April 4, 2013

పెంచిన విద్యుత్ చార్జీలపై వెలువెత్తిన నిరసనలు


ఆర్మూర్అర్బన్: పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో   ఆర్మూర్‌లోని జంబిహనుమాన్ ఆలయం ఎదుట గల గాంధీ విగ్రహం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును విరమించుకోవాలని మహిళలు స్వచ్చందగా తరలివచ్చి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీవీ.నర్సింహరెడ్డి, కౌన్సిలర్ గంగామోహన్‌చక్రు, తెలుగు యువత అధ్యక్షులు జక్కుల రాజేశ్వర్, నూకల ప్రభాకర్, యామాద్రిలింగన్న, గోవింద్‌పేట్ వెంకన్నలు పాల్గొన్నారు.

ఆర్మూర్ అర్బన్ : విద్యుత్‌చార్జీలు తగ్గించేలా ప్రభుత్వం మనసు మార్చాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమ ర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పుప్పాల శివరాజ్, పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, ఉపాధ్యక్షులు ఆకుల రాజు, ప్రధానకార్యదర్శి పొల్కంవేణు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆకుల శ్రీనివాస్, పోహర్‌శైలేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పూజనరేందర్, దోండి ప్రకాష్‌లు పాల్గొన్నారు.

వీరాయూత్ వినూత్నంగా..

బాల్కొండ : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ వీరాయూత్ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్న నిరసన వ్యక్తం చేశా రు. బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్ వీరాయూత్ సభ్యులు విద్యుత్‌చార్జీలను నిరసిస్తూ చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. వీరాయూత్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి ఉపాధ్యక్షులు ప్రవీన్, బాలు, యూత్‌సభ్యులు మనోహర్, నర్సయ్య, శేఖర్, రఘు, వినయ్ పాల్గొన్నారు.

భీమ్‌గల్ : రాష్ట్ర ప్రభుత ్వం అన్ని వర్గాల ప్రజలపై భారం మోపే విధం గా విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఏర్పాట్లు చేసిందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల నా యకులు తహసీల్దార్ రవీందర్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యుత్‌చార్జీల పెంపుతో ప్రజలు ఆర్ధికంగా మరి న్ని ఇబ్బందులో పడతారని ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో టీడీపీ జరిగే ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా పాల్గొటామని బీజేపీ మండల కన్వీనర్ పల్లె శేఖర్ తెలిపారు. తహసీల్దార్ కలిసిన వారిలో ఎస్టీసెల్ అధ్యక్షుడు సంగ్యానాయక్, బీజేవైఎం అధ్యక్షుడు గజ్జల చైత న్య, పట్టణ అధ్యక్షుడు ముత్తెన్న, జగన్, సురేష్‌నాయక్, రమేష్, సురేష్ ఉన్నారు.