులు కిషోర్‌యాదవ్, విష్ణుగౌడ్, బత్తిని సత్యనారాయణ, టి.ఆర్.రవీందర్‌గౌడ్, తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు అజయ్‌లక్ష్మి పాల్గొన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

ఒంగోలు కలెక్టరేట్: ప్రభుత్వ అస మర్థతతో జిల్లా ప్రజానీకం తాగునీటి కోసం రోడ్డున పడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని తెలుగు రైతు రాష్ట్ర అధ్య క్షుడు కరణం బలరామకృష్ణమూర్తి ధ్వజ మెత్తారు. సాగర్ జలాలను విడుదల చేసి తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ తెలుగుదేశంపార్టీకి చెందిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి  స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన అమరణ నిరాహారదీక్షను బలరాం ప్రా రంభించారు.

ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే కందుల నారా యణ రెడ్డి గత 15 రోజుల నుంచి జిల్లా కు సాగర్ జలాలను విడుదల చేసి తాగు నీటి కష్టాలను తీర్చాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖల అధికా రులు చుట్టూ తిరిగినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మార్కాపురం పట్టణంతోపాటు మార్కాపురం, కనిగిరి, దర్శి, ఒంగోలు, సంతనూతలపాడు, అ ద్దంకి, పర్చూరు తదితర నియోజకవ ర్గాల్లో తాగునీటి చెరువులు ఎండిపోయి, సమ్మర్ స్టోరేజ్‌ల్లో నీరులేక ప్రజానీకం కిలోమీటర్ల దూరం వెళ్ళి నీటిని తెచ్చు కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నా రు.

శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉన్నా ఆ నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బలరాం ధ్వజమెత్తారు. హైకోర్టును తీర్పును సాకుగా చూపి శ్రీశైలం ప్రాజెక్టులో 860 అడుగల నీరు ఉన్నా ప్రభుత్వ ఆసమర్థత కారణంగా నీటిని విడుదల చేయడం లేదని కరణం బలరాం పేర్కొన్నారు. హైకోర్టు 834 అడుగులకు తక్కువగా ఉండకుండా చూ డాలని ఆదేశిస్తే దానిని సాకుగా చూపి ప్రజానీకానికి నీరు లేకుండా చేస్తున్నదని ధ్వజమెత్తారు. శ్రీశైలం నుంచి విడుదల చేసి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ తాగునీటి అ వసరాలను తీర్చవచ్చునని తెలిపారు.

ప్రభుత్వం ఇదే విధానాలను వ్యవహరిస్తే ప్రజానీకం తాగునీటికోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థి తులు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సాగర్‌జలాలను విడుదల చేయాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని బలరాం హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యు డు శిద్దా రాఘవరావు మాట్లాడుతూ జి ల్లా ప్రజానీకం తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన మార్కా పురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్ద డిని గుర్తించి గత 20 రోజుల నుంచి సాగర్ జలాలను విడుదల చేయాలని మంత్రులు, నీటిపారుదల శాఖ అధికా రులు, జిల్లా కలెక్టర్ చుట్టూ తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పో యిందన్నారు.

దర్శి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకునుంచి పొదిలి, కొనకనమిట్ల ప్రాంతాలకు 11 రోజులకు ఒక పర్యాయం నీరు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఆర్థం చేసుకోవచ్చునని తెలిపారు. తాగునీటి అవసరాలను తీర్చలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ధ్వజ మెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి వెంటనే సాగర్ జలాలను విడుదల చేసి ప్రజానీకాన్ని అదుకోవా లని లేని పక్షంలో దీక్షను విరమించేది లేదని నారా యణ రెడ్డి హెచ్చరించారు. కందుకూరు, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ దివి శివరాం, పిడతల సాయికల్పనారెడ్డి మా ట్లాడుతూ జిల్లా ప్రజలు పడుతున్న కష్టాలు చూసి సాగర్ జలాలు విడుదల చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నిరెత్తి నట్లు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెం టనే సాగర్‌జలాలను విడుదల చేయా లని డిమాండ్ చేశారు.

అమరణ నిరాహారదీక్ష చేపట్టిన కం దుల నారాయణరెడ్డిని కరణం బలరాం తో పాటు బలరాం తనయుడు కరణం వెంకటేష్ తదితరులు పూలమాలలు వేసి అభినందించారు. మరో వైపు నారాయణ రెడ్డికి మద్దతుగా గఫూర్, రవికుమార్ రెడ్డి, చెన్నకేశవులు, వెంకట్రావు, రామ లింగం, కె.సుబ్బారెడ్డి, దాసు తదితరులు దీక్షలో కూర్చున్నారు.

ఈ కార్యక్రమంలో కొండపి నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జి డోలా బాల వీరాం జనేయులు, పార్టీ జిల్లా ప్రధాన కార్య దర్శి యర్రాకుల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం, కొ మ్మూరి రవిచంద్ర, యానం చిన యోగ య్య యాదవ్, బొల్లినేని వాసు కృష్ణ, టి.అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, మేరీ రత్నకుమారి, గుర్రం ఆదిశేఖర్, చిరం జీవి తదితరులు దీక్షలో పాల్గొని కందు లకు సంఘీభావం తెలిపారు.

ప్రభుత్వ అసమర్థతతో తాగునీటి కష్టాలు

ధర్పల్లి: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యుడు జీవించే పరిస్థితి లేదని వెంటనే ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మం డల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఫసిఓద్దీన్, సురేందర్‌గౌడ్, లాల్‌సింగ్, శం కర్, శాంతయ్య పాల్గొన్నారు

తహసీల్దార్ కార్యాలయం ఎదుట..

