April 4, 2013

విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా సంతకాల సేకరణ

అమృతలూరు: మండల కేంద్రం అమృతలూరులో విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్యర్యంలో ప్రజల వద్ద సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు యలవర్తి బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు . ఇప్పటికే సర్‌చార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటుందని దీనికి నిరసనగా సంతకాల సేకరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శరణు గిరి, బొల్లు రామేశం,కాట్రగడ్డ హేమచంద్ర ప్రసాద్, కొసరాజు దేవకుమార్, క్రొత్తపల్లి రవీంద్రబాబు,తుమ్మల సుధీర్, అమర్తలూరి బాబురావు,శరణు రాజా, కొక్కిలగడ్డ నాగేశ్వరరావు, కైతేపల్లి రాంబాబు, తాతా నాగేశ్వరరావు, జేమ్స్, ఉమామహేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

చుండూరులో..

చుండూరు : రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లోపంతోనే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని రాష్ట్ర రైతు తెలుగు కార్యదర్శి విఎస్‌కె ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం చుండూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద విద్యుత్ సమస్యలపై సంతకాల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. కార్య క్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మా శివారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గుదేటి బ్రహ్మారెడ్డి, భీమవరపు శ్రీమాన్, కంఠంనేని రాహుల్, ఈమని వెంకటేశ్వరరెడ్డి, గొట్టిపాటి రామిరెడ్డి, సజ్జా శ్రీనివాసరావు, మాణిక్యారావు, కె రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.