November 27, 2012

ఏం కొనేటట్టు లేదు!

ఆ గ్రామాల గుండా వస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసుకునే మహిళా కూలీలంతా గుంపుగా కదలివచ్చారు. నా చుట్టూ గుమిగూడి తమ కష్టాలు ఏకరవు పెట్టారు. కూలి చేసుకుంటుంటే వచ్చిన డబ్బులతో నెల గడిచే పరిస్థితి లేదని ఆవేదన చెందారు. అదీ ఇదీ అని లేకుండా నిత్యావసరాల నుంచి కూరగాయల వరకు మండిపోతున్నాయని పెద్దశంకరంపేటలో ఎదురొచ్చిన జనం వాపోయారు. వాళ్ల ఆవేదనలో నిజం ఉందనిపించింది. ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్నవాళ్లే అగ్నిగుండంలోకి తోస్తున్నారనిపించింది.

ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల ఆదాయాన్ని, ఖర్చును సమన్వయం చేస్తూ పాలసీలు తయారుచేయాలి. కానీ ఆ ముందుచూపు లోపించింది. ఆ దెబ్బ సామాన్యుడిపై పడుతోంది. మండే ఎండలకు పక్షులు, జీవాలు రాలిపోయినట్టే మండే ధరలకు సగటు ప్రజలు కూలిపోతున్నారు.

విద్య కోసమో, వైద్యం కోసమో అప్పు చేశారంటే అనుకోవచ్చు. కారపు మెతుకులు తినేందుకు కూడా తల తాకట్టు పెట్టాల్సిన పరిస్థితికి పేదలు నెట్టేయబడుతున్నారు. చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉప్పూ పప్పులు నిప్పుల్లా కాలుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో వాత పెడుతున్నారు. గ్యాస్ ధరలు వంటిళ్లను మండిస్తున్నాయి. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, ముందు ఆలోచన ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. వీళ్లకు ఇన్ని కష్టాలూ లేకపోయేవి.

రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఏటా ఏ సరుకు ఎంత ఉత్పత్తి అవుతోంది, ఎంత వినియోగం అవుతున్నదనే అంచనా ఉండాలి. ఎగుమతులూ దిగుమతులపై కూడా కచ్చితమైన ప్రణాళికతో పనిచేయాలి. టీడీపీ హయాంలో అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి ఎప్పటికప్పుడు ధరల నియంత్రణను పరిశీలించేవాడిని. దాంతో ధరలెప్పుడూ గీత దాటేవి కాదు. కానీ, ఇప్పుడు పాలించేవాళ్లలాగే ధరలూ కట్టుతప్పాయి. వాటిని కట్టడి చేయకుండా ప్రగతిబాటలో కాలు ముందుకేయడం కష్టమనిపిస్తోంది.

ఏం కొనేటట్టు లేదు! చంద్రబాబు

బాబుకు మధుమేహం
రక్తంలో పెరిగిన చక్కెర శాతం..
అలసటే కారణం: వైద్యులు
యాత్రలో ఇక షుగర్ మాత్రలు!

హైదరాబాద్, నవంబర్ 27 : పాదయాత్రలో ఉండగా మంగళవారం ఉదయం టీడీపీ అధినేతకు షుగర్ లెవల్స్ పెరిగాయి. హైదరాబాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం చంద్రబాబును పరీక్షించింది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు మందులు వాడడం తప్పనిసరి అని నాగేశ్వర్‌రెడ్డి సూచించారు.

యోగా, ఇతర దారుఢ్య సాధనాల వల్ల చంద్రబాబు ఇప్పటి వరకు మాత్రలు వాడకుండానే షుగర్‌ను అదుపులో ఉంచుకున్నారు. అయితే ఒత్తిడి వల్ల షుగర్ స్థాయి పెరిగిందని నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. మందులు వాడడం అత్యవసరం కానప్పటికీ వయసు దృష్ట్యా వాడాలని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు.

బాబుకు మధుమేహం

కేసీఆర్‌ను మంత్రిని చేసి ఉంటే.. నేడు
నా వ్యాన్‌లో ఉండేవాడు
నాడు నా కన్నా బాగా 'దేశం' గురించి మాట్లాడేవాడు
వైఎస్ తెలంగాణను దోస్తున్నా పట్టించుకోలేదు
టీఆర్ఎస్ అధినేతపై చంద్రబాబు నిప్పులు
రాష్ట్రమంతటా ఓటేస్తేనే అధికారంలోకి వస్తా
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు ఎప్పుడూ సిద్ధమే
మెదక్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు
మీరు సహకరిస్తే కాంగెస్ర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా

సంగారెడ్డి, నవంబర్ 27 : రాష్ట్రమంతటా ఓట్లు వస్తేనే టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అలా కాకుండా ఒక ప్రాంతంలో పార్టీ దెబ్బతింటే భూస్వాములు, పెత్తందార్లు అధికారంలోకి వస్తారంటూ.. తెలంగాణలో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇప్పుడు తనవెంటే వ్యాన్‌లో ఉండేవారని విమర్శించారు.