డిచ్‌పల్లి : పెంచిన విద్యుత్ చార్జ్జీల ను వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలను ఎత్తివేయాలని కోరుతూ అఖి ల భారత రైతు కూలీ సంఘం జిల్లా క మిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చే యాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సాయినా థ్, కిషన్, భాస్కర్, రాందాసు, మురళి, రాజేందర్, రాంబాబు పాల్గొన్నారు.

డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి

వ్యవసాయానికి ఏడు గంటల విద్యు త్ సరఫరా చేయాలని టీడీపీ నాయకు లు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందరంగా పార్టీ మండలాధ్యక్షుడు పద్మారావు, ప్ర ధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌లు మా ట్లాడుతూ..ఇచ్చే ఐదు గంటల విద్యుత్ కూడా రాత్రి పూట సరఫరా చేయడం తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కార్యక్రమంలో సాయిలు, శ్యాంరావు, రవి పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్ ఎదుట టీడీపీ నాయకుల ధర్నా


ఆర్మూర్అర్బన్: పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో   ఆర్మూర్‌లోని జంబిహనుమాన్ ఆలయం ఎదుట గల గాంధీ విగ్రహం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును విరమించుకోవాలని మహిళలు స్వచ్చందగా తరలివచ్చి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీవీ.నర్సింహరెడ్డి, కౌన్సిలర్ గంగామోహన్‌చక్రు, తెలుగు యువత అధ్యక్షులు జక్కుల రాజేశ్వర్, నూకల ప్రభాకర్, యామాద్రిలింగన్న, గోవింద్‌పేట్ వెంకన్నలు పాల్గొన్నారు.

ఆర్మూర్ అర్బన్ : విద్యుత్‌చార్జీలు తగ్గించేలా ప్రభుత్వం మనసు మార్చాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమ ర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పుప్పాల శివరాజ్, పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, ఉపాధ్యక్షులు ఆకుల రాజు, ప్రధానకార్యదర్శి పొల్కంవేణు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆకుల శ్రీనివాస్, పోహర్‌శైలేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పూజనరేందర్, దోండి ప్రకాష్‌లు పాల్గొన్నారు.

వీరాయూత్ వినూత్నంగా..

బాల్కొండ : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ వీరాయూత్ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్న నిరసన వ్యక్తం చేశా రు. బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్ వీరాయూత్ సభ్యులు విద్యుత్‌చార్జీలను నిరసిస్తూ చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. వీరాయూత్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి ఉపాధ్యక్షులు ప్రవీన్, బాలు, యూత్‌సభ్యులు మనోహర్, నర్సయ్య, శేఖర్, రఘు, వినయ్ పాల్గొన్నారు.

భీమ్‌గల్ : రాష్ట్ర ప్రభుత ్వం అన్ని వర్గాల ప్రజలపై భారం మోపే విధం గా విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఏర్పాట్లు చేసిందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల నా యకులు తహసీల్దార్ రవీందర్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యుత్‌చార్జీల పెంపుతో ప్రజలు ఆర్ధికంగా మరి న్ని ఇబ్బందులో పడతారని ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో టీడీపీ జరిగే ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా పాల్గొటామని బీజేపీ మండల కన్వీనర్ పల్లె శేఖర్ తెలిపారు. తహసీల్దార్ కలిసిన వారిలో ఎస్టీసెల్ అధ్యక్షుడు సంగ్యానాయక్, బీజేవైఎం అధ్యక్షుడు గజ్జల చైత న్య, పట్టణ అధ్యక్షుడు ముత్తెన్న, జగన్, సురేష్‌నాయక్, రమేష్, సురేష్ ఉన్నారు.

పెంచిన విద్యుత్ చార్జీలపై వెలువెత్తిన నిరసనలు

నెల్లూరు - బారకాసు: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డే కారణమ ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. 46 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మ ర్చంట్ పవర్‌ప్లాంట్లకు అప్పగించిన వె ౖఎస్సార్ అందులో ఒక్క మెగావాట్ కూ డా రాష్ట్రానికి సద్వినియోగం అయ్యే అవకాశం లేకుండా చేశారన్నారు. స్వ లాభం కోసం బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ విధానాలపై చెప్పేదొకటి చేసేదొకటిగా ఉందన్నారు. టీడీపీ, కాం గ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరాలో ఎవరు ఎలాంటి విధానాలు అమలు చే శారో తేల్చుకుందామంటూ సవాల్ వి సిరారు.

ప్రస్తుత విద్యుత్ సంక్షోభం వల్ల రాష్ట్రంలో 20 వేల చిన్నపరిశ్రమ లు మూతపడి 20 లక్షల మంది కార్మికులు నిరాశ్రయులయ్యారన్నారు. గ్రా మాలలో ఆరు గంటల విద్యుత్ సరఫ రా చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించి, సర్‌చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలంటూ గురువారం నుంచి ఈ నెల 14 వరకు గ్రామస్థాయి లో సంతకాల సేకరణ చేస్తున్నామ న్నా రు. సేకరించిన సంతకాల కాగితా లతో 15వ తేదీన ఊరేగింపు చేపడతామన్నా రు.

