April 4, 2013

సబ్‌స్టేషన్ ఎదుట టీడీపీ నాయకుల ధర్నా

ధర్పల్లి: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యుడు జీవించే పరిస్థితి లేదని వెంటనే ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మం డల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఫసిఓద్దీన్, సురేందర్‌గౌడ్, లాల్‌సింగ్, శం కర్, శాంతయ్య పాల్గొన్నారు

తహసీల్దార్ కార్యాలయం ఎదుట..

డిచ్‌పల్లి : పెంచిన విద్యుత్ చార్జ్జీల ను వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలను ఎత్తివేయాలని కోరుతూ అఖి ల భారత రైతు కూలీ సంఘం జిల్లా క మిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చే యాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సాయినా థ్, కిషన్, భాస్కర్, రాందాసు, మురళి, రాజేందర్, రాంబాబు పాల్గొన్నారు.

డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి

వ్యవసాయానికి ఏడు గంటల విద్యు త్ సరఫరా చేయాలని టీడీపీ నాయకు లు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందరంగా పార్టీ మండలాధ్యక్షుడు పద్మారావు, ప్ర ధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌లు మా ట్లాడుతూ..ఇచ్చే ఐదు గంటల విద్యుత్ కూడా రాత్రి పూట సరఫరా చేయడం తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కార్యక్రమంలో సాయిలు, శ్యాంరావు, రవి పాల్గొన్నారు.