April 4, 2013

టీడీపీ సంతకాల సేకరణ ముమ్మరం

తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.  స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఉమా కొద్దిసేపు విలేకర్లతో మాట్లాడారు. విద్యుత్‌చార్జీల పెంపుదల, కోతల విషయంపై ప్రభుత్వం కళ్ళు తెరిపించే ందుకే సంతకాల ఉద్యమం ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.200 కోట్లు పెంచినందుకే కాల్పు లు దాకా వెళ్ళిందన్నారు. ఇప్పుడు రూ.32వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఇది ఆమోదయోగ్యమైనది కాదని , ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని అన్నారు.

సంతకాల ఉద్యమం ఈనెల 2 నుంచి 8 వరకూ గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. సంతకాల జాబితా 8న మండలాధ్యక్షుడు, 9న ఎమ్మెల్యేలకు, 18న జిల్లా పార్టీకి, 19న రాష్ట్ర పార్టీకి అందజేస్తారన్నారు. 20న టీడీఎల్పీ సమావేశంలో చర్చించి 22న సంతకాల జాబితాను గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. విద్యు త్ చార్జీలు పెంచితే తప్పేమిటని ఒకపక్క గవర్నర్, చార్జీలు పెరగకుండా ఎలా ఉంటాయని మరోవైపు ముఖ్యమంత్రి అనడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు.

విద్యుత్‌చార్జీలు తగ్గే వరకూ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. గతనెల 24న జరిగిన డీఆర్సీ సమావేశంలో సాగర్‌జలాలు 3వజోన్‌కు విడుదల చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి హామీ ఇచ్చారన్నారు. హామీ గడవు దాటినా సాగునీరు రాలేదని తక్షణం సాగరు జలాల్ని విడుదల చేయాలని ఉమా డిమాండ్ చేశారు. ఆరవ రోజు దీక్షా శిబిరంలో జయరాజు, ఈశ్వరరావు, రామకృష్ణ, జనార్ధనరావులు పాల్గొన్నారు.