16న సంతకాల పత్రాలను ఎమ్మెల్యేలకు, స్థానిక నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు అందజేస్తామన్నారు. 21న టీడీ ఎల్పీ సమావేశం నిర్వహించి 22న రాష్ట్ర గవర్నర్‌కు నిరసన సంతకాల ప్రతులను అందిస్తామన్నారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అన్నం దయాకర్‌గౌడ్, ఒట్టూరు సంపత్‌కుమా ర్, బద్దెపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సంక్షోభానికి వైఎస్సే కారణం

నకిరేకల్: భౌతిక దాడులకు పాల్పడుతూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి టీడీపీలో స్థానం ఉండదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి రజినీకుమారి అన్నారు. పట్టణంలోని నివాసంలో రజినీకుమారి విలేకరులతో మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడిన రేగట్టె మల్లికార్జున్‌రెడ్డికి, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఇటీవల తనపై, పార్టీ నాయకులపై నార్కట్‌పల్లిలో దాడులు చేయించిన రేగట్టెను పార్టీ సస్పెండ్ చేసిందని ఇక పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేద న్న విషయాన్ని కార్యకర్తలు గమనించాలన్నారు. పార్టీలో ఉన్నానని మల్లికార్జున్‌రెడ్డి ఏఅర్హతతో ప్రకటించుకుంటున్నాడని ఆమె ప్రశ్నించారు. క్రమశిక్షణ గల టీడీపీలో మల్లికార్జున్‌రెడ్డి లాంటి వ్యక్తులకు స్థానం లేదని, క్రమశిక్షణ, నీతి,నిజాయితీతో ఉన్న నాయకులకు మాత్రమే పార్టీలో స్థానం ఉంటుందన్నారు.

ప్రజలకు సేవచేయాలన్న లక్ష్యంతో ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి గత తొమ్మిది సంవత్సరాలుగా అధినేత చంద్రబాబు నాయకత్వంలో క్రమశిక్షణ గల నాయకురాలిగా పార్టీలో పనిచేస్తున్నానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోకవర్గంలోని పార్టీ అభ్యర్ధులను అందరిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తున్నానన్నారు.

విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అ«ధికార ప్రతినిధి సోమా యాదగిరి, టి. ప్రభాకర్‌రావు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మినర్సయ్య, వివిధ మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు రాచకొండ వెంకన్నగౌడ్, పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, రాచకొండ కిష్టయ్య, బత్తుల దయాకర్‌రెడ్డి, చేపూరి రవీందర్, పొన్నం లక్ష్మయ్య, చేపూరి సైదిరెడ్డి, బత్తుల కృష్ణాగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, గంజి యల్లయ్య, నక్కరాంభానేష్, చిట్టిపాక సైదులు, నకిరేకంటి అంజయ్య, యాదగిరి ఉన్నారు.

వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. పార్టీలో స్తానం ఉండదు

మిర్యాలగూడ : రైతులను లక్షాధికారులను చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వారిని భిక్షాధికారులుగా మారు స్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ అన్నారు. పెంచిన విద్యుత్‌చార్జీలు ఉపసంహరించాలనే డిమాండ్‌తో మిర్యాలగూడలోని 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట  టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీల్యానాయక్ మాట్లాడుతూ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, 2014వరకు విద్యుత్ చార్జీలు పెంచబోమని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

అప్రకటిత విద్యుత్ కోతలు, కరువు, కాటకాలు, పెరిగిన ధరలతో అవస్థలెదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి బాధించడం దుర్మార్గమని అన్నారు. విద్యుత్ సమస్యలపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు సభలో పట్టుబడితే ప్రభుత్వం తప్పించుకుందని, శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే వాటిని భగ్నం చేశారని విమర్శించారు. తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలో రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పలు పథకాలు అమలు చేశామని, వ్యవసాయానికి నిక్కచ్చిగా ఏడుగంటలు విద్యుత్ ఇచ్చామని తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించామన్నారు.

ధర్నా అనంతరం ట్రాన్స్‌కో డీఈకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి దుర్గాప్రసాద్, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని శ్రీనివాసరావు, త్రిమెన్ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు పెద్దిశ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు ఎస్‌కే.జానీ, తిరందాసు విష్ణు, పట్టణ ప్రధాన కార్యదర్శి పాతూరి ప్రసాద్, మండల అధ్యక్ష, కార్యదర్శులు మంగ్యానాయక్, పులి విద్యాసాగర్, కాటూరి సత్యనారాయ ణ, కోడిరెక్క విజయ్‌కుమార్, దైద వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాస్, మాజీద్, నక్కసంధ్య, రమాదేవి, హు స్సేన్‌నాయక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రాస్తారోకో

వేములపల్లి : విద్యుత్ చార్జీల పెం పును నిరసిస్తూ టీడీపీ మండల నాయకులు సోమవారం నార్కట్‌పల్లి- అ ద్దంకి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మం డల అధ్యక్షుడు జెర్రిపోతుల రాములుగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా మల్లేష్‌గౌడ్ మాట్లాడారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జడ రాములుయాదవ్, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎస్‌కె. రసూల్, ఉగ్గె శివకుమార్, జడ సైదులు, రమేష్, వెంకటేశ్వర్లు, అర్వపల్లి, లతీఫ్, సాయి, అక్బర్, నరేష్ పాల్గొన్నారు.

వామపక్షాల దీక్ష

వేములపల్లి : పెంచిన విద్యుత్‌చార్జీలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ఒక్క రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మాలి పురుషోత్తంరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాపో లు భాస్కర్. సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు రావు ఎల్లారెడ్డి, జిల్లా యాదగిరి, రైతు సంఘం నాయకులు మిర్యాల మధుసూదన్, కొండేటి జలంధర్, కర్ర ఇంద్రారెడ్డి, వి. నాగేందర్, రెండి శ్రీను, మాజీ సర్పంచ్‌లు శశిధర్‌రెడ్డి, కృపాకర్‌రావు పాల్గొన్నారు.