మెదక్‌జిల్లాలో పదోరోజైన మంగళవారం పెద్దశంకరంపేట, కల్హేర్ మండలాల్లో చంద్రబాబు పాదయాత్ర సాగించారు. ప్రజలను కలుసుకుంటూ, వివిధ సభల్లో మాట్లాడుతూ 15.2 కి.మీ.ల దూరం నడిచారు. టీడీపీ లాంటి పేదలపార్టీని దెబ్బతీసేందుకు ఒక ప్రాంతంలో అవినీతిపరులు, ఉద్యమం పేరిట మరో ప్రాంతంలో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.

"నా పరిస్థితిని అర్థం చేసుకుని మీరంతా సహకరించాలి. పాదయాత్రకు సంఘీభావంగా మీరు కూడా నాతో పాటు ఒకటో రెండో కిలోమీటర్లు నడవండి. అలా మీరు సహకరిస్తే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాను'' అని విజ్ఞప్తి చేశారు. సీఎం సీటు కోసమే చంద్రబాబు నడుస్తున్నారనే విమర్శలను తిప్పికొట్టారు "తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాను. నేను చూడని అధికారం లేదు. ఢిల్లీలో చక్రం తిప్పాను. అప్పట్లో ప్రధానమంత్రిని సైతం నేనే నిర్ణయించాను. దానివల్ల రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్రం నుంచి సాధించగలిగాను.

పల్లెటూరుగా ఉండే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టాను. సైబరాబాద్‌కు, హైటెక్ సిటీకి రూపకల్పన చేశాను'' అని చెప్పుకొచ్చారు. వాన్‌పిక్ వ్యవహారంలో సీఎం కిరణ్ దొంగలకు కాపలా కాస్తున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ చార్జిషీట్‌లో ఐదో ముద్దాయిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు జైలుకెళ్లకుండా కాపాడుతున్నారన్నారు. పైగా ధర్మాన తప్పేమీ లేదని కిరణ్ నిస్సిగ్గుగా చెబుతున్నారని మండిపడ్డారు. దొంగ కంపెనీలతో విదేశాలలో సైతం ఆస్తులు కూడబెట్టినందున జగన్ కేసు దర్యాప్తునకు మరో మూడు నెలలు కావాలని కోర్టును సీబీఐ కోరిందంటే జగన్ అవినీతి తతంగం ఎలా ఉన్నదో తెలుస్తున్నదని వ్యాఖ్యానించారు.

తన రాజకీయ జీవితంలో తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి చేశానని, కాదని ఎవరైనా అంటే నిరూపించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, పాఠశాల, కళాశాల భవనాలు, రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని గుర్తుచేశారు. "ఉద్యమంలో ఇప్పటికే పదేళ్లు పోయింది.

ఇంకా పదేళ్లలో ఉద్యోగాలు రాకపోతే మీరు ముసలి వాళ్లవుతారు. జీవితంపై నిరాశ కలుగుతుంది'' అని యువతను ఉద్దేశించి ఆవేదనతో అన్నారు. అయితే, తెలంగాణ అంశాన్ని తేల్చడం తన చేతుల్లో లేదని చెప్పారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర, రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు. మరోవైపు కేంద్రాన్ని నిలదీయాల్సిన కేసీఆర్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఇదే జిల్లా అని చెప్పారు.

టీడీపీలోనే పని చేసినప్పుడు అందరికన్నా ఎక్కువగా పార్టీని గురించి బాగా మాట్లాడేవారని చెప్పారు. వైఎస్ అవినీతి గురించి ఆయన, టీఆర్ఎస్ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 8 వేల ఎకరాలను అమ్మితే పట్టించుకోలేదని, కూతురికి వరకట్నంగా బయ్యారం ఖనిజ సంపదను లీజుకు ఇచ్చినా, జలయజ్ఞం పేరిట ధనయజ్ఞానికి పాల్పడినా టీఆర్ఎస్ స్పందించలేదని విమర్శించారు.

కాగా, తాము అధికారంలోకి వస్తే పేదవృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేసి, మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. మైనారిటీలలో ఎక్కువగా పేదలున్నారని వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. వచ్చే ఎన్నికలలో మైనారిటీలకు పార్టీ నుంచి 15 స్థానాలలో అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు.

