May 19, 2013


విజయవాడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు దేవినేని ఉమ, రాజేంద్రప్రసాద్‌ డిమాండ్ చేశారు. జైలుశిక్ష పడిన మంత్రి పార్థసారథి కూడా రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలు చేయకపోతే నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

మంత్రుల రాజీనామాకు టీడీపీ డిమాండ్



హైదరాబాద్: నందమూరి హీరో కల్యాణ్ రామ్... నందమూరి - నారా కుటుంబాలను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలను చేస్తున్నారట. కల్యాణ్ రామ్ ప్రస్తుతం ఓం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదిన రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జరుపనున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబాన్ని ఒక్క వేదిక పైకి తీసుకు రావాలని కల్యాణ్ రామ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి అతను తన మావయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తండ్రి నందమూరి హరికృష్ణ, బాబాయ్ నందమూరి బాలకృష్ణ, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌లను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను వారికి పంపించారు. ఓం చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరులోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కల్యాణ్ రామ్ కుటుంబాన్ని కూడా ఒకే వేదిక పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.

నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు చంద్రబాబు, బాలకృష్ణల పైన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. హరికృష్ణ పలుమార్లు తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఇటీవల న్యూఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నందమూరి - నారా కుటుంబాలు ఒకే వేదిక పైకి వచ్చాయి. లక్ష్మీ పార్వతి, పురంధేశ్వరి, చంద్రబాబు, జూనియర్ సహా అందరు ఒకే వేదికపై కనిపించారు. ఇప్పుడు కల్యాణ్ రామ్ బాబు, బాలయ్య, హరి, జూనియర్‌లను ఒకే వేదికపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు.

కుటుంబాన్ని ఒకే వేదికపైకి తేనున్న హీరో కల్యాణ్‌రామ్!

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహణకు జరుగుతున్న ఆధిపత్యపోరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించరాదని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. బాబు ఆదేశాలు పాటించకుండా కొందరు మినీ మహానాడును నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించిన టీడీపీ కార్పొరేటర్లు మురళీగౌడ్‌, విజయలక్ష్మి, సదాశివ్‌యాద్‌పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఆధిపత్యపోరుపై బాబు ఆగ్రహం