దామరచర్ల : పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించక పోతే కాంగ్రెస్ ప్రభు త్వాన్ని గద్దెదించేదాక పోరాడుతామని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నా రు. సోమవారం మండల కేంద్రంలో పెంచిన విద్యుత్‌చార్జీలను ఉపసంహ రించుకోవాలని కోరుతూ వామపక్షాల పిలుపు మేరకు చేపట్టిన సామూహిక నిరాహారదీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చంద్రశేఖర్‌యాదవ్, సీపీఐ మం డల కార్యదర్శి సైదులు, సీఐటీయూ మండల కార్యదర్శి పాపానాయక్, ఏఐవైఎఫ్ డివిజన్ కార్యదర్శి లింగానాయక్, వినోద్, దయానంద్, ప్రకాశ్, శోభన్, లింగారెడ్డి, గోపి, లక్ష్మినర్సింహారెడ్డి, సుభాని, కాంతారావు పాల్గొన్నారు.

రైతులను భిక్షాధికారులుగా చేస్తున్న.. ప్రభుత్వాన్ని గద్దెదింపాలి

దుబ్బాక: రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య హెచ్చరించారు.దుబ్బాకలో టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో కలిసి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, రైతు రాజ్యమని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని నిండాముంచిందన్నారు. విత్తనాలు, ఎరువుల కొరతతో రైతులు పడుతున్నారని చెప్పారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరాంతరాయంగా కరెంటు అందిస్తామని చెప్పిన సర్కార్ గంటసేపు కూడా సరఫరా చేయడం లేదని విమర్శించారు.

అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను బస్టాండ్ వద్ద దహనం చేశారు. నిరాహార దీక్షలో తెలుగునాడు గీతాకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు గొడుగుపల్లి రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్, జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, నర్సింహ్మారెడ్డి, రవీందర్, దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, చెన్నారెడ్డి, అరిగె సరోజన, రాపెల్లి లక్ష్మణ్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం నిరహార దీక్షలు కరెంటు కోతలపై సోమవారం దుబ్బాకలో సీపీఎం నిరాహార దీక్ష చేపట్టింది. సీపీఎం డివిజన్ కార్యదర్శి గొడ్డుమల్ల భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు బండ్ల నర్సింలు, కాశయ్య, చంద్రారెడ్డి, ఆకుల భరత్, రాజిరెడ్డి, బాలయ్య, దేవయ్య, బిక్షపతి, వెంకన్న, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఉసురు తీస్తున్న ప్రభుత్వం

తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.  స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఉమా కొద్దిసేపు విలేకర్లతో మాట్లాడారు. విద్యుత్‌చార్జీల పెంపుదల, కోతల విషయంపై ప్రభుత్వం కళ్ళు తెరిపించే ందుకే సంతకాల ఉద్యమం ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.200 కోట్లు పెంచినందుకే కాల్పు లు దాకా వెళ్ళిందన్నారు. ఇప్పుడు రూ.32వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఇది ఆమోదయోగ్యమైనది కాదని , ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని అన్నారు.

సంతకాల ఉద్యమం ఈనెల 2 నుంచి 8 వరకూ గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. సంతకాల జాబితా 8న మండలాధ్యక్షుడు, 9న ఎమ్మెల్యేలకు, 18న జిల్లా పార్టీకి, 19న రాష్ట్ర పార్టీకి అందజేస్తారన్నారు. 20న టీడీఎల్పీ సమావేశంలో చర్చించి 22న సంతకాల జాబితాను గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. విద్యు త్ చార్జీలు పెంచితే తప్పేమిటని ఒకపక్క గవర్నర్, చార్జీలు పెరగకుండా ఎలా ఉంటాయని మరోవైపు ముఖ్యమంత్రి అనడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు.

విద్యుత్‌చార్జీలు తగ్గే వరకూ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. గతనెల 24న జరిగిన డీఆర్సీ సమావేశంలో సాగర్‌జలాలు 3వజోన్‌కు విడుదల చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి హామీ ఇచ్చారన్నారు. హామీ గడవు దాటినా సాగునీరు రాలేదని తక్షణం సాగరు జలాల్ని విడుదల చేయాలని ఉమా డిమాండ్ చేశారు. ఆరవ రోజు దీక్షా శిబిరంలో జయరాజు, ఈశ్వరరావు, రామకృష్ణ, జనార్ధనరావులు పాల్గొన్నారు.

టీడీపీ సంతకాల సేకరణ ముమ్మరం

హనుమాన్ జంక్షన్: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా బుధవారం హనుమాన్‌జంక్షన్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను టీడీపీ నాయకులు ముట్టడించారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, మండల టీడీపీ ఆధ్వర్యంలో విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలతో పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా విద్యుత్‌సబ్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విద్యుత్ కార్యాలయ ఉద్యోగుల విధులకు కొద్దిసేపు ఆటంకం కలిగించారు.

పలువురు మహిళలు తమ గృహాల నుంచి టీవీలు, ఫ్రిజ్ లు, మిక్సీలు, ఫ్యాన్లు, వాషింగ్ మిష న్లు, సబ్‌స్టేషన్‌కు తీసుకువచ్చి అం దరి సమక్షంలో తగులబెట్టారు. తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం చార్జీలు తగ్గించకపోతే వినియోగదారులు ఎవ్వరూ బిల్లులు కట్టరని, కట్టమని అధికారులు చెబితే వారిని నిర్బంధిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు విద్యుత్ బిల్లులు కట్టవద్దని ఆయన పిలుపునిచ్చారు.

