April 4, 2013

విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనల వెల్లువ

జగ్గంపేట: ప్రభుత్వం పెంచిన వి ద్యుత్ చార్జీలను నిరసిస్తూ టీడీపీ సంతకాల సేకరణ బుధవారం ప్రారంభించింది. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ప్రజల నుంచి సంతకాలు సేకరించి ఇటు ప్రభుత్వానికి అటు గవర్నర్ కు అందజేయాలని తెలుగుదేశంపార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో జ గ్గంపేటలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చా ర్జి జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.

పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించిన చంటిబాబు తొలిసంతకాన్ని చేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌విఎస్ అప్పలరాజు, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు కందుల కొండయ్యదొర, జగ్గంపేట మాజీ సర్పంచ్ కొల్లు బాబూరావు, గం డేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలా ల పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు, అల్లు విజయ్‌కుమార్, దొడ్డా విజయ్, మాజీ జడ్పీటీసీ రామారావు, పార్టీ కార్యదర్శి నిమ్మగడ్డ సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంటా రమణ, నియోజకవర్గ ప్రచార కార్యద ర్శి వేములకొండ జోగారావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్వీ ప్రసాద్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాం బత్లు చంద్రశేఖర్, కర్రిశ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైకాపా ప్రదర్శన, ధర్నా

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని బుధవారం జగ్గంపేటలో వైకాపా నాయకుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో ఆందోళన చేపట్టారు. వైకాపా నాయకులు, కార్యకర్తలతో జేవీఆర్ కాం ప్లెక్స్ నుంచి ప్రదర్శన చేపట్టి నాలుగురోడ్ల జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్‌శాఖ డివిజనల్ ఇంజనీరు కా ర్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశా రు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాంగ్రెస్‌ప్రభుత్వం ఐదుసార్లు విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు పన్నుల రూపేణా వడ్డింపులు చేసి ప్రజల నడ్డివిరిచిందన్నారు.

నేటి నుంచి రిలే దీక్షలు

విద్యుత్ చార్జీల పెంపును గురువారం నుంచి జగ్గంపేటలోని వైఎస్సా ర్ విగ్రహం వద్ద రిలే నిరాహరదీక్షలు చేపడుతున్నట్టు వైకాపా నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. విద్యుత్‌శాఖ డీఈ చంద్రశేఖర్‌కు మోమోరాండం అందజేశారు. ఆయన వెంట కుంచే రాజా, పరిమిబాబు, పాలచర్ల సత్యనారాయణ, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, ఎం.నీలాద్రిరాజు, ఒమ్మి రఘురామ్, కొత్త కొండబాబు, రేఖా బులిరాజు, వె లిశెట్టి శ్రీను, పంతం సత్యనారాయణ, జంపన సీతారామరాజు, జ్యోతుల నవీ న్, నీలం శ్రీను, తూము చినబాబు, ఉప్పలపాటి సాయి, వైఎస్సార్ సేవాసమితి సభ్యులు, జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: పెంచిన విద్యుత్‌చార్జీలు తగ్గించాలని వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాల ని, యర్రవరంలో విద్యుత్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేయలనే డిమాండ్లతో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నాయకత్వంలో బు ధవారం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన వైకా పా కార్యకర్తలు, నాయకులతో సబ్‌స్టేష న్ వద్ద ధర్నా చేశారు. వినతిపత్రాన్ని ఎలక్ట్రికల్ ఏఈ నాయక్‌కు అందజేశా రు.

కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ నాయకులు అలమండ చలమ్మ య్య, గొల్లపల్లి కాశీ విశ్వనాధ్, శిడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి బుజ్జి, య ర్రాబత్తుల గోవిందనాయుడు, గొల్లు చి న దివానం, వరుపుల రాజబాబు, జు వ్విన వీర్రాజు, పాండ్రంకి అప్పారావు, ఓలేటి వీరభద్రరావు, పలివెల వెంకటేశ్వరరావు, కొట్టేటి అబ్బులు, పెంటకోట మోహన్, పతివాడ బాబురావు, దాకమర్రి సూరిబాబు, దొరబాబు, కొప్పన రాజబాబు, జ్యోతుల పెదబాబు, సు« దాకర్, గొడతా చంద్ర తదితరులు పాల్గొన్నారు.