కేసీఆర్‌ను మంత్రిని చేసి ఉంటే.. నేడు నా వ్యాన్‌లో ఉండేవాడు:చంద్రబాబు

57వ రోజు మంగళవారం పాదయాత్ర పోటోలు.. 27.11.2012

57వ రోజు మంగళవారం పాదయాత్ర పోటోలు..(eenadu) 27.11.2012

57వ రోజు మంగళవారం పాదయాత్ర పోటోలు..(andhrajyothi)) 27.11.2012

పామర్రు, నవంబర్ 27 : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఈ నెల 28న విడుదల చేయకపోతే చంచల్‌గూడ జైలు గోడలు బద్దలకొట్టి బయటకు తీసుకురావాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో మంగళవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ జగన్ విడుదలపై ఈనెల 28న సీబీఐ కోర్టులో బెయిల్‌పై తీర్పు వెలువడనుండగా ఉదయభాను పైవిధంగా వ్యాఖ్యానించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

సుప్రీం కోర్టు 2013 మార్చి వరకు జగన్ బెయిల్ పిటిషన్ వేయడానికి వీలులేదని సూచించినా సామినేని కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేయడం చట్టాన్ని అగౌరవ పర్చడమేనన్నారు. ఉదయభాను బెదిరింపులు ఎవరిపై అనేది కూడా దర్యాప్తు చేయాలన్నారు. మితిమీరిన ఆర్థిక నేరాలు చేసి జైల్‌లో ఉన్న జగన్ బృందం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని, ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదనే విషయం ఆపార్టీ నేతలు గమనిస్తే మంచిదన్నారు.

సామినేని వ్యాఖ్యలను బట్టి ఆయనపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని, చంచల్‌గూడ జైల్‌లో ఉన్న జగన్మోహనరెడ్డిని కలిసేవారిపై కూడా నిఘా పెట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం జగన్ వ్యవహారంపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, ఫలితంగా జగన్ జైల్‌లో నుంచే రాష్ట్రవ్యాప్తంగా తన బృందాలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ఆదేశాలిస్తున్నట్లు ఉదయభాను వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

భాను పిచ్చి ప్రేలాపనలు: ఉమా
మైలవరం, నవంబర్ 27 : జైలు గోడలు బద్దలుకొట్టి జగన్‌ను బయటకు తీసుకువస్తామని భాను చేసిన వ్యాఖ్యలు పిచ్చి ప్రేలాపనలని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం టీడీపీ కార్యాలయంలో మంగళవారం స్థానిక విలేకర్లతో ఉమా మాట్లాడారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను జైలు గోడలు పగులగొడతామని అనడం అప్రజాస్వామికమన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జగన్‌పై సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు.

ఈ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని ఉమా డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలన్నారు. ఇలాంటి ఆరాచక శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఇలాంటివారు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తుల్ని సైతం కొల్లగొడతారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌కు సకల సదుపాయాలు అందుతున్నాయన్నారు. శాటిలైట్ ఫోన్‌తో సహా రాచ మర్యాదలు చేస్తూ తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ఆదేశాలు -వర్ల రామయ్య

అవినీతిపై పోరాటం చేసిన పార్టీ టీడీపీయే : చంద్రబాబు

మెదక్, నవంబర్ 27 : మాదిక వర్గీకరణ చేసి మీ రుణం తీర్చుకుంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచి ఆదుకంటామని అన్నారు. డీఎస్సీలో బిఈడీ అభ్యర్ధులకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ టీడీపీయేనని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించిన వస్తున్నా...మీకోసం పాదయాత్ర మంగళవారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. కాగా మెదక్ జిల్లాలో పదవరోజు కొనసాగుతోంది. ఈ ఉదయం పెద్దశంకరం నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. జలయజ్ఞానాన్ని ధన యజ్ఞం చేస్తే టీఆర్ఎస్ మాట్లాడలేదని బాబు ఆరోపించారు.

ఆరు నెలలు పడుకోని లెచి ప్రజల మధ్యకు వచ్చి కేసీఆర్ ఏవోవే వాగ్ధానాలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాటం చేసింది ఒక్క టీడీపీయేని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు చాలా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

అంతకు ముందు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్దశంకరంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆయన జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలలోని సమస్యలను విద్యార్థులు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. కళాశాలకు మంచినీళ్లు, లైబ్రరీ ఇతర సౌకర్యాల కోసం ఎంపీ లాడ్స్ నుండి రూ.2 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా యాత్ర ప్రారంభించే ముందు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈరోజు మొత్తం 15 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది.

వర్గీకరణ చేసి మీ రుణం తీర్చుకుంటా, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్