మండల టీడీపీ అధ్యక్షుడు కలపాల జగన్‌మోహన్‌రావు, రాష్ట్ర తెలుగు రైతు సభ్యుడు గుండపనేని ఉమా వరప్రసాద్, ఆళ్ళవెంకట గోపాల కృష్ణారావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వేగిరెడ్డిపాపారావు, వేములపల్లి శ్రీనివాసరావు,చిరుమామిళ్ళ సూర్యనారాయణ ప్రసాద్, మాజీ ఎంపీపీ సభ్యుడు తట్టి అర్జున్‌రావు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి శివయ్య, మజ్జిగ నాగరాజు, కానుమోలు మాజీ సర్పంచ్ దుర్గారావు, శ్రీనివాసరావు, దళిత నాయకులు దయాల రాజేశ్వరరావు, దాసరి వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి

కారేపల్లి: రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడటానికి కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణమంటూ ఖమ్మం ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఆరోపించారు. మండల పరిధిలోని మేకల తండా గ్రా మంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మన రాష్ట్రంలో సరిపోను విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ వైఎస్ తన బంధుమిత్రులకు లబ్ధి చేకూరేందుకు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను విక్రయించాడని ఆరోపించారు.

రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుచేసేందుకు తన అనుకూలంగా ఉన్నవారికి అనుమతులు ఇచ్చారని దీంతో వారు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఆవిద్యుత్ భారా న్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 11సార్లు విద్యుత్ చార్జ్జిలను పెంచారని దీంతో ప్రజలు కోట్లాది రూపాయలు నెలసరిగా బిల్లులు చెల్లిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విద్యుత్ సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో బ్లాక్‌పేపర్ రూపంలో కరపత్రాలను ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన అన్నారు.

సంతకాలు సేకరించిన పోట్ల

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పదేపదే పెంచుతున్న విద్యుత్ చార్జీలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ నరసింహాన్‌కు సమర్పించనున్నట్లు పోట్ల అన్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో రైతులపై ఎలాంటి విద్యుత్ చార్జీలను పెంచకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి 9గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు ఆయన అన్నారు.

కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఉన్నం వీరేందర్, మాజీ ఎంపీపీ బాణోత్ దేవ్లానాయక్, పాలిక సారయ్య, బత్తుల శ్రీనివాసరావు, అడ్డగోల ఐలయ్య, ఎండి హనీఫ్, ఆంగోత్ మత్రు, నూనావత్ వశ్రామ్, భూక్యా బాలాజీ, ఆంగోత్ శంకర్, భూక్యా కబీర్, చాగంటి కోటయ్య, తాత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సంక్షోభానికి వైఎస్ఆరే కారణం

మధిర రూరల్ : విద్యుత్‌చార్జీలు తగ్గించాలని, కోతలను ఎత్తివేయాలని కోరుతూ బుధవారం రాత్రి మధిరలో టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుతమ్ముళ్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధిరలోని విజయవాడ రోడ్డులో పెట్రోలుబంకు వద్ద ప్రారంభమైన ఈ కాగడాల ప్రదర్శన అంబేద్కర్ సెంటర్, మెయిన్‌రోడ్డు, క్లబ్‌సెంటర్ మీదుగా వైరా రోడ్డు వరకు సాగింది.

టీడీపీ కార్యకర్తలు కాగడాలను, జెండాలను పట్టుకొని విద్యుత్‌చార్జీలను తగ్గించాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చీదిరాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి మాదల రామారావు, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి చేకూరి శేఖర్‌బాబు, సొసైటీ చైర్మన్లు బిక్కి కృష్ణప్రసాద్, మాదల శరత్, నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చుంచు విజయ్, అయితం వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగా, రత్నకుమారి, దొండపాటి కృష్ణమూర్తి, చావా శివాజీ, తుమ్మలపల్లి శ్రీను, మాదల రాంబాబు, కేఎన్ఆర్, వాసిరెడ్డి ఉపేంద్ర, గుర్రం రామారావు, గుర్రం శివ, బట్టా గోవిందరాజు, వూట్ల చిన్నకృష్ణమూర్తి, పూర్ణచందర్‌రావు, రవికాంత్, వేల్పుల కొండ, కర్నాటి రాములు, రాయుడు భద్రయ్య,చావా వేణు, నంబూరి శ్రీనివాసరావు, అయిలూరి సత్యనారాయణరెడ్డి, దామా శేషగిరిరావు, నంబూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.


మధిరలో టీడీపీ కాగడాల ప్రదర్శన

అచ్చంపేట: విద్యుత్ సంక్షోభానికి నిరసనగా మండల తెలుగుదేశం నాయకులు మంగళవారం ఆంజనేయుడి విగ్రహం సెంటర్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటివరకు 1500కు పైగా సేకరించినట్టు వారు తెలిపారు. సేకరణలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నల్లమేకల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు పొన్నెకంటి వెంకటరామారావు, నందిగం ఆశీర్వాదం, సరిమెళ్ళ రామిరెడ్డి, సందెపోగు శ్రీనివాసరావు, కొనకంచి యజ్ఞప్రసాద్, నెల్లూరి శ్రీనివాసరావు, ఎడ్లపల్లి బుచ్చిబాబు, గోపిదేశి సాంబశివరావు తదితరులు ఉన్నారు.

విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి : వైసీపీ

పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాక్షసపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు విద్యుత్ లేక అల్లాడుతున్నారు. టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా నిరసిస్తున్నాయన్నారు.

క్రోసూరులో బుధవారం నియోజకవర్గస్థాయిలో జరిగే నిరసన కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో మండల నాయకులు జి బాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జి శ్యాంసన్, మహిళా నాయకురాలు ఎన్ నాగమ్మ, ఎస్‌కె హసీన్, చిలకా కోటేశ్వరరావు, సీహెచ్ నరసింహారావు, పఠాన్ గాలిసా, ఎస్‌కె బాజి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

అమృతలూరు: మండల కేంద్రం అమృతలూరులో విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్యర్యంలో ప్రజల వద్ద సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు యలవర్తి బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు . ఇప్పటికే సర్‌చార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటుందని దీనికి నిరసనగా సంతకాల సేకరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శరణు గిరి, బొల్లు రామేశం,కాట్రగడ్డ హేమచంద్ర ప్రసాద్, కొసరాజు దేవకుమార్, క్రొత్తపల్లి రవీంద్రబాబు,తుమ్మల సుధీర్, అమర్తలూరి బాబురావు,శరణు రాజా, కొక్కిలగడ్డ నాగేశ్వరరావు, కైతేపల్లి రాంబాబు, తాతా నాగేశ్వరరావు, జేమ్స్, ఉమామహేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

చుండూరులో..

