April 4, 2013

పేదలపై కక్ష సాధిస్తున్న ప్రభుత్వం'

ఖానాపూర్: పేద ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపిందని ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ అన్నారు. ఖానాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్షను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.40 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని, కిరణ్ ప్రభుత్వం పేదల రక్తాన్ని జలగలా తాగుతున్నారన్నారు. ఇప్పటికైనా స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు.

అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామునాయక్, పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి చాంద్‌పాషా, మాజీ ఎం పీపీ సల్లా రామేశ్వర్‌రెడ్డి, సహకార సం ఘం చైర్మన్ వెంకగౌడ్, మాజీ ఎంపీటీసీ అంకం రాజేందర్, నాయకులు రాజ్‌గంగన్న, ప్రవీణ్, కన్నయ్య, షబ్బీర్‌పాషా, నహీంఖాన్, పొన్న నారాయణ, వెంకటరాజు, నహీం, తోట రవి, గౌరిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

పెంచిన విద్యుత్ చార్జిలను వెంటనే తగ్గించాలి..

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఎమ్మె ల్యే సుమన్‌రాథోడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. దీక్ష శిబిరం ను ఎమ్మెల్యే సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను తగ్గించాలని గురువారం నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలు సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, నాయకుల సంజీవ్, మల్లేష్, విజయ్, స్వామి, వేణు, దేవరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.