April 4, 2013

వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. పార్టీలో స్తానం ఉండదు

నకిరేకల్: భౌతిక దాడులకు పాల్పడుతూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి టీడీపీలో స్థానం ఉండదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి రజినీకుమారి అన్నారు. పట్టణంలోని నివాసంలో రజినీకుమారి విలేకరులతో మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడిన రేగట్టె మల్లికార్జున్‌రెడ్డికి, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఇటీవల తనపై, పార్టీ నాయకులపై నార్కట్‌పల్లిలో దాడులు చేయించిన రేగట్టెను పార్టీ సస్పెండ్ చేసిందని ఇక పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేద న్న విషయాన్ని కార్యకర్తలు గమనించాలన్నారు. పార్టీలో ఉన్నానని మల్లికార్జున్‌రెడ్డి ఏఅర్హతతో ప్రకటించుకుంటున్నాడని ఆమె ప్రశ్నించారు. క్రమశిక్షణ గల టీడీపీలో మల్లికార్జున్‌రెడ్డి లాంటి వ్యక్తులకు స్థానం లేదని, క్రమశిక్షణ, నీతి,నిజాయితీతో ఉన్న నాయకులకు మాత్రమే పార్టీలో స్థానం ఉంటుందన్నారు.

ప్రజలకు సేవచేయాలన్న లక్ష్యంతో ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి గత తొమ్మిది సంవత్సరాలుగా అధినేత చంద్రబాబు నాయకత్వంలో క్రమశిక్షణ గల నాయకురాలిగా పార్టీలో పనిచేస్తున్నానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోకవర్గంలోని పార్టీ అభ్యర్ధులను అందరిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తున్నానన్నారు.

విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అ«ధికార ప్రతినిధి సోమా యాదగిరి, టి. ప్రభాకర్‌రావు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మినర్సయ్య, వివిధ మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు రాచకొండ వెంకన్నగౌడ్, పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, రాచకొండ కిష్టయ్య, బత్తుల దయాకర్‌రెడ్డి, చేపూరి రవీందర్, పొన్నం లక్ష్మయ్య, చేపూరి సైదిరెడ్డి, బత్తుల కృష్ణాగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, గంజి యల్లయ్య, నక్కరాంభానేష్, చిట్టిపాక సైదులు, నకిరేకంటి అంజయ్య, యాదగిరి ఉన్నారు.