చుండూరు : రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లోపంతోనే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని రాష్ట్ర రైతు తెలుగు కార్యదర్శి విఎస్‌కె ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం చుండూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద విద్యుత్ సమస్యలపై సంతకాల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. కార్య క్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మా శివారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గుదేటి బ్రహ్మారెడ్డి, భీమవరపు శ్రీమాన్, కంఠంనేని రాహుల్, ఈమని వెంకటేశ్వరరెడ్డి, గొట్టిపాటి రామిరెడ్డి, సజ్జా శ్రీనివాసరావు, మాణిక్యారావు, కె రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా సంతకాల సేకరణ


రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళనకు యువత ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వస్తు న్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా పిఠాపురంలో శుక్రవారం తెలుగు యువత సమ్మేళనంలో చం ద్రబాబు పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. కసి, కృషితో పనిచేస్తే దేన్నయినా సాధించవచ్చన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చన్నారు.

ఎన్టీఆర్‌లో ఉన్న కసి, కఠోరశ్రమ, సమయపాలన, దీక్షాదక్షతలు ఎవరికైనా ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గంటన్నరసేపు యువతలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తియుక్తులు, ప్రతిభాపాటవాల గురించి వివరించారు. మెదడుకు ఉన్న శక్తి సామర్థ్యాలు, అంకితభావం, క్రమశిక్షణ వంటివాటిపై చంద్రబాబు యువతకు క్లాస్ తీసుకున్నారు. చంద్రబాబు ప్రసంగం గంటన్నరలో గంటసేపు వ్యక్తిత్వ వికాసం తరహాలో సాగింది.

అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలి


అవినీతి టెర్రరిజం కంటే ప్రమాదకరంగా మారిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాటానికి సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా యువతకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్, కాంగ్రెస్ నేతలు వ్యవస్థను సర్వనాశనం చేశారని.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యువత రాజకీయాలలోకి రావడం అవసరమన్నారు.

యువతకు రాజకీయాల్లో రిజర్వేషన్లు

టీడీపీ అధికారంలోకి వచ్చాకా యువతకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తామని చంద్రబాబు తెలిపారు. ఉన్నత చదువులు లేకపోయినా బిల్‌గేట్స్, ధీరూబాయ్ అంబానీ వంటి అనేకమంది అత్యున్నత విజయాలు సాధించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆత్మవిశ్వాసంతో ముదుకుసాగిపోవాలని సూచించారు.

యువత ఉపాధికి పథకాలు


టీడీపీ హయాంలో పెట్టిన సీఎంఈని వైఎస్ వచ్చి నిర్వీర్యం చేశాడని చంద్రబాబు విమర్శించారు. ఐటీలో ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చామని. రానున్న రోజుల్లో అన్ని రంగాల్లోను యువతకు మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు.

'రండి..అవినీతిపై పోరాడదాం..!'

పిఠాపురం: జనకెరటం ఉప్పొంగింది.. భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర సాగింది. బుధవారం సాయంత్రం పిఠాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర జీవన్‌నగర్, సీతయ్యగారి తోట, మునిసిపల్ కార్యాలయం సెంటర్, కోటగుమ్మం సెంటర్, పల్లపు వీధి, ఉప్పాడ సెంటర్, వన్‌వే ట్రాఫిక్ రోడ్డు, ఆర్ఆర్ పార్కు, చర్జి సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్సు, అగ్రహారం, పశువుల సంతమీదుగా సాగింది.

చంద్రబాబు పాదయాత్రతో పిఠాపురం పట్టణం జనసంద్రమైంది. ప్రజలు బారులు తీరి నీరాజనాలు పలికారు. ఎక్కడికక్కడ యువత, మహిళలు, వృద్ధులు చంద్రబాబు రాకకోసం ఆసక్తిగా ఎదురుచూడడం కనిపించింది. పట్టణ వీధలన్నీ పసుపుమయంగా మారాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో తరలివచ్చిన జనసందోహం వెంటరాగా చంద్రబాబు పాదయాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. పాదయాత్రలో ఆయా వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు.

సెలూన్‌కు వెళ్లి అక్కడ కటింగ్ చేశారు. టీ సెంటర్‌కు వెళ్లి టీ కాశారు. భవన నిర్మాణ పనులు చేస్తున్న వారి వద్దకు వెళ్లి కొంతసేపు తాపీ పని చేశారు. తోపుడు బండ ్ల వర్తకుల ఇబ్బందులు తెలుసుకున్నారు వారి ఇబ్బందులన్నింటినీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ముందుకు కదిలా రు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన స్పందనతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. పాదయాత్రలో పార్టీ నేతలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నిమ్మకాయల చినరాజప్ప, చిల్లా జగదీశ్వరీ, చిక్కాల రామచంద్రరావు, పోతుల విశ్వం పాల్గొన్నారు.

పార్టీలో చేరికలు

పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మొగలి వీరవెంకటసత్యనారాయణ(బాబ్జీ) టీడీపీలో చేరా రు. పిఠాపురంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, పార్టీ జిల్లా కార్యదర్శి మాదేపల్లి రంగబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాబ్జీకి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు పనిచేయాలని కోరారు. బాబ్జీతోపాటు పలువురు పార్టీలో చేరారు. పిఠాపురానికి చెందిన లోక్‌సత్తా నాయకుడు కొండేపూడి శంకరరావు తదితర పార్టీలో చేరగా చంద్రబాబు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

పైలాన్ ఆవిష్కరణ

టీడీపీ ఆవిర్భవించి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బైపాస్ రోడ్డులో నిర్మించిన 32 అడుగుల పైలాన్‌ను టీడీపీ అధినేత చ ంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భగా కేక్‌ను కట్ చేశారు. ఫైలాన్‌ను ఎంతో శ్రమకు ఓర్చి నిర్మించిన నియోజకవర్గ ఇన్‌చార్జి వర్మను బాబు అభినందించారు. తాను 29వ తేదీకే పిఠాపురం రావాల్సి ఉన్నా నాలుగురోజలు ఆలస్యంగా వచ్చానని తెలిపారు. పైలాన్ టీడీపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, గరికిపాటి మోహనరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు.

ఉప్పొంగిన జనకెరటం

జగ్గంపేట: ప్రభుత్వం పెంచిన వి ద్యుత్ చార్జీలను నిరసిస్తూ టీడీపీ సంతకాల సేకరణ బుధవారం ప్రారంభించింది. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ప్రజల నుంచి సంతకాలు సేకరించి ఇటు ప్రభుత్వానికి అటు గవర్నర్ కు అందజేయాలని తెలుగుదేశంపార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో జ గ్గంపేటలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చా ర్జి జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.

పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించిన చంటిబాబు తొలిసంతకాన్ని చేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌విఎస్ అప్పలరాజు, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు కందుల కొండయ్యదొర, జగ్గంపేట మాజీ సర్పంచ్ కొల్లు బాబూరావు, గం డేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలా ల పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు, అల్లు విజయ్‌కుమార్, దొడ్డా విజయ్, మాజీ జడ్పీటీసీ రామారావు, పార్టీ కార్యదర్శి నిమ్మగడ్డ సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంటా రమణ, నియోజకవర్గ ప్రచార కార్యద ర్శి వేములకొండ జోగారావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్వీ ప్రసాద్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాం బత్లు చంద్రశేఖర్, కర్రిశ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైకాపా ప్రదర్శన, ధర్నా

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని బుధవారం జగ్గంపేటలో వైకాపా నాయకుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో ఆందోళన చేపట్టారు. వైకాపా నాయకులు, కార్యకర్తలతో జేవీఆర్ కాం ప్లెక్స్ నుంచి ప్రదర్శన చేపట్టి నాలుగురోడ్ల జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్‌శాఖ డివిజనల్ ఇంజనీరు కా ర్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశా రు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాంగ్రెస్‌ప్రభుత్వం ఐదుసార్లు విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు పన్నుల రూపేణా వడ్డింపులు చేసి ప్రజల నడ్డివిరిచిందన్నారు.

నేటి నుంచి రిలే దీక్షలు

విద్యుత్ చార్జీల పెంపును గురువారం నుంచి జగ్గంపేటలోని వైఎస్సా ర్ విగ్రహం వద్ద రిలే నిరాహరదీక్షలు చేపడుతున్నట్టు వైకాపా నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. విద్యుత్‌శాఖ డీఈ చంద్రశేఖర్‌కు మోమోరాండం అందజేశారు. ఆయన వెంట కుంచే రాజా, పరిమిబాబు, పాలచర్ల సత్యనారాయణ, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, ఎం.నీలాద్రిరాజు, ఒమ్మి రఘురామ్, కొత్త కొండబాబు, రేఖా బులిరాజు, వె లిశెట్టి శ్రీను, పంతం సత్యనారాయణ, జంపన సీతారామరాజు, జ్యోతుల నవీ న్, నీలం శ్రీను, తూము చినబాబు, ఉప్పలపాటి సాయి, వైఎస్సార్ సేవాసమితి సభ్యులు, జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: పెంచిన విద్యుత్‌చార్జీలు తగ్గించాలని వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాల ని, యర్రవరంలో విద్యుత్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేయలనే డిమాండ్లతో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నాయకత్వంలో బు ధవారం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన వైకా పా కార్యకర్తలు, నాయకులతో సబ్‌స్టేష న్ వద్ద ధర్నా చేశారు. వినతిపత్రాన్ని ఎలక్ట్రికల్ ఏఈ నాయక్‌కు అందజేశా రు.

కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ నాయకులు అలమండ చలమ్మ య్య, గొల్లపల్లి కాశీ విశ్వనాధ్, శిడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి బుజ్జి, య ర్రాబత్తుల గోవిందనాయుడు, గొల్లు చి న దివానం, వరుపుల రాజబాబు, జు వ్విన వీర్రాజు, పాండ్రంకి అప్పారావు, ఓలేటి వీరభద్రరావు, పలివెల వెంకటేశ్వరరావు, కొట్టేటి అబ్బులు, పెంటకోట మోహన్, పతివాడ బాబురావు, దాకమర్రి సూరిబాబు, దొరబాబు, కొప్పన రాజబాబు, జ్యోతుల పెదబాబు, సు« దాకర్, గొడతా చంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనల వెల్లువ


ఐ.పోలవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాట్ల బుచ్చిబాబు ఆరోపించారు. విద్యుత్ చార్జీలు పెంపుదలను నిరసిస్తూ టీడీపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఐ.పోలవరం మండలం మురమళ్లలో దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంతకాలు సేకరణ చేపట్టారు. విద్యుత్ చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండుటెండలో పాదయాత్ర చేపడుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌పార్టీ పతనం ఖాయమని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, బొంతు శ్రీరాములు, పచ్చిమాల భగవాన్‌దాసు, ఏలూరి మూర్తి, దంతులూరి ప్రసాద్, జంపన రామభద్రం, జనిపెల్ల విప్లవకుమార్, రాయపురెడ్డి మాణిక్యం, చెయ్యేటి శ్రీను, గంజా సుధాకర్, కొప్పిశెట్టి సోములు, ఉందుర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కిరణ్ పాలనలో రాష్ట్రం అధోగతి


కోటనందూరు: వస్తున్న మీ కోసం చంద్రబాబునాయుడు పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యనమల కృష్ణుడు అన్నారు. కోటనందూరులో మండల పార్టీ అధ్యక్షుడు గాడి రాజుబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుని నియోజక వర్గంలో పాదయాత్ర ఏడు రోజులు ఉంటుందన్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తొమ్మిదో తేదిన తుని నియోజక వర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందని, అధిక సంఖ్యలో కార్యకర్తలు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు.

ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం కోటనందూరు మం డలంలోనే జరగడం మన అందరి అదృష్టమన్నారు. ఉగాది వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. తొమ్మిదో తేదీన కొలిమేరు గ్రామంలో రాత్రి బస చేస్తారన్నారు. పదో తేదీన కేవో అగ్రహారం మీదుగా కోటనందూరు వచ్చి కాకరాపల్లి శివారులో రాత్రి బస చేస్తారన్నారు. 11న విశాఖ జిల్లాకు పయనం అవుతారన్నారు. అనంతరం బస చేసే ప్రదేశాన్ని పరిశీలించారు.

ఈకార్యక్రమంలో గొర్లి అచ్చియ్యనాయుడు, పెంటకోట భాస్కర సత్య నారాయణ, బంటుపల్లి జమీలు, పోతల సూరిబాబు, యర్ర చినసత్య నారాయణ, మాతిరెడ్డి బాబులు, వాసం బెన్నేశ్వరరావు, కుసిరెడ్డి కొండబాబు, గాదె వెంకట్రావు, అంకంరెడ్డి సత్యమూర్తి, వాసిరెడ్డి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

'చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేయాలి'

చెన్నేకొత్తపల్లి: విద్యుత్ సంక్షోభం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుణ్యమేనని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సు నీత ధ్వజమెత్తారు. మడలంలోని దా మాజిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం వందలాదిమంది రై తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైఠాయించి, నిరసన తెలిపారు. దీంతో రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విషయం తె లుసుకున్న చుట్టుపక్కల గ్రామాలవాసులతో పాటు మహిళలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని, ఎమ్మెల్యేకు బాసటగా నిలిచారు. వెంటనే పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అంతకుమునుపు ఎన్ఎస్ గే టుకు చేరుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి, కనగానపల్లి, సీకే ప ల్లి మండలాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులతో కలి సి ర్యాలీగా జాతీయరహదారి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకం గా కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అనంతరం రో డ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పెంచిన విద్యుత్‌చార్జీల పెంపు, కోతలపై తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఎ మ్మెల్యే నిప్పులు చెరిగారు. పాలకుల అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వచ్చిందని విమర్శించారు. సిగ్గుమాలిన ప్రభుత్వానికి రోజులు ద గ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. ఈ నిరసనలో నాయకులు ఎల్.నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, నెట్టెం వెంకటేశు, పరిటాల గజ్జలప్ప, శ్రీరామ్‌నాయక్, కనగానపల్లి మాజీ ఎంపీ పీ అలివేలమ్మ, మాడెం సూర్యనారాయణరెడ్డి, రఘునాథరెడ్డి, న్యామద్దల కిష్టప్ప, తెలుగుయువత నరసింహు లు, గేటు కిష్టప్ప, హరినాథరెడ్డి, రామచంద్రారెడ్డి, నాగేంద్రచౌదరి, రామకృష్ణారెడ్డి, డిష్ వెంకటేష్, రామంజి, ము రళీ, శ్రీరాములు, అంకే ఆంజనేయు లు, మల్లికార్జున, దేవరాజు, బావిరెడ్డి, మహిళలు, రైతులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అరెస్టు...

విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ జాతీయరహదారిపై ఎమ్మెల్యే సునీత చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీపులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి ది గారు. ధర్నాను విరమించే ప్రసక్తే లేద ని భీష్మించారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే ఉండదన్నారు. ఎమ్మెల్యేతోపా టు కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి అందరినీ పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.

విద్యుత్ సమస్యపై నిరసనల హోరు

ఖానాపూర్: పేద ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపిందని ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ అన్నారు. ఖానాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్షను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.40 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని, కిరణ్ ప్రభుత్వం పేదల రక్తాన్ని జలగలా తాగుతున్నారన్నారు. ఇప్పటికైనా స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు.

అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామునాయక్, పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి చాంద్‌పాషా, మాజీ ఎం పీపీ సల్లా రామేశ్వర్‌రెడ్డి, సహకార సం ఘం చైర్మన్ వెంకగౌడ్, మాజీ ఎంపీటీసీ అంకం రాజేందర్, నాయకులు రాజ్‌గంగన్న, ప్రవీణ్, కన్నయ్య, షబ్బీర్‌పాషా, నహీంఖాన్, పొన్న నారాయణ, వెంకటరాజు, నహీం, తోట రవి, గౌరిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

పెంచిన విద్యుత్ చార్జిలను వెంటనే తగ్గించాలి..

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఎమ్మె ల్యే సుమన్‌రాథోడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. దీక్ష శిబిరం ను ఎమ్మెల్యే సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను తగ్గించాలని గురువారం నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలు సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, నాయకుల సంజీవ్, మల్లేష్, విజయ్, స్వామి, వేణు, దేవరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.

పేదలపై కక్ష సాధిస్తున్న ప్రభుత్వం'